టాటాతో పోరాటం- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

(కిందటి సంచిక తరువాయి)
ఘాటో హైస్కూల్‌ నిర్మాణం :
1968 సం||లో ఎలక్షన్ల తరువాత వెంటనే ఘాటో కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఒక నెల అయ్యాక ఘాటో స్కూల్‌ నిర్మాణం చేయిస్తాను అని టాటా కంపెనీ వాళ్ళతో ఛాలెంజ్‌ చేసాను. ఇక అప్పటినుండి మొదలయింది. టాటా కంపెనీ వాళ్ళతో స్కూల్‌ పెట్టే విషయంలో పోరాటం. టాటా కంపెనీవాళ్ళు కార్మికుల పిల్లలకు స్కూల్‌ పెట్టే విషయంలో స్కూల్‌ ససేమిరా పెట్టమని పట్టుదల పట్టారు. అక్కడ ఇంటర్‌ యూనియన్‌ ఉండేది కాని యాజమాన్యం కనుసన్నలలో అది మెదిలేది. ఒకరకంగా యాజమాన్యం చెప్పుచేతలలోనే ఈ యూనియన్‌ నడుస్తూ ఉండేది. బడిపేరు మీద దాదాపు 17 వేలదాకా చందా పోగయింది. కాని ఇంటర్‌ యూనియన్‌ వాళ్ళు టాటా కంపెనీ అనుమతి లేకుండా బడిని కట్టించడానికి ఇష్టపడలేదు. టాటా కంపెనీ ఎక్కడైతే కార్మికులు స్కూల్‌ కట్టించాలనుకున్నారో ఆచోటు మార్చి మరో చోటులో ప్లాటు ఇస్తానన్నారు. కాని కార్మికులు మొట్టమొదట ఎక్కడ కట్టాలనుకున్నారో అక్కడే కట్టాలని పట్టుపట్టారు. అఖిలేశ్వర్‌ సింహ్‌, మగల్‌ సింహ్‌ (తరువాత ఈయన భగవాన్‌ సింహ్‌ పేరన ప్రసిద్ధిక్కాెరు) నిజాo భాయి స్కూల్‌ని కట్టాలని ఒక ఉద్యమాన్ని లేవతీసారు. ఎలక్షన్ల సమయంలో వీరు స్కూల్‌ నిర్మించటానికి సహాయం చేస్తానని నాకు మాట ఇచ్చారు. నేను ఊరు-ఊరు, వాడ-వాడా తిరిగి స్కూల్‌ నిర్మాణం విషయంలో గ్రామీణులకి చెప్పి మీటింగులు పెట్టాను. సభలు పెట్టి చర్చలు జరిపాను. ఒక నెల పూర్తయ్యాక మేము స్కూల్‌కి పునాది రాళ్ళు వేయడానికి అందరిని ఆహ్వానించాము. పది-పన్నెండువేలమంది జనం స్కూల్‌ ప్లాట్‌ దగ్గర పోగయ్యారు. మేం అందరం స్వయంగా అక్కడ రాళ్ళు-రప్పలు ఎత్తేసి శుభ్రం చేసాము. అక్కడ పునాది రాళ్ళు వేసాము. నా మెడలో వేసిన దండని వేలం వేయాలని, ఆ డబ్బుతో భవన నిర్మాణం జరగాలని అందరం నిర్ణయించుకున్నాము. వేలం పాడిన వాళ్ళందరి డబ్బులు కూడా ఇందులో జమ చేయాలనుకున్నాము. చివరికి వేలంలో అధిక ధర పాడేవాళ్ళు దండ తీసుకోవాలని, తక్కువ ధర పాడే వాళ్ళు పూలను పంచుకోవాలని నిర్ణయం జరిగింది. తక్కువకాని, ఎక్కువకాని ఎవరు ఎంత వేలం పాట పాడినా అదంతా చందా కిందే లెక్కకట్టాలని అనుకున్నాము. ఈ ప్రస్తావనని అందరు సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ రోజే 16 వేల రూ||లు నగదు కొంత హామీ లభించాయి. నిజానికి మేం ఏమాత్రం ఇట్లా ఊహించలేదు. వేలంపాటలో 1,500 ఎక్కువగా పాడారు. దండని మెళ్ళోనుండి తీసారు. ఈ విజయానికి నేను స్థబ్దురాలయ్యాను.
ఈ రోజునుండే టాటాతో మా పోరాటం మొదలయింది. మేం భవన నిర్మాణాన్ని మొదలు పెట్టాము. భవనపు పునాది రాళ్ళు పడ్డాయి. గోడలు లేచాయి. టాటా కంపెనీ కోర్టు నుండి న్టే ఆర్డర్‌ తెచ్చింది. అక్కడ రెండు గదులు కట్టాము. రామానంద తివారి (పోలీసు శాఖ మాజీ మంత్రి) ద్వారా ఓపెనింగ్‌ సెరిమొనీ చేయించాము. ఆ ఫోటోలు ఇప్పటికీ మాదగ్గర ఉన్నాయి. ఇందులో కిటికీలు, ద్వారాలు లేని భవనం కనిపిస్తోంది. కాని కప్పు ఉందా లేదా అన్నవిషయం తెలియడం లేదు. నేను గ్రామీణులను వెంట తీసుకు వెళ్ళాను. రాత్రికి రాత్రి అన్ని గదులపైన కప్పు వేయించాను. కోటు-పాంటు, గడియారం-సాక్స్‌ వేసుకున్న యువకులు ఇసుక, సిమెంటు గిట్టీల గంపలను రాత్రంతా మోసారు. నేను కూడా మోసాను. అందరం కలిసి స్కూల్‌ పైకప్పు వేసాము. తరువాత నామీద కోర్టు సుే నడిచింది. కాని ఓపెనింగ్‌ సెరిమొనీ ఫోటో చూపించి వాదించి కోర్టుసుే గెలిచాను. ఈ బడిలో పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టాము. స్కూల్‌ పేరు నేనే పెట్టాను- ”రాoమనోహర్‌ లోహియా శ్రామిక్‌ ఉచ్ఛ విద్యాలయ్‌” టాటా వాళ్ళు కార్మికులు పిల్లల కోసం హజారీబాగ్‌లో ఉన్న స్కూళ్ళకు తీసుకువెళ్ళడానికి రెండు మూడు కొత్త బస్సులు కొన్నారు. పిల్లలని తీసుకువెళ్ళడానికి రోజూ బస్సులు వచ్చేవి. కాని కార్మికులు పట్టుపట్టారు. వాళ్ళందరు తమ పిల్లలను హజారీబాగ్‌కి పంపించకుండా మా స్కూల్లో చేర్పించారు. కంపెనీ బస్సులు ఖాళీగా ఉండేవి.
దీని తరువాత మేము టాటా కంపెనీకి విరుద్ధంగా- ‘కాంట్రాక్టర్లని రద్దు చేయండి, కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చెయ్యండి- స్థానికులైన నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి” అని నినాదాలు చేస్తూ ఉద్యమాన్ని మొదలు పెట్టాము. శ్రీవాస్తవ, మగల్‌ సింహ్‌ సస్పెండ్‌ అయ్యారు. టాటా కంపెనీ చేసిన ఈ పని వలన కార్మికుల కోపం పెరిగింది. గ్రామీణుల
కళ్ళు తెరుచుకున్నాయి. ఉద్యోగాల విషయంలో కంపెనీవైఖరిని చూసి వాళ్ళందరు ఛాలెంజ్‌ చేసారు.
నీళ్ళకోసం పోరాటం :
మేము ఎలక్షన్ల సమయంలో ప్రచారం చేయడం కొంత ఆపేసి గోమియా, ఖుద్‌గడ్డా బన్తీలలో నీళ్ళకోసం పోరాటం మొదలు పెట్టాము. గోమియా మహిళలను, యువకులను తీసుకుని ఎన్‌.డి.ఓ. దగ్గరికి వెళ్ళాము. మమ్మల్నందరిని చూసి, మా పట్టుదల చూసాక ఎన్‌.డి.ఓ కి నీళ్ళ టాంకర్‌ని గోమియాకి పంపక తప్పలేదు. ఖుద్‌గడ్డాలో స్వాంగ్‌ గనుల యజమానిపై ఒత్తిడి తీసుకువచ్చి స్వాంగ్‌, ఖుద్‌గడ్డా బన్తీలకు నీళ్ళకోసం పైపు వేయించాను. తరువాత ప్రభుత్వం ద్వారా వీళ్ళ ప్రణాళిక వేయించి గోమియాలో ఇంటి-ఇంటికి
నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయించాను. గోమియా, ఖుద్‌గడ్డాలోని ప్రజలు నన్ను ‘పానీకి రానీ’ (నీళ్ళ-రాణి) అని పిలిచేవారు. ఎలక్షన్ల సమయంలో ‘పద్మాకీ రానీకి జిందాబాద్‌’ అన్న నినాదం చేనే రాజుసాహెబ్‌కి ‘పానీకి రానీ జిందాబాద్‌’ అంటూ మావాళ్ళు నినాదం చేస్తూ జవాబు ఇచ్చారు. బంజ్‌ గ్రామంలో కూడా నీళ్ళు లేవు. బంజ్‌ గ్రామీణులు దేలా, ఘాట్‌లలో పనిచేనేవారు. అక్కడి మహిళలని తీసుకుని మేము 22 కిలోమీటర్లు కాలినడకన మాండూ బ్లాక్‌ని చుట్టుముట్టాము. టాటా కంపెనీ యాజమాన్యం పై ట్యాంకర్ల ద్వారా ఊరుకి నీళ్ళు ఇవ్వడానికి, బంజ్‌ బన్తీలో హాండ్‌ పంప్‌ వేయించడానికి ఒత్తిడి తెచ్చాను. మాండూ క్షేత్రంలో వేయబడ్డ మొదటి హాండ్‌ పంపు ఇది. మొత్తానికి ఊరివాళ్ళందరి మనస్సులో మా మీద గౌరవం పెరగసాగింది. కీ||శే|| రఘువీర్‌ సహాయ్‌ ఆ రోజుల్లో ఢిల్లీ నుండి వెలువడే హిందీ-ఇంగ్లీషు దినపత్రికలలో, దిన్‌మూన్‌లో మేం చేస్తున్న నీళ్ళపోరాటం గురించి రాసారు. పతాక శీర్షికలలో ఈ వార్తలు పడ్డాయి. మాండూ క్షేత్రం గురించి అందరికి తెలినేలా చేసారు.
భూములకోసం పలుచోట్ల పోరాటాలు :
ఎలక్షన్ల రిజల్టు వచ్చే రోజున గెలుపు నాదే అన్న పూర్తి నమ్మకంతో ఊరేగింపు తీస్తున్న సమయంలో జీపు బానెట్‌ పైన ఎక్కి నేను ప్రకటించాను- ”ఎలక్షన్లలో నేను ఓడిపోయాను. కాని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నాకు ఓటమి ఎప్పుడు ఉండదు. ఓడిపోయాక ఈ క్షేత్రాన్ని వదిలి పోూడదని మీరు అన్నారు. నేను వెళ్ళనని మాట ఇచ్చాను. జల్‌-జంగ్‌-జమీన్‌ (నీళ్ళు- అడవులు- భూములు) ల కోసం పోరాటం మొదలు పెట్టాను. అడవుల్లో పనిచేనే ెనౖనికులకి వ్యతిరేకంగా మా నినాదం- ‘ఘాస్‌ నహీం అబ్‌ ఘాసా దేంగే (లంచం ఇవ్వం – దెబ్బలు వేస్తాం) క్షత్రియుల అజమాయిషీ ఉన్న ఊళ్ళలో
వాళ్ళు పొలాలలో పనిచేనే కూలీల మీద దాష్టీకం చేనేవాళ్ళు. ఈ జమీందారులకు విరుద్ధంగా నేను పోరాటం ప్రకటించాలని వాళ్ళందరు అనుకునేవాళ్ళు. ఇప్పటికీ నాకు ఆ సంఘటన గుర్తుంది. ఎలక్షన్లలో నేను ఓడిపోయాను. చంపా బన్తీలోని పొలాలలో పనిచేనే ఒక దళిత కూలీ, ఇతడు మాతో పాటు ఎలక్షన్ల సమయంలో కార్యకర్తగా పనిచేసాడు; నా దగ్గరికి వచ్చాడు. చంపాకి వచ్చి జమీందారుల చేతుల్లో ఉన్న తమ భూమిని తమకు వచ్చేటట్లు చేయమని అడిగాడు. నేను అతడికి తప్పకుండా ఈ పని చేస్తానని మాట ఇచ్చాను. నేను శ్రీ బాబు గారికి ఈ విషయం చెప్పాను. ఏ రోజు వెళ్దాం అని అడిగాను. అంతే ఆయన కోపంగా అన్నారు- ”ఎవరో ఊరు-పేరు లేని వాడికోసం మనం చంబా బాబూ సాహెబ్‌తో శత్రుత్వం తెచ్చుకుందామని అంటున్నావా? వీళ్ళు మంచి వాళ్ళు కారు. నిన్ను మార్గం తప్పిస్తున్నారు. ఆ జమీందారులు కూడా మనకు మిత్రులే కదా?”
నేను ఆశ్చర్యపోయాను. నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి. నేను ఆ దళిత కార్యకర్తతో అన్నాను- ”సరే! నేను ఒక్కతినే మీ ఊరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాను. నీవు యూనియన్‌ని తయారు చెయ్యి.”
అంబికాదారా అక్కడే కూర్చున్నారు. ”రమణికా! ఈ శ్రీకృష్ణ సింహ్‌ క్షత్రియులకు సహాయం చేస్తాడు. ఈ బీదవాళ్ళకోసం నువ్వు ఒక్కతివే పోరాటం జరపాలి. ఇట్లాంటి లీడర్లనుండి నువ్వు ఏమీ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యకు. వీళ్ళు నిన్ను మోసం చేస్తారు” అని ఆయన అన్నారు.
శ్రీ బాబు ఏ పోరాటానికి ఇష్టపడరు. కాని నేను ఈ పని చేయాలనే నడుం బిగించాను. అందువలన ఆయన ఒద్దని అంటున్నా పోరాడుతాను అని ప్రకటించాను. మా కాడర్‌ వాళ్ళు అందరు ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళకి పోరాడే నేత కావాలి. మా నేతలు తమ గౌరవం మంట గలుస్తుందని కోపంగా అన్నారు. అడవులలో ఉన్న సిపాయిల వలన ఎంతో బాధపడుతున్న గ్రామీణులు మా కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. వెంటనే ఉద్యమం మొదలు పెట్టాలని ప్రార్థించారు. మేం అందరం హజారీబాగ్‌ నుండి (ఆ సమయంలో హజారీబాగ్‌లో గిరిడీహ్‌, చత్‌రా సబ్‌డివిజన్‌గా కలిసి ఉండేవి) నా వైపు నుండి ఛోటా నాగ్‌పూర్‌కి ఉత్తరాన ఉన్న ఆదివానీలు, అక్కడ స్థానికుల పేరుమీద ఒక అర్జీ పెట్టాను. ఘాటో కూలీలు నాకు ఎంతో సహాయం చేసారు. మేం రాసి ఇచ్చిన అర్జీని తీసుకుని కార్మికులందరు సైకిళ్ళమీద, కాలినడకన ఊరు-ఊరు, వాడ-వాడ వెళ్ళారు. నేను ూడా పటేల్‌ సింహ్‌, నిత్యానంద సింహ్‌, మరాఠీలతోపాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను. ఎంతోమంది యువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దుబ్‌రాజ్‌ మాంఝీ, మహదేవ్‌ మాంఝీ ఆ రోజుల్లో మాతో కలిసి తిరిగారు. ఆదివానీలందరు ధనస్సు, బాణాలు ధరించి డుగ్‌డుగ్గీలను తీసుకుని ఒక ఊరేగింపు (దాదాపు 1500 మంది ఆదివానీలు) హజారీబాగ్‌లో తీసారు. ఇది చాలా పెద్ద ఊరేగింపు. సామాన్యంగా రాజుసాహెబ్‌ ఆహ్వానం పైనే ఇంత మంది ఆదివానీలతో ఇంత స్సస్‌ఫుల్‌గా రాలీ తీయగలరు అని అక్కడి వాళ్ళందరు చెప్పడం మొదలు పెట్టారు. ఆయన ఆహ్వానం లేకుండా ఆదివానీలు తమంతట తాము ఇంత పెద్ద ఊరేగింపు మొట్టమొదటిసారిగా తీసారు. మేం అందరం ఈ విధంగా నినాదాలు చేసాము- ‘ఘాస్‌ నహీం అబ్‌ ఘాసా దేంగే’.. ‘లాఠా- ఛావన్‌ ఔర్‌ జలవాన్‌ ముఫ్తదో’- ‘జోతీ జమీన్‌ డిమార్‌షేన్‌ నే బాహర్‌ కరో’.. ‘జల్‌-జంగల్‌-జమీన్‌ హమారా హై’ మాండూలో దీక్ష చేయాలని నిర్ణయం జరిగింది. మేం అందరం ఏడు రోజులు జైల్‌భరో ఉద్యమాన్ని నడపాలని అనుకున్నాము. సిపాయిలు భయపడి అడవులకు రావడం మానేసారు. సమాచారం పంపడానికి ఏ సాధనాలు లేనందువలన మేం చేసుకున్న నిర్ణయం విషయాన్ని అన్ని గ్రామాలకు పంపలేకపోయాము. అందువలన ఒక వారంపాటు జైల్‌భరో ఉద్యమం కోసం ఒకరోజు నిర్ణయించుకుని డోలు, మాందర్‌, బాణాలు, టాంగీ మొదలైనవి తీసుకుని మాండూకి వచ్చేవారు. ఒక్కొక్క గ్రామం ప్రజలు ఒక్కొక్క రోజు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఉద్యమం చేయాలని అరెన్ట్‌ కావాలని నిర్ణయించాము. ముఖ్యంగా ముగ్గురం నేను, పటేల్‌సింహ్‌, నిత్యానంద్‌ సింహ్‌ ఉద్యమాన్ని నడుపుతున్నాము. కాని ప్రతిక్షేత్రంలో మా కార్యకర్తలని నియమించాము. చందాకింద మొక్కజొన్నలు ఇచ్చారు. కార్యకర్తలందరు దీక్షపై కూర్చోబోయే వాళ్ళందరు మొక్కజొన్నల సంకటి తాగి ఉద్యమాన్ని నడిపారు. సిపాయిలు అడవుల్లోకి రావడానికి భయపడేవారు. ప్రభుత్వం వారు మూడో రోజు మమ్మల్ని పిలిచి మాట్లాడారు. కొత్త డిపోలు తెరవాలని కట్టెల అడతీలు పెట్టాలని, మా ప్రతినిధులను తీసుకువెళ్ళి అక్కడి భూములను చూపించాలని, ఆ భూములను డిమార్‌షేన్‌ నుండి తీనేసి భూమి దున్నే రైతులకి ఇవ్వాలని మేం డిమాండ్‌ చేసాము. శౌతా, బద్‌సవ్‌ు, కజరీ, పిండరా, జరబా, తాపిన్‌, దురు, కసమూద్‌, బసంత్‌పూర్‌, రాహీం, పచమో కరమా, జగేసర్‌ మొ||లైన గ్రామాల్లో ఉండే ఆదివానీలు, మహతోలు భూములను స్వాధీనం చేసుకోసాగారు. ఈ ఉద్యమం ప్రభావం కార్మికుల మీద పడ్డది. వెన్ట్‌ బొకారో, దేలా, ఝార్‌ఖండ్‌లోని కార్మికులు మా దగ్గర యూనియన్‌ని స్థాపించాలని వచ్చేవారు.
పహల్‌వాన్‌ల రాతిగుండెలు కరిగాయి :
మేం అందరం ఉద్యమాన్ని పట్టుదలతో నడుపు తున్నాము. పల్లెటూళ్ళలో, బజార్లలో, సంతలలో మీటింగులు పెట్టే వాళ్ళం. అక్కడికి దేలా ఝార్‌ఖండ్‌ కార్మికులతోపాటు పహల్‌వాన్‌లు కూడా వస్తూ ఉండేవారు. ఒకసారి నేను సభ పెట్టడానికి దాహీం వెళ్తున్నాను. మధ్యదారిలో బాబూ బాలాసింహ్‌ పహల్‌వాన్‌ కనిపించారు. ఆయనకి దాహీంలో నా ప్రాణాలకి ముప్పు ఉంది అన్న సంగతి ముందే తెలుసు. అందు ఆయన నాకు హెచ్చరిక చేసారు.
”ఇవాళ మిమ్మల్ని అక్కడ చంపాలని రాజు సాహెబ్‌ ప్లాన్‌ వేసారు. నేను పహల్‌వాన్‌ని, ఈ సందర్భంలోనే నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు రాకండి-” అని ఆయన అన్నారు.
”మరైతే మీరెందుకు ఈ రహస్యాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించానుగా! చంపాలంటే చంపొచ్చుగా. ఎందుకు చంపరు?” అని తిరిగి ఆయన్నే ప్రశ్నించాను.
”ఏయం చేయను, అమ్మగారూ! ఈ పొట్ట పాపిష్టి పొట్ట. ఇది అడ్డమైన పనులను చేయిస్తుంది. మీరు మా బీదవాళ్ళ కోసమే కదా పనిచేస్తున్నారు. అందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.”
”మీరైతే మీ డ్యూటీ మీరు చేయండి. తక్కిన వాళ్ళ మనస్సుల్లో కూడా దయాదాక్షిణ్యాలు రావచ్చుగా! నేను అక్కడికి వెళ్ళాలి. వెళ్తాను కూడా.”
నేను కాలినడకన దాహీం బజారు వైపు వెళ్ళసాగాను. మగన సింహ్‌ ఇంకా తక్కినవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ రాజు సాహెబ్‌ కాంట్రాక్టర్లు కొందరు పహల్‌వాన్లను, కూలీ-నాలీలను పంపించారు. వాళ్ళ చేతుల్లో నల్లజెండాలు ఉన్నాయి. దేలా నుండి రావద్దని అందరు పదే పదే చెప్పడం వలన నేను అడవిలో నుండి కాలినడకన వచ్చాను. మేం వెనక్కి వెళ్ళేటప్పుడు దేలా నుండే వెళ్ళాలని నిర్ణయించారు. అక్కడ టాక్సీని ఏర్పాటు చేసారు. ఎందుకంటే నా కారుని ఎవరు గుర్తుపట్టూడదు. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు దాహీం, పచమోం లోని గ్రామీణులు దీనిని అవమానంగా భావించారు. ఎందుకంటే అడవి ఉద్యమాన్ని నడిపించాలని వాళ్ళే నన్ను అడిగారు. ఇంటికి వచ్చిన అతిథిపై ఈ విధంగా హత్యా ప్రయత్నం చేయడం వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఊరి వాళ్ళందరు రాజు సాహెబ్‌ పంపించినవాళ్ళను ఛాలెంజ్‌ చేసారు. పోట్లాట ఆగిపోయింది. ఇక్కడి ఊరి ప్రజలు మొదటినుండి రాజుసాహెబ్‌కి, కాంగ్రెన్‌కి శత్రువులు. వాళ్ళందరు స్పష్టంగా చెప్పారు. ”గుప్తా గారితో పోరాటం సలపాలంటే ముందు మమ్మల్ని ఎదుర్కోండి-”
గ్రామ ప్రజలు పహల్‌వాన్లని బజారులోనే ఆపేసారు. నన్ను చుటువా నదిని దాటించి టాక్సీలో కూర్చోపెట్టారు. అక్కడ కాంట్రాక్టర్లు పహల్‌వాను ఎదురుకుంటా నిల్చున్నారు. నేను దేలా పొలిమేరలు దాటి ముఖ్యమార్గం నుండి బంజ్‌ గ్రామం వెళ్ళేదాకా వాళ్ళని ఆపారు. బంజీ గ్రామం మాకు సురక్షితమైన చోటు. అక్కడి పిల్లలు, పెద్దలు, యువకులు, స్త్రీలు అందరు నాకోసం ప్రాణాలు సైతం తెగించి పోరాటం చేయడానికి అన్నివేళలా సంసిద్ధులై ఉండేవారు.
(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో