ఆహార భద్రత – రాజ్యం బాధ్యత – డా|| రమా మెల్కొటే

ఆహార భద్రత ఒక దేశం యొక్క ఆర్థిక శక్తికి ఆరోగ్య స్థితికి సూచిక. ఇది రాజ్యం యొక్క విశ్వసనీయతకి కాలమానం కూడా. సమాజంలో ఆకలి ఏ చిన్ని రూపంలో ఉన్నా అది ప్రభుత్వ వైఫల్యంగా, హింసారూపంగానే మనం చెప్పుకోవాలి. 1996లో రోమ్‌లో జరిగిన మొదటి ఆహార శిఖరాగ్ర సమావేశం ఆహార భద్రతను ఈ విధంగా నిర్వచించింది. ”ప్రజలందరికీ నిరంతరం తమ ఆర్థిక, శారీరక అవసరాలకు తగినంతగా సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడమే ఆహార భద్రత.” ఆహార భద్రత లభ్యత, సరఫరా, అందుబాటులో ఉండడం మరియు స్థిరమైన వినియోగం పునాదులుగా రోమ్‌ సమావేశం అభిప్రాయపడింది. తగినంత, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో కలిగి ఉండడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని కూడా రోమ్‌ సమావేశం తీర్మానించింది. రోమ్‌ సమావేశం ఫైనల్‌ డిక్లరేషన్‌లో ఆకలిని ఒక హక్కుల చట్రంలో పొందుపరిచింది.

ఆహార హక్కుకు చట్టపరమైన పునాది భారత రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్‌ 21 ప్రతి మనిషికీ జీవించే హక్కు ఉందని చెప్తుంది. మన సర్వోన్నత న్యాయస్థానం కూడా వివిధ సందర్భాలలో ప్రతి మనిషికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని చెప్పింది. గౌరవంగా జీవించడం అంటే ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోగలగడమే. ఆర్టికల్‌ 39(ూ) పౌరులందరికీ జీవనోపాధి కల్పించాలనీ, ఆర్టికల్‌ 47 అందుకు తగిన ప్రాథమిక వనరులను రాజ్యం కల్పించాలనీ చెప్తుంది. అయితే ఇవి ఆదేశసూత్రాలు మాత్రమే, రాజ్యం బాధ్యత కాదు అని అన్నది. జాతీయ మానవ హక్కుల కమీషన్‌ మాత్రం ఈ ఆర్టికల్స్‌ను జీవించే హక్కుతో ముడిపెడుతూ వీటిని అమలులో పెట్టే బాధ్యత రాజ్యానిదే అని వ్యాఖ్యానించింది. జనవరి 2003లో న్యాయస్థానం తరువాత ఇచ్చిన వ్యాఖ్యానాల్లో హక్కుల పరిధిని మరింత విస్తరింపజేసింది.  వీటిని కూడా ఆహారహక్కుకు అన్వయించవచ్చు.

పౌరసమాజం, న్యాయ స్థానాల క్రీయాశీలత

స్వాతంత్య్రానంతరం కరువు పరిస్థితి రాకపోయినప్పటికీ ఆకలినైతే ఇప్పటి వరకూ జయించలేదనే చెప్పాలి. 1980, 90లలో కలహంది (ఒరిస్సా), రాజస్థాన్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి చావులే ఇందుకు నిదర్శనం. 2008 సం|| చివర్లో మానవహక్కుల కార్యకర్తలు మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ప్రకాశం, అనంతపూర్‌ మరియు వరంగల్‌ జిల్లాల్లో జరిపిన పరిశోధనలు ఆకలి మరణాల గురించి వాస్తవాలు తెలియజేసాయి.

జీవించే హక్కు, చట్టబద్ధమైన కార్యాచరణ లేకుండా వాస్తవ రూపం దాల్చడం చాలా కష్టం. 2001 సం||లో (ూఖజకూ) పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసింది. దేశంలో ఒకప్రక్క ఆహారనిల్వలు అపూర్వమైన స్థాయికి చేరుకుని మరొకప్రక్క కరువు ప్రభావిత ప్రాంతాలలో ఆకలి తీవ్రత అధికమైన పరిస్థితులలో ఈ పిటిషన్‌ దాఖలు అయింది. మొదట భారతదేశ ప్రభుత్వంపై ఆ తర్వాత ఆరు కరువుపీడిత రాష్ట్రాలపై కేసు నమోదయ్యింది. నిష్ఫలమైన ప్రభుత్వ విధానాలు ప్రజాపంపిణీ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యా యనీ, ప్రజల ఆకలి తీర్చడంలోను, కరువు పరిస్థితులను చక్కదిద్దడం లోను ప్రభుత్వం విఫలం చెందిందని పిటీషనర్‌ వాదించారు. ఈ పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు పేదప్రజలకు తగినంత ఆహారం అందించడం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించినప్పటికీ ఆచరణలో ఉన్న ఇబ్బందుల వల్ల అవి ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది. పథకాల అమలులో ఇబ్బందులను వాటి దుష్ఫలితాల ప్రభావం గమనించిన సుప్రీంకోర్టు నవంబర్‌ 28, 2001లో తాత్కాలిక ఆదేశాలలో 9 ప్రభుత్వ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని ఆదేశించింది. అవి (1) (ూణూ) ప్రజా పంపిణీ వ్యవస్థ (2) అంత్యోదయ అన్న యోజన (3) మధ్యాహ్న భోజనం (వీణవీ) (4) (Iజణూ) సమగ్ర శిశు సంరక్షణ పథకం  (5) అన్నపూర్ణ పథకం (6) జాతీయ వృద్ధాప్య పెన్షన్‌ పథకం (7) నేషనల్‌ మెటర్నిటీ బెనిఫిట్‌ పథకం (8) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (చీఖీదీూ) (9) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన.

2002లో స్త్రీలు, పిల్లలు, ఆదివాసీలలో పౌష్ఠికాహార లేమిని నిర్మూలించడానికి, ఈ కేసు పరిధిని మరింత విస్తృతం చేసారు. ూఖజకూ ఙర యూనియన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధిపొందిన ఈ వ్యాజ్యం జఱఙఱశ్రీ ూశీషఱవ్‌వ aష్‌ఱఙఱరఱaఎ పaసవస పవ జీబసఱషఱaశ్రీ aష్‌ఱఙఱరఎ  ఆకలి, పేదరికం, పౌష్ఠికాహార లేమి మొదలైన అనేక అంశాలపై విస్తృత చర్చ జరపడానికి దోహదం చేసి రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆ బాధ్యత నిలిపింది.

భారతదేశంలో అనేక సామాజిక సేవా సంస్థలు ఆహార హక్కును ప్రతి పౌరుడికి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ప్రచారం చేస్తున్నాయి. వీటి ఫలితంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ మరియు మధ్యాహ్న భోజన పథకం విస్తృతంగా గ్రామీణ భారతంలోకి వెళ్ళాయి. =ఱస్త్రష్ట్ర్‌ ్‌శీ టశీశీస షaఎజూaఱస్త్రఅ ఆహార పథకాలను హక్కులుగా మార్చాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్ట రూపాన్ని (ఆహార భద్రత చట్టం) తీసుకొచ్చింది. అయితే ఈ హక్కును ప్రభుత్వాలు అమలులో పెట్టడానికై ఉద్యమం కొనసాగుతూనేవుంది. ఆహార హక్కుతో పోషకాహార హక్కును కూడా అమలులో పెట్టాలని ఉద్యమం సాగుతున్నది.

ఆహారం అనేది ప్రజల సహజమైన కనీస హక్కు. అయితే నేటి ఆధునిక ప్రపంచంలో కొన్ని దేశాలు తమ ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు, ఉత్పత్తి వ్యవస్థలు మెరుగుపర్చుకునేందుకు ఇంకొన్ని దేశాలు మరింత లాభాలు పొందేందుకు ఆహారం అనేది  ఒక యుద్ధభూమిగా మారింది.

ఆకలి,కరువు అంటే అర్ధం ఏమిటి?

సుదీర్ఘకాలంపాటు ఏ ప్రదేశంలో అవసరమైన పోషకాలు లేక తీవ్రమైన ఆకలితో ప్రజలు అలమటిస్తుంటారో దాన్ని కరువు ప్రాంతంగా గుర్తించవచ్చు. కన్సైజ్‌ ఆక్స్పర్ట్‌ థెసారిస్‌ ప్రకారం కరువు అంటే ”తీవ్రమైన ఆకలి, ఆహారం మరియు పోషకాహార లోపం, సమతుల ఆహారం లేకపోవడం, ఆహారం లేకపోవడం వలన మరణం సంభవించడం” అని అర్థం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక మనిషి సజీవంగా ఉండడానికి రోజుకి 1000 కెలరీలు అవసరం. అవసరమైన పనులు చేసుకోవడానికి మరిన్ని కేలరీలు అవసరం. ఇంక శారీరక శ్రమ అవసరమైన వ్యవసాయ కార్మికులు, పరిశ్రమలలో చేసే కార్మికులు సరైనంత ఆహారం తీసుకోకపోవడం వల్ల బలహీనంగా మారడం, తద్వారా వ్యాధినిరోధకశక్తి తగ్గడం జరుగుతుంది. సరైన ఆహారం తీసుకోకపోతే మొదటగా తన శరీరంలో అందుబాటులో ఉన్న క్రొవ్వును కరిగించుకుని జీవక్రియ కొనసాగిస్తుంటాయి. ఆ తరువాత శరీరంలో ఉన్న ప్రొటీన్‌ నిల్వలు, కండరాల క్షీణత మొదలవుతుంది. ఆహార కొరత అలాగే కొనసాగితే ముందు అవయవాల వైఫల్యం తరువాత మరణానికి దారితీస్తుంది.

అయితే మెడికల్‌ కోడ్‌ ప్రకారం ఆకలి మరణాలు అంటే పూర్తిగా ఆహారం లేకుండా మరణించడం లేదా ఉపవాసం వలన కలిగే మరణం కాబట్టి ఈ మరణాలన్నీ ఆకలి చావులుగా ప్రభుత్వం గుర్తించదు. పోషకాహార లేమివల్ల క్షయ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడటం జరుగుతుంది. ఈ వ్యాధులకు చికిత్స వున్నప్పటికీ పోషకాహార లేమివలన మరణిస్తారు.

90వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో ఆకలి మరణాలు సంభవించాయి. అధికారిక రికార్డులు మాత్రం ఇవన్నీ వివిధ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలుగా చూపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఆదివాసి మహిళ కమ్లి కేసు కూడా ఇలాంటిదే. శ్రీ ఖ.=. వేణుగోపాల్‌ (=వ్‌స. Iూూ) తన పరిశోధన ద్వారా ఆమె మరణానికి కారణం ఆకలి అని నిరూపించారు. అయితే శవపరీక్ష నివేదిక ప్రకారం ఆమె ప్రేగులలో పరమాణువంత ఆహార అవశేషాలు కనుగొన్నామని చెప్పి, కమ్లి చావుకు కారణం ఆకలి కాదని తేల్చింది మన Iజణూ యంత్రాంగం. ఇది మన ప్రభుత్వ పక్షపాత ధోరణిని ఎత్తు చూపుతోంది.

ఆహార పథకాలు

ఒక ఆరోగ్యకరమైన జీవితం కోసం సమతుల్య ఆహారం కావాలనుకోవడం అతిశయోక్తి ఏమీ కాదు. సమతుల్య ఆహారం అంటే సరైన నిష్పత్తిలో ఆహారధాన్యాలు, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా 5 సం|| క్రింది వయస్సు పిల్లలకు సమతుల్య ఆహారం తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే పిల్లలలో సంజ్ఞాత్మక (షశీస్త్రఅఱ్‌ఱఙవ రసఱశ్రీశ్రీర) నైపుణ్యాలు ఈ దశలోనే ఏర్పడతాయి. నిజానికి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని పసిపిల్లల ఆరోగ్యంలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణీస్త్రీలు, మరియు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకి అవసరమైన అన్ని మార్గదర్శకాలు Iజణూ కార్యక్రమంలో ఉన్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి ఏమిటి? ఇదే చర్చనీయాంశం.

ఖచీIజజుఖీ నివేదిక ”ప్రపంచం-పిల్లలు 2009” ప్రకారం మనదేశంలో 2000-2007 మధ్య పుట్టిన పిల్లలలో 28% తక్కువ బరువుతో ఉన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 5 సం|| పిల్లలలో 46% మంది ఉండవలసిన దానికన్నా తక్కువ బరువుతో ఉన్నారు. 38% పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, రక్తహీనత ఉన్న పిల్లల (6-35 నెలల) శాతం గ్రామీణ భారతంలో 81.2%. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 72.7% శాతం ఉంది. వివాహిత మహిళల్లో (15-49 సంవత్సరాలు) అయితే ఈ శాతం గ్రామీణ ప్రాంతాల్లో 59.5 గాను, పట్టణ ప్రాంతాల్లో 54.6 గానూ ఉంది. పురుషులలో (15-49 వయస్సు) రక్తహీనత శాతం గ్రామీణ ప్రాంతాల్లో 27.7 మరియు పట్టణ ప్రాంతంలో 17.2 శాతంగా

ఉంది. దీనిని ఇండియాలో పట్టణ గ్రామీణ తారతమ్యాలనవచ్చును. ఖచ్చితంగా దీనిని లింగవివక్షగా భావించవచ్చు.

తాజా అధికారిక గణాంకాలు మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ సాధనలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో చెప్తున్నాయి. మిలీనియం డెవెలప్‌మెంట్‌ గోల్స్‌ ప్రకారం ప్రసూతి మరణాలను మూడోవంతుకు, శిశుమరణాలను రెండింట మూడో వంతుకు తగ్గించాలని తీసుకొన్న ప్రతిజ్ఞ వాస్తవంలో కార్యరూపం దాల్చలేదు. నమూనా నమోదు వ్యవస్థ (ూ=ూ) 2013 ప్రకారం ప్రతి 100000కి 167 ప్రసూతి మరణాలు, ప్రతి 1000కి 40% శిశు మరణాలు నమోదు అవుతున్నాయి. పుట్టిన 7 రోజుల లోపు మరణిస్తున్న శిశువుల సంఖ్య  ఎక్కువ. ఈ మరణాల్లో చాలా శాతం ఆరోగ్య సమస్యను, తీవ్రతను గుర్తించడంలో జాప్యం చేయడం చికిత్స అందకపోవడం వలన సంభవించినవే. అంతేకాక అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీలు చాలామందికి గర్భధారణ సమయంలోను, ప్రసవించిన తరువాత రెస్టు తీసుకోవడం కూడా సాధ్యం కాని పని. ణఱర్‌తీఱష్‌ శ్రీవఙవశ్రీ ష్ట్రశీబరవ ష్ట్రశీశ్రీస ూబతీఙవవ 3  ప్రకారం దేశ వ్యాప్తంగా నాలుగోవంతు స్త్రీలకు ప్రసవానికి ముందు (ూఅ్‌వఅa్‌aశ్రీ జaతీవ) 50%, పైగా, కాన్పు తర్వాత (ూశీర్‌ అa్‌aశ్రీ జaతీవ)   రెండు వారాల వరకు ఎటువంటి సంరక్షణలేదు. 2010లో దేశవ్యాప్తంగా గర్భిణీస్త్రీలను క్లిష్టమైన పరిస్థితులనుంచి సంరక్షించేందుకు ముందుగా 53 జిల్లాలలో I+వ్‌ీూ (ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్‌ యోజన) పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం గర్భధారణ సమయంలోను, ప్రసవానంతరం పాలిచ్చే తల్లి ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసవానంతరం విరామ సమయంలో ఆమె నష్టపోయే వేతనాన్ని ప్రభుత్వం భరిస్తుంది. 2013 సం||లో (I+వ్‌ీూ) పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద నగదు ప్రోత్సాహకాన్ని  జాతీయ ఆహార భధ్రతా చట్టం ప్రకారం 4000 నుండి 6000కు పెంచారు. అయితే మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాలలాగానే ఈ పథకం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూలన పడింది. అధికారిక లెక్కల ప్రకారం 2010-2013 సం||ల మధ్య అర్హులైనవారిలో కేవలం 28% మాత్రమే I+వ్‌ీూ పథకం ప్రకారం లబ్ది పొందారు. మహిళా శిశు సంక్షేమశాఖ 2014 నాటికి మరొక 200 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తృతం చేయాలని సంకల్పించింది. ఇది మంచి పరిణామమే అయినా అమలు విషయంలో ప్రభుత్వానికి నిబద్ధత లేకపోవడం పెద్ద లోటు. 53 జిల్లాల నుంచి 200 జిల్లాలకు అంటే పథకాన్ని 4 రెట్లు ప్రాంతాలకు విస్తృతం చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన బడ్జెట్‌ను 358 కోట్ల నుండి 438 కోట్లకు మాత్రమే పెంచడం ఇందుకు ఉదాహరణ.

ఉన్న పథకాలు సరిగా అమలు కానప్పుడు మరిన్ని కొత్త పథకాలు అవసరమా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. Iజణూ పథకంలో గర్భిణీ మరియు పాలిచ్చే తల్లుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానాలు పొందుపరిచారు. గర్భస్థ శిశువుల నుండి 6 సం|| చిన్నారుల పోషణ కోసం కూడా ఎన్నో విధివిధానాలు రూపొందిం చారు. ఇవన్నీ చక్కగా అమలయితే మనదేశంలో స్త్రీ శిశు సంక్షేమానికి ఎదురుండదు. అంగన్‌వాడి కేంద్రాలలో వేడి భోజనం పెట్టాలని, ఉపాధ్యాయులు, సహాయకులు, వంటమనుషులు, శుభ్రమైన నీరు, మరుగుదొడ్లు కనీస అవసరాలని, ఇవి తప్పనిసరిగా ప్రతి కేంద్రంలోనూ ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు మధ్యంతర

ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలా లేదు. అంతేకాదు భోజనం స్థానంలో రవ్వ, చక్కెర మరికొన్ని సూక్ష్మ పోషకాలు కలిపి అదే భోజనం అని చెప్పటానికి ప్రయత్నిస్తోంది. చాలా కేంద్రాలలో అవి పిల్లలు తినడానికి పనికిరాక పశువుల మేతగా ఉపయోగించడమో లేక అమ్మడమో జరుగుతున్నది. సూక్ష్మ పోషకాలను (వీఱషతీశీఅబ్‌తీవఅ్‌ర) వీటిలో కలపడం వల్ల వాటిలో ూతీవరవతీఙa్‌ఱఙవర ఉండటంతో  పిల్లలు వాటిని జీర్ణించుకోలేరని పోషకాహార నిపుణులు అంటారు. ఆహార హక్కు జaఎaజూaఱస్త్రఅ లో వేడిగా ఉన్న భోజనం అంటే జవతీవaశ్రీ, ూతీశ్‌ీఱవఅ (గ్రుడ్లు) మిగితా విటమిన్లు, స్థానికంగా దొరికే రాగి లాంటి తృణ ధాన్యాలతో కూడినదని వాదించారు. సుప్రీంకోర్టు ఈ రకంగానే వీవaశ్రీ అంటే ఇవన్నీ కూడినదని, పిల్లలకు వేడి భోజనం ఇవ్వాలని చాలాసార్లు ఉత్తర్వులు ఇచ్చింది.

ఒక సమయంలో బిస్కెట్ల పరిశ్రమ చేసిన లాబీయింగ్‌ వల్ల మాజీమంత్రి రేణుకా చౌదరి అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు గుడ్లు మరియు ఇతర పోషక పదార్థాల బదులుగా బిస్కెట్లు పెట్టాలని ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. అయితే వివిధ పౌరసమాజాల జోక్యంవల్ల ప్రస్తుతం ఉప్మా, కిచిడీ వంటివి పిల్లలకు వండిపెట్టడం జరుగుతోంది. అయితే ఈ పథకం అమలులో సమరూపత లేకపోవడం, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులలేమి అంగన్‌వాడి వ్యవస్థను పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య.

అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే అంగన్‌వాడి కేంద్రాలలో ఆహారం తీసుకునే పిల్లలలో 90 శాతం మంది నిరుపేద దళిత వర్గాలకు చెందిన పిల్లలు. 1970లో స్థాపించబడిన ఈ కార్యక్రమం కనుక చిత్తశుద్ధితో అమలు జరిపి ఉంటే ఈపాటికి స్త్రీశిశు సంక్షేమంలో ఎంత పురోగతి సాధించబడేది? అంగన్‌వాడి కేంద్రాలు కేవలం పిల్లలకు అవసరమైన ఆహారం అందించడమే కాదు  వారికి అవసరమైన ప్రీస్కూల్‌ విద్యను అందించడానికి కూడా నిర్దేశించబడ్డాయి. అయితే ఈ పథకాల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం కులవివక్షను కూడా ప్రతిబింబిస్తోంది.

అంగన్‌వాడి కేంద్రాలు (ూఔూ) పథకంతో పాటు సమానమైన ముఖ్యమైన మరొక కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం. అన్ని ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు మరియు ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత విద్యా పాఠశాలలలో పిల్లలకు పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం కూడా అంగన్‌వాడీ పథకంలాగానే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అమలులో కొంత మెరుగైన ఫలితాలను సాధించిందని చెప్పవచ్చు. ఈ పథకంలో లబ్ది పొందేది కూడా ఎక్కువమంది దళిత, నిరుపేద విద్యార్థులే. 1960లో ముందుగా తమిళనాడులో ప్రారంభించబడి తదనంతర కాలంలో మిగిలిన రాష్ట్రాలకు వ్యాపించిన తర్వాత పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. భోజన సరఫరాను ప్రైవేటీకరించరాదని సుప్రీంకోర్టు అనేకసార్లు ఆదేశించినా ఇప్పటికీ చాలా ప్రదేశాలలో నాందీ ఫౌండేషన్‌, అక్షయపాత్ర, ఇస్కాన్‌ వంటి సంస్థలు చాలా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయి. పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, కుల వర్గ పక్షపాత ధోరణి మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లానింగ్‌ కమీషన్‌ గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌లోని 8 వెనుకబడిన జిల్లాలలో జరిగిన ఒక అధ్యయనం వివిధ ప్రభుత్వ పథకాల అమలులోని లోపాలను వెల్లడించింది. అదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, అనంతపూర్‌, కడప జిల్లాలలో ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేవని వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలూ, మరియు సామాజిక కార్యకర్తలూ ఆసక్తి చూపడం వల్ల మధ్యాహ్న భోజన పథకం కొంతలో కొంత మెరుగ్గా ఉంది.

ఆహార భద్రతను వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తినుండి వేరుచేయడం సాధ్యం కాదు.

చీణూ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చి నగదు బదిలీ పథకం తీసుకురావడం ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. చీణూ ప్రభుత్వం Iజణూ నిధులకు కోతపెట్టి అధిక పన్ను ఆదాయం పొందడానికి ఈ ఖర్చు అంతా రాష్ట్రాల మీదకి నెట్టాలని చూస్తోంది. మార్కెట్‌ శక్తులకు అన్ని హక్కులూ ధారాదత్తం చేసి రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చీణూ లక్ష్యంగా ఉంది. ఆహార పౌర సరఫరాల మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ అధ్యక్షతన ప్రధాని నియమించిన అత్యున్నత కమిటీ ప్రభుత్వ ఆహార గిడ్డంగులు (ఖీజI) పునర్నిర్మాణానికి మరియు ఆహార భద్రతకు సంబంధించిన విధివిధానాలు సూచించడంలో విఫలమయ్యింది. ఈ కమిటీ సిఫార్సు ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రజాపంపిణీ వ్యవస్థ, దశలవారీగా ఉపసంహరించు కుని నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని సూచించింది.

ధాన్యం, ముఖ్యంగా గోధుమ, ఆహార ఉత్పత్తిలో స్వయంసమృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు మరియు హరితవిప్లవం నేపథ్యంలో 1964లో ఖీజI ఏర్పాటు చేయడం, సహకార వ్యవస్థలు ఏర్పాటు చేయడం, రైతులకు రాయితీలు రుణసదుపాయాలూ కనీస మద్దతు ధర (వీూూ) వంటివి 1970 నుండి 1980 వరకూ వ్యవసాయాన్ని కొంత ఆశాజనకంగా చేసాయి.

ఔుూ క్రింద వ్యవసాయం కూడా బహుళ వాణిజ్య వ్యవస్థలో భాగం అయ్యాక చీవష ్‌తీaసవ టaషఱశ్రీఱ్‌a్‌ఱశీఅ ఒప్పందం (ుఖీూ) (2013 బాలి కాన్ఫరెన్స్‌) ప్రకారం అనేకమార్లు చర్చలు జరిగి చివరికి ఆహారపదార్థాల ఉత్పత్తి, దిగుమతుల విషయంలో (వీబశ్ర్‌ీఱ కూa్‌aతీaశ్రీ ుతీaసఱఅస్త్ర ూవర్‌వఎ) ఇచ్చిపుచ్చుకునే పద్ధతిని సమాధి చేసారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ తమ దేశాల్లో రైతులకు రాయితీ విధానాలను ఆదాయ రాయితీగా, ఆదాయ బీమాలుగా, పంట నష్టపరిహారంగా కాపాడుతూనే, ఇతర దేశాల్లో ఉత్పత్తి రాయితీలు (ూతీశీసబషవతీ రబపరఱసవ) ప్రపంచ వాణిజ్య సూత్రాలకు వ్యతిరేకమని, ఆ రాయితీలను తీసివేయాలని, లేదా పూర్తిగా తగ్గించాలని వాదిస్తున్నారు. 1994లో చేసిన వ్యవసాయ ఒప్పందం (ూస్త్రతీవవఎవఅ్‌ శీఅ ూస్త్రతీఱషబశ్ర్‌ీబతీవ) ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రతకై ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇటువంటి నిబంధనలు ఉండవని తీర్మానించింది. అయితే ఇవి మొత్తం ఉత్పత్తిలో 10% కంటే ఎక్కువ వుండడానికి వీలులేదు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఇతర దేశాలపై తమ పెత్తనాన్ని సాగిస్తున్నారు.

నయా ఉదారవాద, గ్లోబల్‌ ప్రభావాల నేపథ్యంలో మన దేశంలో ఆహార భద్రతా అంశాన్ని చర్చించాలి. రాష్ట్రాలకు గోధుమ, వరి, బియ్యం సేకరణకు సంబంధించిన అన్ని అంశాలను, హక్కులను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సర్వోన్నత కమిటీలు సిఫార్సులు చేసినా ఆయా రాష్ట్రాలు ఇప్పటికే అనేక రుణాలు, లోటు బడ్జెట్‌లలో మునిగిపోయి ఉండడంవల్ల ఆచరణసాధ్యం కావట్లేదు. ఆహారసేకరణ, నిల్వ, నిర్వహణలో అత్యంత సమగ్ర భాగస్వామి అయిన ఖీజI తన ప్రాథమిక లక్ష్యాలను చేరుకోవడంలోనే విఫలమైందని నకూజ కమిటీ నివేదించింది. ఈ కమిటీ కనీస మద్దతు ధరను కూడా తీసి వెయ్యాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఆహార భద్రతా చట్టం ఉనికి, విశ్వసనీయత ఏమిటి? రెండు సంవత్సరాల క్రితం చట్టరూపం దాల్చిన చీఖీూూ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీజీూ ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణను మూడుసార్లు వాయిదా వేసింది. నకూజ రిపోర్టు ప్రకారం ”ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపాలు కొన్ని రాష్ట్రాలలో 40-50% మొదలుకొని కొన్ని రాష్ట్రాలలో 60-70% దాకా ఉన్నాయి. నూరుశాతం కంప్యూటరీ కరించకుండా, లబ్దిదారుల ఎంపికా, గుర్తింపు విధానం పూర్తిగా అమలు కాకుండా, విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయకుండా చీఖీూూ పథకం అమలు ఎప్పటికీ సాధ్యం కాదు.” కొత్త వాణిజ్య ఒప్పందం (ుఖీూ) నేపథ్యంలో ఖీజI పాత్రను పరిమితం చేయడం, మద్దతు ధరలు ఉపసంహరించుకోవడం కేంద్రప్రభుత్వ విధానంగా మారింది. ఇది సామాజిక రంగానికే ఒక విపత్తు. చివరికి ఈ పథకాల ద్వారా అత్యంతంగా నష్టపోయేది మధ్యాహ్నభోజన పథకం మరియు Iజణూ లబ్దిదారులు. అంటే 0-6 సంవత్సరాలు మరియు 6 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలు. ఎందుకంటే వీరు ఉద్యమం చేయలేరు – ఓటర్లూ కారు.

చివరిగా

మన దేశంలో, 60 సంవత్సరాల స్వాతంత్య్రనంతరం ఇంకా ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనేవున్నాయి అంటే, దానికి కారణం మన రాజకీయ వ్యవస్థ, వ్యవసాయ విధానాలు, నయా ఉదారవాద సిద్ధాంతాలు. ఆహార పంటల నుంచి వాణిజ్య పంటలకు ఇచ్చే రాయితీలు, పురుగు మందులు (ఖీవత్‌ీఱశ్రీఱఓవతీర) ఇవన్నీ రైతుపై పెట్టుబడి భారం మోపుతున్నవి. అంతేకాక, భూసంస్కరణలను ఇప్పటికీ సరిగా అమలు చేయకపోవడం వల్ల వ్యవసాయ సంక్షోభం కొనసాగుతూనే వుంది. మౌలికమైన మార్పులు చేసి వ్యవసాయాన్ని చక్కబరిచినపుడే ఆహార భద్రత సాధ్యమవుతుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>