పెళ్ళాగింది – ఊరు బాగుపడింది- రమాదేవి చేలూరు

విశాల వినీలాకాశపు వేదికపైకి కారుమబ్బుల కన్యకలొచ్చి కనువిందు చేస్తుంటే, మలయమారుతం రాగనాద సమ్మిళితమై, వాటిని కమ్మేసింది. కరి మబ్బులు పులకించి, పరవశించి  యలొలుకుతూ, నాట్యమాడి కరిగి వానజల్లులై అవనిని ముద్దాడాయి.
సాయంత్రం 3 గం||ల సమయమైంది. బడి వదిలే సమయం కావచ్చింది. బడి పిల్లలందరూ… ఇళ్ళకి వెళ్ళే ధ్యాసలో వున్నప్పుడు, అనుకోని అతిథిలా వానజల్లులు అలవోకగా మట్టిని స్పృశించి అలరిస్తున్నాయి. మా పల్లెలో వానొన్తే వాన అందం. ఇక బడి ముందు వాన కురిన్తే అందాని అందం.
మట్టివాసన, చల్లటి గాలితో కలసి పిల్లల బుగ్గల్ని తాకితే, వాళ్ళు పరవశులై, ఒక్కొక్కరే లేచి, బడి కిటికీల ఊచల్ని పట్టుకొని, బయటికి తొంగిచూస్తూ ఆనందించారు. కళ్ళతోనే ఆనందాన్ని పక్కవాళ్ళతో పంచుకుంటున్నారు. వాన కురిన్తే ఉద్వేగానికి గురికాని మానవుడు లేడు. ఎప్పుడు వానొచ్చినా పిల్లలు కిటికీల వద్దచేరి పోతారు. టీచరు ఆ మాత్రాని కోప్పడదని తెల్సువాళ్ళకి. నేను ఆ బళ్ళో ఒక టీచర్ని. ఇంకా ముగ్గురు టీచర్లున్నారు. ఆరోజు వాళ్ళు సెలవులో వున్నారు.
ఒకమ్మాయి బడిలో నుంచి బయటళ్ళిె కొన్ని క్షణాల పాటు జడివానలో తడిసి, అమాంతం లోపలకొచ్చేసింది పిట్టలా. అందరూ రిేంతలు కొట్టారు. ఆ దృశ్యం చూసి నాకు చాలా ముచ్చటేసింది. ముత్యాల బిందువుల్ని మోముపై మోసుకొచ్చుకుంది. వాటిని చేత్తో తుడిచేస్తూ ముత్యాల హారాల్ని పంచి ఇచ్చినట్టు అందరి ముఖాల మీదకి విసిరేసి ఆనందించింది. నేను ముసిగా నవ్వాను. నాూ తడవాలన్పించింది. గొర్రెదాటులాగా బడిపిల్లలందరూ, ఒక్కొక్కరే బయటికి పరుగుతీసి తడిసి రావడంతో బడంతా తడిసి రచ్చరచ్చైంది. కాని ఒకమ్మాయి మాత్రం వానలో తడవడానిళ్ళెలేదు. ఆ పిల్లకి ఒంట్లో బాగోలేదనుకున్నాను.
కానీ హుషారుగా ఆనందిస్తోంది. సెలయేటి గలగలలు ఆమె నవ్వుల్లో విన్పిస్తున్నాయి. ఎప్పుడూ లేంది, ఆరోజు మాత్రం చాల ముస్తాబైంది. పూల జడ, జడకుచ్చులు, కొత్త పావడాతో బడికొచ్చింది, వెన్నెల్లో కిన్నెరసాని లాగ. ఆ అమ్మాయిని ఇలారా! అని పిలిచాను. దగ్గరకొచ్చింది.
‘ఏం నీకు వానంటే ఇష్టం లేదా?’ అని అడిగా.
‘ఇష్టమే మేడం!’ అంది గలగలా నవ్వుతూ.
‘ఎందుకు తడవలేదు? తడిన్తే మొలత్తిె మానైపోతావని భయమా?’ పూలజడని, పావడాని చూపించింది. ‘ఇవి తడుస్తాయ్‌!’ అంది. మరో అమ్మాయి మా దగ్గరకొచ్చి, ‘మేడం.. మేడం! వాళ్ళింటికి ఈ పొద్దు సుట్టాలొచ్చార’ంది.
ఒస్తే!
వాన్లో తడిన్తే వాళ్ళవ్వ (అమ్మమ్మ) తిడుతుందంట అనిందమ్మాయి. ‘అదా సంగతీ! ఏం ఈరోజు, మీ ఇంట్లో పండగా?’ అనడిగా. ‘పండగ లేదూ, గొండగాలేదని’ంది పూలజడమ్మాయి. దాని పేరు సరళ. ‘మేడం! మీరు గూడా వానలో తడసల్ల’ అంటూ శ్రీను గాడు పట్టుపట్టాడు. వాడిపట్టు ఉండుం పట్టని తెల్సి, నేను లేచి, సరళని పట్టుకొని బయటికి పరుగు తీసి, క్షణం పాటు వానలో తడిసి లోనికొచ్చాం. పిల్లల అల్లరితో బడంతా గోల గోల.
ఇంతలో ఒకామె, జల్లుల్లో గొడుగేసుకొని, బడి ముందు నిలబడి, వాన నీళ్ళల్లో తన కాళ్ళ పట్టీలు, మెట్టల కంటిన బురదని నాజూగ్గా కడిగి లోపలకొచ్చింది. ఆవచ్చిందెవరన్నట్లు పిల్లల వైపు చూశా.
‘సరళ అవ్వగదా!’ (అమ్మమ్మ) అని అన్నారు. నాంతో ఆశ్చర్యమేసింది. అవ్వ అవ్వ లాగ లేదు. అమ్మ లాగుందనుకున్నా మనసులో. ”మా పాప సరళమ్మని ఇపుడు ఇంటికి పంపించల్ల మేడం! అని అడిగింది నోట్లో వక్కాకు నముల్తూ.
‘ఏం, ఎందుకు?’ అన్నా.
‘ఇంట్లో సుట్టాలొచ్చి గుచ్చున్నారు గదా? మా సరళమ్మకి ఈ పొద్దు పెండ్లి సూపులు సుత్తారు గదా!” అనింది.
ఉలిక్కి పడ్డాన్నేను.
‘అపుడేనా? దాని వయసెంత? దాని బతుంత?’ అని కోపంగా అన్నా.
‘దాన్నొక అయ్యకప్పగిస్తే, దాని బతుకుదాన్ది, మా బతుకు మాది, ఎన్నాళ్ళని మా ఇంట్లో పెట్టుకుంటాం’ అని తీవ్రంగా అనింది.
‘ఊరుకోమ్మా తల్లీ! పసిపిల్లకి పెళ్ళిచెయ్యగూడద’న్నా కాస్తతగ్గి.
‘నేను పన్నెండేండ్లకి పెండ్లయి పాపని గన్నా, నా బిడ్డ పన్నెండేండ్లకి సరళమ్మని గనింది గదా! అందరం అంతే గదా!’ అంటూ లెక్కలేసి చెప్పింది.
‘పద్దెనిమిదేండ్లు దాటాక ఆడపిల్లకి, ఇరవైరెండు దాటాక మగ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల. అది చట్టం. చట్టం అతిక్రమిన్తే, ప్రభుత్వానికి తెలిన్తే జైలు తప్పద’ని వివరించాను.
మా చుట్టూ బడిపిల్లలందరూ జేరి మా చర్చని వింటున్నారు.
‘ఊర్కోమ్మాయ్యా మేడం! అవన్నీ సదువుకునోళ్ళకి, పట్నవాసులకి, మా పల్లోల్లకి గాదు, సరళమ్మ పెండ్లి ప్రభుత్వానివెరు సెబుతారు?’ అంటూ దబాయించింది.
‘మేం.. మేం.. సెబుతాం.’ అంటూ బడిపిల్లోల్లు ముక్తకంఠంతో అరిసి గోలచేశారు.
‘నా బట్టల్లారా… తినింది అరక్క అరుస్తున్నారా? గాడిదనా కొడు …. ” అంటూ పిల్లల్ని తిట్టనారంభించిందామె.
‘అమ్మా తల్లీ! ఆగాగు, పిల్లోల్లని త్టిటకు, కానీ సరళకీ వయసులో పెళ్ళిజేన్తే జైలు తప్పదన్నా’ కోపంగా.
‘నేనిప్పుడే పెళ్ళి చేస్కోను టీచరు, ఇంగా సదువుకోవల్ల నేను’ అంటూ నిశ్చయంగా సరళ చెప్పింది.
‘సదువూ లేదూ, సట్టబండల్లేవుగానీ ఇంటికి పోదాం పద’ అంటూ సరళని లాక్కొని వెళ్ళిందామె.
‘చెవుటోని ముందర శంఖం ఊదినట్లుందిగదా!’ అన్నాన్నేను బడిపిల్లల్తో.
‘మేడం! పెద్దపాముని సన్నకర్రతోనే సంపుతాం గదా! అట్లే ఈల్ల్కూడా ఉపాయంతో బుద్దిసెప్పాల’ అంటూ శ్రీనుగాడి ఉవాచ. వర్షం తగ్గుముఖం పట్టింది. పూర్తిగా వాన ఆగేదాకా పిల్లలాగ లేకపోతున్నారు. వానలో తడుస్తా ఇళ్ళళ్ళెటం వాళ్ళకిష్టం. అందు ఇంటిగంట కొట్టేశాం. ఉరకలేస్తూ పిల్లలందరూ ఇళ్ళళ్ళిెపోయారు.
లిలిలి
మరుసట్రోజున మళ్ళీ ‘సరళ పెళ్ళి’ మీద పిల్లలు చర్చని ప్రారంభించారు. నాల్గైదు తరగతి పిల్లలందరూ బాల్యవివాహాల్ని వ్యతిరేకించారు. బడిలో చిన్నతరగతి వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే.
‘సరేగాని పిల్లలూ!, ఊళ్ళో జరిగే బాల్యవివాహాల్ని ఆపేదెలా చెప్పండర్రా’ అన్నాను.
‘ఒనేయ్‌ సరళా! నువ్వు గట్టిగా పట్టుబట్టి పెళ్ళి చేసుకోనంటే చేసుకోనని ూర్చో’ శ్రీనుగాడు సరళకి ఉద్బోధ చేశాడు.
‘పెళ్ళి మాటెత్తితే పారిపోతానని బెదిరించు’ ప్రసాదుగాడి సలహా.
‘టెన్త్‌క్లాసు తర్వాత పెళ్ళి చేస్కుంటానని చెప్పవే తల్లీ!’ లలిత సర్దుబాటు ధోరణి.
‘మేడం! ఈ ఊర్లో బాల్యవివాహాలు చానా జరిగినాయి’ మంజులమ్మ తన జ్ఞాపకాల్ని చెప్పింది.
‘పోలీసోల్లకి తెలిన్తే జైల్లో వేస్తారు తెలీదా?’ అని ప్రశ్నించా.
‘ఎవర్ని మేడం?’ సులోచన ప్రశ్న.
‘పెళ్ళిచేసిన పెద్దల్ని, పెళ్ళికొచ్చిన వాళ్ళని…’ అని అన్నా.
‘ఇంక నుంచి చిన్న పిల్లోల్లకి పెండ్లి సేత్తే, మేం మీకు చెప్తే, మీరు పోలీసోల్లకి చెప్పండి టీచర్‌’ అని శ్యామల సలహా.
సరేగాని ఇప్పుడు వెంటనే ఏం చెయ్యాలబ్బా అంటూ ఆలోచించసాగా. ఎలాగైనా సరే ఈ ఊరోళ్ళకి బుద్ధి చెప్పాలి. చెప్పి తీరాలి. ముక్కుపచ్చలారని పసికందులకి, పదేళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యటమా? అవ్వ ఇదేం కాలం.
నాల్గైదు తరగతి పిల్లోల్ని పిలిచి, డజను తెల్లకాగితాల్నిచ్చి, ఇలా రాయమన్నాను. ‘పద్దెనిమిదేండ్లు ఆడపిల్లలకి, ఇరవైరెండు సంవత్సరాలు మగపిల్లలకి వయసు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చెయ్యాలి. అట్లుగాక ఈ వయసుకి ముందే పెళ్ళిళ్ళు చేన్తే అది నేరం. అట్లా చేన్తే ప్రభుత్వం శిక్షించును. జైలు తప్పదు. బాల్యవివాహాల్ని చేన్తే కలెక్టరుగ్గానీ, పోలీసులకి గానీ, బళ్ళో టీచరమ్మలకి గానీ తెలియచేయండి’ అని రాయించి, ఊర్లో అన్ని గోడల మీద అతికించి రమ్మన్నాను.
ఇక చూస్కో పిల్లోల్లంటే పిల్లోల్లుగాదు, పిడుగులు. అక్షరశిల్పాల్ని కాగితాల మీద చెక్కి, తమ నైపుణ్యాలన్నీ ప్రదర్శించి, ఆఘమేఘాల మీద పయనమై, ఊర్లో సందుల్లో గొందుల్లో తిరిగి గోడగోడకీ ఓ కాగితాన్ని అంటించారు. పరుగంటే లేళ్ళులాగా, పనంటే తేనెటీగల్లాగ చేస్తారీ పిల్లలు. అతికించడమేగాదు, అందులో ఏం రాసుందో, చదివి, వివరించి, వర్ణించి, ఉద్బోధ చేసి, బెదిరించి, భయపెట్టి జనాల్ని బలుసాకు తినిపించి మరీ వచ్చారు. ‘చూసి రమ్మంటే కాల్చివచ్చే రకాలీల్లు’. సరళ ఇంటి గోడకి రెండు కాగితాల్ని అతికించారు భద్రంగా.
ఊర్లో జనమంతా పోస్టర్ల మీదే చర్చ. జనం బడిదాకా వచ్చి ‘ఏంది మేడం! ఇది మరీ విడ్డూరం. ఎన్నడూ లేంది ఈ పొద్దు’, అని కొందరంటే. ‘మా పిల్లోల్లు మా ఇష్టం, ఎపుడు పెండ్లిండ్లు చెయ్యాల అప్పుడు నేత్తాం’ అని మరికొందరన్నారు.
‘ఆడపిల్లోల్లని శాన్నాల్లు ఇంట్లో వుంచుకోూడదు’ అని మరికొందరు. చివరికి నాతో వాగ్వివాదానికి దిగారు. కోప్పడ్డారు, బెదిరించారు, రచ్చరచ్చగా మారి నామీద దాడి జరిగినంత పనైంది. పిల్లలు నాకు రక్షణగా లేకుంటే అదే జరిగుండు.
‘మా మేడంని ఏం అనద్దండి, మేడం మంచి చెప్పింది, వినకుంటే జైలే’ అని పిల్లోల్లు అనగానే వాళ్ళ తల్లిదండ్రులు మొట్టికాయలేశారు ‘నోరు మూసుకోండని’. అయినా పిల్లలు విన్లేదు.
అంతలో పక్క టౌను నుంచి ఒక పోలీసాయన ఎస్సై, ఎక్కడికో డ్యూటీ మీద ఆ దోవన పోతూ పోతూ, సెల్‌ఫోన్‌ రింగ్‌ అయితే మాట్లాడేందుకని, మా బడి ముందర వేపచెట్టు నీడన ఆగారు. బైకాపి నిలబడి ఫోన్‌లో మాట్లాడసాగారు. ఎెన్సౖని చూడగానే ఊర్లో జనం చల్లాచెదురై బరబరా వెళ్ళిపోయారు. ఆ సంఘటనకి ఆశ్చర్యం వేసింది. ఇదేందో బాగుందిరా అనుకున్నా. బళ్ళో పిల్లోల్లు ూడా నాతోపాటే ఆశ్చర్యపోయినారు.
