దేశభక్తి కవితల భారతి

రాజేశ్వరి దివాకర్ల

‘భారతి’ అన్న పేరుతో ప్రసిద్ధురాలైన శ్రీమతి తిరుమల రాజమ్మ కన్నడ భాషలో ఎంతో ప్రచారం పొందిన దేశభక్తి గీతాలను రచించింది.

 ఆమె ‘గాంధీగారి ప్రీతి వాత్సల్యాలను చరగొన్న మహిళామణి’ గా మన్ననలను అందుకుంది.

 రాజమ్మ సంగీత విద్వాంసురాలు.  ప్రఖ్యాత గురువులు వీణా శేషన్న గారి వద్ద వీణను నేర్చుకుంది.  ఆమెకు సంగీతం బాగా తెలిసినందువల్ల భావానికి తగిన రాగాన్ని సమకూర్చేది.  స్వయంగా రాసిన పాటలను మధురంగా పాడేది.  ఆమె ‘భారతీ రపక త్రయం’ అని గుర్తింపు తెచ్చుకున్న నాటక రచనను చేసింది. తనకు సోదర సవనుడు, ఆత్మీయుడు, ఆనాటి కన్నడ నాటక కర్త ‘కైలాసం’ జీవన చరిత్రను అత్యద్భుతంగా రాసింది.  గురువు వీణా శేషన్న గారి జీవిత చరిత్రను రాసింది.  విమర్శలను వ్యాసాలను వెలువరించింది.  ఇతర రచనలను ఎన్నింటిని చేసినా ఆమెను దేశభక్త కవయిత్రిగానే మొట్ట మొదట పరిగణిస్తారు.  రాజమ్మకు సమకాలంలో ఇతర రచయిత్రులకు ఎవ్వరికీ లభించని కీర్తి ప్రతిష్టలు దక్కాయి.  ఆ విషయంలో ఆమెకు ప్రతిభతో పాటు అదృష్టం కలసి వచ్చిందని అంటారు.
తిరుమల రాజమ్మ మాతృభాష తెలుగు, ఆమె తండ్రి మదనపల్లెలోని పుంగనూరుకు చెందిన కందాడ రాఘవాచార్యులు.  ఆయన ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో విజ్ఞానాన్ని బోధించేవారు.  ఆయన గణితం, సంస్కృతా లలో పండితులు.  రాజమ్మ తల్లి సీతమ్మ, ఆమె ఉదార స్వభావురాలు.   ఆమె తెలుగు, కన్నడ గీతాలను చక్కగా పాడేది.  రాజమ్మ తాత విద్వాన్‌ రాజగోపాలాచారి.  ఆయన ‘లయీ రైస్‌’ కు సంస్కృత పాఠాలను నేర్పారు.  ఆమె మేనవమ విద్వాన్‌ వెంకటాచార్యులు నాటక కర్త.  ఆయన రాసిన భోజప్రబంధం లేక కాళిదాసు ప్రబంధం అనేక సార్లు ప్రదర్శనను పొందింది.  రాజమ్మ సోదరులు సాంస్కృతిక రాజకీయ రంగాల్లో ముందంజ వేసారు.
రాజమ్మ కందుకూరి వీరేశలింగంగారి సాహిత్యాన్ని, ఉపన్యాసాలను చదివి విని ప్రభావితురాలయింది.  ఆంధ్రకేసరి టంగు టరి ప్రకాశం పంతులు గారి ప్రోత్సాహం తో తెలుగు దేశభక్తి గీతాలను రాసింది.  కాని అవి లభ్యం కావు.  రవీంద్రనాథ ఠాకూరు బెంగాలీ నవల తెలుగు అనువాదాన్ని అనుసరించి కన్నడ ‘దృఢ ప్రతిజ్ఞ’ ను రచించింది.  కన్నడ నాటక రచయిత కైలాసం గారి టొళ్ళు-గట్టి నాటకాన్ని తెలుగు చేసింది.  వాళ్ళ ఇంటి దగ్గరలోనే బళ్ళారి రాఘవ గారి నాటక ప్రదర్శనలు జరుగుతుండగా చసి నాటక స్వారస్యాన్ని బాగా గ్రహించింది.
రాజమ్మ 1900 సంవత్సరంలో జన్మించింది.  ఆమెకు పదమూడవ ఏట ‘కన్నడ భీష్మ’ అనిపించుకున్న తిరుమల తాతాచార్య శర్మతో వివాహం జరిగింది.  శ్రీ టి.టి. శర్మ పత్రికారంగంలో ప్రముఖులు.  ఆయన సంస్కృతాంగ్ల పండితులు.  తొలుత శర్మ చెన్నై లోని పురావస్తు శాసన పరిశోధన విభాగంలో ప్రభుత్వోద్యోగం చేసారు.  ఆయన బాపూజీ ఆశయలకు ఆకర్షితుడైనా తాను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆనాటి ఉద్యవనికి దరంగా ఉండదలచారు.  కాని రాజమ్మ ప్రోద్బలంతో ఉద్యోగాన్ని వదలి పత్రికా ఉద్యమ రంగంలో ప్రవేశించారు.  మొదట ‘మైసరు క్రానికల్‌’ కు సంపాదకత్వం వహించారు.  తరువాత ‘విశ్వ కర్నాటక’ పత్రికను స్థాపించారు.  ఆ పత్రిక ఆనాటి ఆందోళనకు వెన్నుదండగా నిలిచింది.  శర్మ, రాజమ్మలు అన్యోన్య దంపతులు.  రాజమ్మ భర్త గౌరవాన్ని ఇనుమడింపజేస్త సహకరించేది.  శర్మ భార్య ఎడల ఎంతో శ్రద్ధను కనపరచేవారు.  ‘శర్మది రాజకీయ రంగం’, రాజమ్మది ‘కోమల హృదయ కళారంగం’, తమ దాంపత్యం ‘భిన్న స్వభా వాల అన్యోన్య భావసిద్ధి’ తో పరిపూర్ణమైందని రాజమ్మ ఒకచోట చెప్పింది.  శర్మ భార్యను ఇతరులు ప్రశంసిస్తుంటే ఎంతో సంతసించేవారు.  తమ వృత్తి జీవితంలోన, వైయక్తిక జీవితంలో భార్య సహకారం అపూర్వమని వెల్లడించారు.  ‘ఐనీలి రిరీ నీలిజిచీతీతిజి వీతిరిఖిలి శిళి ళీలి’ అని ప్రకటించారు.  రాజమ్మ విశ్వ కర్నాటక పత్రికలోని ప్రతి విభాగాన్ని తెలుసుకుని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఇతరులకు వర్గ సచకంగా వాటిని సరిదిద్దేది.  పత్రిక పట్ల ఎంత బాధ్యత వహించిందంటే, ఒకసారి ప్రభుత్వం పత్రికకు కావలసిన కాగితాన్ని సమకూర్చ డం జాప్యం చేసినప్పుడు, ఆమె తన గాజులను అమ్మి వచ్చిన డబ్బుతో కాగితాన్ని కొని పత్రికను సకాలానికి వెలువరించింది.  శర్మ, రాజమ్మ దంపతులకు ఒక కువర్తె, ఇద్దరు కువరులు కలిగారు.  రాజమ్మ సంసారపరంగాను సాహిత్య, సంగీత కార్యకలాపాలలోన సఫలీకృతమైన భాగ్యశాలిని అంటే ఆమెకు కష్టమన్నది కలుగలేదని కాదు.  రాజమ్మ కువర్తె జయలక్ష్మి తన 25వ ఏట ఒక బిడ్డను వదిలి ఆకస్మికంగా మరణించింది.  రాజమ్మకు తీవ్ర వనసికాఫతం కలిగింది.  ఆమె ఆరోగ్యం క్షీణించింది.  ఆమెకు అలాంటి కష్టం కలిగినా ఒంటరితనం ఎప్పుడ అనుభవించలేదు.  ఆమెకు సదా భర్త, ఇతర ఆత్మీయులు తోడుగా నిలిచారు.  రాజమ్మ శరీరం కోమలమైనా ఆత్మధైర్యాన్ని నిలుపుకుంది.  తన వ్యక్తిగత జీవితానికి, సాహిత్య జీవితానికి ఒక గురిని ఏర్పరుచుకుంది.  దానిని ఇలా ఈ క్రింది వటల్లో వ్యక్తం చేసింది.
ఒడిదుడుకులకు క్రుంగిపోకు, లొంగిపోకు
జీవన గమనంలో ఎటువంటి కష్టమైనా రానీ,
ఓర్చుకో  ఏమైనా కానీ, అని ఎదిరించి నిలబడు
రేపు ఏమౌతుందో అని తలచి ఆగిపోకు
ఎదిరించి ముందుకు నడు
ఆమె తీసుకున్న క్రమబద్ధ నిర్ణయన్ని పై మాటలు తెలుపుతాయి.
రాజమ్మకు ‘భారతి’ అన్న పేరును కలిగించింది, టి.టి. శర్మ పురాశాసన పరిశోధన శాఖలో పనిచేసినప్పుడు, ఆయన పై అధికారిగా ఉన్న కృష్ణవచార్యులు.  సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో రాజమ్మ ‘స్వరాజ్య పరిషత్తు’ అన్న దేశభక్తి గీతాన్ని రచించింది.  దానిని ‘తిలక సందేశ’ అన్న పత్రికలో ‘భారతపుత్రి’ అన్న పేరుతో ముద్రించారు.  దానిని చసిన కృష్ణవచార్యులు, తాము స్వయంగా దేశభక్తులు, ఆంధ్రాంగ్ల పండితులు కావడం మూలాన, ఆ రచనా నామం కంటె       ‘భారతి’ అన్నది సార్థకంగా ఉంటుందని సచించారు.  అప్పటినుంచి రాజమ్మ ‘భారతి’ గా ప్రకటించుకుంది.  సంగీత సాహిత్యాలను రెండింటిని సహజంగా ముడివేసుకుని, దేశభక్తి స్రోతస్సుగా ప్రవహించిన ఆమె కవిత ‘భారతి’ అన్న పేరును సార్థకం కావించింది.
రాజమ్మకు బాల్యం నుంచి సంగీతం అంటే ఆసక్తి చాలా ఎక్కువ.  ఆమె బాలికగా ఉన్నప్పుడు తమ ఇంటి వద్ద ఒక భిక్షుకి పాడినపాటను విని, చరణానికొక కాసు చొప్పున ఇచ్చి ఆ పాటను నేర్చుకుంది.  ఆమె వధ్యమిక పాఠశాలలో చదివేటప్పుడు ‘సావిత్రి’ అన్న ఆద్యంతం సంగీత ప్రధానమైన నాటకంలో ముఖ్య పాత్రను ధరించి అందరిని ముగ్ధులను చేసింది.  ఆమె గాన నైపుణ్యాన్ని ఆనాడు చసిన వారందర ఆమెకు సంగీత పాఠాలను తప్పక నేర్పించమని ఆమె తండ్రికి సిఫారసు చేసారు.  పెద్దలు చెప్పిన వటను కాదనలేక రాజమ్మ తండ్రి ఆమెకు సంగీతం చెప్పించారు.  అలా మొదలైన సంగీతం వీణాభ్యాసంతో పరిణతి చెందింది.  రాజమ్మ సంగీతాన్ని ఒక్కసారి విన్నవారు మరిమరి వినాలని కోరుకునేవారు.  గాంధీ కర్నాటకా నికి వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా ఆమెను తమవద్దకు పిలిపించుకుని ఆమె సంగీతాన్ని వినేవారు.  రాజమ్మ సాహిత్య రచనకు, దేశభక్తికి అధిక సమయం కేటాయించడం వల్ల, కేవలం సంగీతజ్ఞురాలిగా కచేరీలను చేయలేదు.  సంగీత ప్రపంచానికి వత్రమే తనను నియమితం కావించుకోలేదు.  ‘గాన విద్యను ధార్మిక విద్య’ గా గ్రహించిన ఆమె ఆ విద్యతో సార్వత్రిక ప్రయెజనాన్ని సాధించింది.
రాజమ్మ బాపూజీని మొదటి సారిగా చెన్నై సముద్ర తీరాన జరిగిన మహాసభలో చసింది.  జన సముద్రం మరొక వైపు ఉప్పొంగుత ఉండగా ఎత్తైన వేదిక మీద గాంధీ కూచుని ఏక ధాటిగా చపుతున్న నాయకత్వ ప్రతిభకు రాజమ్మ దిగ్భ్రాంతిని చెందింది.  రాజమ్మ సోదరులకున్న పరిచయలను బట్టి వారి ఇంటికి అనేకమంది సుప్రసిద్ధ వ్యక్తులు వచ్చి పోత ఉండేవారు.  వారి వలన రాజమ్మకు గాంధీని గురించి పరోక్ష పరిచయం కలిగింది.  దేశాద్యంతం ఆయన నడుపుతున్న రాజకీయ ఆందోళనను గురించిన అవగాహన కలిగింది.  గాంధీ దర్శనం ఆమెకు దివ్యమైన అనుభతిని కలిగించింది.  అక్కడి వాతావరణం, గాంధీని చచిన నతన భావావేశాలతో ఆమె అక్కడికక్కడే ఒక గేయానికి రాగయుక్తమైన రపకల్పన చేసింది.  ఆ గేయమే ఆమె రాసిన మొట్ట మొదటి పాట.  రాజమ్మకు ఆ సమయంలో గాంధీని కలుసుకునే అవకాశం రాలేదు.  ఆ రోజు సభలో సాయంత్రం ఆమె తాను రాసిన పాటను పాడింది.
దేశ సేవా నిరతులవండి లోకులార
పరులకు దాసులమౌతే నష్టం తప్పనిసరి
భారతీయులం మనం, మన భారతం
ధరకోసం జీవిద్దాం ధరకోసం శ్రమిద్దాం
మహత్తరమైన స్వాతంత్య్ర కాంక్షతో నిండిన ఆ పాట ఆనాటి సభకెంతో ఉత్తేజాన్ని కలిగించింది.  గాంధీ దర్శనంతో రాజమ్మ శాంతియుత జీవితం అభ్యుదయనికి మరలింది. ఆమె ‘దేశసేవ ఈశసేవ’ గా తలచింది.
1921వ సంవత్సరంలో అహమ్మదా బాదులో కాంగ్రెసు మహాసభ ఏర్పాటయింది.  ఆ సవవేశంలో భాగంగా అఖిల భారత సంగీత సమ్మేళనం జరిగింది.  ఆ సంగీత సమ్మేళనంలో పాల్గొనడానికి రాజమ్మకు ఆహ్వానం వచ్చింది.  శర్మ తన ఉద్యోగ వృత్తి మూలంగా ఆ సవవేశానికి వెళ్ళవచ్చునా అని సందేహించారు.  కాని రాజమ్మ ఆయన చేస్తున్న సేవావృత్తి కంటే సభకు వెళ్ళడమే ముఖ్యమని నిర్ధారించింది.  దంపతులిద్దర ముంబై రైలెక్కారు.
రాజమ్మకు బాపూజీని దరం నుంచి చసి నమస్కరించడం ఆశయం కాదు.  ఆయనను కలుసుకుని వట్లాడాలి.  ఆయన పరిచయం చేసుకోవాలి.  అదే ఆమె లక్ష్యం.  ఆమె అహమ్మదాబాదు సభకు వెళ్ళేటప్పుడు, ఆమె పట్ల అభివనం కలిగిన చక్రవర్తి రాజగోపాలచారిగారు ఆమె కొక సిఫారసు ఉత్తరాన్నిచ్చారు.  ఆ సభలో రాజమ్మకు ఆ లేఖను గాంధీకివ్వడం సాధ్యం కాలేదు.  ఆ మర్నాడు ప్రార్థనా గీతాన్ని పాడే అవకాశం కలిగింది.  ఆమె ప్రార్థనగా తాను రచించిన
జై భారత భూమికి మాతకు జై పావన
మూర్తికి సన్మంగళమగు గాక సతతం
దేవ ధర్మావతార గో విప్ర హిత విచార
పావన మహివకృతికి
భావ వైభవ సృష్టి లావణ్య శోధ
జీవన సుఖ దాయనికి…. అన్న గేయన్ని ఆలపించింది.
ఆ పాట ఆనాడు చాలా ప్రచారాన్ని పొందింది.  అనేక సంవత్సరాలు విద్యాలయల్లో, కళాశాలల్లో ఆ పాటను ప్రార్థనగా పాడేవారు.  అహమ్మదాబాదు సభ రాజమ్మ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది.  ఆమెకు అక్కడ స్వామి శ్రద్ధానందగారి ఆశీర్వాదం, టంగుటరి ప్రకాశం పంతులు గారి ప్రోత్సాహం లభించాయి.  ఆయన ఆమెను తెలుగులో కూడా దేశభక్తి గీతాలను రచించమని కోరారు.
రాజమ్మ ఆరోజు సాయంత్రం గాంధీని ఎలాగైనా కలుసుకోవాలని నిశ్చయించుకుంది.  ఆమె ఎవ్వరికీ చెప్పకుండానే బాపూజీ నివాసానికి భజన కూటమితో బయలు దేరింది.  దర్శనం కావాలి, దర్శనం కావాలి అంట ముందుకు వెళ్ళింది.  అక్కడ నలు వడుకుతున్న ‘శ్రీమతి సరళాబాయి చౌధురాణి’ గారి పేరు నడిగి తెలుసుకుని ఆమె చేతికి గాంధీకిమ్మని తన దగ్గరున్న లేఖనిచ్చింది.  గాంధీ అక్కడకు రాగానే ఆ లేఖను చసారు.  దానిని చదివి చిరునవ్వు నవ్వారు.  ఆమెను తాను పొద్దున సభలో చసాను కదా!  ప్రార్థన ఎంతో బాగా పాడింది కదా, అంట ఆమెను ముందే గుర్తించినట్టు తెలిపారు.  రాజమ్మ ఆయన పాదాలను తాకి నమస్కరించింది.  బాపూజీ ఆమెను ప్రీతి వాత్సల్యాలతో పలకరించారు.  అక్కడున్నన్ని రోజులు ఆమె ప్రార్థనను నిత్యం పాడాలనీ, కర్నాటకానికి తాము వచ్చినప్పుడు ఆమె సంగీతం వినిపించాలని ఆదేశ పూర్వకంగా అభ్యర్థించారు.
బాపూజీని మొదటిసారి చసినప్పుడే ఎంతో ప్రభావితురాలైన రాజమ్మ, ఆయన పరిచయం కలిగాక ఆమె ఆలోచనలకు ఒక మూర్త రపం కలిగింది.  ఆమెలో ఉత్సాహం రెట్టింపు అయింది.  ఆ స్ఫర్తితో అనేక గేయలను రాసింది.  వాటిల్లో ‘బ్రిటిషు వారు భారతదేశాన్ని విడిచి వైదొలగాలి’ అన్న ఉద్వేగంతో రాసిన ‘రాష్ట్రశక్తి విరాడ్రపధారీనవె’ అన్నపాట, ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి ‘సత్యసంగ్రామరంగానికి తరలిరండి, రండి’ అన్నది, దేశ స్వాతంత్య్రం లభించాక ‘భారత స్వాతంత్య్ర యజ్ఞ సవప్తి, స్వరాజ్య సిద్ధి సవరంభ సుదినం ఇది,’ ‘వీరఘోషల విజయ పతాక నెగరేసే రోజిది’ అన్న పాటలు చాలా ప్రచారాన్ని పొందాయి.  అహమ్మదాబాదు నుండి తిరిగి వచ్చాక రాజమ్మ భర్త శర్మ ఆనాటి ఉద్యమంలో సక్రియత్మక మైన భాగం వహించసాగారు.  రాజమ్మ ఆయన కార్యకలాపాలకు సంపూర్ణ సహకారమిస్త ప్రగతి శీలత్వానికి కళారప సాంగత్యమైంది.
1924వ సంవత్సరంలో కర్నాటక బెల్గాంలో కాంగ్రెసు సమ్మేళనం జరిగింది.  అందులో శ్రీ శర్మ కార్యనిర్వాహక బాధ్యతను వహించారు.  అప్పుడు రాజమ్మకు మొదటి కువర్తె జనించింది.  ఆమె మూడు నెలల బాలెంత.  ఆమె ఆ సమ్మేళనానికి వెళ్ళలేదు.  గాంధీ శర్మను చడడంతోనే తన సోదరి రాజమ్మ ఆయనతో పాటు రాలేదని గ్రహించారు.  ఆమె యెగక్షేవలను అడిగి తెలుసుకున్నారు.  ఆమె తప్పక అక్కడకు రావాలని నిశ్చయించారు.  ఆమె వచ్చి ఆ సమ్మేళనంలో భాగంగా ప్రసిద్ధ సంగీత విద్వాంసులందర పాల్గొంటున్న సంగీత కచేరీలో గానం చేయలని ఉద్దేశించారు.  వెంటనే ఆమెను బయలుదేరి రమ్మని వర్తవనం పంపారు.  గాంధీ పంపిన కబురు రాజమ్మకు అపారమైన ఆనందాన్ని కలిగించింది.  వెంటనే వీణతోన చంటిపిల్లతోన బెల్గాంకు వచ్చి చేరింది.  ఆ సమావేశంలో రోజూ ఉదయ ప్రార్థనను పాడడమే కాకుండా, పండితులు, విద్వాంసులు, పోరాటయెధులు అందర ఒక్కచోట చేరిన సభలో వీణావాదనను చేసింది.  దాసపదాలన, కృతులన ఆలపించింది.  ‘రామనామం జపించినవారికి భవబంధన ముండునా’ అన్న పాటను పాడుతున్నప్పుడు బాపూ తన్మయులయ్యరు.
1927వ సంవత్సరంలో నిరంతరమైన పోరాటం వల్ల గాంధీ ఆరోగ్యం కొంత క్షీణించింది.  వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సచించారు.  ఆయన తన విశ్రాంతి స్థలంగా కర్నాటక ప్రాంతంలోని నందిగిరులను ఎన్నుకున్నారు.  అక్కడ కొన్నిరోజులు బసచేసారు.  తదుపరి బెంగుళూరుకు వచ్చారు.  అక్కడ కువర పార్క్‌ దగ్గర మైసరు మహారాజుకు అతిథిగా ఒక నెలరోజుల కాలం ఉన్నారు.  గాంధీతో పాటు గంగాధర రావు దేశపాండే, రాజాజి మొదలైన నాయకులు ఉన్నారు.  గాంధీ కార్యదర్శి మహదేవభాయి దేశాయి సంగీతప్రియులు కావడం వల్ల వారానికి రెండురోజులైనా ఇతరులతో కలసి శర్మ ఇంటికి వెళ్ళేవారు.  రాజమ్మ వీణావాదనను వారు వినేవారు.  ఒకరోజు మహదేవభాయి బాపూజీకి ‘వైష్ణవ జనతో’ గీతాన్ని కన్నడంలో వినాలని ఉందన్న, వారి కోరికను ఆమెకు తెలిపారు.  ఆమెను ఆ పాటను కన్నడంలోనికి అనువదించమని సచించారు.  రాజమ్మకు హిందీ తెలియక పోయినా, ఆ పాటను పలువర్లు వినడం వలన అర్థ స్వారస్యాన్ని బాగా గ్రహించింది.  ఆ గీతాన్ని కన్నడంలోనికి అనువదించింది.  ఆ సమయంలో ఆమె రెండవ సంతానం కువరుణ్ణి వెస్తున్న నిండునెలల గర్భిణి.  మిత్రులు రాజమ్మ వీణను ప్రశంసిస్తుంటే బాపూజీ తాను కూడా ఆమె వీణావాదనను వినాలని అభిలషించారు.  రాజమ్మ గాంధీ బసకు వెళ్ళి వీణను వినిపించింది.  చివరకు తాను అనువదించిన కన్నడ ‘వైష్ణవ జనతో’ గీతాన్ని మయవళవ గౌళ రాగంలో పాడింది.  గాంధీ ఆమె వీణను తన్మయత్వంతో విన్నారు.  ఆమె గీతాన్ని విన్నాక ఆ పాట మరో రాగంలో పాడితే బాగుంటుందని అన్నారు.  గాంధీ సంగీతజ్ఞానానికి అక్కడున్న వాళ్ళందర ఆశ్చర్యపోయరు.  రాజమ్మ ఇంటికి తిరిగి వెళ్తుంటే ఆమెను మరునాడు మరల రమ్మని ఆహ్వానించారు.  రాజమ్మ నిండునెలల గర్భిణి అన్న విషయన్ని తెలుసుకుని, ‘మరేం ఫరవాలేదు, ఆమెను రమ్మనండి’ అన్నారు.  ఆ మరునాడు రాజమ్మ భర్తతో కలసి వెళ్ళింది.  ‘వైష్ణవ జనతో’ పాటను శ్రీ రాగంలో పాడి వినిపించింది.  గాంధీ ఎంతో సంతసించారు.  భార్య ప్రావీణ్యతను పెద్దలందర ప్రశంసిస్తుంటే గర్వపడిన శర్మను కూడా మెచ్చుకున్నారు.
1924లో బాపూజీ మరల బెంగుళూరుకు వచ్చారు.  ఆయన తిరిగి వెళ్తూ, శర్మ, రాజమ్మ దంపతుల ‘విద్యావినయ సంపత్తును ప్రస్తుతిస్త’ ఒక శ్లోకాన్ని స్వహస్తాలతో రాసి వారికిచ్చారు.  తదుపరి ఆరేడు సంవత్సరాల అనంతరం గాంధీ బెంగుళూరుకు వచ్చారు.  శర్మను చూడ్డంతోనే ఎప్పటివలెనే రాజమ్మను ్గూర్చి అడిగారు.  ఆమె కూడా వస్తే కొంతసేపు సంగీతం విని ఆనందించేవాడను కదా! అని ఆమె రాని లోటును పేర్కొన్నారు.  ఆ వటను భర్త వలన విన్న రాజమ్మకు అపారమైన సంతోషం కలిగింది.  బాపూజి చెప్పిన సమయనికి సరిగ్గా వెళ్ళాలని సిద్ధమైంది.  కాని ఆమెను తీసుకుని వెళ్ళవలసిన మనిషి రావడం ఆలస్యం అయింది.  గాంధీ సమాయజాప్యాన్ని సహించేవారు కాదు.  రాజమ్మ బెదురుత ఆయన ముందు హాజరైంది.  గాంధీ ఆమెను చసి ‘వేళ మించింది.  ఇక నేను స్నానానికి వెళ్ళాలి’ అంట లేచారు.  రాజమ్మ కన్నీళ్ళ పర్యంతం అయింది.  కస్తరిబా ఆమెను దగ్గరకు తీసుకుని ‘బాపూజిని ఒప్పిస్తాను, సంగీతాన్ని తప్పక వింటారు’ అని ఓదార్చింది.  అప్పటికి రాజమ్మకు రెండవ కువరుడు పుట్టాడు.  రాజమ్మ వాడిని ప్రేమగా ‘బాపూ’ అని పిలుచుకునేది.  ఆ సంగతిని విన్న గాంధీ నవ్వుకున్నారు.  కస్తరిబా వట ప్రకారం ఆమె సంగీతాన్ని విన్నారు.  రాజమ్మకు గాంధీ దర్శనం అదే కడసారిగా మిగిలింది.  రాజమ్మకు గాంధీ మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది.  ఆమె ఆ విచారంలో
 ‘కర్మవీరుడా, జీవన్ముక్తుడా
 ధర్మరపుడా నవె నవె
 మర్మాన్నెరిగి సన్మార్గాన్ని చపిన
 కర్మచంద్ర మొహనదాస నవె’ అన్న ‘నమన గీతాన్ని’ రాసింది.  నిత్య ప్రార్థనగా బతికి ఉన్నంత కాలం పాడేది.  గాంధీ వద్ద పత్రికాభివనాన్ని, సంగీత గుణ ప్రశంసను సాహిత్య అభినందనలను పొందిన రాజమ్మ ‘నెనపుగళు’ (స్మృతులు) అన్న శీర్షికలో గాంధీతో తన అనుబంధాన్ని, చివరి సవవేశాన్ని ఎంతో హృద్యంగా తెలిపింది.  రాజమ్మ గృహిణిగా నిండుతోడై భర్తకు సహకరించింది.  ఆ రోజుల్లో ‘తమ ఇల్లు కురుక్షేత్రంలా ఉండేదని, క్షేత్రపాలకురాలు తమ శ్రీమతి’ అని శర్మ చెప్పారు.  వారి ఇల్లు రాజకీయ అపరాధుల స్థావరమని తలచిన పోలీసులు పర్యవేక్షణకు వచ్చేవారు.  రాజమ్మ వారిని బెదిరించి వెనక్కు పంపేది.  ఆమె ధీరత్వాన్ని చసిన వారికి ఆమె అనుజ్ఞ లేకుండా ఆమె ఇంట కాలుపెట్టడం సాధ్యం అయ్యేది కాదు.
1947లో స్వాతంత్య్రం లభించింది.  మైసరు వత్రం రాజుల పరిపాలనకు చిక్కింది.  అప్పుడు ‘మైసరు ఛలో’ ఆందోళన ఆరంభం అయింది.  అందులో రాజమ్మ కుటుంబం అంతా పాల్గొన్నారు.  శర్మ చెరసాల పాలైనప్పుడు జరిగిన సభలకు రాజమ్మ అధ్యక్షత వహించింది.  ఆ పోరాట ఫలితంగా మైసరు ప్రభుత్వ ఆధీనానికి వచ్చింది.  రాజమ్మ కువరుడు శ్రీరంగ తల్లిని గురించి చెప్తూ ‘వ తల్లి జైలుకు వెళ్ళలేదు, బ్రిటిషువారి లాఠీదెబ్బలు తినలేదు, భారత భాగ్యవిధాత ప్రీతిపుత్రిక అనిపించుకుంది’ అన్న వటలు సందడి చేయకుండానే స్వాతంత్య్ర శ్రద్ధను చపిన ఆమె వ్యక్తిత్వాన్ని చాటుతాయి.
నిజానికి ‘భారతి’ సాహిత్యం నాటక రచనతోనే ఆరంభం అయింది.  1919వ సంవత్సరంలో అమెచర్‌ నాటక సంస్థ వారు లలితకళా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసారు.  దానికి ముఖ్యఅతిథిగా రవీంద్రనాథఠాకూరు గారిని ఆహ్వానించారు.  కన్నడంలో నాటక రచనను ప్రోత్సహించేందుకు నాటక రచనా స్పర్థను ఏర్పాటు చేసారు.  ఆ పోటీలో రాజమ్మ ‘సుఖవర్గ’ అన్న మూడంకాల నాటకాన్ని రాసి పాల్గొంది.  ఆమెకు మరొక రచయితతో పాటుగా ప్రథమ బహువనం లభించింది.  ఆ నాటక బహువన ధనం మూడువందలను వారిద్దర చెరిసగం పంచుకున్నారు.  రాజమ్మ రాసిన నాటకాలలో ‘భారతి రపకత్రయం’ అని మూడు నాటకాలు పేరు తెచ్చుకున్నాయి.  రాజమ్మ రాసిన నాటకాలలో స్త్రీ పాత్ర చిత్రణను శ్రద్ధగా కావించింది.  ఆమె మొదటి నాటకం ‘సుఖవర్గ’ బాల్య, వితంతు వివాహానికి సంబంధించినది.  ఆమె తన నాటకాలలోని స్త్రీ పాత్రలను సాటి స్త్రీగా అర్థం చేసుకుని దర్శించింది.  ప్రసిద్ధమైన మూడు నాటకాలలో ‘తపస్విని’ ఊర్మిళ పాత్రను భిన్నకోణంలో చపుతుంది.  సీతారామలక్ష్మణులతో అరణ్యాలకు వెళ్ళక ఒంటరిగా మిగిలిన ఊర్మిళ చేసిన త్యాగాన్ని ఆమె మనస్సులో చెలరేగిన కలవరాన్ని రాజమ్మ ఎత్తిచపింది.  రవీంద్రనాథఠాకూరు ఒక వ్యాసంలో ‘కావ్యాలలో నిర్లక్షిత’ పాత్రలను గురించి రాస్త, అటువంటి వాటిలో ఊర్మిళ పాత్ర గమనార్హమైనదని విశ్లేషించారు. ఆ వ్యాసాన్ని గురించి తెలుసుకున్న రాజమ్మ తాను కూడా ఊర్మిళ ఆవేదనను గురించి ఆలోచించింది.  ఆ పాత్ర వైవిధ్యాన్ని ఇతర పాత్రల దృక్కోణంతో పరిశీలించి నిరపించింది.  రెండవ నాటకం మహాసతి చారిత్రక ప్రధానమైనది.  రాజమ్మ భర్త పురశాసన విభాగంలో పరిశోధన చేసినప్పుడు దొరికిన శాసనాధారంగా రాసిన నాటకం అది.  ఆ నాటకంలో చోళరాజు ఆధీనంలో ఉన్న నెమలినాడును పాలించిన ‘ఏచన’ భార్య ‘దేకబ్బె’ మహాసతి అయిన వృత్తాంతం ఉంది.  రాజమ్మ దేకబ్బె సహగమనాన్ని సమర్ధించదు.  చారిత్రక సత్యాన్ని దాచదు.  కాని ఎంతో చతురంగా దేకబ్బె చేసిన పని ఏవత్రం సమర్థనీయం కాదని తెలుపుతుంది.  మూడవ నాటకం ‘వాత్సల్యతరంగలీలా’ దేవకన్య అయిన మేనకకు వనవ స్వభావం ఆరోపిస్తుంది.  మేనక పసికందును విడిచి వెళ్ళిపోయేటప్పుడు సహజ వతృమూర్తిలా విలపిస్తుంది.  పసిపాపను కాపాడుమని ప్రకృతిని వేడుకుంటుంది.  ఆ నాటకంలో మేనకలోని స్త్రీ భావాలను రాజమ్మ అత్యుత్తమంగా చిత్రించిందని ‘భాస్కరుడు చడనిది భారతి చసిందని’ అంటారు.
రాజమ్మ చపరికి సంప్రదాయన్ని రపుదిద్దుకున్నా, ఆమె కుటుంబంలో వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని ఎన్నడ కోల్పోలేదు.  ఆమె సాహిత్యంలో నిరంతరం వాస్తవికమైన ఆదర్శాన్ని ప్రతిబింబించింది.  ఆమె స్త్రీల అభ్యుదయన్ని ఊహాత్మకంగా కాక నిర్మాణాత్మకమైన దృష్టితో పరిశీలించింది.  సాహిత్యంలో నతనమైన ఆకాంక్షను, అభిలాషను సక్రియత్మకంగా మలచింది.
రాజమ్మ స్త్రీవిద్య అన్న వ్యాసంలో చెప్పిన వటలు ఆమె నిజదార్శనిక ఆదర్శాన్ని తెలుపుతాయి.  ఆమె స్త్రీ విద్య ఆత్మవిద్యగా పరిణమించాలని కోరింది.  స్త్రీకి చదువు లోకనీతిని తెలుపు విధంగా ఉండాలని ఆమె తీర్మానించింది.  లోకజ్ఞతను కలిగిన స్త్రీ పురుషునికి సవనమే కాదు, అతనిని మించగలదని ఆమె నమ్మింది.  క్రమబద్ధమైన జీవనసరళిని తెలుసుకున్న స్త్రీలు తమ కుశల హస్తాలతో రచనలను కావిస్తే అద్భుతమైన సాహిత్యం వెలువడు తుందని ఆమె విశ్వసించింది.  మన జీవితం కల్మషరహితమైతే సాహిత్య శుభ్ర వాతావరణం నిష్కల్మషమైన మనస్సులను పరిమళిస్తుందని ఆమె తెలిపింది.
రాజమ్మగారి రాష్ట్రశక్తి, రాష్ట్రభక్తి కవన సంకలనాలు వెలువడ్డాయి.  ఆమె అప్రకటితమైన రచనలింకా వెలువడనున్నాయి.  ఆమె దేశభక్తి గీతాలతో పాటు భావగీతాలను కూడా రాసింది.
రాజమ్మ తన గృహమెప్పుడ నందగోకులంగా ఉండాలని ఆశించింది.  ఆమె తన మనుమలకు, ఇరుగుపొరుగు పిల్లలకు చక్కని కథలను విప్పి చెప్పేది.  రాజమ్మకు 1973వ సంవత్సరంలో పతీవియెగం కలిగింది.  ఆమె ఆ దుఃఖాన్ని దాచుకుని ఆయన అసంపూర్తిగా వదలిన ‘ఇందిరా ప్రియదర్శిని’ రచనను పూర్తి కావించింది.
రాజమ్మకు బాల్యం నుండి కలిగిన సంగీతాభిలాష ఆమె దేశభక్తి గీతాలకు ఆకరమై, గాంధీవంటి ఉత్తమ పురుషులకు చేరువయ్యే భాగ్యాన్ని కలుగజేయడమే కాక, కడవరకూ తోడుగా నిలిచింది.  ఆమె వృద్ధురాలైన తదుపరి సాహిత్య వ్యాసంగాన్ని నిలిపింది.  కాని సంగీతాన్ని వదలక అనేక మంది శిష్యులకు వీణ పాఠాలను నేర్పింది.  సంగీతాభ్యాసాన్ని కలుగజేసింది.
భారతి 1943లో శివమొగ్గలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనం మహిళా గోష్టికి అధ్యక్షత వహించింది.  ఆమె ఆ సభలో చేసిన కోమల ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  రాజమ్మ సంగీత సాహిత్య ప్రతిభకు ఆమెకు 1968లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.  1972లో భారతి అభినందనా సమితి, ఆమె అభినందన గ్రంథాన్ని వెలువరించారు.  ప్రఖ్యాత కన్నడ రచయిత వస్తి అధ్యక్షతన జరిగిన భారతి అభినందన సభలో ఆ దంపతులకు విశేష సత్కారం లభించింది.
రాజమ్మ తన 84వ ఏట మరువలేని సాహిత్యాన్ని జీవన సంవిధానాన్ని మనకు మిగిల్చి తాను కనుమరుగైంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.