భూమిక సాహితీ సమ్మేళనం

గతంలో భూమిక ఆధ్వర్యంలో జరిగిన సాహితీ యాత్రలు మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చీన విషయం మనందరికీ అనుభవమే. ఆ యాత్రలన్నీ విహారయాత్రలుగా కన్పించినా… నిజానికి మనమందరం సామాజిక ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడిన ప్రాంతాలకే వెళ్ళాం. వారి ఉద్యమాలతో, వారి పోరాటాలతో మమేకమయ్యాం. ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా తిరిగాం. క్రితం సంవత్సరం తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ అడవి గర్భాల్లోకి వెళ్లాం. గోండు గూడేల్లోని దయనీయ స్థితుల్ని కళ్ళారా చూసాం.
మళ్ళీ సాహితీ యాత్రని ప్లాన్‌ చెయ్యమని చాలా మంది అడుగుతున్నారు. రెండేళ్ళకొకసారి ఆర్గనైజ్‌ చేస్తున్నాం కాబట్టి… ఇప్పుడు కూడా చెయ్యాలి. ప్రశాంతి, నేను కూర్చుని భూమిక గురించి మాట్లాడుకుంటున్నపుడు సాహితీయాత్ర ప్రస్తావన కొచ్చింది. ఈసారి పాత యాత్రలకి భిన్నంగా నిర్వహిస్తే బావుంటుందని, వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల్లోకి వెళితే ఎలా వుంటుందని ప్రశాంతి అన్నప్పుడు… చాలా బావుంటుందని అనిపించింది. అయితే ఇది యాత్ర మాత్రమే కాదు… ప్రస్తుత సామాజిక స్థితిగతులు, స్త్రీల అంశాలు, అస్తిత్వ ఉద్యమాల తీరుతెన్నులు మొదలైన అంశాల మీద వర్క్‌షాప్‌ రూపంలో నిర్వహిస్తే బావుంటుందని అనుకున్నాం. హిందూత్వ అజెండా, స్త్రీలపై పెరుగుతున్న హింస, రాజకీయల్లోకి చొచ్చుకొచ్చిన మతం మొదలైన అన్ని అంశాలమీద చర్చించాలని అనుకున్నాం.
సీరియస్‌గా వర్క్‌షాప్‌ నిర్వహించుకుంటూనే అడవిలోకి నడకలు, మూసీ జన్మస్థలం దగ్గర ఆటలు పాటలు, వీధి నాటకాలు, ఏక పాత్రాభినయాలు వగైరా వగైరా లన్నింటిని మిళితం చేయడమూ వుంటుంది. అనంతగిరిలో చక్కటి హరితవనం వాటి హరిత రిసార్ట్స్‌ ఉన్నాయి. ఓ మూడు రోజుల పాటు నగరారణ్యానికి దూరంగా నిజమైన అడవుల్లో ఉండొద్దాం. మీరేమంటారు?
సెప్టెంబరు మూడో వారంలో 14-20 మధ్య ఈ వర్క్‌షాప్‌ వుంటుంది. ఇంతకు ముందులాగానే అందరం కాంట్రిబ్యూట్‌ చేసుకుందాం. ఎంత? అనేది వివరాలన్నీ అందుబాటులోకి వచ్చాక మీకు తెలియచేస్తాం. సెప్టెంబరు 4 నాటికి మీమీ వివరాలు, సమ్మతి, మీ కంట్రిబ్యూషన్‌ భూమిక కార్యాలయానికి చేరాలి.
‘చలో అనంతగిరి
చలో మూసి కే ఉస్‌ పార్‌”

Share
This entry was posted in భూమిక సూచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో