మీడియాలో మేమెక్కడ

జూపాక సుభద్ర
భూమిక గత సంచికలో ‘మనతల ఎవరి పాదాల మీద వుంది’అంటూ కొండేపూడి నిర్మల చాలా నిజాలు జర్నలిష్టుల అవస్థలు, అవకాశాల మీద వచ్చే అడ్డంకులు వెరసి జర్నలిస్టుల తలలు ఎవరి పాదాల పాలవుతున్నాయి అనే వాస్తవాల్ని చాలా బాగ చెప్పడం జరిగింది.

 

మీడియా యాజమాన్యాల మీద యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో జర్నలిష్టుల గొంతులు యాజమాన్యాల ఆధిపత్యాల కింద ఎట్లా నలుగుతున్నాయో చెప్పడం బాగుంది.
గత కొన్ని రోజుల్నించి పత్రికా యాజమాన్యాలకు దళిత కింది కులాలలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ప్రత్యక్షంగా కొంత ప్రచ్ఛన్నంగా కొంత. యింకా ఆ యుద్ధం చల్లారనే లేదు. నిజానికి యీ యుద్ధం ముందుగ జర్నలిస్టులకు యాజమాన్యాలకు జరగాల్సి వుండింది. కాని మొన్నటి మీడియా యాజమాన్యాల దళిత కింది కులాలకు జరిగిన యుద్ధంలో యాజమాన్యాల్ని కాపాడే పాత్ర పోషించిండ్రు జర్నలిస్టులు. ప్రధానంగా జర్నలిస్టులవల్లనే పత్రికా యాజమాన్యాలు రక్షణ పొందినయి.
పత్రికా యాజమాన్యాలు ‘మీరే మేము మేమే మీరు’ అని  షోచేసి జర్నలిస్టుల్ని మాయచేసి సక్సెస్‌ అయినయి. మీడియాకు దళిత బహుజనులకు జరిగిన ఈ యుద్ధంలో జర్నలిస్టులు దళిత బహుజనకులాల్తో కల్సి యాజమాన్య ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా నిలబడాల్సినవసరముండింది.
మీడియా అనేది సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని యివ్వకపోగా వారిని అవమానకరంగా చిత్రించడం పరిపాటైంది. యిక దళిత కింది కులాల ఆడవాళ్లనైతే యింకా లోకువగా హేళనగా వ్యవహరిస్తాయి. ‘ఆడమగ కులం మతం ప్రాతపదికగా ఎవరినీ కించపరచొద్దు రెచ్చగొట్టొద్దు’ అనే సూత్రాలున్నా వాటిని టివి ఛానల్స్‌లో పత్రికల్లో చూడం.
‘మీడియా స్వేచ్ఛ’ అనే దాన్ని అపురూపంజేసి, ఆకాశదీపంలా గ్లోరిఫై చేస్తున్నయి మీడియా యాజమాన్యాలు. మీడియా స్వేచ్ఛంటే దానికి కులం, మతం, ప్రాంతం, జెండర్‌ లాంటివి అంటవా? ఏవీ  అంటని అతీతమా! అతీతమే అయితే మీడియాలో కేవలం కోస్తాంధ్ర ఆధిపత్య మగవాళ్లే యాజమాన్యాలుగా  ఎందుకున్నారు? దీన్ని యదృచ్చికమనుకోవాలా దీన్ని మీడియా స్వేచ్ఛనుకోవాలా. ‘మీడియా స్వేచ్ఛ’ అంటే అక్షరాలతో  కెమెరా కన్నుల్తో ఒక వర్గాన్ని యింకో వర్గం అదుపు చేసే ప్రక్రియగానే నడుస్తుంది కదా! మార్కెట్‌, పెట్టుబడి, ఆదాయ వనరులు మీడియాకు అంటని వస్తువులా! వీటన్నింటి మీద అందమైన పూతగా మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని గ్లామరైజ్‌ చేసి చించుకోవడం అన్యాయం.
– ఇక మీడియాలో దళిత కింది కులాలు, దళితేతర ఆడవాళ్లు చాల తక్కువ. ఇక దళిత వాల్లైతే 99,99,999కి ఒక్కరుంటారమో! అనేక స్త్రీవాద ఉద్యమాల తర్వాత పత్రికల్లో ఒక పేజీ, టీవీల్లో ఒక అరగంట కేటాయించినా దానిలో దళితేతర స్త్రీలకు సంబంధించిన  ఫ్యాషన్ల్లు, వంటలు, ముగ్గులు, చిట్కాలు,  యింకా పురాణాల్లో నుంచి కూడా ఆధిపత్య కుల స్త్రీ వ్యక్తిత్వాలనే ఆవిష్కరించం చూస్తుంటాం. కాని  దళిత కింది కులాల స్త్రీల సమస్యల్ని, వారు చేసే ఉద్యమాలు మచ్చుకైనా కనబడయి. ఒక వేళ చుక్క తెగి పడ్డట్టు ఎప్పుడైనా వున్నా కూడా అవి దళిత కులాల స్త్రీలను లీడ్‌ చేసే దళితేతర స్త్రీలనే జెండాలు ఎజెండాలుగా ఎగరేస్తాయి. (స్త్రీలకు ఒక పేజి వుంది పత్రికలో. కాని దళితులకు ఒక్క సూదిమొనస్థానం కూడా లేదు)
సారా తాగే వాల్ల భార్యలు చేసే సారా వ్యతిరేక పోరాటాలు వార్తలు కావు. కాని దానికి మద్ధతిచ్చే దళితేతర ఆడవాళ్లు కనబడితే వాల్లను కెమెరానిండ, అక్షరం అంచులదాకా విస్తరించుకుంటాయి. మద్దూరు భూపోరాటాలు, వ్యవసాయకూలి పోరాటాలు, తునికాకు పోరాటాలు, బీడి కార్మిక పోరాటాలు, సఫాయి ఆడోల్ల పోరాటాల్లో దళిత మహిళా నాయకత్వాల మొఖాలు కెమెరాల నజారుకు ఆనవు. అక్షరాల ఆయుధానికంటవు. ఈ స్త్రీలను పట్టించుకోకపోవడం, వారి సమస్యల్ని ప్రపంచానికి చాటడానికి అవకాశం కల్పించకపోవడం మీడియా స్వేచ్ఛనా!
పత్రికల్లో టీవీల్లో దళిత మహిళల రచనలు, అభిప్రాయాలు, వ్యక్తీకరణలు ఏ మాత్రమోస్తున్నాయో అందరికి యెరుకే….
పత్రిక రచ్చకెక్కని టీవి గడపతొక్కని ఎస్సీ, బీసి, ఆదివాసీ మైనారిటీ, స్త్రీలు, తెలంగాణ కవులు, కళాకారులు, విమర్శకులు, మేధావులు, రచయితలు కోకొల్లలు. వీరికి స్థానం లేకుండా కొద్ది మంది ఆధిపత్య కులాల (అదీ కోస్తాంధ్ర రచయితలే) రచయితల్నే నిత్యం సర్క్యులేట్‌ చేయడం, అస్తిత్వ ఉద్యమాల కొత్త గొంతుల్ని పక్కకు నెట్టడం స్థానం లేకుండా చేయడం మీడియా స్వేచ్ఛ అందామా!
నిజానికి పెద్దకుల బడా మీడియా యాజమాన్యాలకు దళిత బహుజన కులాలకు జరిగిన యుద్ధం దళిత కింది కులాల స్త్రీలది కూడా. కాని యుద్ధంలో వాళ్లెక్కడ? ఆకాశంలో సగం సంఖ్య ఒకే. కాని ఆ సగంలో దళిత స్త్రీలెక్కడ ఏ మూలకు, ఏ అడుగుభాగం అనేది వెతుక్కుంటున్నోల్లు.
 మీడియాలో దళితులు, బీసీలు, దళితేతర స్త్రీలే అంతంత మాత్రం ప్రాతినిధ్యాలు. యిక దళిత కింది కులాల, ఆదివాసీ, మైనారిటీ తెలంగాణ స్త్రీల గురించిన స్థానాలు అడిగే దూరంలోనే లేవు. వీల్లకు మీడియా ప్రాంగణాలు ప్రకటిత దేవుడి గుళ్ళ నిషేధాలే. సూది మొన జాగ కూడా మీడియాలో వీరికి లేదు.
దళిత స్త్రీ మీడియాలో కనిపించినా జర్నలిస్టులుగా, యాంకర్లుగా ప్రోగ్రామర్స్‌గా, ఆపరేటర్లుగా, ఎడిటర్లుగా కనిపించరు. వాల్లు స్వీపర్లుగా క్లీనర్లుగా, కక్కోసులు కడిగేవాల్లుగా మాత్రమే కనిపిస్తారు. కుల సమాజం దళిత స్త్రీలను  ఎట్లా చూస్తుందో-ఎలాంటి వృత్తుల్లో వుంచిదో దానికి భిన్నంగా మీడియా యాజమాన్యాలు ప్రయత్నించనపుడు మీడియా స్వేచ్ఛని దళిత స్త్రీలు తలకెత్తుకోవాలా! గౌరవించాలా! సామాజిక న్యాయాల్ని మీడియా పట్టించుకోక పోవడం, ప్రకటించక పోవడం, అనుసరించక పోవడం ఆచరించకపోవడం మీడియా స్వేచ్ఛనా!
ఆ మధ్య ఒక ఎన్జీవో సంస్థలో చదువులేని దళితాడామో, ‘గడి’గడప తొక్కనామో దొర యింట్లకుబోయి, దొరపూజగదిలకు బొయి దొరతింటుంటే, పూజచేస్తుంటే.. దొరకు ఎదురుగ నిలబడి వీడియో తీసిందనీ, అట్లా తీసినందుకు ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందనీ… ఓ..యింకేముంది దళితాడ వాల్లకు యింతకన్నా అభివృద్దేమున్నదని మహిలా సాధికారత నిపుణులనే వాల్లు నిర్ధారణ చేసిండ్రు. అలాంటి అవగాహనలో అట్లాంటి నిపుణులుండొచ్చు.ఎన్జీవో సంఘాలుండొచ్చు.  అది వాల్లకు గొప్ప అచీవ్‌మెంటేమో గాని దళిత స్త్రీలకసలే కాదు.
మీడియా మాదిగ, దళితాడోల్లను కొన్ని వేల మైళ్ల దూరం వుంచింది. కాని చరిత్రలో మీడియా నిర్మాతలు, మీడియాకు దండోరై గొంతులిచ్చింది. గుండెనిచ్చింది, డప్పునిచ్చింది, యింకా చరిత్ర నడకకు చెప్పు తొడిగింది మాదిగాడోల్లె..ననేది చరిత్ర మరిచిన విషాదం.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.