పాటలు

పనికి తోడు పాట

సాకీ :  ఆది మానవుడు ఆహారంకై అరచిన అరుపే తొలిపాట

పరిణామ క్రమ పరిశ్రమలో సాగిన జీవన స్వరాల పాట

పల్లవి : పనికి తోడు పాట – ఆ పాటకు సైదోడుపని

పనిపాట లిద్దరు – కవల పిల్లలు

ప్రజల పాట కెన్నడు లేవులే ఎల్లలు, పనికి తోడు పాట, ఆ…

చరణం :

1. నాగలి నక్కు కొడవలి గొడ్డలి

కమ్మరి కొలిమిని కాలే వేళ   ||2||

సమ్మెట పట్టిన రైతు సోదరులు

పక్కటెముకలు పట పట లాడగ

దమ్ము కాచుకొని హుమ్మని వేసిన ఊపిరి దరువే పాట

||పనికితోడు||

2. ప్రజలకు పిడికెడు మెతకులు పెట్టగా

దుక్కులు దున్ని నొల్లలు రాసిన

ఊడుపుల మడిలో వంగిన వనితలు

అలుపు తీర్చుకొని గొంతులు కలసి

బృందంగానమె చేసిన వుళవుళ సవ్వడి సందడె పాట

||పనికితోడు||

3. సారే కావుళ్ళు పెళ్ళి పల్లకిలు

భూజాలు కాయలు కాయగమోసి  ||2||

మాసిన బట్టలు మూటలు తెచ్చి

చాకిరేవులో ఉతికి ఉతికి

అలసట ఇస్సో ఇస్సని చాకలి ఆకలి శ్వాసే పాటు

||పనికితోడు||

4. రోట్లో బియ్యం దంచి దంచి

చేట్లో బియ్యం చెరిగి చెరిగి   ||2||

ఆకలి తీర్చే అతివలు అమ్మలు

అలసిన కండ పులిసిన దండలు

అహూ అహూ అంటూ వేసే నిట్టూర్పేగా పాట

||పనికితోడు||

5. గనిలో ఖనిలో కార్ఖానాల్లో

పంటపొలాల్లో సముద్రాలలో   ||2||

ఏర్లు అడవులు ఎడారుల్లో

యుగయుగాలుగా జీవిక కోసం

గమించు దారుల శ్రమించు శక్తుల స్వేద నాదమే పాట

||పనికితోడు||

6. మట్టి మనుషుల మెతుకే పాట

బక్క ప్రాణుల బ్రతుకే పాట   ||2||

చెమట చుక్కల సవ్వడి పాట

శ్రామిక శక్తుల శకటం పాట

సమసమాజ నిర్మాణం కోసం జరిగే పోరే పాట

||పనికితోడు||

(మహిళా సమత సొసైటీ – సమత పాటలు పుస్తకం నుండి….)

 

కోడికూత కూయగానే

కోడి కూత హైలెస్సా – కుయ్యంగానే హైలెస్సా

సద్దిమూట హైలెస్సా – సంకన బెట్టి హైలెస్సా

పార తట్ట హైలెస్సా – నెత్తిన బెట్టి హైలెస్సా

బుర్రు గర్రు హైలెస్సా – బస్సులు ఎక్కి హైలెస్సా

కాయకష్టం చేసేటోళ్ళు హైలెస్సో ఓ …. ఓ… ఓ….

ఊరిదారి దాటుతున్నారు హైలెస్సా

రెలా… రెలా… రెలా… రెలా… రెలారే  ||2|| కోడి||

1. ఉండరా ఉండు హైలెస్సా – ఒక్కటిగా వుండు హైలెస్సా

తిప్పర తిప్పు హైలెస్సా – చక్రం తిప్పు హైలెస్సా

అరె దించర దించు హైలెస్సా – బరువులు దించు హైలెస్సా

పట్టర పట్టు హైలెస్సా – మట్టిని పట్టు హైలెస్సా

తిప్పర తిప్పు జీవిత చక్రం హైలెస్సో ఓ… ఓ… ఓ…

తిప్పకపోతే తిరిగీరాదు హైలెస్సా

రెలా… రెలా… రెలా… రెలా… రెలారే… ||2|| కోడి||

2. చెయరా చేయు హైలెస్సా – పనులను చేయు హైలెస్సా

చేసిన కష్టము హైలెస్సా – చెదిరిపోదు హైలెస్సా

ఇచ్చిన కూలి హైలెస్సా – సరుకులు కొనుక్కొని హైలెస్సా

బుర్రకు పట్టిన హైలెస్సా – ధూళిని దులిపి హైలెస్సా

పొద్దు వాలి పోతుందని హైలెస్సో ఓ… ఓ… ఓ….

పొయ్యి రాజబెట్టాలని హైలెస్సా

రెలా …. రెలా… రెలా… రెలారే …  ||2|| కోడి|7

3. తొక్కర తొక్కు హైలెస్సా – సైకిల్‌ తొక్కు హైలెస్సా

జల్లర జల్లు హైలెస్సా – వడ్లను జల్లు హైలెస్సా

వేయిరా వేయు హైలెస్సా – గెత్తము వేయు హైలెస్సా

వదలరా వదులు హైలెస్సా – నీటిని వదులు హైలెస్సా

వదలపోతే పంటరాదు హైలెస్సో ఓ… ఓ… ఓ…

పంటలతోనే బ్రతుకులు పండునూ హైలెస్సా

రెలా… రెలా… రెలా… రెలా… రెలారే… ||2|| కోడి||

4. నమ్మర నమ్ము హైలెస్సా – భూమిని నమ్ము హైలెస్సా

దున్నరా దున్ను హైలెస్సా – భూమిని దున్ను హైలెస్సా

పట్టరా పట్టు హైలెస్సా – నాగలిపట్టు హైలెస్సా

పట్టరా పట్టు నాగలిపట్టు హైలెస్సో … ఓ… ఓ… ఓ…

పట్టకుపోతే పంటా రాదు హైలెస్సా

రెలా… రెలా… రెలా…. రెలా…. రెలారే…. ||2|| కోడి||

 

 

3.  చందమామా

వెన్న కన్న మెత్తని వాడు రైతు

పల్లవి : దుక్కిదున్నినాడమ్మ చందమామ రైతు

మొక్క నాటి నాడామ్మ చందమామా

 

1. మండుటెండలో మలల మాడూతు తిండికి దొరకని రైతు బిడ్డలు

భార్య పిల్లలను వెంట బెట్టుకుని ఆ… ఆ… ఆ…   ||2||

కలుపు మొక్కలను చక్కగా తీసి

కష్టించి పైరును పెంచే చందమామా – రైతు

పండించి ప్రజలకు పంచే చందమామ

ఆ… ఆ… ఆ… ఓ… ఓ… ఓ…  ||దుక్కిదున్ని||

 

2. పురుగుల మందును పంపులో పోసి అడ్డంపడిన చెత్తను ఊది

చిమ్మిన గ్యాసుకు సొమ్మసిల్లన ఆ.. ఆ… ఆ..  ||2||

పంట చేనుకోక కంటికి రెప్పయి

భూస్వాముల సాకిరి చేసే చందమామ రైతు

సావుకారి బాకిని తీర్చే చందమామ

ఆ… ఆ… ఆ… ఓ… ఓ… ఓ…  ||దుక్కిదున్ని||

 

3. అన్నదాత వ్యవసాయ కార్మికులు అప్పులతో బల్‌ సతమతమైతూ

చినిగిన బట్టలు చింపిరి జుట్టుతో ఆ.. ఆ… ఆ..  ||2||

ఈదరించుకొని బీటికి పోయి

మేలురకములు అమ్ముతడమ్మ చందమామ రైతు

తాలురకములు తింటాడమ్మ చందమామ

ఆ… ఆ… ఆ… ఓ… ఓ… ఓ..  ||దుక్కిదున్ని||

 

4. చక్రవడ్డితో లెక్కలు కట్టి చెల్లించాలని సేటులు అడిగితే

అట్లాగే అని తల ఆడించి ఆ… ఆ… ఆ…  ||2||

ఆరు నెలల గడువిమ్మని కోరే

వెన్న కన్న మెత్తని వాడే చందమామ రైతు

నీకన్నా చల్లని వాడే చందమామ  || దుక్కిదున్ని||

ఆ… ఆ… ఆ… ఓ… ఓ… ఓ…

(మహిళా సమత సొసైటీ – సమత పాటలు పుస్తకం నుండి….)

Share
This entry was posted in పాటలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.