మోడువారిన పాలనలో బీట్లవారిన నేల – డా|| కత్తి పద్మారావు

మబ్బులు కమ్మినట్లు కమ్మి

ఆవిరవుతున్నాయి.

అల్పపీడనం ఏర్పడినట్లు ఏర్పడి

తేలిపోతున్నాయి

సముద్రగర్భంలో

గుంపులు గుంపులుగా చేపలు

పచ్చిక బయళ్ళలో

తెల్లని వెన్నెల్లా వాలిన

పక్షి సమూహాల దృశ్య కావ్యం

సముద్రం మబ్బుల తెరను తాకుతుంది

సూర్యుడు చిన్నబంతిలా

కడలి మీద చిందులు

ఎండ్రకాయలు సముద్రపు ఒడ్డున

చిన్ని చిన్ని రంధ్రాల్లో జొరబడుతున్నాయి

ఏ కంత నుండి వెళ్తున్నాయో

ఏ కంత నుండి వస్తున్నాయో

అంతుబట్టడం లేదు

ఆ చిత్రకారుడు

ఆ పటాన్ని రంగులతో దిద్ది దిద్ది

మార్కెట్టులో వేలం వేస్తున్నాడు

దోసిట్లో రూపాయల వర్షం కురిసినా

ఆ రంగుల చిత్రం వెళ్ళేటప్పుడు

రెండు కన్నీటి చుక్కలు రాలుతున్నాయి

ఆ పడతి తన కొడుకును కూడా

అపురూపంగా పెంచుకొంది

రూపంలో శిల్ప ప్రమాణాలు తెచ్చింది

ఎవరో వ్యాపారులు తమ అంగడిలోకి బేరమాడారు!

తన ఉత్పత్తి శక్తిని అమ్ముకొంది

వస్తువులు, రూపాలు, మనుష్యులు

అన్ని అంగడి వస్తువులు

ఒక్క చేత్తో తీసుకొన్న రూకలతో

వందల చేతులు కడిగిస్తున్నారు

పాలకుడు పరవశంలో వున్నాడు

నదుల ఆనకట్టల పేరుతో

ప్రవాహాలుగా కాసుల అలలు

రాజ్యం అంటే ఇంత ధన ఉప్పెనయితే

దోచుకోవడంలో ఇంత ఆనందంవుంటే

ఇక వర్షాలెందుకు? వెన్నెలెందుకు.

అన్ని సరిహద్దుల్లో కవాతులు పెరిగాయి

సరుకులమ్మేవాడికి పెద్దలాభాల్లేవు

ఆయుధాలమ్మేవాడు కుబేరుడవుతున్నాడు

నల్లమందు వ్యాపారాలకు

సువర్ణం బిళ్ళల గుహలు

నేరాన్ని దృశ్యంగా తీస్తే జనం ఎగబడుతున్నారు

తండ్రులు, కొడుకులు, మనవళ్ళకు

ఒకే తార నాయిక

వాళ్ళు దేనికి సిగ్గుపడరు

వాళ్ళ ధనవ్యామోహం

వారిలోని మనుష్యులను వధించింది

వాళ్ళు తెల్లని నవ్వుతో తిరుగుతున్నారు

వాడు నిస్సిగ్గుగా అక్షరాల నమ్ముకొంటున్నాడు

మేధావులుగా చెప్పుకొనేవాళ్ళు

ఒక్కొక్క వ్యాపారి దగ్గర

భజంత్రిలుగా చేరారు.

రోజు అక్షరాలకు అబద్ధపు రంగులేసి

వికృతమైన అతని రూపాన్ని దిద్దిదిద్ది

అచ్చు వేస్తున్నారు.

కోట్ల రూపాయలతో

బొమ్మలు ముద్రించుకొన్న వారిపుడేరి

మనస్సనే అద్దంలోకి రంగుల బొమ్మెందుకు

ఒక్క మంచిమాట చెప్పినందుకు

తధాగతుణ్ణి ప్రపంచ దేశాలు

మోసుకెళ్ళ లేదా?

చెప్పింది చేసిన వాళ్ళందరి

చిత్రాలు ప్రజల గుండెల్లో లేవా!

వాడెందుకు ఎప్పుడూ ఏడుస్తాడు

ఒక్క చుక్క కన్నీరు వాడిచెంపలమీద రాలలేదు

ఆ ట్రాక్టర్ల, ఆటోల మీద

మైళ్ళు మైళ్ళు వెళ్ళి నాట్లేసి వస్తున్న వారి చిరునవ్వు

పరుగులమీద నడక

ఆత్మవిశ్వాసం

జీవన దృశ్యాలుగా వున్నాయి

పాలించే వాడికంటే,

పాలితునికే ఆత్మవిశ్వాసం ఎక్కువ

మానవ సంస్క ృతీ వికాసనం

విశ్వాసంలోనే వుంది.

ఏది జీవితం?

తప్పక అది వైవిధ్యభరితమే

విశ్వాసంలేని జీవితం ఒక్కటే

నిస్తేజం అవుతోంది.

నాటుకెళ్ళివస్తూ వారేమనుకొంటున్నారు

పాలకుని కళ్ళల్లో నీళ్ళులేవు

మబ్బుల్లోనూ నీళ్ళులేవు

రాతిగుండెల పాలనలో జలస్రవంతి ఎక్కడిది?

అందుకే!

నీతిగలవారిని ఎన్నుకోండి!

సంపద అందర్దీ అవుతోంది

సమసమాజ స్థాపనా పతాక ఎగురుతోంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో