నివారణా! నిషేధమా!- భండారు విజయ

సాంతిేకాభివృద్ధి వల్ల లభించిన అద్భుతమైన వేదిక అంతర్జాల సమాచార వాహిక ‘ఇంటర్‌నెట్‌’. దాని ఆధారంగానే నడుస్తున్నది ‘సోషల్‌ మీడియా’. రోజువారి తమ భావాలను ఆలోచనలను, అభివృద్ధిని, ఆందోళనలను పరిచయం లేదా ప్రచారం చేసుకోవటానికి ప్రతివారికి ఈ ‘ఓపెన్‌ ఫోరవ్‌ు’ లో అవకాశం, అధికారం ఉంటుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, అంశాలే కాక సాహిత్య, సాంస్కృతిక, కళలను అభిమానించేవారికి, విజ్ఞానాన్ని పొందేవారికి, ఆదరించేవారికి, ఆనందాన్ని ఆస్వాదించేవారికి ఓ వారధిలా ‘సోషల్‌ మీడియా’ పనిచేస్తుంది.

అయితే కొన్ని ‘వెబ్‌సైట్లు’ సమాజాన్ని విచ్ఛిన్నంచేనేవిగాను, యువతను పెడదారి పట్టించేవిగాను, సభ్య సమాజంలో పెద్ద మనుషలుగా చెలామణి అవుతూ చీకటి రాజ్యాలను సృష్టించుకొని అరాచకాలు సృష్టించేవిగాను ప్రమాదభరితంగా వున్నాయి. మానవత్వాన్ని మంటగల్పి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నది ప్రతి ఒక్కరు సమ్మతించిన విషయమే. ముఖ్యంగా యువతను ప్రక్కదారి పట్టించి, వారి జీవితాలను, జీవనగమనాన్ని ూడా శిథిలం చేస్తున్నాయి. మానవీయతను కోల్పోయి ఉక్రోషానికి, ఉగ్వేదానికి లోనయి వికృత దాష్టీకాలను ఉసిగొల్పి మానవత్వ విలువలను మంటగల్పుతున్నాయి. వ్యాధిగ్రస్త సమాజాన్ని తయారుచేస్తున్నాయి. యువతను అష్టావక్రులుగా తయారుచేస్తున్నాయి.

ముఖ్యంగా ‘పోర్న్‌సైట్స్‌’ అంటే ‘నీలి అశ్లీల దృశ్యాల వెబ్‌సైట్స్‌’ యువతను మాననిక, శారీరక రుగ్మతలవైపు పయనించేలా చేస్తున్నాయి.

ఈ వెబ్‌సైట్స్‌పై ‘నిఘా’ ఎక్కడా మనకు కన్పించదు. పుంఖాను పుంఖాలుగా ప్రతిరోజు పుట్టుకొచ్చే ఇటువంటి వెబ్‌సైట్స్‌ ప్రభుత్వ ఖజానాలను నింపటంతోపాటు, వ్యాపార దృక్పథాన్ని మరింత బిగువుతో, పకడ్భందీగా చాపకింద నీరులా ప్రవహించి యువతను ముంచెత్తుతున్నాయి. నూతన ‘గ్లోబలేజేషన్‌’ ఆర్థిక విధానాలవలన మనుషల జీవితాలు జీవనశైలినే కాక కుటుంబ విచ్ఛిన్నాలను సృష్టిస్తున్నాయి.

ప్రతిరోజు దినసరి అలవాటులో ‘చాయ్‌ (టీ) తాగటం ఎలాగో, చేతిలో ఫోన్‌ లేదా సెల్‌ ఉండటం ూడా అంతే నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందులో అంతర్జాలం అందించే నీలి అశ్లీల సాహిత్యం లేదా దృశ్యాలను చూడటం ఓ అవసరమైన అలవాటుగా యువత మార్చుకుంటున్నారు.

మానవ సంబంధాలకు సంబంధించిన లేదా విజ్ఞానానికి సంబంధించిన అంశాలను చూడకుండా అటు వ్యాపారసంస్థలు లాభార్జనే ధ్యేయంగా, విశృంఖల ‘వెబ్‌సైట్స్‌’ను వెరైటీగా చూపిస్తూ, యువతను ఆకర్షిస్తూ తమతోపాటు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ ఖజానాలు నింపి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. మాస్‌ మీడియాలు సోషల్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా ఈ అశ్లీల డాక్యుమెంట్స్‌, వీడియోస్‌, మూవీస్‌ను డౌన్‌లోడ్‌ చేస్తున్నా వాటిపై ఎటువంటి నిఘాను పెట్టకుండా వాటిని మరింతగా ప్రోత్సహిస్తూ వాటిని నడుపుతున్న బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

తత్ఫలితంగా పాలుగారే పసిపిల్లల నుంచి పండుముదుసళ్ళ వరకు ఈ అశ్లీల నీలిచిత్రాలు లేదా దృశ్య వెబ్‌సైట్ల ప్రభావానికి లోనై సభ్య సమాజం తలదించుకునే అకృత్యాలకు, అత్యాచారాలకు, హత్యోన్మాదాలకు పాల్పడుతున్నారు. ఉచ్చనీచాలు మరచి, వాయివరసలు విడిచి కామ, క్రోధాలచే ప్రకంపితులై ఎవరిమీద పడితే వారి మీద, ఒంటరిగా ఉన్న స్త్రీలపైన, ఏమరుపాటుగా వున్న యువతులపైన శాడిజాన్ని చూపుతూ లైంగిక దాడులు చేస్తూ, లొంగని స్త్రీలపై పైశాచిక ఉన్మాదాన్ని చూపిస్తూ హత్యలు చేస్తున్నారు. నేరస్తులుగా, వంచకులుగా సమాజంలో నిలబడిపోతున్నారు.

కుటుంబాలలో ూడా తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెదనాన్నలు, మామలు, తాతలు తమ లైంగిక ఉద్వేగాలను అణచుకోలేక అమాయకులైన బిడ్డలను, చెల్లెళ్ళను, అక్కలను, మనుమరాళ్ళను ూడా వదలకుండా తమ పైశాచిక కాముకత్వానికి బలిచేస్తున్నారు. అవి బయటపడతాయన్న భయంతో హత్యలు చేస్తూ, నిజాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నంలో మానవత్వాన్ని మంటగల్పి, చివరికి పట్టుబడి జైలు ఊచలు లెక్కబెడ్తూ తమ జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.

ఈ వెబ్‌ెనౖట్స్‌ల విషసంస్కృతిని అలవర్చుకొని యువత 20 సం||లు ూడా నిండకుండానే విచ్ఛలవిడి శృంగారాలకు అలవాటు పడి ‘ఎయిడ్స్‌’ వంటి మహమ్మారి రోగాలబారినపడి ప్రాణం మీదకి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటు తల్లిదండ్రుల ప్రేమను అటు కుటుంబ ఆదరణను పొందలేక, పొందినా… ఆత్మన్యూనతా భావంతో పెళ్ళిళ్ళ ఎడ విముఖతను పెంచుకుంటున్నారు. విషసంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ… బయటకు వచ్చే మార్గాలు మూసుకొనిపోగా ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ముఖ్యంగా యువత దైన్యమైన స్థితికి నెట్టివేయబడి నేర ప్రవృత్తులకు లొంగిపోతున్నారు.

నీలి అశ్లీల వెబ్‌సైట్ల మోజులో పడి కొందరు యువకులు స్త్రీలపై ఎక్కడ అత్యాచారం చేస్తూ పట్టుబడతామో! అన్న భయంతో ‘హోమో సెక్సువాలిటీ’కి అలవాటుపడి అసహజత్వ, వికృత లైంగిక దాడులను వెతుక్కుంటూ జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులకు, కుటుంబాలకు దూరంగా చదువు నిమిత్తమో, ఉద్యోగ నిర్వాహణపరంగానో, వ్యాపార నిమిత్తంగానో, నివసిస్తున్నారు. హాస్టల్స్‌లో తలదాచుకుంటున్నారు. ఒంటరితనంతోనో, హార్మోనుల ప్రభావంతోనో ఈ వెబ్‌సైట్స్‌చే ఆకర్షించబడి, స్త్రీలతో లైంగికత్వం ‘ఎయిడ్స్‌’కు దారి తీస్తుందన్న భయంతో కూడా ‘హోమోసెక్సువాలిటి’కి ఆకర్షించబడుతున్నారు.

అంతేకాకుండా విశృంఖల లైంగికత్వాలకు అలవాటుపడి ఆరోగ్యకరమైన స్త్రీలను ‘పెళ్ళిళ్ళు’ చేసుకొని, పిల్లల్ని కని ఆత్మవంచనతో భార్యా, పిల్లలకి కూడా ‘ఎయిడ్స్‌’ ను అంటించి కుటుంబ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. సభ్య సమాజంలో నిలువలేక తమతోపాటు అమాయకులైన భార్యా, పిల్లల్ని కూడా బలిచేస్తూ చివరికి ఆత్మన్యూనతాభావంతో జీవిస్తున్నారు. కొందరైతే బలవంతంగా తమ జీవితాలకు ముగింపునిస్తున్నారు.

ఈ వెబ్‌సైట్స్‌ వలన యువతలో నేర ప్రవృత్తి పెరిగి ఒంటరి స్త్రీలను, యువతులను అపహరించి, లేదా కిడ్నాపులు చేస్తూ వారిని అక్రమ రవాణా చేస్తున్నారు. వ్యభిచార కూపాల్లోకి బలవంతంగా నెట్టివేస్తున్నారు. ప్రేమల పేరుతోనో, ఉద్యోగాల పేరుతోనో, లేక సినిమాల పేరుతోనో వారిని నమ్మించి, వంచించి స్త్రీల శరీరాలతోనే కాక వారి మెదడ్లతోనూ వ్యాపారం చేస్తూ ‘మాఫియా’లుగా మారిపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు – మహిళాసంఘాలు ఈ పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను పెంచిపోషిస్తున్న ప్రజాప్రభుత్వాలకు వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా వాటిని నిరోధించమని కనీసం వాటిని నియంత్రించమని ఎన్ని అర్జీలు పెట్టినా, పోరాటాలు చేసినా స్పందించలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రభుత్వాలు పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను చట్టబద్ధంగా బ్యాన్‌ చేసినప్పటికినీ, మనదేశంలో పుంఖాను, పుంఖాలుగా రోజూ ఎక్కువ సంఖ్యల్లో పెరిగిపోతూనే వున్నాయి. అభివృద్ధిచెందిన దేశాలతో పోల్చితే మనదేశంలోనే ‘నేరప్రవృత్తికి’ ఈ వెబ్‌సైట్స్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచదేశాలలో మొత్తంగా పేర్చితే దాదాపు 40 లక్షల వరకు ఈ వెబ్‌సైట్స్‌ వున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు.

ఐ ఫోన్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వచ్చిన తర్వాత ఈ వెబ్‌సైట్స్‌ విస్తృతంగా యువతను ఆకర్షించి వారిని వారి జీవిత విధానాలను విచ్ఛిన్నకరం చేస్తున్నా ప్రభుత్వాలు-రాజకీయ నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా, చూసిచూడనట్లుగా వదిలివేయటం వలన చాపకింద నీరులా చేరి సమాజాన్ని రోగగ్రస్తం చేస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశించిన రాజకీయ నాయకులు కూడా అక్కడ జరిగే చర్చలకు స్పందించకుండా, పార్లమెంటులోనే తమ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ నీలిచిత్రాల వీక్షణను చేస్తున్నారంటే, వాటి ప్రభావం-ఆకర్షణ సభ్యసమాజంలో ఎంత వుందో చెప్పవచ్చు.

‘మాతంగి’, దేవదాసి, జోగిని వ్యవస్థలు ఉన్నప్పుడు సమాజాన్ని ఆమోదించలేదా ఇప్పుడు ఈ వెబ్‌సైట్స్‌ను ఎందుకు మహిళలు ఆమోదించారు- అన్న ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతున్నది. ఆ సమస్యలు పితృస్వామ్య భావజాలంతో, మానవతా దృక్పథంతో, పురుష అహంకారానికి నిదర్శనంగా వచ్చిన దురాచారాలు మాత్రమే. స్త్రీలను శారీరకంగా, మానసికంగా, అణచివేసి తమ శృంగార కాంక్షలను బలిచేసి స్త్రీలను కించపర్చి తమ అధికార దర్పాన్ని చూపిన భూస్వామ్య పెట్టుబడి విషసంస్కృతికి ఆనవాళ్ళు మాత్రమే! అక్కడ ఆ ప్రాంతానికి మాత్రమే ఈ దురాచారం వాటి ప్రభావం వుంటుంది. కాని ఈ వెబ్‌సైట్స్‌ సభ్యసమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. వాటితో వీటిని పోల్చటం- అవి ఉన్నప్పుడు ఇవి వుండటం తప్పేంటి అని వాదించటం తెలివిహీనంతోను, కుట్రపూరితంగాను చేసే వాదనగానే భావించాల్సి వుంటుంది. మహిళలను అణచివేయటంలోని అంశంగానే గుర్తించాల్సి వుంటుంది.

నాలుగు లక్షలకు పైగా వున్న ఈ వెబ్‌సైట్స్‌లో కేవలం 30% వెబ్‌సైట్స్‌ను మాత్రమే భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించటం జరిగింది. ఇది కొంచెంలో కొంచెం అభినందించవల్సిన విషయమే అయినప్పటికినీ ‘సినిమా ప్రముఖులు’ కొందరు దీనిని విబేధించటం వెబ్‌సైట్స్‌ను నిషేధించటం వలన మనుషులు మారుతారా! దానివల్ల లాభంకంటే నష్టాలే ఎక్కువ అన్న పిడివాదాన్ని ప్రదర్శించటం నిజంగా సభ్య సమాజం తలదించుకోవల్సిన స్థితిలోకి పడిపోయింది. కేవలం తమ సినిమా వ్యాపారాన్ని పెంచుకొని తద్వారా స్త్రీల పాత్రల విలువలకు వలువలు వలిచే విషసంస్కృతిలో కోట్లు గడిస్తున్న సినిమా ప్రపంచం ఆడవాళ్ళపట్ల వాళ్ళపై అనునిత్యం జరుగుతున్న అకృత్యాలపట్ల కనీస మానవీయతను కూడా చూపకపోవటం నేరంగానూ, స్త్రీలను విలాసవస్తువుగా, భోగవస్తువుగా చూడటంలో-చూపించటంలో తమ పిడివాదాన్ని వినిపించటం చాలా బాధాకరం. ‘నీలి’ వీక్షణంపై నూతన దాడి అని విరుచుకుపడటం, వ్యక్తి స్వేచ్ఛను అణచివేయటమే అని గగ్గోలు పెట్టటం వారిని కొందరు ప్రముఖులు కూడా అనుకరించటం సమర్థించటం కూడా విచారకరం.

ఇదే సంస్కృతి కొనసాగితే సమాజంలో ఇప్పటికే స్త్రీలపై పెరిగిపోతున్న అత్యాచారపర్వాలు, హత్యోన్మాదాలు, యాసిడ్‌ దాడులు ఇంకా విజృంభించి స్త్రీల పుట్టుకకు సవాళ్ళుగా నిలిచిపోతాయి. భవిష్యత్తులో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఉత్పాదక శక్తులైన మహిళలు కనుమరుగై పోవల్సిన దారుణ పరిస్థితులు ఎదుర్కొనవల్సి వచ్చినా ఆశ్చర్యపోవల్సిన పనిలేదు.

కాబట్టి మానవతా వాదులు, సమాజ అభ్యున్నతిని కోరే సంస్కారవంతులు, పోరాట పటిమను కల్గిన అభ్యుదయవాదులు అందరూ ఏకమై ఈ పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను నిషేధించటాన్ని ఆహ్వానిస్తూ మిగిలిన పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను నియంత్రించాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా పే ఛానల్స్‌ లాగా పే వెబ్‌సైట్స్‌గా వాటిని కుదించి వాటిని బ్లాక్‌ చేసినట్లైతే కనీసం రాబోయే జనరేషన్‌నైనా సక్రమ మార్గంలో నడిపిన వారమౌతాము.

ఈ వెబ్‌సైట్స్‌ను నియంత్రించటంవలన చైల్డ్‌ ఎబ్యూజింగ్‌ తగ్గిపోతుంది. అసహజ శృంగారాన్ని ఆమోదించకుండా చేస్తుంది. స్త్రీలపై లైంగిక వేధింపులు తగ్గిపోతాయి. అంతేకాకుండా అమ్మాయిల కిడ్నాపులు, వ్యభిచార గృహాలకు అమ్మాయిలను చేరవేయటాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పురుషుల దృక్పథంలో స్త్రీలు లైంగిక వస్తువులు కాదన్న స్పృహ కల్గుతుంది. యువతి పెడదోవపట్టకుండా నివారిస్తుంది. దాంపత్య జీవితాలలో అభద్రతాభావం తగ్గిపోయి సుఖమయమైన జీవితాలను దంపతులు గడపగల్గుతారు.

సామాజిక పరంగానే కాక కుటుంబపరంగా కూడా అనేక విధాలుగా పురుష అహంకారానికి, పితృస్వామ్య భావజాలానికి స్త్రీలు అణచివేయబడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. సమాజం ఆమోదించని, స్త్రీలు ఆమోదించని ఈ ‘పోర్న్‌గ్రఫి’ కేవలం పురుషుల ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మాత్రమే పెంపొదిస్తాయి. అంతేగాక సహజసిద్ధమైన శృంగార ప్రక్రియలకు విరుద్ధమైనవి. మగవాళ్ళ క్రూర ప్రవృత్తికి మూలమైన వాటిని స్వేచ్ఛ పేర ఆమోదించలేనివి దేవాలయాల్లో బూతు బొమ్మలు లేవా! వాటిని వీక్షించటం లేదా అని పిడివాదం చేయటం కళాత్మక అభివ్యక్తిత్వానికి దుర్మార్గపు రాక్షసప్రవృత్తికి లంకె పెట్టటం నీతిమాలిన చర్యగానే భావించాల్సి వస్తుంది. స్వేచ్ఛ పేరిట సమర్థించటం, నైతికత పేరిట వాదించటం సిగ్గుపడాల్సిన విషయం.

స్త్రీ పురుషుల నడుమ అభద్రతాభావం, ఆందోళన, మానసిక కృంగుబాటు, మానసిక వైకల్యాలు కల్గించి దాంపత్య జీవనాలను విముకత్వం కల్గించే ఈ పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను నిషేధించటం నివారించటం వలన ఆరోగ్యకరమైన కుటుంబానికి తద్వారా సమాజానికి పునాది వేసినవాళ్ళ మౌతాము. యువత అసహజత్వాన్ని వీడి సభ్య సమాజంలో స్త్రీలపై గౌరవభావంతో ఉండగల్గుతారు. మానవీయత కల్గిన పౌరులుగా స్త్రీల ఎడల సమభావాన్ని చూపగల్గుతారు. కాబట్టి ప్రతివారు ఈ పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను నిషేధించాల్సిందిగాను, పకడ్భందీగా నివారించటానికి పూనుకోవల్సి వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో