రెండు కట్టడాలు – రెండు నరమేధాలు – రమాసుందరి బత్తుల

అమృత్‌సర్‌లో మా బస్‌ ప్రవేశించగానే నేను మొదట చూడాలనుకొన్నది జలియన్‌వాలాబాగ్‌. స్వర్ణ దేవాలయం కూడ ప్రముఖమైనదే. రెండు నరమేధాలకు సాక్షీభూతాలుగాఎదురెదురుగా నిల్చొని వున్నాయి అవి రెండు. ముందు లంగరుకి వెళ్ళాము. లంగరులో అన్ని వేళలా ఆహారం ఉచితంగా వడ్డిస్తారు.
సిక్కులు అతిథులను చాలా గౌరవిస్తారు. చెప్పుల కౌంటర్‌లో, వంట దగ్గర, వడ్డింపుల దగ్గర, ఎంగిలి కంచాలు కడిగే దగ్గర అందరూ భక్తులే. నేను తిన్న ఎంగిలి కంచం తీసుకొని ఒక ముసలి సిక్కు నాకు నమస్కరించాడు. ఏమి చేయాలో తెలియక నేనూ ఎంగిలి చేత్తో నమస్కరించాను. చెప్పుల స్టాండ్‌ దగ్గర, తిరిగి ఇచ్చే చెప్పులను కొందరు స్త్రీలు వాళ్ళ చున్నీలతో తుడిచి ఇస్తున్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలోకి వెళ్ళి నేను సరస్సు ఒడ్డున కూర్చొన్నాను. మా కా్లన్మట్స్‌ గురుద్వారలోకి వెళ్ళారు. నాకు తోడుగా గురుప్రియ ఉండిపోయింది. బంగారు తాపడం చేసిన గురుద్వార ప్రతిబింబం సరస్సు నీటిలో ప్రతిబింబిస్తుంది. వేల భక్తులు తిరుగుతున్నా ఎక్కడా ధ్వనులు పెద్దగా వినబడటం లేదు. దూరంగా క్యూలో భక్తులు, కవాతు చేస్తున్న సైనికులలాగా స్లో మోషన్‌లో కదులుతున్నారు. అప్పటి రెండుసార్లు నా తలమీద ముసుగు జారిపోవడం, మహిళాభక్తులు వచ్చి న్నేహపూర్వకంగానే సరిచేసి వెళ్ళటం జరిగింది.
గురుద్వారా చుట్టూ వున్న కట్టడాలను చూసాను. ఎటువైపునుండి కాల్పులు జరిగి ఉంటాయి? వందమంది సిక్కు తీవ్రవాదులు మీద… వెయ్యిమంది ెనౖనికులు గ్రేనేడ్స్‌తో, టాంకర్స్‌తో అటాక్‌ చేసిన కిరాతకానికి తెర ఎక్కడ లేచి ఉంటుంది? దేశభక్తులు, శాంతికాముకులు, శాంతస్వభావులు అయిన సిక్కులు ఆయుధాలు పట్టడానికి ప్రేరేపించిన రాజకీయాలు ఎంత క్రూరమై ఉంటాయి? వందల సంవత్సరాలు అన్ని మతాలతో సహజీవనం చేసిన సిక్కుమతం ఆగ్రహాన్ని పాలకులు సకల ప్రజల వైపు చూపించి ఆడిన కుటిల నాటకం ఖరీదెంత? పదిహేను వందల అమాయక సిక్కుల ప్రాణాలు. న్వేచ్ఛావాయువుల కోసం జలియన్‌వాలాబాగ్‌లో గుమిూడిన ప్రజలను హతమార్చిన బ్రిటీషు వాడికి, మతప్రార్థనల కోసం దేవాలయానికి వచ్చిన అమాయక భక్తులను అంతం చేసిన ప్రజాస్వామిక, లౌకిక ప్రభుత్వానికి తేడా ఎంత? బహుశ డయ్యర్‌ని చంపిన ఉద్ధాంసింగ్‌ని దేశభక్తుడిగాను, ఇందిరాగాంధిని చంపిన సత్వంత్‌సింగ్‌ దేశద్రోహిగాను చిత్రీకరించినంత.
మెల్లిగా లేచి నడవడం మొదలుపెట్టాము. బహుశ ఈ కారిడార్‌ మీదనే తనతోటి సిక్కుని కాల్చి, శవాన్ని మోసుళుెతున్న సైనికుడు రోదించి ఉంటాడు. ఇక్కడ నివాసముంటున్న ఖల్సాల అన్నం పళ్ళాలలో బుల్లెట్‌ గాయాలు ఉండే ఉంటాయి. మతమే బలం అనుకొనే సమూహాల నమ్మకాల మీద వీరు చేసిన గాయాలు ఇక్కడా, తరువాత బాబ్రీలో ఇంకా స్రవిస్తూనే ఉన్నాయి.
”పైన సిక్కుల మ్యూజియం ఉంది, వెళదామా?” అంది గురుప్రియ. మ్యూజియంలో సిక్కుమతం ప్రారంభం నుండి అమరులైన వారి చిత్రపటాలు ఉన్నాయి. చూస్తూ ఒక గదిలోకి వెళ్ళగానే అక్కడనుండి ఫొటోలు కనిపించాయి. స్వర్ణ దేవాలయం దాడిలో మరణించినవారి ఫొటోలు. పక్క గదిలో ఇందిరాగాంధీ మరణం తరువాత జరిగిన మారణకాండలో మరణించినవారు. ఇందిరాగాంధీ చితి మంటల వెలుగుల్లో కనబడిన రాజీవ్‌గాంధీ కళ్ళ కసి… గుట్టలు గుట్టలు శవాలుగా, విలపిస్తున్న తల్లుల అవిసిపోయిన గుండెలుగా, అన్నల తమ్ముళ్ళ తండ్రుల శవాల వద్ద నిలబడిన యువకుల మౌనపు రక్తపు మరిగింపుగా కనిపిస్తుందక్కడ నాకు.
నా చెయ్యి పట్టుకొన్న గురుప్రియ వైపు తేరిపార చూసాను. ”బహుశ మీ పెద్దలు అవమానాన్ని దిగమింగి, దుర్మార్గాన్ని భరించి తలవంచి పిచ్చితల్లి నీకీ అశాంతిలేని జీవితాన్ని ప్రసాదించి ఉంటారు. నీ నిష్కల్మషమైన, స్వచ్ఛమైన, ప్రశాంతమైన నవ్వుకోసం వారు చెల్లించిన మూల్యం వెలలేనిది” గొణిగాను.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>