సావిత్రీబాయి ఫూలే : భారతదేశంలోని ప్రప్రథమ ఉపాధ్యాయురాలు- అనువాదం: అబ్బూరి ఛాయాదేవి

ఈ దేశంలో ఉపాధ్యాయులకు గర్వకారణం కావచ్చు, రాజకీయ నాయకులూ, ప్రభుత్వ అధికారులూ, ప్రజలూ ఒక దినాన్ని తమ గౌరవార్థం గుర్తు పెట్టుకుంటున్నందుకు– వారు అందిస్తున్న సేవలకూ, భారతీయ సమాజం పురోభివృద్ధికి పాటుపడుతున్నందుకూ, ఎవరి పేరున, వారి జన్మదినం సందర్భంగా ఈ ఉపాధ్యాయుల దినాన్ని పండుగలా చేసుకుంటున్నారో, ఆ వ్యక్తి విద్యార్థుల కోసం, సమాజంలోని బడుగు వర్గాల వారికి ఎంతో అవసరమైన విద్యతో వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యకపోయినప్పటికీ, కాని బడుగువర్గాల వారి కోసం, ముఖ్యంగా ఆడపిల్లలకోసం, అస్పృశ్యులకోసం- శతాబ్దాలుగా విద్యావకాశాలకు దూరంగా ఉంచబడిన వారికోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను ప్రారంభించిన ప్రప్రథమ భారతీయ ఉపాధ్యాయురాలి గురించి దేశచరిత్రలో భాగంగా ఎవరికీ తెలియదు, చరిత్ర పుస్తకాలలో ఆమె ప్రస్తావన లేదు. ఉపాధ్యాయురాలుగానూ, మహిళాభ్యుదయానికి పాటుపడిన మహిళగానూ 19వ శతాబ్దం చివరి దశలో కూడా మన సమాజంలో చాలామందికి తెలియదు.

భారతదేశంలోని ప్రప్రథమ ఉపాధ్యాయురాలి గురించి మనకి ఏం తెలుసు? ఎంతవరకు తెలుసు? ప్రప్రథమ ఉపాధ్యాయురాలు అనిపించుకునేందుకు ఆమె ప్రత్యేకంగా ఏం చేసింది? ఇది అసాధారణమైన ప్రశ్న. మామూలుగా, మనదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? లేదా, ‘చంద్రమండలంపై పాదం మోపిన మొదటి భారతీయుడెవరు? అంటూ అడిగే ప్రశ్నలు, పాఠ్యపుస్తకాలలో చేర్చే ప్రశ్నల వంటిది కాకుండా, ఎన్నడూ ఎవరూ సామాన్యంగా అడగని ప్రశ్న. భారతదేశ చరిత్ర గురించి రాసిన గ్రంథాల్లో బ్రిటిష్‌ వారితో యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి రాసి ఉండవచ్చు ఇంతవరకూ. ఇటీవల ఎవరెస్ట్‌ మహాపర్వత శిఖరం మీద నడిచిన బచేంద్రీపాల్‌ గురించి ఒక అధ్యాయం ఉండొచ్చును, హిందీ సినిమాల్లో ఆకర్షణీయమైన నటి అయిన ఐశ్వర్యారాయ్‌ గురించి ఉండొచ్చును. అయితే, భారతదేశంలోని ప్రప్రథమ ఉపాధ్యాయురాలి గురించి ప్రస్తావన ఎక్కడా కనిపించదు, ప్రత్యేక అధ్యాయం మాట అటుంచి ఈ కారణం వల్లనే కావచ్చు ఆ విప్లవాత్మకమైన మహిళ గురించి మనకి అంతగా పరిచయం ఏర్పడలేదు. కానీ ఎందువల్ల? మనదేశంలోని ప్రప్రథమ ఉపాధ్యాయిని మనకి అసలు ఏమీ తెలియకపోవడానికి కానీ, ఏ కొద్దిపాటి మాత్రమే తెలియడానికి కానీ కారణం ఏమిటి? ఎందువల్ల? భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో స్కూళ్లలోని పాఠ్యపుస్తకాల్లో ఆమె కనిపించకపోవడం ఎందువల్ల అని ఆశ్చర్యం కలుగుతుంది. పాఠ్యగ్రంథాలను రూపొందించేవారూ, చరిత్ర పరిశోధకులూ చెప్పలేరు- వారికి ఆమె చేసిన కృషి గురించి గాని, ఆమె జీవితం గురించిన విశేషాలు గాని తెలియడానికి వీలుకాలేదని. మరాఠీలోనూ, ఆంగ్లంలోనూ కావల్సినన్ని పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. వాటిలో ఎన్నిటిలోనో ఆమె జీవిత ధ్యేయం గురించిన విశేషాలు వివరంగా ఉన్నాయి.

ఇది కేవలం పాఠ్యపుస్తకాలను రూపొందించే వాళ్ళకీ, చరిత్ర పరిశోధకులకీ మనోభావాల్లో కులం విషయంలోనూ లింగభేదం విషయంలోనూ వివక్ష చోటుచేసుకోవడంవల్లనే అనుకుంటాను. ఇదంతా పురుషాధిపత్య, బ్రాహ్మణ సంప్రదాయ ఆలోచనా విధానం వల్లా, వివక్షలు భారతీయ సమాజంలో లోతుగా చొచ్చుకుని ఉండటంవల్లా ఏర్పడిన భావాలు- మేధావులైన వాళ్ళు హిందూ సమాజంలోని ఉన్నత కులానికి చెందిన వాళ్ళు మాత్రమేననీ, నీచ కులానికీ, దిగువ వర్గాలకీ చెందిన వాళ్ళు ఎన్నటికీ మేధావుల్నీ, అటువంటి అద్భుత వ్యక్తుల్ని సృష్టించ లేరనీ అనుకోవడంవల్లనే. అయినప్పటికీ, భారతదేశంలోని ప్రప్రథమ

ఉపాధ్యాయురాలు నీచకులానికి చెందినది కావడంవల్లనే విద్యాలయాలకు చెందిన పాఠ్యగ్రంథాలలో గుర్తింపులేకుండా ఉండిపోయింది. అంతేకాకుండా, ఆమెని సాధారణంగా జ్యోతి బాపూలే అనే అంటారు- దళిత ఉద్యమంలో కూడా చాలా ఏళ్ళుగా దళిత మేధావులు కూడా పురుషాధిపత్య భావజాలంతో ఉండటం వల్లనే.

జ్యోతిరావ్‌ ఫూలే భార్యగా గుర్తింపు పొంది ఉండటం మాట అటుంచి, ఆధునిక భారతదేశంలోని ప్రప్రథమ ఉపాధ్యాయురాలు అయిన సావిత్రీబాయి ఫూలే స్త్రీ విద్య కోసం, దళితుల విద్యకోసం, స్త్రీల హక్కుల కోసం ఉద్యమించిన మహిళగా, అభ్యుదయ మార్గంలో కవిత్వం రాసిన మహిళగా, కులవివక్షనీ, పురుషాధిపత్యాన్నీ నిరసిస్తూ ధైర్యంగా పోరాడిన ఉద్యమ నాయకురాలిగా తన ప్రత్యేకస్థానం తనకుంది. ఆమె జీవితాన్నీ, పోరాటాన్నీ ఇంకా విశాల దృక్పథంతో అంచనా వేయవలసి ఉంది. దళిత స్త్రీల ఉద్యమం మహిళల హక్కులకు చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఇచ్చి, దళిత ఉద్యమంలో ఆమె వహించిన పాత్రవల్ల ఆమె పేరుని భారతదేశ నిర్మాతలలో పతాకస్థాయిలో ఉంచారు.

సావిత్రీబాయి ఫూలే దళిత సమాజానికి చెందిన ఆడపిల్లలకోసం, స్త్రీలకోసం మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ సమాజంలోని దళితుల అభ్యుదయంకోసం, పురోభివృద్ధికోసం పాటుపడింది. ఆమె భర్త మహాత్మ జ్యోతిరావ్‌ ఫూలే ప్రారంభించిన దళిత ఉద్యమాన్నీ, 19వ శతాబ్దం రెండవభాగంలో గొప్ప సామాజిక కార్యకర్తగా జీవితాంతం వరకూ దళితుల, స్త్రీల అభ్యుదయంకోసం కృషి చేసి తన చుట్టూ ఉన్న సమాజంలోని వారి కోసం పాటుపడింది. జ్యోతిరావ్‌ఫూలే, సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో ప్రప్రథమంగా కులవ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతంగా ప్రారంభించి, దళితులకూ, స్త్రీలకూ వ్యతిరేకంగా విస్తృతంగా భారతీయ సమాజంలో వ్యాపించి ఉన్న బ్రాహ్మణ ఆధిపత్యంతో కూడిన కులసంస్కృతినీ, విలువల్ని ఖండిస్తూ అభ్యుదయ మార్గాన్ని అనుసరించిన మొదటివారు.

జ్యోతిరావ్‌ ఫూలేకి అత్యంత ప్రియమైన స్వప్నం ఏమిటంటే, భారతదేశంలోని స్త్రీలు తమ హక్కుల్ని పూర్తిగా అనుభవించాలన్నది. ఇది విద్యకున్న శక్తి ద్వారానే సాధ్యం అని ఆయన అభిప్రాయం. బడుగు వర్గాలలోని స్త్రీలు పురోభివృద్ధి చెందడానికి విద్య ఒక ముఖ్య సాధనం అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇందుకు మగపిల్లల స్కూళ్లకన్న ఆడపిల్లల స్కూళ్ళు ఎక్కువగా ఉండాలని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నారు. ఈ ఆలోచనని తరవాత డా|| అంబేద్కర్‌ ప్రశంసించారు. సావిత్రీబాయి, జ్యోతీరావ్‌లు స్త్రీలకూ దళితులకూ విద్యా హక్కు ఉండేందుకు ఎంతో కష్టపడి పోరాడవలసి వచ్చింది ఆ రోజుల్లో మహారాష్ట్రలో పీష్వాల పరిపాలన సాగుతున్నప్పుడు. స్త్రీలకు విద్యావకాశం లభించడం విషయంలో మహారాష్ట్రలో అది అంధకార యుగం అని చెప్పడం సమంజసం. ఆ అంధకారయుగంలో సావిత్రీబాయి, జ్యోతిరావ్‌ ఫూలేలు మహారాష్ట్రలో విద్యాజ్యోతిని వెలిగించారు. దళిత స్త్రీల విద్యకోసం చేసిన ఉద్యమంలో సావిత్రీబాయి జ్యోతిరావ్‌ ఫూలేకి మొట్టమొదటి అతి ముఖ్యమైన సహాయకారి.

సావిత్రీబాయి మహారాష్ట్రలోని సతారా జిల్లాకి చెందిన నయ్‌గాంవ్‌లో 1831లో జనవరి 3న జన్మించింది. మహారాష్ట్రలో 1818లో పీష్వా పరిపాలన అంతమయాక, బ్రిటిష్‌ పరిపాలన మొదలైన 13 సంవత్సరాల తరవాత ఆమె జన్మించింది. ఆ రోజుల్లో ఆడపిల్లకి బాల్యంలోనే వివాహం చేయడం మామూలుగా అలవాటు. ఆ అమ్మాయికి చదువుకోవాలని ఉన్నా, సావిత్రీబాయిని తొమ్మిదేళ్ళ వయస్సులో జ్యోతీరావ్‌కిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ సమయంలో జ్యోతీరావ్‌ ఒక మిషనరీ స్కూల్లో చదువుకుంటూ ఉండటం వల్ల సావిత్రీబాయి తన తల్లిదండ్రుల దగ్గరే ఉంది. ఆ రోజుల్లో ఒక మతానికి సంబంధించిన రాజకీయ వర్గం పోరాటం చేస్తున్నా, వారికి వ్యతిరేకంగా క్రైస్తవ మత ప్రచారకులు మన సమాజంలోని అస్పృశ్యులకు విద్యావకాశాలు కల్పించినందుకు వారికి ఋణపడి ఉండాలి. జ్యోతిరావ్‌ దూరాలోచన

ఉన్నవాడు అవడంవల్లా, ప్రతి స్త్రీకీ విద్య లభించాలి అనే విశ్వాసం

ఉన్నవాడు కావటంవల్లా, సావిత్రీబాయి తనతో ఉండటానికి రాగానే ఆమెకి ఇంగ్లీషు, మరాఠీ నేర్పించడం మొదలుపెట్టాడు. ఇరవై ఏళ్ళ వయస్సులో జ్యోతిరావ్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయాడు. ఆ నాటికి సావిత్రి ఇంగ్లీషు, మరాఠీ బాగా నేర్చుకుంది. భర్త చేపట్టిన పనిలో పాలుపంచుకునేనాటికి ఆమె ఇంకా యుక్తవయస్సులోనే ఉంది. ఫూలే దంపతులు ఆడపిల్లల కోసం, ముఖ్యంగా శూద్రులకోసం, శూద్రుల కన్న కింది వర్గాలకు చెందిన ఆడపిల్లలకోసం ఒక పాఠశాలని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే తలిదండ్రులు వారి పిల్లల్ని పంపించడానికి అంతగా బాధపడక్కర్లేదు కదా అని. అయితే, బోధించేందుకు

ఉపాధ్యాయురాళ్ళు లేనే లేరు. 1846-47లో సావిత్రీబాయి, తనతోపాటు అహమద్‌నగర్‌లో చదువుకుని, అధ్యాపక వృత్తిలో శిక్షణ పొందిన సహాధ్యాయిని ఫాతిమాషేక్‌ అనే అమ్మాయి ఇద్దరూ జీవితాంతం కలిసి పని చేశారు.

1848 జనవరి 14 నాడు జ్యోతిరావ్‌ ఆడపిల్లలకోసం ఒక పాఠశాల ప్రారంభించాడు. ఆ పాఠశాలని బుధవార్‌పేటలో భిడే అనే ఆయన ఇంటి వరండాలో ప్రారంభించాడు. పూనాలో భిడే జ్యోతిరావ్‌కి స్నేహితుడు. భారతదేశంలో ఆడపిల్లలకోసం ప్రారంభించిన మొట్టమొదటి పాఠశాల ఇది. ఈ పాఠశాల బాధ్యత సావిత్రీబాయికి అప్పగించబడింది. అందువల్ల ఆమె భారతదేశంలోని ప్రప్రథమ

ఉపాధ్యాయిని అయింది. ఈ పాఠశాలలో మొదట్లో తొమ్మిది మంది విద్యార్థినులు ఉండేవారు. సదాశివ్‌ గోవింద్‌ డే అనే అతను జ్యోతిరావ్‌కి మరో మిత్రుడు అహమద్‌నగర్‌ నుంచి కొన్ని పుస్తకాలు పంపించాడు. ఆ పాఠశాల ఆరు నెలలపాటు నడిచింది. తరవాత మూసివేయాల్సి వచ్చింది. వేరే మరొక భవనంలో చోటు దొరికిన తరవాత, కొన్ని నెలల తరవాత పాఠశాలని పునఃప్రారంభించారు.

జ్యోతిరావ్‌కీ, సావిత్రీబాయికీ, ఇతర మిత్రులకీ పాఠశాలని స్థాపించడం చాలా కష్టమయింది కానీ, సావిత్రిబాయికి ఆ రోజుల్లో ఆ పాఠశాలని నడపడం మరీ కష్టమయింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువు చెప్పించడం పాపం అనుకునేవారు. వారిలో చాలామంది పురుషులు కన్యాపాఠశాల అనేదానికే వ్యతిరేకంగా ఉండేవారు. అందువల్ల ఆ పాఠశాలకి ఉపాధ్యాయుడు దొరకడం చాలా కష్టమయిపోయింది. ఆమె ఒక్కర్తే కష్టపడి నడపవలసి వచ్చింది. అంటే ఆ పురుషాధిపత్య సమాజంలో ఆమెకి ఎన్నో అంతరాయాలు కల్పించేవారు. ఆమెకీ, ఆ పాఠశాలకీ వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు. పొద్దున్నే ఇంటినుండి బయటపడి పాఠశాలకి వెళ్ళడం పెద్ద యజ్ఞం అయేది ఆమెకి. ఆమె ఇంట్లోంచి బయటికి బయలుదేరగానే, సంప్రదాయ వాదులు కొందరు చేరి ఆమె వెంటపడి, ఆమెని బూతులు తిట్టేవారు. వాళ్ళు ఆమె మీదికి చెడిపోయిన కోడిగుడ్లూ, పేడ, టొమాటోలూ, రాళ్ళూ విసిరేవారు. ఆమె తనతోపాటు మరొక చీర పట్టుకెళ్ళేవారు పాఠశాలకి, అక్కడ కట్టుకోవడానికి- ఒకసారి ఆమెపై అత్యాచారం చేయబోయిన ఒకడిని చెంపదెబ్బ కొట్టేవరకూ ఆ యజ్ఞం కొనసాగింది.

సావిత్రీబాయి తన ఉద్యోగం విషయంలో చాలా స్పష్టంగా, పట్టుదలతో ఉండేది. ఆమె ఎదుర్కొన్న మొదటి సవాలు పాఠశాలకి ఆడపిల్లలు వచ్చేటట్లు చూడటం. వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మిఠాయిలు పంచిపెట్టేది. ఆ పిల్లలు పాఠాలు నేర్చుకోవడంలో అలసిపోతున్నారని గ్రహించి, వాళ్ళకి ఆటల సమయం ఏర్పాటు చేసింది. చదువు నేర్చుకోవడం ఆసక్తికరంగానూ, ఆనందదాయకంగానూ అనిపించడానికి కథానికల క్లాసు ఏర్పాటుచేసింది. అవి ఆడపిల్లలకి చాలా ఆసక్తి కలిగించాయి. ఎందుకంటే, అవి ఆడవాళ్ళ జీవితాలకి సంబంధించినవీ, వాటినుంచి నేర్చుకుని, స్వేచ్ఛగా ఉండాలనే కోరికతో ఉండటంవల్ల. ఆమె కూడా కొన్ని కవితల్ని రాసి వాటిని వారికి చదివి వినిపించేది. ఆమె బోధించే పద్ధతి సరళంగానూ, స్పందింపజేసే విధంగానూ, వాళ్ళు కూడా పాల్గొనే విధంగానూ ఉండేది. ఒక విధంగా ఈ పద్ధతులు ఆమె సృష్టించినవే. వాటినే ఇప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులు అనీ, శిక్షణ పొందేవారికి అనుకూలమైన పద్ధతులు అనీ అంటున్నారు. ఆడపిల్లలు పూర్తిగా అభివృద్ధి చెందడంపైన కూడా ఆమె దృష్టిని కేంద్రీకరించారు. ఆమె ఉద్దేశంలో విద్యాభ్యాసం అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, మనసులకి స్ఫూర్తి కలిగించి, స్త్రీలూ దళితులూ వ్యక్తిత్వవికాసం పొందే సాధనంగా పరిగణించింది ఆమె. సావిత్రీబాయి ఆడపిల్లలకి విద్యాబోధన చేసినదాని ప్రభావాన్ని ముక్తాబాయి అనే పదకొండేళ్ళ దళిత బాలిక రాసిన వ్యాసాన్ని బట్టి తెలుస్తుంది. మంగలూ, మహర్లూ అనే రెండు దళిత తెగల బాధల గురించి రాసిన వ్యాసం అది. ”ఓ మహర్లూ, మంగలూ, మీరు పేదవారూ, రోగిష్టివారూ. విద్య అనే వైద్యమే మీకు నయం చేస్తుంది. వెర్రి నమ్మకాలనుంచీ, మూఢవిశ్వాసాలనుంచీ మిమ్మల్ని దూరంగా

ఉంచుతుంది. మీరు నిజాయితీగానూ నీతిగానూ ఉంటారు. మిమ్మల్ని దోపిడీకి దూరం చేస్తుంది. మిమ్మల్ని జంతువుల్లా చూసేవాళ్ళు ఇంకా అలా ప్రవర్తించడానికి సాహసించరు. అందుచేత దయచేసి కష్టపడి పనిచెయ్యండి, చదువుకోండి” అని రాసింది ఆ అమ్మాయి.

సావిత్రీబాయి తన విద్యార్థినులపట్ల దయగానూ జాగ్రత్తగానూ ఉండేది. ఆమె విద్యార్థినులకూ, వారి తల్లిదండ్రులకూ ఎన్నో విధాల ఏ అవసరం వచ్చినా సహాయం చేసేది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పాఠశాలలకు ఆత్రంగా వెళ్తూ ఉంటారు తమ పిల్లల గురించి కనుక్కోవడానికి. కానీ సావిత్రీబాయి తల్లిదండ్రుల ఇళ్ళకే వెళ్ళి పాఠశాలలో పిల్లలు ఎలా చదువుకుంటున్నారో తెలియజెబుతూ ఉండేది. ఏ పిల్లయినా పాఠశాలకి రాకపోతే ఆ పిల్ల ఇంటికి వెళ్ళి కనుక్కునేది. ఏ పిల్లకయినా అనారోగ్యంగా ఉంటే, డాక్టరు వెళ్ళి చూసేటట్లూ, మందులు ఇచ్చేటట్లూ ఏర్పాటు చేసేది. ఆ ప్రాంతంలో ఆమె ఎంతో పేరు, గౌరవం పొందింది త్వరలోనే. క్రమంగా అక్కడివాళ్ళు తమంతట తామే తమ పిల్లల్ని పాఠశాలకి పంపించడం మొదలుపెట్టారు. సంవత్సరం పూర్తి అయేసరికి ఇరవైఅయిదుమంది విద్యార్థినులయారు. వారిలో పదిమంది బ్రాహ్మలు, ఆరుగురు మరాఠీలు, ఇద్దరు చమార్లు, ఇద్దరు మహర్లు, ఒక మాతంగ, ఒక గదారియ, ఒక జులాహ, ఒక సావి, ఒక మాలి కులాలకు చెందిన వాళ్లున్నారు. 1849-1850 ప్రాంతంలో ఆడపిల్లల సంఖ్య ఇరవైఅయిదు నుంచి డెబ్భైకి పెరిగింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద సంఖ్య.

ఆ స్కూలు తరవాత, సావిత్రీబాయి, జ్యోతిరావ్‌, వారి మిత్రుడూ కలిసి పూనే పట్టణంలోనూ, చుట్టుపక్కలున్న పల్లెటూళ్ళలోనూ ఇంకా ఎన్నో పాఠశాలల్ని తెరిచారు. ఈ పాఠశాలల గురించి ఇంకా సమాచారం పూనె ప్రభుత్వ సమాచార గ్రంథంలో లభిస్తుంది. 1852 మే 1వ తేదీన జ్యోతిరావ్‌ అస్పృశ్యులైన వారి ఆడపిల్లలకు పాఠశాల ప్రారంభించాడు. ఆ రోజుల్లో అస్పృశ్యులకు విద్య లభించే సంప్రదాయమే ఉండేది కాదు. నిజానికి అస్పృశ్యులకోసం పాఠశాలలే ఉండేవి కావు. బ్రాహ్మణులు వాళ్ళకి విద్య నేర్చుకునే హక్కు ఇచ్చేవారు కాదు. అంతేకాక, బ్రాహ్మణులు శతాబ్దాల తరబడి వారికి నేర్పిపెట్టారు వాళ్ళు విద్య నేర్చుకోవడం పాపం అనీ, వాళ్ళ పిల్లల్ని పాఠశాలలకి పంపిస్తే బ్రాహ్మణులవల్ల మరిన్ని ఘోరాలు సంభవిస్తాయనీనూ. అందువల్ల

వాళ్ళు విద్యపట్ల అనాసక్తి, నిర్లక్ష్యం ఏర్పరచుకున్నారు. వాళ్ళ పిల్లల్ని పాఠశాలకు రప్పించడానికి సావిత్రీబాయి చాలా కష్టపడవలసి వచ్చింది. అస్పృశ్య బాలికల కోసం భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి పాఠశాల అయింది అది. ఈ గ్రంథంలో మహాత్మా ఫూలే ఆనీసంశోధన్‌ (Phule and Social Reforms), డా|| మంగూల్‌కర్‌ ఇలా రాశారు: ”భారతదేశ చరిత్రలో అస్పృశ్యులను ఉద్ధరించడానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నం అది.” 1852 మే 29 సంచికలో ‘పూనే పరిశీలన’ (పూనే అబ్జర్వ్‌) అనే పత్రిక ఈ పాఠశాలను గుర్తించింది. అందులో ఇలా రాసింది:

”మాలీ కులానికి చెందిన ఒక వ్యక్తి తన సొంత ఖర్చులతో అస్పృశ్యుల కోసం ఒక పాఠశాలని ప్రారంభించాడు. భారతీయ సామాజిక సంస్కర్తలకు ఇదొక పెద్ద వార్త. వేటల పేటలో స్థాపించిన ఈ పాఠశాలలో మహర్‌, మాంగ్‌, పఖారీ కులాలకు చెందిన పిల్లలకు ఈ పాఠశాలలో చదువు నేర్పించేవారు.”

ఉపాధ్యాయుల పని కేవలం పాఠశాలలో పిల్లలకు మాత్రమే పరిమితం కాదు, మొత్తం సమాజానికి తమ సేవని వర్తింపజేయాలి అనుకోవాలి. సావిత్రీబాయి ఫూలే ప్రధానంగా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ, తన కర్తవ్యాన్ని విద్యాబోధనకి మాత్రమే పరిమితం చేసుకోలేదు. తన కర్తవ్యాన్ని మరింత విస్తృతమైన, విశాలమైన అర్థంలో తీసుకుంది. ఈ విధంగా సావిత్రీబాయి మంచి ఉపాధ్యాయురాలే కాక, గొప్ప సామాజిక కార్యకర్త కూడా. ఆ రోజుల్లో భారతదేశం అంతటా అస్పృశ్యత ఒక క్రూరమైన ఆచారంగా పాటించబడేది. కానీ పూనేలో మరింత తీవ్రంగా ఉండేది భారతదేశంలోని ఏ ఇతర పట్టణంలో కన్నా. ఉన్నత కులాల వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఉన్న బావుల్లో నుంచి నీళ్ళు తీసుకోవడానికి అస్పృశ్యుల్ని రానిచ్చేవారు కాదు. ఉన్నత కులాల స్త్రీలను బతిమాలుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది అస్పృశ్య మహిళలు. ఇది చూసి, ఆ స్త్రీలందరినీ సావిత్రీబాయి తన సొంత బావిలోంచి తీసుకోమని ఆహ్వానించింది. ”మీరు తీసుకోగలిగినంత నీరు తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ బావి మీదే. మీరు ఏ సమయం లో అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా నీళ్ళు తీసుకోవచ్చు” అని చెప్పింది.

స్త్రీలలో ఈ కుల వివక్ష నెలకొని ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన మీదట, స్త్రీల సమావేశాల్నీ, ”నువ్వులు-బెల్లం” పండుగల్నీ ఏర్పరచడం ప్రారంభించింది. ఈ సమావేశాల్లోనూ, పండగ ఉత్సవాల్లోనూ ఏ రకం స్త్రీలయినా పాలు పంచుకోవచ్చు. ఆ విధంగా అన్ని రకాల కులాల స్త్రీలూ ఒకచోట కలుసుకుని తమ అభిప్రాయాన్ని పరస్పరం పంచుకుని తమ సమస్యల్ని చర్చించుకునే అవకాశం కల్పించిందామె. స్త్రీలందరినీ ఒక చోటకి చేర్చి వారి సమస్యల గురించి చర్చించుకునే ప్రయత్నం చేయడం ఇదే మొట్టమొదటిసారి. తరవాత సావిత్రీబాయి గ్రహించింది, స్త్రీలందరూ ఒకచోట చేరినంత మాత్రాన సరిపోదని. స్త్రీల పరిస్థితి, దుస్థితీ పురుషాధిపత్యపు విలువలకల్లా, మనుషులనమ్మకాలవల్లా ఏర్పడినవేనన్న నిర్ణయానికి వచ్చింది. ఈ స్త్రీలను సంఘటిత పరిచి, స్త్రీలు సమాజంలో తమపై జరిగే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి అందరూ కలిసిగట్టుగా ఉండి పోరాటం చెయ్యడానికి శక్తివంతం కావాలని గ్రహించేటట్లు చెయ్యాలనుకుంది. ఆమె చేసిన కృషి ఫలితంగానే 1852లో పూనేలో మహిళామండలి ఏర్పడటం జరిగింది. ఆ రోజుల్లో అది చాలా కష్టమైన పని. ఈ మహిళామండలి స్త్రీల సాధికారతకోసం, స్వేచ్ఛకోసం కృషి చేయడం ప్రారంభించింది. ఈ మహిళామండలి నాయకురాలుగా, సావిత్రి అనేక విధాలుగా పితృస్వామ్య వ్యవస్థనీ, బ్రాహ్మణ ఆధిపత్యాన్నీ ఖండిస్తూ, అనేక సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించేది.

ఆ రోజుల్లో స్త్రీలు ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ అణచివేతకి గురి అయేవారు. స్త్రీల పట్ల, ముఖ్యంగా దళిత స్త్రీలపట్ల క్రూరంగా

ఉండే పితృస్వామ్య, బ్రాహ్మణ సంప్రదాయాలూ, ఆచారాలూ, కర్మకాండలూ ఎన్నో ఉండేవి. వరకట్న సమస్యని పరిష్కరించడానికి సామూహిక వివాహాల్ని సులభంగా జరిపించడానికి ఏర్పాటు చేయడం మొదలు పెట్టగానే అన్ని వైపుల నుంచీ వ్యతిరేకతని ఎదుర్కోవలసవచ్చింది. కానీ ఆమె వదిలిపెట్టలేదు. స్త్రీ ఏ వయస్సులో ఉన్నప్పటికీ, విధవరాలైతే తల తప్పనిసరిగా గొరిగించుకోవలసి వచ్చేది ఆమె విధవరాలని గుర్తించడానికి వీలుగా. ఆ స్త్రీల పరిస్థితి చూసి సావిత్రీబాయి జాలిపడేది. ఈ విషయమై, మంగలివాళ్ళని కలుసుకుని, ఆ స్త్రీల తలలు గొరగవద్దని పదే పదే వేడుకుంది. ఎన్నోసార్లు వేడుకున్న తరవాత, ఆమె జ్యోతీరావ్‌తోనూ, ఇతర స్నేహితులతోనూ కలసి మంగలి వాళ్ళు నిరాకరణ దీక్ష చేపట్టేటట్లు చేశారు. అది అటువంటి నిరాకరణ దీక్షకి పూనుకోవడం మొదటిసారి. మంగలివాళ్ళు పూనుకున్న ఆ పని గురించి ఉన్నత కులాల వాళ్ళందరూ సావిత్రీబాయి పట్ల మండిపడ్డారు.

ఆ రోజుల్లో పూనేలోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎంతోమంది వితంతువులు ఉండేవారు. యుక్తవయస్సులో ఉన్న ఆడపిల్లలూ, చిన్న బాలికలూ ఆ వితంతువులలో ఎక్కువ మంది

ఉండేవారు. అటువంటి వారు సమాజంలోని పురుషులు చేసే లైంగిక దౌర్జన్యానికీ దోపిడీకీ సులభంగా గురి అయేవారు. వాళ్ళు చెయ్యనిదానికి, వాళ్ళు బాధ్యులు  కానిదానికి వాళ్ళు బాధలకి గురి అయేవారు. గర్భం రాకుండా చేసుకునే మార్గాలూ, అవకాశాలూ లేక గర్భవతులయేవారు తరచుగా. గర్భవిచ్ఛిత్తి కోసం అనారోగ్యకరమైన మార్గాలు అవలంబించడంవల్ల ప్రాణాలు కోల్పోయేవారు కొందరు. చాలాసార్లు ఇల్లు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చేది. 1853 జనవరి 28 నాడు సావిత్రీబాయి ”బాలహత్య నివారణ గృహం” అనే స్త్రీల ప్రసూతి గృహాన్ని ప్రారంభించింది. ఈ ప్రసూతి గృహంలో వాళ్ళు పిల్లల్ని కన్న తరవాత అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. 1873 వరకూ అరవైమంది స్త్రీలు అక్కడ బిడ్డలకు జన్మనిచ్చారు. ఇది సావిత్రీబాయి ఆ గృహంలో చేసిన చరిత్రాత్మక ఘనకార్యం. తరవాత ఈ ప్రసూతి గృహం పెద్ద ఆసుపత్రిగా రూపొందింది. సావిత్రీబాయి కేవలం వితంతువులకు ఈ విధమైన సేవచేయడంతో ఆగిపోలేదు, ఇంకా ముందుకుసాగి ఎంతో చేశారు. ఈ గృహంలో పుట్టిన శిశువుని పెంచుకుని, తద్వారా సమాజంలోని ఇతర అభ్యుదయవాదులకు మార్గాన్ని సూచించారు. ఆమె పెంచుకున్న శిశువు పేరు యశ్వంతరావు. అతను తరవాత వైద్యుడు అయ్యాడు.

సావిత్రీబాయి ఆధునిక మరాఠీ భాషలో స్ఫూర్తిదాయకమైన ప్రగాఢ సందేశాత్మకమైన కవిత్వం రాసేదని చాలామందికి తెలియదు. ఆమె రాసిన కవిత్వం, జ్యోతీరావ్‌కి రాసిన లేఖలూ ఆమెకున్న సున్నితమైన, విప్లవాత్మకమైన మనస్సుని వెల్లడిస్తాయి. సావిత్రీబాయి ”కవితా పుష్పాలు” (కావ్య ఫూలే) అనే గ్రంథాన్ని 1854లో ప్రచురించింది. అది ఆమె సాహిత్యంలో సాధించిన ఘనత. ఆమె ఆలోచనా ధోరణికీ, పోరాటానికీ ప్రతిరూపమైన ఈ గ్రంథం మార్గదర్శకంగా నిలిచే గొప్ప చారిత్రాత్మక సాక్ష్యం. ఈ సంకలనంలో వివిధ విషయాలకు- విద్య, ప్రకృతి, ముఖ్యంగా కులవ్యవస్థకి- సంబంధించిన కవితల్లో కవయిత్రిగా ఆమె సృజనాత్మకత, విప్లవాత్మకత మరింత ప్రస్ఫుటమవుతాయి. సావిత్రీబాయి 1893లో మరొక కవితా సంకలనాన్ని కూడా వెలువరించింది. దాని పేరు ‘బవన్‌కషి సుబోధ్‌ రత్నాకర్‌’ (వజ్రాల సముద్రం). ఈ సంకలనం ఫూలే జీవిత చరిత్ర అని చెప్పవచ్చు. ఇది ఆనాటి బ్రాహ్మణ దురాచారాలను విమర్శించిన ఫూలేని బలపరిచేదిగా ఉంది. అప్పు, ‘కర్జ్‌’ గురించి సావిత్రీబాయి రాసిన వ్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పండుగలు చేసుకోవడానికి అప్పు తీసుకునే అలవాటుని ఆమె నిరసించేది- అప్పు తీసుకున్న వాళ్ళు అప్పులబోనులో చిక్కుకు పోతారని.

తన భర్త విప్లవాత్మక ధోరణిని సావిత్రీబాయి ఎంతవరకు పుణికి పుచ్చుకున్నారో సామాజిక పరివర్తన సాధించడంలో తన స్వీయ పద్ధతి ఏమిటో ఆమె జ్యోతీరావ్‌కి దూరంగా ఉన్నప్పుడు రాసిన మూడు ఉత్తరాల్లో ప్రస్ఫుటమవుతుంది. సావిత్రీబాయికి భర్తపై ఉన్న ప్రేమ, తామిద్దరూ కలిసి సమాజంలోని బడుగు వర్గాలవారికి విద్య ద్వారా పురోభివృద్ధి సాధించేటట్లు చెయ్యాలనుకున్న విస్త ృత ధ్యేయంతో ముడిపడే ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ”ఇక్కడ పూనేలో మామధ్య విభేదాలు కల్పించి జనం మనోభావాలను కలుషితం చెయ్యడానికి ప్రయత్నించే మూర్ఖులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళకి భయపడి మేము చేపట్టిన పవిత్ర కార్యాన్ని ఎందుకు మానుకోవాలి? మా పనిలో మేము ఉండటం నయం. అన్ని ఆటంకాలనూ దాటి, మేము విజయం సాధిస్తాం. భవిష్యత్తు మాది అవుతుంది.” అనేది ఆమె.

మహారాష్ట్రలో 1875-77 ప్రాంతంలో పెద్ద కరువు ఏర్పడింది. ఆకలి, దాహాలతో జనం మరణించేవారు. ఆ కరువుకి గురైన వారికి సేవ చేయడానికి సావిత్రీబాయి శాయశక్తులా ప్రయత్నించింది. సావిత్రీబాయి నాయకత్వంలో సత్యశోధక్‌ సేవాదళం సభ్యులు కరువు బాధితులకు సహాయం చేశారు. పశ్చిమ మహారాష్ట్రలో 52 అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు.

మహాత్మఫూలే ఆకస్మిక మరణం అరవై మూడు సంవత్సరాల వయస్సులో 1890లో జరగడంతో సావిత్రీబాయికి ఎదురుచూడని ఘాతుకం అయింది. ఆమె ఒంటరిదైపోయింది. అయినా, తన పోరాటాన్ని మానుకోలేదు. మహారాష్ట్రలో 1896లో మరో కరువు ఏర్పడినప్పుడు ఆమె మరింత తీవ్రంగా కృషి చేసింది సేవ చేయడంలో. వారికి సహాయం చేసే కేంద్రాలను ఏర్పరచవలసిందని బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కరువు అయింతరవాత, 1897లో పూనేలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలింది. ప్లేగ్‌ బాధితుల్ని జంతువుల్ని చూసినట్లు చూసేది బ్రిటిష్‌ ప్రభుత్వం. దీన్ని సావిత్రీబాయి సహించలేకపోయింది. విధి ప్రదర్శించిన క్రూరత్వంలో చిత్రం అన్నట్లు ఒక ప్లేగు బాధిత బాలికకి సేవచేస్తూ ఆమె కూడా ఆ వ్యాధికి గురి అయి, 1897లో మరణించింది.

సావిత్రీబాయి చేసిన పోరాటం మహారాష్ట్రలోని

ఉద్యమకారులకు శక్తినీ, స్ఫూర్తినీ అందించింది. లింగవివక్ష లేకుండా చేయడంలో డా|| ఆనందీబాయి గోపాల్‌ జోషి, పండిత రమాబాయి, తారాబాయి షిండే, ఇంకా ఎంతోమంది ఆమెచేసిన కృషి వల్ల స్ఫూర్తి పొందారు. మహారాష్ట్రలో ఆవరించిన అంధకార యుగంలో సావిత్రీబాయి విప్లవాత్మక పాత్ర వహించి, జాతి మొత్తానికి అమూల్యమైన సందేశాన్నిచ్చింది- దళిత వర్గానికి చెందిన స్త్రీలు ఎంత తెలివినీ, ధైర్యాన్నీ ప్రదర్శించగలరో తెలుపుతూ. ఆమె ప్రప్రథమ ఉపాధ్యాయురాలే కాదు, మొత్తం భారతదేశంలోనే ప్రథమ స్త్రీ ఉద్యమకారిణి. ఆమె కవితలూ, ఇతర రచనలూ ఇప్పటికీ మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. 1998 మార్చి నెలలో భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం ఒక తపాలాబిళ్ళని విడుదల చేసింది. భారతీయ సమాజం కోసం ఆమె నిర్వహించిన పాత్రని దృష్టిలో పెట్టుకుని ఆమె గౌరవార్థం మార్చి 10వ తేదీని భారతీయ మహిళా దినంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ దళిత స్త్రీల సమాఖ్య పండుగ జరుపుతోంది.

(Courtesy: http://mukeshmanas.blogspot.in)

Savitribai Phule: First Woman Teacher of India, Published in SACH, February-April, 2015. Email: notowar.isd@gmail.com

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో