నా… ని’వేదన’ – శ్రీమతి నండూరి జ్యోతి

కరిగే కాలానికి తెలుసునా… కరిగిన కాలం విలువ
పరుగెత్తే పయనానికి తెలుసునా… పరుగుతీనే వేగం విలువ 
కనిపెంచే మమకారానికి తెలుసునా… కనిపించని మమకారం విలువ
ఎదిగీ ఎదగని ఈ పసిూనకు తెలుసునా… విలువైన బాల్యం విలువ
కనిపెంచినవారి మమకారం… కడివెడంత వున్నా
కనుసన్నల్లో పెంచాలని… మిన్నంటే ఆశ వున్నా
కనిపించని జీవన పధం… కదలలేని బ్రతుకు రథం
నన్నిలా మార్చింది… బాలూలీగా… నాపై నా జాలిగా…
పగలనక… రేయనక… ఎండనక… వాననక
నాలుగు మెతుకుల కోసం… నాలుగు రూకల కోసం
విలువైన బాల్యాన్ని విడచి… మోయలేని భారం మోసి
ూలీనాలీ చేస్తూ… నా బ్రతుకును ప్రశ్నగా మార్చుకున్న నేను
సమాజం సంధించే ప్రశ్నలకు… జవాబులేని నేను ఏమని బదులివ్వను
వెంటాడి వెంటాడి వేటాడే ఆకలిగొన్న పులికి పంజావాడి ఎక్కువ
ఎదురీది ఎదురీది నడిచే ఈ ఆకలిగొన్న పసిప్రాయానికి కన్నీటివాలు ఎక్కువ
సమాజపు కడలి ఒడిలో కన్నీరు కార్చినా తీరని దాహం
ఎడారి ఒడిలో ఎదురేగి ఎదురేగి… ఎండమావిౖ గమ్యం తెలియని గమనం
అడుగులు వేసి వేసి సొమ్మసిల్లే ముళ్ళదారిలో… అంతులేని పయనం
ఓనమాలు నేర్వాలని ఎదురు చూసి చూసి… దరిచేరని అక్షర సిరిౖ నాలో రేగే అంతరంగం
ూనిరాగాలు తీసి… కునుకు వేసి… కమ్మని పాఠం వినే పాఠశాలకు దూరమై
నా ఆశల సౌధాలను ూకటివేళ్ళతో పెకలించిన ఈ చీకటి బతుకును ఏమని అడగను!
చిరుప్రాయపు చిగురుటాకు వాడియైన వేడికి వాడి… బంగరు బాల్యానికి భద్రతే కరువై
ఈ బోసి నవ్వుల చిన్నారి బాలలను వీధిన విసిరేసిన వీధి బతుకును ఏమని అడగను!
భూమికి ఆకాశం ఎంత దూరమో… ఆకశానికి భూమి అంతే దూరం
కనిపించే ఆకాశం అందనిదీ ఆకాశం…
అందని ఆకాశంలా అందనంత దూరంలో వున్న పలకా బలపం అందుకోలేక
కనుమరుగైపోయిన వసంతంలా వికసించే వివేకం విడమరిచే విజ్ఞానం ఇమడలేక
విలువలు వీడిన తెగిన గాలిపటంలా, మంచికీ చెడుూ తేడా తెలియని మా”నవ” మృగాన్ని అవుతున్నా
చట్టాలన్నీ తప్పు చేస్తున్నవారికి చుట్టాలవుతుంటే… ఏ చట్టానికి ఏమని విన్నవించను!
ఆకురాల్చే కాలానికి తెలుసు ముందుంది కనువిందు చేనే పచ్చదనమని
కానీ కాలగమనంలో ూలిపని చేనే చినవాడికి చెప్పగలనా ముందుంది మంచికాలమని
కనుల ముందు నిలిచివున్న కదిలే కాలానికి తెలుసు…
జాగృతిలో వుంటూ నిదురపోయే జనసంద్రానికి తెలుసు…
”నేటి బాలలే రేపటి పౌరులని”
ఇటుకలు మోనీ… ూలీ చేసి… చేతులు కందిన చినవాడిని
పెదవి విప్పి చెప్పాలని వుంది… గొంతెత్తి పలకాలని వుంది…
”బురదలో పుట్టేది కమలమే…
మట్టిలో పుట్టేది మాణిక్యమే…
మాూ చేయూతనిచ్చి చూడరా…
విలువైన బాల్యం కోల్పోతున్న చిన్నారులం…
బంగరు భవిష్యత్తుగల భావిపౌరులం కాలేమా”!!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to నా… ని’వేదన’ – శ్రీమతి నండూరి జ్యోతి

  1. A.Rambabu says:

    Wonderfully written about the childhood which has been robbed away , due to financial problems , the golden age of going to school has been lost/taken away . The hidden/ raw talent / intelligent of the children is lost, If opportunity is given to these deprived children , their talent / intelligence can be useful to this country in nation building. This nice message has been given in this article / post. Really wonderful presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో