ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

లైలాగారూ..!
మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..

ప్రతి పత్రికకు విమర్శలు అవసరమే..కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు..ఇది  ఈనాటి పత్రిక కాదు…ఎన్నో ఏళ్ళుగా ప్రముఖుల పర్యవేక్షణలో  ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి..కేవలం స్త్రీలకే అని కాకుండా పురుషులకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ..తనదైన బాటలో నడుస్తున్న పత్రికను దిక్కుమాలిన పత్రిక అనడం సముచితం కాదు…మనం ఒకరిని దూషిస్తేనో, వేలెత్తి చూపితేనో గొప్పవారమయిపోతామనే భ్రమలు ఇప్పుడు లేవు.. మనం మాట్లాడే ప్రతి మాటలో..వాడే ప్రతి పదంలో సభ్యతను మరచిపోకూడదు…ఒక పత్రికను కొని చదివే సంస్కారం మనలో లేనంతకాలం మంచి పత్రికన్నీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసిందే..చేతనయితే మనం సాయం చేయాలి లేకుంటే సత్యవతిగారు అన్నట్లు నచ్చకపోతే చదవటం మానేయాలి.. ఇది స్త్రీల పత్రిక అంటే మన పత్రిక…మనలో మనమే ఇలా అసభ్యపదజాలం వాడుకుంటూపోతే పురుషులకు లోకువ కావడంలో వింతేముంది?..? మనం ఎదగాల్సింది డబ్బు సంపాదించడంలో కాదు…సాటి స్త్రీని గౌరవించడం..అయినా మీరు రాసిన ఉత్తరం యధాతధంగా ప్రచురించినపుడే మన భూమిక గెలిచింది. గెలుపు బాటలో నిరంతరం ప్రయాణిస్తూనే వుంటుంది…
శైలజామిత్ర, హైద్రాబాద్‌

ఆడవాళ్ళంతా విదేశాలకు వెళ్ళలేరు, ఉద్యోగాలు చెయ్యలేరు, నలుగురిలో తిరిగిరాలేరు కానీ వాళ్ళ గుండెల్లో తమను అంతా గుర్తించాలన్న ఆరాటం వుంటుంది. తమ మాటగానీ అభిప్రాయాలు గానీ సమాజంలో వినిపించాలని తపన వుంటుంది. అలాంటి భావోద్వేగాలను కాగితంమీదకు తెచ్చినపుడు, వాటిని ఆప్యాయంగా తీసుకునే తరుణీమణులెందరు? అసహాయతకి ఊతకర్రనిచ్చేదెవరు? భూమికే కాదు ఏ పత్రికలోనయినా సత్యవతిలాంటి స్నేహశీలి వున్నపుడు బలహీనుల గొంతులు సైరన్లవడం ఖాయం. ఏదైనా మనం కళ్ళతో స్వయంగ చూసినప్పుడే ఏ విషయంపైనైనా స్పందించాలి. భూమికలో బహుమతి ప్రదానోత్సవం గురించి చదివి మీ అభిప్రాయం వెలిబుచ్చినట్టున్నారు. ఆ రోజు మాట్లాడిన, అధ్యక్షత వహించిన, బహుమతి ప్రదానం చేసిన వ్యక్తులు అసామాన్యులు. ఎంతో కష్టపడి త్యాగాలు చేసి ఆ స్థితికి వచ్చినవారు. ఆ సమయంలోని భావోద్వేగంలో ఒక పవిత్రతుంది. ఒక ఉద్యమం వుంది. ఏ స్త్రీల మీద చులకన లేదు.. దిక్కులేని వాళ్ళనిపించలేదు. మగవాళ్ళ సహకారంతో పోటీలు నడవడం అనేది అసంగతం కాదే!భూమిక మగవాళ్ళని చీల్చి చెండాడటం లేదు, వాళ్ళని దూరంగా పెట్టడం లేదు. మీరు మానసికంగా సరిలేని స్థితిలో వున్నారని మీ రాతలు చెప్తున్నాయి. భూమిక స్త్రీల సమస్యలకు ఒక వేదిక. ఒక్కోక్క నీటి చుక్క సముద్రమైనట్టు, ఆడవాళ్ళ ఒక్కొక్క సమస్య ఒక్కోసారి సమాజ రీతుల్నే మార్చేయవచ్చేమో! స్త్రీవాదం అవకాశవాదం కాదు ఆడవారి అణ్వాయుధం! వెనకటి పత్రికల్ని తిరగేయండి. అందులోని సమాచారాన్ని చూడండి, మీరు కోల్పోయినదేమయినా అక్కడ దొరకొచ్చు. ఆడవాళ్ళని కించపరిచే హక్కు మాత్రం మీకు లేదని తెలుసుకోండి లైలా ఏర్నేని గారు!! ఆల్‌ద బెస్ట్‌!
తమ్మెర రాధిక, వరంగల్‌

సత్యవతిగారికి ముందుగా అభినందనలు, ‘జాతీయ మీడియా అవార్డు’ పొందినందుకు. మీ సారధ్యంలో ‘భూమిక’ మాసపత్రిక చాలా చక్కగా రూపుదిద్దుకుంటోంది. అన్యాయాలకి బలైన సొదరీమణులకు అక్షరరూపంగా (భూమికద్వారా) మీరిస్తోన్న ఓదార్పు, ధైర్యం చాలా మెచ్చుకోదగినది. అందుకు కూడా మీకు నా అభినందనలు.
జూన్‌ సంచికలో సంపాదకీయం భార్గవీరావుగారి గురించి రాసారు.ఆవిడతో నాకూ ఏడేనిమిదేళ్ళగా పరిచయం.నూరేళ్ళ పంట పుస్తకం సంకలనం తెచ్చేముందు ‘మీ కథ పంపండి’ అంట ఫోను చేసారు. అదే మా తొలిపరిచయం. ఆ తర్వాత తరుచూ ఫోనులో కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఒకసారి ముంబాయి వచ్చినప్పుడు ఆవిడ తమ్ముడి భార్యని తీసుకొని మా ఇంటికి వచ్చి చాలాసేపు వుండి, భోజనం చేసి వెళ్ళారు. మంచి స్నేహాశీలి, చక్కగా నవ్వుతూ కళ కళలాడుతుండే మనిషి..మరిచిపోలేని మనిషి.
‘రేపటి ప్రశ్న’ కథ సూటిగా సమాజానికే వేసిన ప్రశ్న.
తురగా జయశ్యామల, ముంబాయి

భూమిక జూలై సంచికలో లైలా మెయిల్‌, కె.సత్యవతిగారి స్పందనలు చదివాను. జండర్‌ అవగాహన పురుషులకే కాదు కొన్ని సందర్భాల్లో స్త్రీలకు కూడా ఉండదని తెలుసు కాని, పెద్ద చదువులు చదివి స్టేట్స్‌లో స్ధిరపడ్డ స్త్రీలలో కనీసం కూలి నాలి చేసుకునేవారికున్న అవగాహన కూడా లేదంటే చాలా ఆశ్చర్యం కలిగింది. రచయిత్రిగా కంటే కూడా ఒక మహిళగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను, తరతరాలుగా మహిళల మీద జరుగుతున్న అనాన్యయలాకు, అసమానతలకు, అవమానాలకు వ్యతిరేకంగా ఎంతో మంది స్త్రీలు పోరాటం చేస్తున్నారు. ఎవరి పోరాటం వారిది. పోరాటాలు వేరయినా అందరి ధ్యేయం ఒకటే. మహిళా విముక్తి.
మహిళా పత్రికలైనా, స్త్రీవాదమైనా, స్త్రీల సాహిత్యమైనా ఏదైనా సరే పురుషుల్ని కించపర్చటం, కుటుంబ విచ్ఛిన్నం, పురుషుల్ని అణచివేయడం, అవమానించడం వాటి ఉద్ధేశ్యం కాదు. ఇప్పటికీ కుటుంబంలో, సమాజంలో ద్వితీయ పౌరురాలిగా చూడబడుతున్న స్త్రీని పురుషునితో సమానంగా గౌరవించాలని స్త్రీకి స్త్రీ శత్రువు కాదని మనం చెప్తాం.
కాని లైలా లాంటి వారు మిడి మిడి జ్ఞానంతో డొక్కు పత్రికలని, మూసేస్తేనే మంచిదని అనడం చాలా ఏహ్యమైన చర్య. పత్రికల్లో, మీడియాల్లో, ఉద్యోగాల్లో, విద్యలో, రాజకీయాల్లో, సాహిత్యంలో, కుటుంబంలో, సమాజంలో అన్నింటిలో ఇప్పటికీ మహిళలకున్న అవకాశాలు చాలా తక్కువ. పోరాడే అవకాశాల్ని అందుకొని, అనేకానేక అవమానాలు భరించి, ప్రతిక్షణం పోరాటం చేస్తూ  మహిళలకి అవకాశాల కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం ప్రతిరోజు అగ్ని పరీక్షలనెదుర్కొనేవారికి ఆ బాధ తెలుస్తుంది. దేశం, జాతి, కులం, మతం ఏదైనా మహిళలందరూ మహిళా విముక్తి కోసం సంఘటిత పోరాటం చేయాలి.
సమస్యలు రూపం మార్చుకుంటున్నాయి. చట్టాలు వృధా అవుతున్నాయి. పరిష్కారం కోసం, ప్రయోజనాలకోసం మహిళలందరూ కలిసి పోరాటం చేయాలి. మహిళల గళం దళంలా వుండాలి. ఇగోలకు తావివ్వకూడదు. మహిళల కోసం మనం ఏం చేశాం, చేస్తున్నామ, చెయ్యాలి- ఈ దిశగా మన ఆలోచనలు వుండాలి. ఒక మహిళ అయి వుండి మహిళల కోసం మహిళలు నడుపుతున్న ఒక పత్రిక మూసేయాలనటం అనైతిక చర్య. కన్నాంబగారికి గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్ళు వచ్చేవట. కొందరు మహిళలు టివీ సీరియల్స్‌, సినిమాలు చూస్తూ కన్నీరు మున్నీరౌతారు. వారు ఆ పాత్రలో ఇన్వాల్వ్‌ అయి ఆ కష్టాలు వారివని ఓన్‌ చేసుకుంటారు. అందువల్ల వారికి కన్నీరు వస్తుంది. లైలా లాంటి వారికి గ్లిజర్‌ వేసినా కళ్ళలో నీళ్ళు రావేమో.
గాజు కళ్ళలో కన్నీరు రాదు. రాతి గుండెకు చెమ్మ ఉండదు. డబ్బు కట్టలు పక్కన ఎన్ని ఉన్నా మంచంలో ఉన్న్పుడు మంచినీళ్ళు కావాలంటే నోట్లో పోయగలిగేది సాటి మనిషేగాని డబ్బుకట్టలు కాదు. మనుషులు బతకడానికి డబ్బు అవసరం ఉండవచ్చు కాని మనిషి డబ్బుకోసం జీవించడం, దిగజారటం సరికాదు. లైలాగారూ! ముందు మానవ సంబంధాల గురించి తెలుసుకోండి. తర్వాత మహిళల సమస్యల్ని పరిశీలించండి. మీకు వీలయతే ఇండియాలో ఏదో ఒక పల్లెకెళ్ళి పేద, గిరిజన, దళిత, బహుజన మహిళలతో కలిసి ఒక రోజు జీవించండి.  వాళ్ళు చనుబాలను అమ్ముకుంటున్నారు.బిడ్డల్ని అమ్ముకుంటున్నారు. తాగొచ్చిన భర్తల చేతుల్లో చావుదెబ్బలు తిని కడుపు నింపుకుంటున్నారు.  పోనీ స్త్రీలకు దిక్కు చూపించే ఓ పత్రిక మీరు నడపండి. కొండంత చీకట్లో గోరంత వెలుతుర్ని వెతుక్కుంటున్నారు మహిళలు, దాన్ని మూసివేయాలని ప్రయత్నించకండి.

జి.విజయలక్ష్మి, హైదరాబాద్‌
 
సత్యవతిగారికి
భూమిక పత్రిక నిర్వహణలో మీ కృషి అభినందనీయం. మహిళలకు మీరు అందించే ఆత్మవిశ్వాసం, వారిని చైతన్యవంతం చేసే మీ ప్రయత్నం మెచ్చుకోదగినది. భూమిక ద్వారా మీరందిస్తున్న విజ్ఞానం ఎందరి జీవితాలకో మార్గదర్శకంగా నిలుస్తుంది. పత్రిక గురించి అవగాహన లేని కొందరు చేసే వ్యాఖ్యానాలు పట్టించుకోవలసిన అవసరం లేదు, పత్రికా ముఖంగా మీరు చెప్పిన సమాధానం, కుక్కకాటుకు చెప్పు దెబ్బలా వుంది.
జ్వలిత, ఖమ్మం

లైలా ఉత్తరానికి సమాధానం
చిలిపి అల్లరి తెలిసినంతగ, ప్రేమ తెలియని విదేశీకాంతలు
మెచ్చలేరే వెచ్చని హృదయం పొంగిన మధురానుభతి?
ఆమెకో చిన్న వినతి
ఒక చిన్న కన్నీటి బొట్టు విలువ తెలుసా నీకు లైలా? గుండె చితికి చినికిన రక్తం బొట్టు అది.
పొంగకు ఇతరులను అవమానించానని, చెప్తున్నా అది కుసాంస్కానికి ఒక తార్కాణం  మాత్రమని.
సత్యవతిగారు
మంచిమనసుతో, ఆవేదనతో ఆవాళ నేను ఇనీషియేట్‌ చేసిన అ ప్రయత్నాన్ని ఆమె అలా వెక్కిరించడం నాకు అచ్చెరువు కలిగించింది. బహుమానాలు ఇచ్చినట్టిచ్చి ప్రయత్నపూర్వకంగా మీరే వెనక్కి తీసుకున్నారన్న ఒక నీచమైన అభిప్రాయం. ‘ఇదేనా ప్రపంచం’ అని మరోసారి అనిపించేటట్టు చేసింది. బాధపడకండి. ఈ విషయంలో మీరు కనబరచిన స్పోర్టివ్‌నెస్‌కి నా శుభాకాంక్షలు
పుష్పాంజలి, మదనపల్లి

 

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

3 Responses to ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

 1. మీకు అనుకూలంగా వచ్చిన స్పందనల్ని మాత్రం బాగా ఏర్చికూర్చి ప్రచురుంచారు. చాలా బాగుంది.

 2. Sarada Devi Mukku says:

  ఫ్రతిస్పందన లొ లైలా ఉత్తరానికి సమాధానము రాసిన పుష్పాంజలి గారికి…..

  మీ భావజాలం చూసి మీరు నా చిననాటీ స్నెహితురాలెమొఅని తెలుసుకుందామని ఈ కామెంట్ పమ్పిస్తున్నాను… మీరు Ade Pushpanjali అయినట్లైతె saradamukku@yahoo.com కి email పమ్పగలరు.

  Thanks,
  శారద ముక్కు, కనిగిరి

 3. BUCHI REDDY says:

  చక్కని జవాబులు చెప్పారు–
  బాగున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో