వర్తమాన లేఖ డా. శిలాలోలిత

ప్రియమైన ప్రతిమా!
ఎలా ఉన్నావ్‌? ఈ మధ్య బాగా గుర్తొచ్చావ్‌. నెల్లూరు లోనే మా పిన్ని కూతురు సునీత 
ఉంటుంది. రమ్మని చాలాసార్లు అంది. ఇద్దర్నీ చూసినట్లు ఉంటుంది కదా అనుకున్నా. ఈ వేసవిలో కూడా కుదర్లేదు. నీకు గుర్తుందా ప్రతిమా! రచయిత్రులమందరం ఒకసారి టూర్‌కి వచ్చినప్పుడు మీ ఇంటిమీదే దండయాత్ర చేసాం. అందరూ నువ్వు చేసిన ఏర్పాట్లు చూసి మెచ్చుకున్నారు. మనం అప్పుడు పులికాట్‌ సరస్సులో ప్రయాణం చేయాలని పడవల్ని కూడా ఏర్పాటు చేసుంచావు. ప్రవాహం ఉధృతంగా ఉంది. కష్టమన్నా వినలేదు మనం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ఏం కాదు. ఏమౌతుంది అని మొండిసాేం కదూ! భయస్తులు కొందరు లోలోపలే దుఃఖ పడ్డారనుకో. ఆనాటి పడవ ప్రయాణం ఎంత సాహసంగా అన్పించిందో! ప్రతిమా, నిన్ను మొదటిసారిగా కథావర్క్‌షాప్‌లో చూశాను. ‘భూమిక’ నిర్వహించింది. టాంక్‌బండ్‌ ఒడ్డున బోట్స్‌క్లబ్‌లో ఆ రోజు పగలూ, రాత్రి అందరూ కలిసున్నాం. కాళీపట్నం రామా రావు, పి.సత్యవతి, వాసిరెడ్డి నీతాదేవి, అల్లం రాజయ్య, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, .లలిత, కొండవీటి సత్యవతి లాంటి ప్రముఖులు కథలెలా రాయాలి? నిర్మాణమెలా ఉండాలిలాంటి విషయాలపై ప్రసంగాలు చేశారు. చాలా ఉత్సాహంగా విన్నామప్పుడు. తెల్లారేసరికి తలా ఒక కథ రాసి చూపించాలన్నారు. అప్పటి చెయ్యి తిరిగిన రచయిత్రివి నువ్వు. నేను కవిత్వం తప్ప కథ జోలికి పోలేదు. మనిద్దరం బాగా సన్నిహితులమయ్యామప్పుడు. ‘నాలుగు చుక్కల ముగ్గు’ అని కథ రాసానప్పుడు. ఇంటిపనిని నాలుగుతరాల్లోని స్త్రీలు ఎదుర్కొన్న, పరిష్కరించుకున్న విధానాన్ని రాసానందులో.
పి.సత్యవతిగారి ‘ఇల్లలకగానే’ కథ చాలా ఇష్టం నాకు. అలాగే నువ్వు రాసిన ‘అక్క ఈగ’ కథ కూడా మంచి కథ. బాగా నీకు పేరు తెచ్చిపెట్టిన కథ కూడా కదూ! నీ మొదటి కథాసంకలనం ‘పక్షి’, రెండవ కథల పుస్తకం ‘ఖండిత’లోని కథలు మర్చిపోలేనివి. ఎందుకంటే ప్రతిమా! నువ్వు రచనా వ్యాసంగాన్ని నీరియన్‌గా తీసుకుని రాస్తావ్‌. ఒక కథ రాయాలంటే దాని ఇతివృత్తం గురించి చాలా ఆలోచించి, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ రాస్తావు. అందు ‘రాచపుండు’లాంటి రాజకీయ కథ, నాటకంగా తయారై నీకు ‘నంది అవార్డ్‌’ను ూడా తెచ్చిపెట్టింది. పొలాలు ఎండిపోయిన రైతన్నల దుస్థితిని ‘కంకాళం’ కథలో చెప్పావు. విత్తనం కథ, పిల్లలులేని స్త్రీ మనోచిత్రానికి, మొలకకోసం ఎదుర్కొన్న వాస్తవాన్ని వివరించావు. అన్నట్లు ప్రతిమా ‘గంగ జాతర’ కథను ఎంత నైపుణ్యంతో చెక్కావో తెల్సా! రాజకీయాల్లో పదవిని సంపాదించాక కూడా, భర్త ఆధిపత్యాన్ని ఎదుర్కొని, తానే పరిపాలించాలనే నిర్ణయంతో ముగించావు.
ప్రతిమా నీ కవిత్వసంపుటి ‘రెండు సగాలు’లోని ఓ కవితను నేను చాలాసార్లు సెమినార్లలోనూ, ఉపన్యాసాలలోనూ చెప్పాను. ఆ కవితేంటో చెప్పనా! సారాంశం చెప్తాను. ఒకతను పెళ్ళి చేసుకోవాలనుకుని పెళ్ళిూతురు కోసం అన్వేషిస్తుంటాడు. తనకు కావాల్సిన వాటిని ఎదుటివాళ్ళతో చెబ్తుంటాడు. అమ్మాయి అందంగా లేకపోయినా పర్లేదు, కట్నం ఇవ్వకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు,
ఉద్యోగం చెయ్యకపోయినా పర్లేదు, ఎత్తు తక్కువున్నా పర్లేదు – ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనం కూడా అనుకుంటాం ఇతనెవరో ఆదర్శవంతుడిలా ఉన్నాడని, కాని కవితలో చివరి లైను దగ్గర ఠక్కున ఆగిపోతాం. ‘ప్రశ్నించని ఆడదైతే చాలు చేసుకుంటానంటాడు.’ నిజంగా మానవ మనస్తత్వాన్ని, స్వభావాన్నీ చాలా బాగా చెప్పగలిగావ్‌ ప్రతిమా! మనం ‘తలకోన’ అడవులకెళ్ళినప్పుడు తాళ్ళతో చేసిన వంతెనను ఎలా దాటామో గుర్తొచ్చిందా తల్లీ! ప్రతిమా నీలో వుండే న్నేహశీలత్వం, మెత్తని గుణం నాంతో ఇష్టం. కానీ మరీ మొహమాటస్తురాలివి నువ్వు. ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ బాధను కూడా నువ్వే పడిపోతుంటావు. ఒకటిరెండుసార్లు మరీ అంత మెతగ్గా ఉండకు అన్నట్లుగా కూడా నాకు గుర్తు. చాసో అవార్డు, రంగవల్లి లాంటి విలువైన అవార్డులు అందు నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నీరియన్‌గా రచనను స్వీకరించడంతో పాటు, విభిన్న అంశాలను కథావస్తువులను తీసుకోవడంవల్ల నీకా ప్రత్యేకత వచ్చింది.
మొన్నటి న్యూన్‌ చూసావా? జరీనాబేగం అనే లెక్చరర్‌ భర్త హింసకు ఎలా గురయ్యిందో! ఏడాదిన్నర క్రితమే విడాకులు కూడా తీసుకుందట. నువ్వు ఎలా బతుకుతావు చంపేస్తానని బెదిరింపులట. కాలేజీ అమ్మాయి లను ఇంటికి తీసుకురమ్మని హింసించేవాడట. అన్నింటినీ ఎదుర్కొని తన బతుకు తాను బతుకుతుంటే భరించలేకపోయాడు. పోలీన్‌న్టేషన్లలో, పీలేరు, తిరుపతి, చంద్రగిరిలలో ఫిర్యాదు ఆత్మరక్షణకోసం చేసినా, వాళ్ళూ పట్టించుకోలేదు. మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిందట. ఆఖరికి వాడు మొన్న ఆటో ఎక్కుతున్న ఆమెపై యాసిడ్‌ పోసాడు. హాస్పిటల్‌లో ఉందిప్పుడు. ఆమె ఎంత ధైర్యం ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. నేరం చేన్తే వెంటనే శిక్ష పడ్తుంది అనే భయం లేకపోవడంవల్లనే ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనసంతా వికలమైపోయింది ప్రతిమా! నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాను. ఉండనా మరి!

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో