పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?

కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్‌ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశానికి ‘యూనిఫెమ్‌’ సభ్యులతో పాటు స్త్రీల మీద హింస తగ్గాలని, చట్టం సక్రమంగా అమలవ్వాలని భావించే, నిబద్ధతతో ఆలోచించే పురుషులు చాలామంది హాజరయ్యారు. లోపల మీటింగు అవుతుంటే, బయట కొంతమంది పురుష సంఘాల వాళ్ళు ఆందోళనకీ, నినాదాలకీ దిగారు. ప్రభుత్వం స్త్రీ పక్షపాతిగా వ్యవహరిస్తూ, స్త్రీల కోసం చట్టాలు తెస్తోందని, వాటిని స్త్రీలు దుర్వినియెగం చేస్తున్నారని నినాదాల్విడం మొదలుపెట్టారు.  ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భార్యలు, భర్తల్ని కాల్చుకుతింటన్నారని మంత్రితో వాదనకి దిగడంతో ఆమె ”చట్టంలో మార్పులు చెయ్యడానికి సిద్ధమేనని, అయితే ప్రస్తుతం అలాంటి ఆలోచనలేదని” తేల్చి చెప్పారు.జూన్‌ 25నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ వార్తని ప్రచురించింది.
ఈ వార్త చదివినప్పుడు నేను చాలా అప్‌సెట్‌ అయ్యాను. ఈ దేశంలో  స్త్రీలకు జరుగుతున్నదేమిటి? ఈ పురుష సంఘాల వాదనలేమిటి? స్త్రీలు పురుషుల్ని హింసించగలగడమేమిటి? నిజంగా స్త్రీలు అలా చెయ్యగలిగితే ప్రతి రోజూ వేలల్లో వివిధ హింసలకి గురవుతూ చావడమెందుకు. వారి వాదనలు నిజమైతే కట్నం మంటల్లో స్త్రీలు మాత్రమే ఎందుకు కాలి మసై పోతున్నారు? ఇటీవల ”నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌ బ్యరో” విడుదల చేసిన కట్నం హత్యల సంఖ్య ఏమిటి? అదే రిపోర్ట్‌లో పేర్కొన్న 37% గృహహింస కేసుల సంగతేంటి? గుప్పెడు సొమ్ముకోసం, సంవత్సరాల తరబడి రాని మనోవర్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగే స్త్రీల మాటేమిటి? దేశంలో అమానుషంగా హత్య గావింపబడుతున్న ఆడపిండాల, పిల్లల విషయమేమిటి? ఆడవాళ్ళు పురుషుల్ని  హింసించి, అణిచివేయగల స్థాయిలో వుంటే ఇన్ని ఆకృత్యాలు, అన్యాయలు స్త్రీల మీదే ఎందుకు జరుగుతున్నాయి? పురుష సంఘాల వాళ్ళు గుండెల మీద చేతులుసుకుని ఆలోచించుకోవాలి.
ఈ దేశంలో అన్ని అందలాలు, అధికారాలు, ఆస్తులు ఎవరి చేతుల్లో వున్నాయి? రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నత హోదాల్లో వెలుగుతున్నదెవరు? పార్లమెంటు నిండా పొంగి పొర్లుతున్నది పురుషులా? స్త్రీలా? పరిపాలనలో వున్న వాళ్ళంతా ఎవరు? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక మహిళ కూడా న్యాయమూర్తిగా లేకుండా అందరూ మగవాళ్ళే ఎందుకున్నారు? స్త్రీలు హింసకు, గృహహింసకు పాల్పడుతున్నారని మంత్రి ముందు గుండెలు బాదుకున్న మగ సంఘాల సభ్యులు ఈ మాత్రం ఆలోచించలేరా? చెదురు మదురుగా జరిగే సంఘటనలను జనరలైజ్‌ చేసి ఆడవాళ్ళంతా చట్టాలను దుర్వినియెగం చేస్తున్నారని గొడవ చేయడం న్యాయమేనా?
నిజానికి ప్రపంచీకరణ పుణ్యమా అని ఈ రోజు స్త్రీల మీద విపరీతంగా హింస పెరిగిపోతోంది. పసిపిల్లల్ని, ముసలివాళ్ళని సైతం వదలకుండా లైంగిక అత్యాచారాలకి తెగబడుతున్నారు. అత్యాచారం చేసి చంపేయడం చాలా మాములైపోయింది. విజయవాడలో ఆయేషా కేసు మన మనసు పొరల్లో ఇంకా పచ్చిగానే వుంది.ఆ పిల్లని అంత దారుణంగా చంపినవాళ్ళు సమాజంలో స్వేచ్చగా తిరుగుతూనే వున్నారు. పేపర్‌ తిరగేస్తే ప్రతిరోజూ దర్శనమిచ్చేవి ఇలాంటి ఘటనలే.
ఇక కుటుంబాల్లో నిత్యం జరిగే హింసకి లెక్కే లేదు. ఈ రోజుకీ కట్నం మంటల్లో స్త్రీలు కాలుతూనే వున్నారు. కుటుంబంలో అమలవుతున్న హింసస్థాయి ఏ రేంజిలో వుందో నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యరో లెక్కలే సాక్ష్యాలు. ఇవి ప్రభుత్వ లెక్కలు. స్త్రీల ఉద్యమం చెబుతున్న లెక్కలు కాద . స్త్రీలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తెచ్చింది. అవి అమలవుతున్నాయ లేదా అనేది వేరే చర్చ. నిజంగానే స్త్రీలు హింసకు పాల్పడుతుంటే, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద బోలెడు సెక్షనులున్నాయి. పురుషులు వాటిని ఎందుకు వాడుకోకూడదు? హింసకి ఎవరు పాల్పడినా శిక్షార్హులే. ఎవరైతే పురుషులు హింసించబడుతున్నారో వాళ్ళు మిగతా చట్టాలను ఉపయెగించి న్యాయం పొందొచ్చు కానీ మెజారిటీ స్త్రీలకు మేలు చేయడం కోసం వచ్చిన ప్రత్యేక చట్టాలను రద్దు చేయాలనడం అవివేకం. అన్యాయం.
మంత్రి ముందు  మగ సంఘాల వాళ్ళు తెచ్చిన మరో అంశం ఈ చట్టాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయని. వీళ్ళు ఏభై ఏళ్ళ వెనకబడి వున్నారనిపిస్తోంది. ఎందుకంటే విడాకుల చట్టం తెచ్చినపప్పుడు కూడా ఇదే వాదన లేవనెత్తారు. విడాకుల చట్టం వల్ల కుటుంబాలు కూలిపోలేదే. కుటుంబాల్లో ఆడవాళ్ళు నానా హింసలకీ బలవుతూ జీవఛ్ఛవాల్లాగా బతుకుతుండాలనేది వీళ్ళ వాదన. స్త్రీలు చట్టాల సహాయంతో బతుకుల్ని బాగు చేసుకునే చిన్న ప్రయత్నం కూడా సాగనివ్వని పురుషాధిక్య భావజాలం వీళ్ళ నరనరాల్లో ఇంకిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం.
నిజానికి జూన్‌ 25న జరిగిన సమావేశానికి స్త్రీల అంశాలపై నిబద్ధతతో పనిచేసే పురుషులు చాలామంది హాజరయ్యారు. గృహహింస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ఎన్నో అమూల్యమైన సలహాలనిచ్చి,చక్కటి చర్చను సాగించారు. ఆ విధంగా చూస్తే ఆ సమావేశ ఉద్దేశ్యం నెరవేరినట్టే. అయితే సమావేశం బయట జరిగిన గొడవకి మీడియా ప్రాధాన్యత నివ్వడం, స్త్రీలు చట్టాలను దుర్వినియెగం చేస్తున్నారనే అంశాన్ని మాత్రమే హైలైట్‌ చెయ్యడం చూస్తే స్త్రీల పట్ల మీడియా ఎంత పక్షపాతంతో వ్యక్తికరిస్తుందో అర్ధమౌతుంది. స్త్రీలు పురుషులుకలిసి పనిచేస్తేనే సమాజంలో హింస తగ్గుతుంది. స్త్రీల వాస్తవ జీవితాల నేపధ్యంలో ఆలోచించాలిగాని బాధితుల మీదే బండలేయడం అన్యాయం. అమానుషం, అమానవీయం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

4 Responses to పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?

 1. Lalitha says:

  ఇంత వరకు నాకు భూమిక అనె స్థ్రీ వాద పత్రిక గురించి థెలియదని చెప్పుతకు విచారించుచున్నను.
  ఛదువుథు ఉంతె అనందాన్ని పత్తలెక పొయను.
  థాన్క్స.
  లలిథ

 2. ఈ విషయంపై నేను రాసిన బ్లాగు ఈ క్రింది లంకెను అనుసరించి చదవగలరు
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_05.html

 3. Japes says:

  Gents !
  lets come out of our narrow minded lanes & try to think of issues without straying Off the ‘context’ here.

 4. సాయి says:

  కొండవీటి అని తండ్రి ఇంటిపేరో, భర్త ఇంటి పేరో పెట్టుకుని, పురుషాధిక్యత గురించీ, పురుషాధిక్య భావజాలం గురించీ విస్తుపోతారేం, చోద్యం కాకపోతే!!

  సాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో