వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతిప్రియమైన సత్యా!

నీ ఊహే పారిజాత పరిమళంలా అల్లుకుపోతుంది. నీ న్నేహం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. నువ్విచ్చిన మాననిక ధైర్యాన్ని గురించి విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిజం సత్యా, ఇది పొగడ్తో, అతిశయోక్తో కాదు, నేనేకాదు నాలాంటి ఎందరో నీకు ఆత్మీయ న్నేహితులే.

గోదావరి నదీప్రవాహం నుంచి ఎగినిపడ్డ రెటం గలగల గవ్వల శబ్దాన్ని చేస్తూ ఇలా హైదరాబాద్‌ నగరంలోకి వచ్చి పడింది. మనం కలినిన ప్రతీసారి ఎక్కువ మాట్లాడుకోకపోవచ్చు కానీ నీ సాన్నిహిత్యం న్నేహసౌరభాన్నే మిగులుస్తుందెప్పుడూ. ‘భూమిక’ పత్రిక కోసం నిరంతరం నువ్వు పడుతున్న శ్రమ, తపన నన్నెంతో ఆకర్షించాయి. స్త్రీల కొరకు ఫెమినిన్ట్‌ పత్రిక ఇంతకాలంపాటు ఆగకుండా తీసుకురావడం వెనక నీ పట్టుదలే వుంది. ‘భూమిక హెల్ప్‌లైన్‌’ స్థాపన ద్వారా ఎందరో స్త్రీలకు ఫోన్‌ ద్వారానే వారివారి జీవన సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని కలిగించడం అభినందనీయమైన విషయం. టెక్ట్స్‌బుక్స్‌లో హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ రావడం వల్ల చాలామందికి ఉపయోగ పడ్తోంది. 24 గంటలపాటూ పనిచేయడం వల్ల ూడా ఎందరికో న్యాయాన్ని చేయగలు గుతోంది. నువ్వు చేస్తున్న ఎన్నెన్నో పన్లూ, స్త్రీల కోసం అనునిత్యం పడే తపన, మానవత్వాన్ని కోల్పోతున్న మనుషలపట్ల నీ ధర్మాగ్రహం, నువ్వు నిప్పై జ్వలించే తీరు, ఎటువంటి న్థితినైనా ఎదుర్కోగలిగే నీ ధైర్యం ఇవన్నీ నాంతో స్ఫూర్తిని కలిగిస్తాయి.

ఉన్నదున్నట్లుగా మొఖాన అడిగేయడం నీ స్వభావం. ఇవన్నింటికంటే సత్యా, నీలో ఒక పనిపాప వుంది. చల్లని చిర్నవ్వు వుంది. ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకొన్న హృదయముంది. న్నేహానికి ప్రాణంపెట్టే లక్షణముంది. పగలురాత్రీ అని లేకుండా ఆపదల్లో వున్నవాళ్ళకు ఎలాగైనా కాపాడ గలిగే సమర్ధతుంది. కరుణ నిండిన మనస్సుంది. అది కన్నీళ్ళకు కరుగుతూనే, ఎదుర్కోవాలి. కన్నీరుండూడదు. కన్నీళ్ళు కార్చడం బలహీనత అనే తత్వంతో, కన్నీళ్ళకు డ్యాoలు కట్టేని, ధైర్యంతో ఎదుర్కొనే శక్తుల్ని బట్వాడా చేస్తావు.

సత్యా ఇంకో విషయం చెప్పనా! నీతో న్నేహం చేనినవాళ్ళెవరూ మర్చిపోరు. నిన్ను ఒదులుకోరు. వాళ్ళ మనశ్శరీరాల్లో నువ్వొక భాగమైపోతావ్‌. ఇది వాళ్ళు చేసుకున్నది కాదు. నువ్వొక న్నేహగుచ్ఛానివి. కాబట్టి అందరూ అలాగే అనేసుకుంటారు.

తోటి స్త్రీలకోసం నువ్వు కన్న కల ‘ఆమె కల’ అనే కథల రూపాన్ని తీసుకొంది. స్త్రీలు జాగృతమవ్వాల్సిన న్థితి కోసం ‘మెలకువ సందర్భం’ అదే మరో కథల పుస్తకాన్ని తీసుకొచ్చావు కదూ! నీ ప్రయాణానుభవాలతో వచ్చిన ‘తుపాకి మొనపై వెన్నెల’ కూడా నాంతో హత్తుకున్న రచన. అవునూ! డిటిపి అయిపోయిన కవిత్వ సంకలనం ఇంకా ఎప్పుడు తల్లీ వెలుగు చూడ్డం! సామాజిక కార్యక్రమాలు ఎక్కువైపోయి రచనాకాలం తగ్గిపోతోంది. నీ కథల్లోని పాత్రలు, వాటి ధైర్యం, తెగువ, జీవన సామర్ధ్యం ఎన్నో విలువైన విషయాల్ని చెప్పడంతోపాటు, మాననిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ‘పాలపుంత’ కథలో జీవనసా రాన్ని వినూత్న ధోరణితో చెప్పావు.

సాహిత్యమూ, నీ ప్రేమ మూర్తిమ త్వంతోపాటు నువ్వుచేనిన ఇంకొక పనివల్ల మన సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. అప్పటివరకు రచయిత్రులు ఎవరిపాటుకు వాళ్ళు గూళ్ళల్లో ఉంటూ, రచనలు చేస్తూ విడివిడిగా బతుకుతూ, మీటింగుల్లో మాత్రం కలుస్తూ, ఫోనుల్లో మాత్రం మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు. నువ్వేం చేసావో తెల్సా. వాళ్ళందరి మౌనాన్నీ బద్దలు కొట్టావు. చిన్నా, పెద్దా రచయిత్రులందరితో కలని భూమికతో మీటింగ్‌లు పెట్టడంతోపాటు, టూర్లను ఏర్పాటు చేయడంతో ఇళ్ళను వదిలి వారం రోజులపాటు ఆత్మీయ మిత్రులతో కలిని తిరగడంలోని న్వేచ్ఛను అందరూ అనుభవిం చేట్లు చేశావు. న్వేచ్ఛ గొప్పతనాన్ని చెప్పకనే చెప్పావు. ఈ టూర్లు వినోదయాత్రాల్లానే కాకుండా,ఒక సాంఘిక ప్రయోజనం కోసం కూడా ఏర్పాటు చేశావు. వాకపల్లి లాంటి దుఃఖోద్వేగ యాత్రలు ప్రయాణించిన అంద రికీ అంతర్లీనంగా ఒక చక్కటి న్నేహంగా రూపొందడానికి ఆస్కారమైంది. పోరాట స్ఫూర్తిని కలిగించింది.

స్త్రీవాద భావాలు అటు సాహిత్యంలో కాక జీవితాల్లో ూడా చొచ్చుకుపోవడానికి కారకులయినాయి. ఎప్పుడున్నా దిగులు మేఘం నన్ను చుట్టేనినప్పుడు, నేను బలహీ నమౌతున్న క్షణా లు ఎదురైనప్పుడు, సమస్యలు అలుముకున్న ప్పుడు, ధైర్యం చేజారిపోతున్నప్పుడు నన్ను కళ్లు మూసుకుని తల్చుకోగానే నాలో ఏనుగు బలం వచ్చేస్తుంది. నిజం సత్యా! సాహిత్యమి చ్చిన నెచ్చెలిని నువ్వు. నీ న్నేహం నాలో నిరంతరం ఇలా ప్రవహిస్తూనే వుంటుంది సత్యా!

నీకు గుర్తుందా సత్యా! యఫ్‌.బి.లో పోస్ట్‌ పెట్టావొకసారి నువ్వు ఆఫీసుకొస్తుంటే, దార్లో ఫ్లై ఓవర్‌ మధ్యలో ఒక మొక్కను సరిగ్గా పాతకపోవడంతో అది వడలిపోయి వాలిపోతూ నీకు కన్పించింది. అయ్యో మొక్క చచ్చిపోతుందాని నీకు బాధ. అక్కడ కారు ఆపడానికిగానీ, పార్కు చేయడానికిగాని వీలు లేదు. మొత్తం చుట్టు తిరిగొచ్చి ఓ మూల కారు పెట్టి, ఒక చిన్నపిల్లవాడు కనబడితే వాడికో వంద రూపాయలిచ్చి, చుట్టూ సరిగ్గా తవ్వి మొక్కను పాతమని చెప్పి, మళ్ళీ చుట్టూ తిరిగి వస్తుంటే గుంటను తవ్వుతున్న పిల్లాడు కన్పించగానే సంతోషించానన్నావు. ఆ నాటి మొక్క ఇప్పుడో పెద్ద వృక్షమై పోయిందన్నావ్‌. ఒక మొక్క కోసమే నువ్వంత తల్లడిల్లి పోతావే! తోటి మనిషికి కష్టమొన్తే ఊరుకొనే స్వభావం కాదు నీది. ప్రకృతంటే, వెన్నెలంటే, పువ్వులంటే, అడవి అంటే, సెలయేళ్ళు, సముద్రాలంటే ఎంతో ఇష్టం కదూ! నేను చేపపిల్లలాంటి దాన్ని, నిరంతరం ఈదుతూనే ఉంటానన్నావ్‌. నువ్వొక కథలో రాసావ్‌ గుర్తుందా? సంతోషమంటే ఎక్కడో ఉండదు. నీచుట్టూ, నీలోనే ఉంటుంది. దాన్ని వెతికి పట్టుకోవడమే జీవితం అని. చాలా అలవోకగా జీవిత సత్యాల్ని పాత్రల్తో పలికించడం నీ ప్రత్యేకత. ఇప్పటికింకా నా మదిలోని భావాల్లో కొన్నింటిని మాత్రమే రాయగలిగాను. ఇంకోసారి మళ్ళీ ఉత్తరంలో కల్సుకుందాం సరేనా!

నీ…శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో