తెరతీయగ రాదా

సువార్తమ్మ

మావోళ్ళే
మాలో వాళ్ళేనని నమ్మాం
అంబేడ్కర్‌ బొమ్మ పెట్టుకున్నారు కదా…


దోపిడీ చెయ్యర్లే అనుకున్నం
కలిసి పోరాడుదాం అన్నపుడల్లా
కలిసి పంచుకుందాం అంటున్నారని బెమపడ్డాం
కాడెద్దులై ఎట్టి పనిలో నలిగినోళ్ళం
ఒకరికొకరు ఓదార్పు అయినోళ్ళం
దొరతనం ముందు మీరూ మేమూ ఒక్కటే అనుకున్నాం
ఒక మెట్టు పైకెక్కి మాపైనే కాళ్ళెత్తినారు
మా లోగుట్టు ఎరిగి మా మల్లల్ని పగలగొట్టినారు
మా బువ్వ గుంజుకుని మమ్మల్నే బూకరించినారు
మాదిగ వారిని మా దిగువ వారని ఈసడించినారు
‘దారా’ ధర్మం మాట్లాడుతున్నావా?
నిజమైతే చెప్పు సియ్యల దండేస్తాం ముడుసుగొట్టి పెడతాం
అవునూ మన కులపెద్దలేరీ?
ఎబిసిడి కంచాల్లో రిజర్వేషన్‌ మెతుకులు పంచమని
పంచాయితీ జరుగుతుంటే మాట్లాడ్రేమీ? ఎటు బోయారు?
మహానాడులకు ప్రాణం పోసే పనిలో ఉన్నారా?
బడుగుల సాధికారం పాట పాడుతున్న ‘కాకీ’
మాదిగ సాధికారం పాట అంటరానిదా? మౌనమేల మామా?
రుధిర క్షేత్రంలో మెరిసిన ‘కత్తి’కి దళిత చిలుం పట్టింది
పదునెక్కుతుందో లేదో వర్గీక’రణం’లోనే తేలాలి
బొజ్జ పెంచిన సామాజిక అన్యాయం
ఐక్యతని ‘తారక’ మంత్రంలా జపిస్తోంది
‘కాకా’ సామికి సూపు తగ్గింది
మాదిగ ‘గొడిసెలు’ అగపడట్లే
పనబాక దొరల బాకా
లోక్‌సభ తోటలో కాపుగాసింది
నంది మందల్ని రానీయకుండా ‘కేక’ లేస్తోంది
రాయితీ పోగులన్నీ నావేనని మోహిని చింతగా మూల్గింది
‘శీలం’ లేని నక్క మాదిగ సేలో పడింది
గొల్లపల్లి గీత వినోదంగ వక్కాకు ఏసుకుని
మండుతున్న గూడెంపై కేకరిస్తున్నారు
లక్కయిల్లు కాల్చే రాజకీయాలు చేస్తున్నారు
ఇల్లుకాలి మాదిగలేడుస్తుంటే
కుండల కుర్చీల సర్దుకుపోతున్నారు!
విఘ్నాలు రావు, తొలిగి పొయ్యాయనుకున్నాం
‘చిన్న’బోయిన మోసం సుప్రీం గూట్లో నక్కింది
పెబుత్తం పెంపుడు కుక్కని జూజూ పోపో డిడి అంటూ
డక్కలోళ్ళ పైకి వుసిగొల్పింది
కారంతో ఒక ‘…వాజి’మ్మని రెల్లి తోటి బడుగుల పైకి తోలింది
మోచి మెహతర్‌ తెలంగాణ మీదికి భయాకర్‌ని వొదిలింది
బక్క బతుకులపై పెంట జల్లడానికి పెంటపాటిని
ఎబిసిడిలకు అడ్డంగా ‘మల్లు’లను దింపింది
జాషువా గుర్రానికి ‘కుసుమ’ను ఎదురొడ్డుతున్నారు
నలిగిపోద్దిరో అంటే వినరు
కుల హిందువులకు ‘బోయీ’లయినవారు
పాలేర్లు గానే మిగిలి పోతారు
జ్ఞానానందం మీసం ఊడదు
నిన్న దండోరా పోటెత్తిన ‘యుద్ధనౌక’
నీలి మొసళ్ళ మడుగులో కూరుకుపోయింది
మాదిగ డప్పులపై నిప్పులు పోసుకుంటోంది
శివసాగరం ఎండిపోయింది సూరీడు ‘నల్ల’గప్పేశాడు
జాంబవుడి చిందుకు ఉరుములు అడ్డంబడతయా కళ్యాణమా?
ఆకలి ‘దప్పు’లు కలిసే కనుపాపలే సెందర్‌ బావా!
తులనాత్మకంలో శిగలేనిమణి
మాదిగ గోడుని మల్లెమొగ్గల గొడుగుని మర్సిపోయింది
మన్నెం రాతలేనా మల్లేపల్లి మాదిగ దైన్యం రాయరాదా?
ఘంటా! గూటం గుర్తుకు రాదా?
ఎంకమ్మా! గోసంగి గోసని గొంతులోనే నొక్కమాకు
గోరంతటి తడి చేసుకోరా
చెప్పులు డప్పులు కొమ్ములు కాలెముంతలు
గూటం కత్తి ఆరె సెల్ల
పోగర పన్రాయి నర్రాయి తోలు వారు
మా పనిముట్లు మా సంస్కృతి మియ్యెట్లవుతయ్‌?
మీ అకౌంట్లో ఏసుకుంది చాలు! చాలించండిక!
అయ్యోరే!
దిష్టి తగలకుండ చెప్పు యాలగట్టు
పనికత్తి తీసుకో
ఇదిగో! యీ కొవ్వు తడపల్ని లాగెయ్‌
సియ్యల్ని పోగులేద్దాం సమానంగ పంచుదాం
పాయందుకో అడ్డమొస్తె పట్టదీద్దాం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

2 Responses to తెరతీయగ రాదా

 1. Anonymous says:

  కదిలించింది ఈ కవిత.

 2. కవితా వస్తువుపై వ్యాఖ్యానించే అవగాహనకానీ, సాధికారికత కానీ నాకు లేదు.
  కవితా శిల్పంపై
  ఎంత గొప్ప కవిత.
  వర్గీకరణం పై భిన్న స్వరాల లోతుపాతుల్ని అటు నర్మగర్భంగానూ కాక ఇటు తేటతెల్లంగానూ కాక చెప్పటం అబ్బురమనిపించింది.
  అయినా ఎక్కడా కవిత్వం పలుచన కాలేదు.
  దీనినే ఒక వ్యాసంగా వ్రాయాలంటే ఎన్ని పేజీలు పడుతుందో. వంద పేజీలైనా సరే ఇంతటి విస్త్రుత అర్ధాలు రాగలవా?
  సాధారణంగా ఇలాంటి వస్తువుపై వ్రాసే కవితలు శుద్దవచనంలో సాగి, వాక్యాలను కలిపి చదువుకొంటే ఒకటో రెండో చక్కటి పారాగ్రాఫులు వచ్చేలా ఉంటాయి. కానీ ఈ కవిత అలా కాక మంచి కవిత్వంతో కూడా అలరారుతుంది.

  సువార్తమ్మ గారికి అభినందనలు
  బొల్లోజు బాబా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో