ఏ కూతురితోనైనా
అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది
అమ్మాయి జీవితాకాశంలో
వేల ఇంద్రధనుస్సుల్ని సృష్టించాలని
అమ్మాయి అడుగులేనినంతమేరా
ఆకుపచ్చని తివానీ పరవాలనీ
అమ్మ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది
ఆ రోజుల్లో మా అమ్మ ూడా చెప్పేది
ఆడపిల్లలంటే అణగిమణగి ఉండాలనీ
ఎన్ని తుఫాన్లనైనా ఎదలోనే దాచుకోవాలనీ
ఎప్పుడూ తలవంచుకునే నడవాలనీ
హాయిగా నవ్వూడదనీ, గట్టిగా మాట్లాడొద్దనీ
కన్నీటి జాడల్ని ఎవ్వరికీ కన్పించనీయొద్దనీ
అప్పగింతల పాటతోబాటు
అటే చివరి ప్రయాణమైపోవాలనీ
అమ్మ ఎప్పుడూ చెప్తుండేది
అందు నేను
కళ్ళల్లో పొగ పోయిందనే వంకతో
కన్నీరు కారుస్తుంటాను
నాలుగ్గోడల మాటున నవ్వు నటిస్తుంటాను
బాధ్యతలేగాని హక్కుల ఊసెత్తలేను
కన్నవారే పరాయివాళ్ళలా ప్రవరి్తన్త
తప్పు చేయకపోయినా తలదించుకుంటాను
ఆకాశం మెరుపుల్ని ఆస్వాదించాలనిఉన్నా
అందని చందమామని చూని
నిట్టూరుస్తుంటాను
అమ్మాయిలెప్పుడూ
అవసరంలేని అమాయకులే గదా!
కొంచెం తిండి, గుడ్డలిన్తే
ఇంటెడు చాకిరీకి
జీవితాంతం కట్టుతాడేసుకుంటారు
తీరా ఇంత ప్రయాణం చేశాక
వెనక్కి తిరిగి చూసుకుంటే
మా అమ్మ చెప్పిన మాటలేవీ
నా జీవితంలో అక్కరకు రాలేదు
ప్రతిక్షణం నా కాళ్ళకు
పలుపుతాళ్ళయ్యాయి
దారిపొడుగునా మొలిచిన
ముళ్ళజెముళ్ళయ్యాయి
ఇవ్వాళ నేను మాత్రం
నా కూతురితో నిర్భయంగా చెప్తున్నా
అడుగు అడుగునా ముళ్ళకంచెలతో
రాజీపడి పోవద్దని
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