‘మేడం, ఎస్సైని ఒకసారి బళ్ళోకి రమ్మని పిలుస్తాను, విషయం చెప్పండని’ శ్రీనుగాడు ఐడియా చెప్పాడు.
‘సరేగానీ! పిల్చుకురా’ అన్నా.
శ్రీనుగాడు ఎస్సైని లోనికి పిలుచుకొని వచ్చాడు. మేం జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాము.
‘మామూలేనండి ఇవన్నీ. చట్టానికి కళ్ళుగప్పి జరుగుతుంటాయ’ని అన్నారు. ఈలోగా నాకో ఐడియా వచ్చి ఇలా అన్నాను.
‘సార్‌! ఇపుడు ఊర్లో గోడలమీద కాగితాలంటించాము. దానికి మీరు మద్దతిస్తున్నట్లుగా, ఊరంతా ఒక రౌండు తిరిగి, పోస్టర్లు అంటించిన దగ్గర బైకు ఆపుకోని అటు ఇటు తిరిగి, మీ దారిన మీరు వెళ్ళండి, జనం భయపడతారన్నాను.’
ఆయన నవ్వి, ‘సర్లేండి, అదేం పెద్దపని, తప్పకుండా అలాగే’ అంటూ బైక్కిె ఊర్లోళ్ళాెడు. బళ్ళో మన పిల్లోల్లు కొందరు బైక్‌ని వెంబడించారు సరదాగా. జనం తిక్క కుదిరింది.
లిలిలి
మరుసటిరోజున, సెలవులోనున్న మా బడి టీచర్లు ముగ్గురూ బడికి హాజరైనారు. నిన్న, మొన్న జరిగిన యుద్ధం గూర్చి చెప్పాను. ‘మనలే మేడం! వాళ్ళ పెళ్ళిళ్ళూ, తద్దినాలూ’ అంటూ ఒక టీచరు రాగాలు తీసింది.
‘టీచర్లు టీచర్లుగానే ఉండాలి గానీ, వాళ్ళ బాగోతాలు మనలే?’ అంటూ మరో టీచరంది.
‘అబ్బా థాంక్స్‌ మేడవ్‌ు! ఇన్నాళ్ళకి ఈ ఊరి జనాన్ని బెదిరించార’ని మరో టీచరు మెచ్చుకున్నా గానీ, నాకు కోపమొచ్చింది.
‘ఏం మనుషులీల్లు’ అన్పించింది.
‘మీ కంటే బడిపిల్లలే మేలుగదా! నడుంబిగించి మరీ బాల్యవివాహాల్ని వ్యతిరేకించారు. టీచర్లంటే వేలం బడిపాఠాలే గాదు, ఊరి రుగ్మతల్ని పోగొట్టాలి. మనం వున్నది పల్లెల్లో. అజ్ఞానపు సమాజంలో. వాటిని బాగుచెయ్యాల. బళ్ళో పిల్లల డ్రాప్‌అవుట్స్‌కి ఒక కారణం బాల్యవివాహాలని అర్థమవుతోంది. దాన్ని ఆపాలి గదా! మనం బతికిందే బతుకు గాదు గదా! మన చుట్టూ వుండేవాళ్ళని బతికించాలి. వస్తినమ్మా! పోతినమ్మా! అంటూ బడికి రావడం పోవడమేనా?’ అంటూ కోపంగా తిట్టాను.
‘సరే మేడం! ఏం చేద్దాం చెప్పండి’ అన్నారు.
‘నాకు మద్దతివ్వండి చాల’న్నాను.
‘అడుసు తొక్కనేల, కాలు కడగనేల’.
‘బురదెందుకు మేడం అంటించుకోవటం’ అని అన్నారు.
‘మన ఊళ్ళని, మన జనాన్ని మనం బాగుచేసుకోకపోతే పైనుంచి దేవుడు దిగిరాడు బాగుచెయ్యను’ అని అన్నాను.
‘అట్లనే అట్లనే మేడం, మీ మాటింటాం’ అంటూ మాటిచ్చారు టీచర్లు.
ఈలోగా, సరళ అమ్మమ్మ ఊరిజనాన్ని వెంటేసుకొచ్చింది సయోధ్యకి.
‘పండగనాడు గుళ్ళో దేవుని పెళ్ళండి మేడం, దేవుని పెండ్లినాడు పిల్లకి పెండ్లి చేన్తే మంచిదికదా! దుడ్డు కర్జుండదు, సులభంగా పెండ్లి జరిగిపోతాది, కొంచెం పెద్దమనసు చేసుకోని సరళమ్మకి పెండ్లి చెయ్యనీ తల్లీ! అడ్డం చెప్పద్దు’ అనింది కళ్ళు తుడుసుకుంటా.
దేవుని పెండ్లినాడు, పండగపూట, చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఆ పెళ్ళిళ్ళు సగం బాల్యవివాహాలు. ముక్కుపచ్చలారని పసికందులకి పెళ్ళిళ్ళు చేస్తారని, ముసిలోల్లకి పిల్లోల్లనిచ్చి చేస్తారని మా బడి టీచర్లు చెప్పసాగారు. నాకు చాల ఆశ్చర్యమేసింది. నాకు ఆ ఊరు, ఆ ప్రాంతం కొత్త. ఈ విషయాలు తెలీవు. ఈసారి దేవుని పెళ్ళినాడు చాలా బాల్యవివాహాలు జరగబోతున్నాయని బడిపిల్లోల్లు లిస్టు చదివారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టివెరు తెస్తారు? ప్రజలే గదా? అందరూ మనందుకులే అనుకుంటే, సమాజం బాగుపడేదెట్లా?
సరళ అమ్మమ్మ నావం చూస్తా దీనంగా ముఖంపెట్టి చూడసాగింది.
‘ఎట్టి పరిస్థితిలోనూ మరో ఆరేండ్లు సరళకి పెళ్ళి చెయ్యూడదు. దానికి పెళ్ళివయసూ లేదూ, చదువూ లేదు, పనీ రాదు, నామాట పెడచెవిన పెట్టి పెళ్ళి తలబెడితే మాత్రం నీకు జైలు తప్పదు’ అన్నాను తీవ్రంగా. ఆమె నా కాళ్ళావేళ్ళా పడింది. ససేమిరా కుదరదన్నాను. మా టీచర్లు నాకు బలంగా మద్దతిచ్చి, సరళ అమ్మమ్మని బాగా తిట్టారు.
ఈలోగా, దేవుని పెళ్ళినాడు, తమ పిల్లలకి పెళ్ళిళ్ళు తలపెట్టిన తల్లిదండ్రులు, పెద్దోల్లు గూడా వచ్చి నాతో తగువేసుకున్నారు. గొడవకి దిగారు. బడి మానేసిన పిల్లోల్లు కూడా వచ్చినారు. వాళ్ళకి పట్టుమని పదమూడేండ్లు ూడా లేవు. అపుడే పెళ్ళిళ్ళు. చాలాసేపు సర్దిచెప్పినాము.
‘దేవునితోపాటే పిల్లోల్లకి పెండ్లిండ్లు జేన్తే ఖరుజు కందాయము, వుండదు, సులభంగా అయిపోతాదని వాళ్ళ వాదన. ‘నాలుగేండ్లకి దేవునితోపాటే ఖర్చులేకుండా, నయాపైసా పెట్టకుండా పెళ్ళిళ్ళు చెయ్యండని’ చెప్పాను.
త్వరగా పెళ్ళిళ్ళు చేనేసి, చెయ్యి దులుపేసుకోవాలని వాళ్ళ ధ్యాస.
మా టీచర్లూ, నేనూ కలసి బెదిరించి ‘పెళ్ళిగొడవ’ మాన్పించాము. తలప్రాణం తోకకొచ్చింది.
‘పెండ్లి గిండ్లి సెయ్యెద్దంటివి గదా మేడం! ఇపుడు మా పిల్లోల్ని ఏం జెయ్యాలె?’ అని అడిగారు.
‘బడి వయసే గదా! బడికి పంపండి మొర్రో’ అన్నాను.
ఆ మాట వాళ్ళకి కర్ణకఠోరంగా తోసింది. ‘ఏం బడీ, సదివేం జెయ్యాల’ అన్నారు.
‘మల్లా బళ్ళోకి పంపితే ూలివెరు బోతారు? సంటోళ్ళని సాదెేవరు? ఇంట్లో కూడూ కురాకు వండి వక్కలేనేదెవురు?’ అంటూ నన్ను నిలదీశారు.
‘ఆహా! మీ పిల్లోల్లకి పెళ్ళిళ్ళు చేసి ఈ రోజు అత్తారింటికి పంపితే ఈ పనులెవరు జేస్తారు మీకు’ అంటూ ఎదురుప్రశ్న వేశా.
‘అదిగాదు లేమ్మయ్యా! మాగోడు మాది’ అని సర్దిచెప్పుకున్నారు.
మా టీచర్లతో కానేపు చర్చ జరిపా. తర్జనభర్జనల తర్వాత ఒక నిర్ణయానికొచ్చాము. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘వుమెన్‌ వెల్ఫేర్‌ సెంటర్స్‌లో టైలరింగ్‌ పనికి పిల్లల్ని పంపండ’న్నాము. వాళ్ళు ‘ససేమిరా వద్దన్నారు.’ ‘మా గడప దాటి, ఊరు దాటి, ఆడపిల్లోల్ని పక్క ఊర్లకి పంపనే పంపమ’న్నారు.
చివరగా మరో అస్త్రం ప్రయోగించాము. డ్రాప్‌అవుట్స్‌ (బడి మానేసిన) కొంతకాలం బడికి వస్తూపోతూ, రాయటం చదవటం, లెక్కలు నేర్చుకోవాలి. ఒక కుట్టుమిషను కొని, టైలరింగు వచ్చిన మనిషితో వాళ్ళకి ఆ ఊర్లోనే శిక్షణ ఇప్పిస్తామని ప్రమాణం చేసి, ఒప్పించి వాళ్ళందరినీ ఇళ్ళకి పంపేశాం.
ఇక ఆ క్షణం నుంచి నాకు, టీచర్లకి కష్టాలు మొదల య్యాయి. మా టీచర్లు వాళ్ళ ఇళ్ళల్లోని పాతవి, కొత్తవి గుడ్డలు సమూరుస్తామన్నారు. కుట్టుమిషను కొనే బాధ్యత నాదే.
ఏ నెలకానెల అతుకుల బతుకులతో జీవనం సాగించే మాకు అమాంతం కుట్టుమిషను కొనడం గగనం అయ్యింది. వాళ్ళతో వీళ్ళతో అప్పుచేసి, చేతిలోనున్న నాల్గురూకల్ని కలిపి, ఐదువేలు జమజేసి కుట్టుమిషను కొని తెచ్చిచ్చాను. కళ్ళెం దొరికింది గదా! ఇక గుర్రం కావాలి. టైలరింగు తెల్సిన మనిషి కోసం వెతికి వెతికి వేసారాము. ఎవర్నడిగినా బిజీ, బిజీ అంటారు. ఆ వూర్లోనే ఒక టైలరున్నాడు. రోజుకోగంట మాత్రం శిక్షణ ఇమ్మంటే ససేమిరా అన్నాడు. వాడి కాళ్ళూగడ్డాలు పట్టుకొని, బతిమాలి, బామాలి ‘బాబ్బాబు పిల్లోల్లు అన్యాయం అయిపోకుండా కాపాడ’ని ప్రారి్థన్త దిగొచ్చి సరేనన్నాడు.
మిషను అంగన్‌వాడీ సెంటర్‌లో వేశాము. బడి మానేసిన (డ్రాప్‌అవుట్స్‌) పిల్లల్ని పిలిచి, బడికి వస్తూ పోతూనే టైలరింగ్‌ నేర్చుకోమన్నాము. సరేనన్నారు. ఒక మిషను, గంపెడు పిల్లోల్లు. ‘ఏటిలో పిసికిన చింతపండులా వుంది’ వ్యవహారం. విషయాన్ని గ్రహించిన నాతోటి టీచర్లు బంగార్లుగా మారారు. ఒక టీచరుకి కొంత టైలరింగు తెల్సు. ఆమె ూడా తన విద్యని పిల్లలకి నేర్పింది. పిల్లలేగాదు ఆ ఊర్లో కొందరు ఔత్సాహిక స్త్రీలు గూడా టైలరింగు నేర్చుకుంటామని వచ్చారు. మంచిదేగదా! కానియ్యండి మరి అన్నాన్నేను. మరికొన్ని విరాళాల్ని నేకరించి మరో మిషను కొనిచ్చాము.
కొందరు నడివయసు స్త్రీలు, కుర్రాళ్ళు ూడా వచ్చి ‘మాకు ఏందన్నా పని చూపించ’మన్నారు. ఏం పని చూపించాలి? మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి. పెట్టుబడి లేకనే పనులు చెయ్యాలి? ఎలా? ఇంట్లో వున్న బియ్యంతోటే వరివడియాలు పెట్టమని చెప్పాను. పాకింగ్‌, మార్కెటింగ్‌ కుర్రాళ్ళకి అప్పజెప్పాము.
ఆ ఎండాకాలం సెలవుల్లో నేనూ, మా టీచర్లతో కలసి గోదావరి జిల్లాల్లో పర్యటించి, అక్కడ పచ్చళ్ళు, పాకింగ్‌ నేర్చుకొని వచ్చి మా ఊర్లో జనానికి నేర్పించాము. పచ్చళ్ళంటే పెట్టుబడి కావాలి గదా! పండగలు, బట్టలు, బర్త్‌డేలు ఎన్నో ఖర్చుల్ని ఆపేసి నిధుల్ని సమూర్చుకున్నాం. ఊర్లో వ్యవసాయపు పనులు లేనప్పుడు
పచ్చళ్ళు, వడియాలు చేసి జనం బతుకులీడ్చారు.
ప్రతినెలా మండలంలో టీచర్ల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వందలాది టీచర్లు పాల్గొంటారు. మా వూరి సమస్యల్ని, బాల్యవివాహాల నిలుపుదలని, డ్రాప్‌అవుట్స్‌ని తిరిగి బళ్ళోకి రప్పించిన విధానాన్ని పదేపదే చెప్పేవాళ్ళం. పక్క ఊరి టీచర్లందరూ మా ఊరికొచ్చి తేనెటీగల్లా బిజీగా వున్న మా ఊరి జనాన్ని జూసి ముక్కున వేలేసుకున్నారు. వాళ్ళు గూడా వాళ్ళ ఊర్లు బాగుకోసం నడుం బిగించారు.
ఒకరోజు ఉదయాన్నే న్యూన్‌పేపరు చదువుతుండగా అందులో ‘ఎన్నో బాల్యవివాహాలను అడ్డుకున్న మంగమ్మ’ అంటూ ఒక ఫోటో వేశారు. ఎవరీ మంగమ్మ, ఏమా కథ అని ఆ ఫోటోని తదేకంగా చూసాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు సరళ అమ్మమ్మే ఈ మంగమ్మ. చాలా గ్రేట్‌.
సరళ పెళ్ళాగింది, ఊరు బాగుపడింది గదా!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో