Eleven causes for the Degeneration of India – గురజాడ- పత్తి సుమతి

”సామాజిక ప్రయోజనం లేని సాహిత్యానికి నేను విలువ ఇవ్వలేను” అని తఱచుగా వ్యాఖ్యానించేవారట మహాకవి శ్రీశ్రీ… అంతా తానై మహాభారతాన్ని నడిపించిన వీరాధివీరుడు, అరివీర భయంకరుడు భీష్ముడు చివరికి అంపశయ్యపై అచేతనుడై దిక్కులు చూస్తూవున్న విధంగా ఉంది మన వర్తమాన సాహిత్యం… వేలవేల సంవత్సరాలనాటి రామాయణం, మహాభారతంలోని సీత, అహల్య, ఊర్మిళ, ద్రౌపది, కర్ణుడు… పాత్రల చుట్టూ ‘గుడుగుడు గుంజం గుండ్రపరాయిలాగా తిరుగుతున్నది ఈనాటి మేటి మన మహిళాసాహిత్యం తీరుతెన్నులు. నేటి సాహిత్యంలో అనువర్తిత విమర్శ, అనువర్తిత పరిశోధన – applied research కనిపించడం లేదు… ఇప్పటికీ – మన సాహిత్య దీపధారి మహాకవి గురజాడ నూటపది సంవత్సరాల క్రితం వ్యాఖ్యానించిన మాటల మూటలు మన జాతి పరిస్థితికి శిరోధార్యమయి కూర్చున్నాయి… – ”Eleven causes for the degeneration of India” అని 1897లోనే ఒక Thought striving statement-  కన్యాశుల్కంలో తన mouth-piece అయిన గిరీశం పాత్రతో వ్యాఖ్యానిస్తారు మన గురజాడ.

The First and Foremost cause for the degeneration  మాత్రం – మనదేశంలో పుట్టిన మహామహా పురుషోత్తముడు – సమస్త మానవాళికి మహనీయుడు – బుద్ధుడు ప్రవచించిన బౌద్ధమతాన్ని వైదికులు తమ స్వార్థంతో వెళ్ళగొట్టడంతో… మన భారతీయ సంస్కృతి పతనంకి పునాదిరాయి పడింది. మళ్ళీ మనువాదం, మలివేదం విజృంభించడంతో కుల, మత మౌఢ్యం ఊడలు సాచింది. జన్యువైవిధ్యం లోపించడం, మానవీయ కోణంలో ఆలోచించలేని అజ్ఞానం, స్వశక్తిపై నమ్మకం లేకపోవడం మన భారతజాతిని అంచెలంచెలుగా ఒక బలహీనజాతిగా మార్చివేసాయి. అందు మహాకవి గురజాడ ఇలా తన ఆవేదనను వ్యక్తీకరించారు : ”బౌద్ధం మనదేశంలో పుట్టింది. పుట్టిన దేశం నుంచి దానిని వెళ్లగొట్టి మనదేశం ఆత్మహత్య చేసుకుంది” అని…
మన దేశ ”degeneration ప్రారంభానికి” మొట్టమొదటి కారణం ఇదే… ”The First Pioneer of the Universe”ని కోల్పోయాం అనేది అక్షరసత్యం.
ఇలా అనేకానేక కారణాలు సుస్పష్టంగా కన్పిస్తూ న్నప్పటికి… స్త్రీల విషయంలో ఈ ‘Degeneration’ పరాకాష్ఠకు చేరింది. ఈ ఆధునిక హైటెక్‌ యుగంలో ” ‘రేపుల’ పర్వం” మొదలైంది.
”ఒకప్పుడు విజ్ఞానపు వీధులలో విహరించిన దేశం… సత్యానికి ధర్మానికి మారుపేరు మనదేశం… సభ్యతూ సంస్కృతికీ మేలుబంతి మనదేశం… మానవతకు బంగారపు మకుటమైన మనదేశం…”కి ఇప్పుడేమయింది? ఎటు పోతోంది? ఒక్క నిర్భయ ఉదంతం ఒక మాయని మచ్చగా ఈ దేశ చరిత్రలో నిలిచిపోతోంది. ఐదారేడుల పసిపాపల పైన కూడా ఈ ఆధునిక కీచకపుంగవులు చేస్తోన్న అకృత్యాలు, అరాచకాలు సభ్యసమాజాన్ని తల ఎత్తుకోకుండా చేస్తున్నాయి. ”రోడ్డుపై మిఠాయిలుంటే కుక్కలు తినకుండా ఉంటాయా?…” నిర్భయ సుేలో ఒక డిఫెన్స్‌ లాయరు – వివాదాస్పర వికృత వ్యాఖ్య చేసాడు.
అంతేకాదు… ”…అసలు అర్ధరాత్రి సమయంలో పరాయి పురుషుడితో వెళ్లేందుకు నిర్భయ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? ఎదిగిన కూతురు ఎక్కడికి పోతోందో పట్టించుకోవద్దా! అదే నా కూతురు అయితే పెట్రోలు పోసి తగలబెడతాను.” ఇది చదివిన ప్రతీ భారతీయునికి గుండెలవిసిపోయాయి. మన degeneration of India కి అంతకంటే కొలమానం ఏమి కావాలి? – కనీసం సినిమాకి వెళ్లే న్వేచ్ఛ కూడా లేదని… ఇక్కడ భారతావనిలో చీకటి పడితే – మృగాల రూపంలో దుర్యోధన, దుశ్శాసన, కీచకులు విజృంభిస్తారని… ఇది హైటెక్‌ యుగం కాదని… రాతియుగమని… ఇదీ మన నేటి భారతమని…” లొసుగులు ముసుగులు – లోలోపల కొట్టిమిట్టాడుతున్న అసలైన మన pseudo సంస్కృతిని భళ్ళున…భళ్ళుభళ్ళున బహిర్గతం చేసి న్యాయవాది (వ్యాధి) పుణ్యం కట్టుకున్నాడు… పట్టపగలు భారతస్త్రీకి ఏ ప్రమాదం వాటిల్లదని… చీకటి పడితేనే మానవమృగాలనుండి ‘ముప్పు’ పొంచియున్నదని… కనుక… భారతీయ వనితల్లారా! తస్మాత్‌! జాగ్రత్త!?” అని ఒక ultimate statement ఇచ్చేసాడు… ఈ న్యాయవ్యాధి (వాది) గార్కి 125 కోట్ల భారతీయులు ఒఒక ప్రశ్న సంధిస్తూన్నారు… ముక్తకంఠంతో – ”…మరి అభంశుభం ఎరుగని 3, 5, 6, 7 ఏళ్ళ పసిపాపలపై – పట్టపగలు – ఈ నీచ నికృష్ట వ్యవన్థీకృత భారతంలో పెరిగిన కీచకుల దాడి ఏ సంస్కృతికి చెందినది మహాశయా! ఆ పసిపాపలపై పెట్రోలు పోసి తగలబెడతారా! న్యాయవ్యాధిగారు?!… ఇది నిజంగా జాతి క్షమించలేని పాపం…
బ్రిటిష్‌ జర్నలిస్టు తీసిన ‘ఇండియాస్‌ డాటర్‌’ లఘుచిత్రం ప్రసారాన్ని నిలిపివేసినంత మాత్రాన్న మనలో నిబిడీకృతమైయున్న కపటం, కుళ్ళు, నీచత్వం ఎక్కడికి పోతాయి… రేపు మరొక రూపంలో బయటపడతాయి… దీనికి అంతం ఎప్పుడు…? ఒక విధంగా ఆ లఘుచిత్రం – మన మేడిపండు సమాజాకృతిని బహిర్గతం చేసి మనల్ని అప్రమత్తం చేసిందనేది తిరుగులేని నిజం… రెండున్నరఏళ్ళ జైలు జీవితం తరువాత కూడా నిందితుడి ఆలోచనావిధానంలో