కొత్త రాష్ట్రంలో జోగినీ నిషేధ చట్టం పెట్టాలి- జూపాక సుభద్ర

పోయినేడాది తెలంగాణ రాష్ట్రమొచ్చినంక (2-6-14) తెలంగాణ రాష్ట్రప్రభుత్వము బోనాలను రాష్ట్రపండుగ్గా ప్రకటించింది. కొత్త తెలంగాణ కదా! అనేక సంస్కరణ కలలతో వున్న నూతన తెలంగా ణలో బోనాల్లో జోగినీ ప్రమేయముడొద్దనీ, జోగినీలు లేని ‘బోనాలు’ జరపాలని ముఖ్యమంత్రికి విజ్ఞాపన చేయడానికి ‘తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం’ వెళితే ముఖ్యమంత్రిని కలినే అవకాశం లేకుండె. కొంతమంది తెలంగాణ ప్రతి నిధులు తెలంగాణలో అసలు జోగినీలే లేరని కొట్టిపారేనిండ్రు. కానీ బోనాల్లో ఒక దళిత మహిళ మొకం నిండా పసుపు పూసుకొని కుంకుమబొట్లు నెత్తి నిండ పూలు, చేతిలకిన్నెర లాంటి వాయిద్యం, మెడల నిమ్మకాయల దండ భీకరమైన వేషంతో గుడి చుట్టు పోతురాజులతో ప్రదక్షిణలు చేని, బలిరక్తాన్ని బియ్యంల కలిపి పొలిచల్లేది, భవిష్యవాణి చెప్పేది బోనాల ఉత్సవాల్లోనే కదా! అది రాష్ట్ర ప్రభుత్వ పండగ కదా!

జోగినీ వ్యవస్థ తెలంగాణలో దళిత మాదిగ కులాల్లో ఒకటి అర బీనీ కులాల్లోని ఆడవాల్లకు దురాచారంగా శాపంగా వుంది. నిమ్న కులాల్లో అదీ మరీ ముఖ్యంగా మాదిగ కులాల్లో ఆడపిల్లలు జెర ముక్కు మొకం సక్కగున్నా, ఎర్రగున్నా, ఆ యింట్ల ఎవరికన్నా ఆరోగ్యంబాగ లేకున్నా, లేదా ఒక్కగానొక్క బిడ్డయినా వూరి పెద్దల్నించి వొత్తిడి వుంటది ‘ఏందిర ఎల్లా .. రామసక్కని బిడ్డని యింట్లుంచుకొని బువ్వకు సచ్చుడేందిరా, నీ బిడ్డెను జోగిని జేెన్త దేవుని సొమ్మంత మీకేనా జోగినీ జెత్తె నీకు బర్కతి, వూరుకు బర్కతి’ అని తల్లిదండ్రుల్ని మాయజేని ఆశ సూయించి వాల్ల ఆడపిల్లల్ని సదువుకోనీయక దేవునికి పెండ్లిజేని దేవుని భార్యను చేని ఆమెను వూరంతటికి వుంపుడుగత్తెగా జేస్తుంది జోగినీవ్యవస్థ.

జోగినీలను ఎవ్వరు పెండ్లి జేసుకోవద్దట. చేసుకున్నోడు సచ్చిపోతడట. అంది ఆమెను పెండ్లి చేసుకోవద్దట. కాని ఆమెను సెక్స్‌ బొమ్మగా వాడుకోవచ్చట, దానికి ఏ దోషం లేదట ఎవ్వరు చావరట. ఏందీ నమ్మకాలు! ఎంత దుర్మార్గమైన దురాచారం దళిత మాదిగ, అణగారిన ఆడవాల్లకు. ఏ సంస్కరణలు వీల్ల దురాచా రాన్ని రూపుమాపలే ..

నిజానికి కులసంగాలకు మరీ ముఖ్యంగా మాదిగ కులసంగాలకు తమ కులమ్మీద, తమకుల మహిళల మీద జరుగుతున్న దాడిలాగ, విధ్వంసంలాగ చూడలేక పోవడం వారి వెనకబాటు తనమైనా అయివుండాలి, అసహాయత అయినా అయివుండాలి. ఏదో నినిమాల ఒక బ్రాహ్మణ మహిళలకు అవమానం జరిగిందని ధర్నాలు జేని, గగ్గోలు బెట్టిన దళిత, మాదిగ కుల సంగాలు తమ కులమ్మీద, తమ కులమహిళలమీద జరుగుతున్న జోగినీ దుర్మార్గపు ఆచారం పట్ల మతంపేరుతో జోగమ్మను జేని తర్వాత ఆమెను వూరి మగాళ్లందరికి ఉమ్మడి సొత్తుగా చేస్తున్న జోగినీ వ్యవస్థ పట్ల సోయివుండది.

యితర కమ్యూనిస్టు, విప్లవ సంగాల్కూడా పట్టలే యీ దురాచారం. కాని సొంతకులం ఆడవాళ్లు యిట్లా అన్యాయంగా ఆచారం పేరుతో నాశనం అవుతుంటే తరాల కాన్నుంచి కుల సంగాలకు పట్టకపోవడం ఏమనాలి?

మహిళా ప్రాతినిద్యాలకోసం పెద్ద పెద్ద మీటింగులుబెట్టి మహిళల కోసం పోరాడుతున్నమని చెప్పే నాయకులు సొంతకులం లోని మహిళలు జోగినీ పేరుతో బలవుతుంటే ఏనాడైనా నోరు విప్పిండ్రా. జోగినీ చేయడమనేది మా కులాల మీద, మా ఆడవాళ్లమీద విధ్వంసకరమైన దాడి అని ఎన్నడైనా గుర్తించారా! తమ ఆడవాళ్ల యీ మతాచారం, ఆధిపత్య కులాచారం వుందనీ, దేవుడి భార్య పేరుబెట్టి వ్యభిచరించే దుర్మార్గాల మీద స్పందించారా!

ఇప్పటికి తెలంగాణలో దాదాపు 50 వేల మంది జోగినీలున్నారు. తెలంగాణొచ్చి సంవత్సరం దాటినా, ఆవిర్భావ సంబరాలు చేస్కున్నా .. జోగినీ నిషేధ చట్టం మీద పౌరసంగాలు, ప్రభుత్వాలు మాట్లాడ్తలేవు. 1988లో ఉమ్మడి రాష్ట్రంలో ‘జోగినీ నిషేధ చట్టమొచ్చింది. అయినా యిప్పటిదాకా యీ చట్టానికి రూల్స్‌ రూపొందించని దున్థితి ఆంధ్రలో వుంది. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే జోగినీ నిషేధ చట్టం తీసుకొని రావాల్సివుంది.

జీవో ఎమ్మెన్‌ 139 (ఎడ్యుషేన్స్‌ తేది 29-12-2009 ప్రకారం జోగినీ పిల్లలకు తండ్రిపేరు కాకుండా తల్లిపేరు పెట్టొచ్చు అని ఆర్డరిచ్చినా అది అమలు కావడంలేదు. స్కాలర్‌షిప్‌ ఫాoలో తండ్రిపేరు కాడ తల్లిపేరుండడం వల్ల ఆన్‌లైన్‌లో ఆ్సన్‌ కాక ఆంధ్ర తెలంగాణలో జోగినీ పిల్లలందరికి స్కాలర్‌షిప్పులు ఆగిపోయినయి. జోగినీలకు ఎట్లాంటి పెన్షన్స్‌ రావడం లేదు. దేవుడి భార్యలైనం దున, దేవుడు సావనందున వాళ్లు వితంతు వులు కారట. నిత్యసుమంగలులట అందుకేవాళ్లకు వితంతు పెన్షన్‌ లేదు. వృద్ధాప్య పెన్షన్‌ కూడా లేదట. ఏ పెన్షన్‌ లేని మాకు సపరేట్‌గ జోగినీ పెన్షన్‌ యివ్వాలని సచివాలయం చుట్టూ తిరుగుతున్న జోగమ్మలకు ఏ సంగాల అండలేకపోవడం విషాదం.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.