మార్పురాలేదు సరికదా! ‘ఇలా మాట్లాడితే’ తనకి ఎటువంటి ‘ముప్పు’ ముంచుకువస్తోందో… అనే ‘భయం’ కూడా లేదంటే ‘ఇటువంటి దారుణమైన సామాజిక పరిస్థితిని ఏ విధంగా explain చేయాలో కూడా చాలా సంక్లిష్టం – అని చెప్పక తప్పదు. ఎందుకంటే మన First IPS మహిళా ఆఫీసర్‌ కిరణ్‌బేడీ తీహార్‌ జైళ్ళనే ఒక ప్రార్థనా మందిరంగా (heritage గా) మార్చివేసిందనేది నిఖార్సయిన వాస్తవం… రెండున్నర ఏళ్ళ తరువాత తనకు ‘ఇంటర్వ్యూ’ రూపంలో వచ్చిన ఈ కాస్తా అవకాశాన్ని కూడా నిందితుడు దుర్వినియోగం చేసుకున్నాడు… one should pity for India’s son too…ఇదే ప్రతీ భారతీయుని తీరని ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం… ఇదే…ఇదే…ఇదే… మన societal degeneration and degradation … ఇదే గురజాడ చెప్పినది. ”…బాధితురాలి మీదే తీవ్ర ఆరోపణలు చేయడం – మహిళలు పాటించవల్సిన నియమాలు ఏకరువు పెట్టడం – అన్నింటికంటే అతని తరఫున వాదించిన న్యాయవాది అమానుషమైన వ్యాఖ్యలు… బ్రిటిష్‌ వనిత ఉడ్విన్‌ మన సమాజంలో వేళ్లూనికుని వున్న హిపోక్రనీని, డూప్లిసిటీని తేటతెల్లం చేసి పుణ్యం కట్టుకుంది – అనేది పచ్చినిజం.
”పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ‘ది ఇలెవెన్‌ కాజస్‌ ఫర్‌ డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ను గూర్చి మూడు గంటలు ఒక్కబిగిని లెక్చర్‌ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు…” అంటాడు కన్యాశుల్కంలో శిష్యుడితో గిరీశం. ఇది నూటికి నూరుపాళ్లు గురజాడ Monologue. ఇది వేలం ఆయన ‘statement’ అని చెప్పక తప్పదు. ఒక్క నిర్భయా ఉదంతం గురించి ఎవరైనా research చేన్తే మన నేటి సమాజం – రోజురోజుకి… క్షణంక్షణంకి ఎంత పతనమవుతోందో thesis రాయవచ్చు… అనేక వేల సంవత్సరాల క్రితం రామాయణంలో నీతను ఎత్తుకుపోయిన రాక్షసరాజు రావణాసురుడు కూడా నీత యెడల చాలా ఔచిత్యంగా (decency గా) ప్రవర్తించాడని పురాణాలు చెపుతున్నాయి.
మహాభారతంలో ‘ద్రౌపది వస్త్రాపహరణ’ ఘట్టంలో దుశ్శాసనుడు చేసిన నీచనికృష్ట చర్యకు – ప్రతిచర్యగా దుశ్శాసనుని గుండె రక్తంతోనే తిరిగి జుత్తు ముడివేస్తానని ద్రౌపది చేసిన ప్రతిజ్ఞ కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుశ్శాసనుని గుండె చీల్చి రక్తాన్ని త్రాగి, ప్రేగులను తన మెడలో ధరించి, దోసిలి నిండుగా రక్తము నిడుకొనివచ్చి ద్రౌపది కురులకు వ్రాసి ముడివేశాడు. వ్యాసుడు సృష్టించిన అటువంటి అరివీర భయంకరులు, అతిరథ మహారథులు నేటి భారతావనిలో లేరు.
ఈ కుష్టు కులవ్యవస్థలో, కార్పొరేట్‌ కారాగార కబంధ హస్తాలలో చిక్కుకున్న విద్యావిధానంలో… భ్రష్టుపట్టిపోయిన సామాజిక, రాజకీయ నికృష్ట వ్యవస్థలో – ”ఈ దారుణ మారణ హింసాకాండను – ఉడుత్తిెన యువరక్తంతో – ఉప్పొంగిన ఉద్రేకంతో – ప్రతీకార జ్వాలాజ్వలిత హృదయాలతో – ప్రతిఘటించి – తమ కవోష్ణ రుధిర తర్పణంతో – భారతావనినే పునీతం చేసిన భగత్‌సింగ్‌లు – రాజగురు – సుఖదేవ్‌లువంటి వీరధీర యువశక్తి, నవశక్తి… ఎలా మొలత్తుెతారు…?! ఎక్కడనుంచి ఆవిర్భవిస్తారు?! మహా అయితే క్రొవ్వొత్తులు వెలిగిస్తారు. ఛానెల్స్‌లో గంటల తరబడి చర్చిస్తారు… దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన… భారతజాతికి ప్రాణం పోసిన… వారు ఏరి… ఎక్కడా కన్పించరేం… వీరులు లేని భూమి అయిపోయిందా?! అన్నీ వంకరటింకర మాటలు-చేష్ఠలే… ‘ఉడ్విన్‌కి ‘షటప్‌’ అని చెప్పాలని ఉందని’ – ఒక సాహితీవేత్త అన్నారని ప్రముఖ వార్తాపత్రికలలో వచ్చింది. ఇది నిజంగా నిజమయితే – దారుణం. ఉడ్విన్‌ అనే స్త్రీకి ‘షటప్‌’ అనే బదులు ‘జైలు జీవితం’ అనుభవిస్తున్న నిందితుడు ‘జైల’నే పాఠశాలలో ఏమి నేర్చుకున్నాడో నిలదీన్తే… ఈ ప్రముఖ సాహితీవేత్తకు కోటి నమస్కారాలు పెట్టేవాళ్లం.
నిందితుడు రాయడానికి కూడా సాధ్యంకాని మాటలు మాట్లాడాడని పత్రికలు ఘాెష పెడుతున్నాయి. మృగంతోను… మనిషితోను పోల్చలేని ‘తిర్యగ్దృక్కుడు’లా ఈ సమాజం తయారుచేసింది. సరైన చదువు, సంధ్య, సంస్కారం… నేర్చుకోవడానికి అవకాశమే లేని అట్టడుగు వర్గానికి చెందినవాడు కావడం వలన… జైలుజీవితం కూడా ఏ విధంగా సహకరించక పోవడం మన ప్రారబ్ధం… ఈ రకమైన మానసిక ప్రవృత్తి గలవారు ఎలా పుట్టుకువస్తున్నారో చాలా లోతైన అధ్యయనం చేయవలసి వుంది… పుట్టినా వారిని పకడ్బందీగా ప్రాథమిక పాఠశాలల్లో reform మరియు refine చేయగల్గే స్థాయికి ఈ ‘బడులనే గుడులు’ తయారుకావాలి… ఆ అదృష్టం కూడా లేదు మనకు… మరమనుష్యలను మాత్రమే తయారుచేస్తున్నాం.
”నా కూతురో, సోదరో ఇలా మగ న్నేహితుడితో బయటిళ్లిె కుటుంబానికి చెడ్డపేరు తెన్తే కుటుంబమంతా చూస్తుండగా పెట్రోల్‌ పోసి ఆమెకు నిప్పుపెడతాన’ని వ్యాఖ్యానించిన నిందితుడు లాయర్‌కి 125 కోట్ల భారతీయులు ముక్తకంఠంతో ‘human biology’లోని fundamentals మొట్టమొదట చదవమని చెపుతూ… ఈ ఘాెర క్రూర, కర్కోటక, నీచ, నికృష్ట రాజకీయ సామాజిక వ్యవస్థలో పుట్టి పెరిగిన విషఫలాలకు ముక్కుపచ్చలారని పసిపిల్లలు సహితం బలైపోతూంటే కడుపులో పెట్టుకొని కాపాడుకోవలసిన కన్నతండ్రి అనవలసిన మాటలా!” అని నిలదీయాలి. (ఈ విషయం repeat చెయ్యడం జరిగింది. క్షమించాలి… ఆక్రోశం అలా రాయిస్తోంది.)
నూరు సంవత్సరాల క్రితమే అగ్ని¬త్రావధాన్లు కూతురి సుబ్బి పెళ్లి విషయంలో… పెళ్లిూతురు తల్లి వెంకమ్మతో… తన పినతల్లి కొడుకు ముసిలిపీనుగ – లుబ్దావధాన్లు గురించి గిరీశం ఇలా అంటాడు : ”అమ్మా! యేం చెప్పను! వాడో త్వాష్ట్రం… పిల్ల దొరకడమే చాలు వాడికి… యీ సమ్మంధం వదులుకుంటే వాడికి పెళ్లే కాదు… వాడని వాడొదిలే ఘటం కాదు.”
అప్పటి పరిస్థితులకు ఈ సంభాషణ ఒక తార్కాణం. ఇప్పటి మన నేటి భారతంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే ‘ఒంటరిగా కని్పన్త చాలు ఆడదయితే చాలు… 60 ఏళ్ల నుండి 3 ఏళ్ల పసిపాపలకు ూడా రక్షణ మృగ్యం. దీనికి తిరుగులేని సాక్ష్యం… పత్రికాకథనం ప్రకారం: కొద్దిరోజులక్రితం పంజాబులోని మోగాలో తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న పదమూడేళ్ల బాలికపై బస్సు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడమే కాదు… అందుకు అభ్యంతరం చెప్పారని – వారిద్దరినీ నడుస్తున్న బస్సునుంచి నిర్దాక్షిణ్యంగా తోనేశారట… బాలిక అక్కడికక్కడే మరణించగా, ఆమె తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది… ఇంకా విశేషమేమిటంటే ఈ బస్సు పంజాబు ముఖ్యమంత్రి కుటుంబసభ్యులదట… ఈ సంఘటన కొసమెరుపు ఏమిటంటే పంజాబు ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రివర్యుడి వ్యాఖ్యలు : ”Incident result of God’s will” ఇదీ మన mindset degeneration. పట్టపగలు ూడా విచ్చలవిడిగా దొరుకుతున్న మత్తుపదార్థాలకు బానిసలై ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు… దీనికి బాధ్యత పూర్తిగా పాలకులు, ప్రభుత్వమే వహించాలి… one should pity for India’s son’s degradation and degeneration too… India’s son’s ఎందుకు ఇలా దిగజారుతున్నారో అధ్యయనం చేయాలి… యింకొక కారణం – న్యాయస్థానంలో ఎంతకు తెమలని సుేల జాప్యం కూడా ముఖ్యమయిన కారణమని ద్యోతకమవుతుంది… సర్వత్రా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు.
ఇది నిజంగా క్షమించరాని విషయం… ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి.
ఇన్ని రకాల బాధాగ్ని భాష్పాల భాషలు అక్షరీకరించాలంటే మనకి సాధ్యం కాని పని… మనలో నిరంతరం రగులుతున్న దావాగ్ని యొక్క పొగలు, సెగలు – పెల్లుబుకుతున్న సమరధ్వానంతో భగభగ, భుగభుగమని హృదయాల ఆవేదనా అలజడులు తగ్గాలంటే – శ్రీశ్రీ అన్నట్లు : ”మనసౖేెన్య సహాయం వద్దు, మనమే ఇక ెనౖన్యంగా మారిపోదాం”.
శ్రీశ్రీ కవితను hijack చేసి ఆలంబనగా తీసుకుందాం… మనలో రగులుతున్న ఈ బడబాగ్నులను చల్లార్చుకోవాలంటే శ్రీశ్రీ కవితే మనకు ఉపశమనం… ఒ ఒక రశీశ్రీaషవ… విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు,?!… దుర్హతి, దుర్గతి, దుర్మతి, దుర్మృతి… దుర్విధుడు, దుర్హృదుడు, దురాధర్షుడు, దురాత్ముడు, దుర్ధర్షుడు, దుర్భగుడు… ఈ యావత్తు మందిని… ద్రుఘణముతో (గండ్రగొడ్డలి) మట్టుబెట్టలేని మన నిస్సహాయతకు చింతిల్లుతూ శ్రీశ్రీ కవితను ఆశ్రయిద్దాం… గురజాడ ఏౖక ఏకలవ్య శిష్యడి కవితే మనకి శిరోధార్యం మరియు శరణ్యం :
”మొరపెట్టాను
మొత్తుకున్నాను
మంచిగా ఉండండర్రా అంటూ
గోల పెట్టాను…
ఘాెషించాను…
అమాయకుల జోలికిపోకండర్రా అంటూ
మెత్తగా బలిమాలుకున్నాను…
విన్నారు కాదు.
విలువలకి వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు
(నిందితుడు, డిఫెన్స్‌ లాయర్లు, జూరవబసశీ మేధావులు)
ఊరుకుంటానా నేను
కసిగా కసాయిగా
ఉపద్రవంలాగా ఉవ్వెత్తుగా లేచి
సంహారాన్ని స్యందనం చేసి
ఉద్రేక తరంగాలే తురంగాలుగా
ఆగ్రహం కొరడాని చేబూని
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై
భారత కురుక్షేత్రంలో
నవయుగ భగవద్గీతా ఝంఝని ప్రసరిస్తాను
మంటలచేత మాట్లాడించి
రక్తంచేత రాగాలాపన చేయిస్తాను…”
అన్న శ్రీశ్రీ పదములతో శపథం బూని అగ్ని సంతకం చేయాలి… – అవును మహాకవి గురజాడ చెప్పిన ‘Eleven causes for the degeneration of India’కి శ్రీశ్రీ సాహితీసారథ్యమే తిరుగులేని remedy… ఆ విప్లవ సాహితీవీరులుకి శతకోటి వందనాలర్పిస్తూ… చివరిగా ఒక మాట…
మన జాతి రత్నాలు… మన రేపటి వెలుగులు… మన యువశక్తి, నవశక్తి, మన ఆస్తి – ఈ నీచ నికృష్ట వ్యవన్థీకృత వలయంలో చిక్కుకుని మంచిగా మసిలే మార్గంలేక, చేయడానికి సరియైన పనిలేక, సరిఅయిన విద్య అందుబాటులో లేక – ‘man biological instincts’ అర్థం చేసుకొనే capacity లేక (పాశ్చాత్య దేశంలో ‘డేటింగ్‌’ అంటారు) – వేలం ఒక అబ్బాయి, అమ్మాయి సినిమాకి వెళ్ళినంత మాత్రాన – లేక అమ్మాయి సరిగ్గా ‘dress’ వేసుకోకపోతే ‘rape’ చేనేయవచ్చు అనే ‘primitive character’కి ఎందుకు? ఎలా? దిగజారుతున్నారో… ఈ నాసిరకమైన రుగ్మతలు, జాడ్యాలు, భావదారిద్య్రం నుంచి మనం బయటపడేలా ‘శాస్త్రీయ మార్గాలు’ అన్వేషించి, పరిశీలించి, పరిశోధించి, విశ్లేషించి, నిర్వచించి, నిర్వహించి మన యువతను ‘పరిరక్షించి’ వారిని ‘I am ‘he’ or she” గా తీర్చిదిద్దే బాధ్యత మనల్ని పరిపాలించే ప్రభుత్వాలది, యావత్తు సమాజానిది… ఎందుకంటే అరిటాకు మీద ముల్లు పడ్డా – ముల్లు మీద అరిటాకు పడ్డా మన ‘భారతదేశమే’ దిగజారుతుంది మన National pride అభాసు పాలవుతుంది. ఇది తథ్యం… అదే మహాకవి గురజాడ వ్యక్తీకరించినది… తస్మాత్‌! జాగ్రత్త… ఓ భారతీయుడా!…
Womanhood యొక్క degeneration, degradation కి ultimate example  … గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన విద్యార్ధిని రిషికేశ్వరి ఆత్మహత్యా ఉదంతము (13.7.2015).

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో