పి.సత్యవతిగారి ”గ్లాసు పగిలింది” కథా విశ్లేషణ

పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత

కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్‌ బాబు భార్య.
 వీలర్‌ అండ్‌ వీలర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గారికి, వారి సతీమణికి డిన్నర్‌ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.

ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. అప్పుడే పార్టీలో టేబుల్‌పై పెట్టడానికి సబ్బు పొడితో తోమి తుడిచి పెట్టుతున్న కొత్త గాజు గ్లాసుల్లో ఒకటి పని కుర్రాడి చేతినుండి జారి పడి పగిలింది. ఆ గ్లాసు పగలటంతో అమాజి గారికి కోపం, బాధ కలిగాయి కాని ఆ సమయంలో పని కుర్రాణ్ణి తిట్టడం, కొట్టడం వలన పని జరగదని తెలుసు కనుక కోపాన్ని లోపలే అణుచుకుంది.
గ్లాసు పగలడమే కాదు గాజు ముక పని కుర్రాడి చేతిలో గుచ్చుకుంది. అతిథులు వచ్చే వేళకు పని కుర్రాడి చేతికి బ్యాండేజి చేసి, ఉతికిన బట్టలు వేసి గది దగ్గరే ఉండి అన్నీ అందిస్త పని స్మార్ట్‌గా చేయల౦టుంది అమాజి.
పని తొందర్లో పడి పని కుర్రాడు ప్రొద్దుటి నుండి ఏమీ తిన లేదు. రెండో ఆట సినిమా వదిలిపెట్టే వరకు డిన్నర్‌ కొనసాగుతనే వుంది. ఆకలి మంటను, చేతి మంటను, నిద్రలేమితో కళ్ళ మంటను భరిస్తూ అమ్మగారు చెప్పే పనులన్నీ చేస్తూనే వున్నాడు. అమ్మగారు ప్రొద్దున పాల సీసాల కారు రాకముందు వాడిని లేపింది. మళ్ళీ పాలొచ్చాయి. అప్పటికి డిన్నర్‌ తెమలటంతో ఎంతో జాగ్రత్తగా అన్నీ సర్ది పాలు తీసుకొని లోపలికి వచ్చే వరకు మిగిలిన పదార్థాలు పని మనిషి సుబ్బులు తీసుకుంటూ వుండ టం చూశాడు. తినటానికి తనకేం లేవా? అని అడిగాడు. నిన్నటి నుండి తింటనే వున్నావ్‌ మళ్ళీ ఇవన్నీ కావాలా? అని ఎదురు ప్రశ్న వేస్తుంది పని మనిషి సుబ్బులు. అమ్మగారు నన్నే తీసుకోమన్నారంట అన్నీ తానే తీసుకుంటుంది. చేసేదేమీ లేక రోజంతా తిండి లేని నీరసంతో నిద్రొచ్చి పడుకుంటాడు. అవ్మజి పదకొండు గంటలకు నోట్లో బ్రష్‌తో వచ్చి నడుముపై తన్నిన తన్నుకు గాని కుర్రాడికి మెలుకువ రాలేదు. నిన్న డెబ్బై రుపాయల గ్లాసు పగలకొట్టి ఇంకా పడుకుంటావా? మీ అమ్మకు కబురెట్టాను వచ్చి కనుక్కుంటుంది. అని నిన్నటి నుండి దాచుకున్న కోపాన్ని వెళ్ళ గక్కుతుంది.
నిన్న మధ్యాహ్నం తినమని ఇచ్చిన అన్నం టేబుల్‌ క్రింద అలాగే ఉంది. అది చూసి అమాజి ఎన్ని పనులున్నా నేను భోజనం వనలేదు. నువ్వు ఎందుకట్లా ఇచ్చిన అన్నం వదిలేసావని దబాయించి ఆహార పదార్థాలు వేస్టుకావడం నేను చూడలేను అంట ఆ అన్నమే తెచ్చుకుని తినమని వత్తిడి చేస్తుంది. ఆ అన్నం వాసనకు కుర్రాడి కడుపులో తెమిలి వాంతి రావడంతో ”వెదవసచ్చినోడు ఎంత సుకువరవె వాడింట్లో వేడివేడిగా వండించుకుని తింటాడు కాబోలు” వెక్కిరింతగా భర్తకు పిర్యాదు చేస్తుంది.
కుర్రాడి తల్లి వచ్చింది. గ్లాసు పగల కొట్టాడని వాడు అంగీకరించాడు. దానికి పరిహారంగా నెలకు పదిరపాయల చొప్పున ఏడు నెలల జీతం ఇవ్వకూడదని అమాజి నిర్ణయించింది.
కుర్రాడి తల్లి ఆమె కాళ్ళా వేళ్ళా పడి శిక్ష తగ్గించమని బ్రతిమిలాడింది. అమ్మగారి అహాన్ని తృప్తి పరచడానికి కొడుకును కసితీరా కొట్టింది. దానితో తృప్తి పడిన అమాజి తన కెంతో దయ కలిగినట్లు, బీదల పట్ల తనకెంతో జాలి ఉన్నట్లు, పని కుర్రాడితో వాడు తిన బోయి వాంతి చేసుకున్న అన్నాన్నే తల్లికి తెచ్చివ్వమని పురమాయిస్తుంది.
తాము తిన్న తరువాత వాడు తినవచ్చులే అని సమాధానపెడుతుంది. తల్లి కూడా ఆ అన్నం తినలేక అమ్మగారు చూడకుండా చెత్త డబ్బాలో వేసి కొడుక్కు కొనుక్కు తినమని అర్ధొరూపాయి చేతిలో పెట్టి, పని ొమానుకోవద్దని చెప్పి వెళ్ళి పోతుంది.
టైము పన్నెండవుతోంది. అమ్మగారు కాఫీ తాగుతున్నారు. వారి భోజనాలిప్పుడే కావు. నిన్నటి నుండి ఆకలిమంట, చేతిమంట, వళ్ళంతా మంటలు. జేబు తడుముకోగా అతిధిగారు వీపు తట్టి ఇచ్చిన పది రపాయల కాగితం కనిపించింది. వాని ఆలోచనలో బస్సులు, రైళ్ళు వచ్చాయి. ఇల్లు వదిలి గేటు దాటాడు. ఎండలో తన మార్గం వెతుక్కుంట వాడు నడక ప్రారంభించడంతో కథ ముగుస్తుంది.
కథా విశ్లేషణ : ఈ కథలో పేద, ధనిక వర్గాల మధ్య వైరుద్యం, స్త్రీల జీవితాల, తీరు తెన్నులు చిత్రించబడ్డాయి.
1. వర్గ వైరుధ్యం :
అమాజి, వినోద్‌ బాబు భార్య భర్తలు. వీరు వీలర్‌ అండ్‌ వీలర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌కు ఇచ్చే విందు ఆర్ధికంగా ఇంకా అభివృద్ధి చెందడానికి, అవసరానికి మించిన డబ్బును సంపాదించి సంఘంలో తన ప్రతిష్టను పెంచుకోవడానికి. ఎక్కువ వ్యాపార వేత్తలు ఇచ్చే విందులు ప్రతిఫలాన్ని ఆశించి, అవసరానికి మించిన డబ్బును సంపాదించడానికే అన్నది లోక వాస్తవం.
అవ్మజి అభిప్రాయం ప్రకారం ఎంతో తెలివి, దక్షత గల వాడు వినోద్‌ బాబు. అందు వల్లనే ఎన్నో వ్యాపార లావా దేవీలు నడపగలుగుతున్నాడని ఆమె నమ్మకం. వీలర్‌ కంపెనీ డీలర్‌ షిప్‌ కనుక వస్తే ఊరిచివర వేస్తున్న మేడకి ఫైనల్‌ టచెస్‌ ఇవ్వచ్చు. స్వంత ఊర్లో ఉన్న ఇల్లు హోటల్‌గా వర్చవచ్చు. ఇంకా అనేక ప్రయెజనాలను సమకూర్చుకోవచ్చునని ఆమె ఆశ.
డీలర్‌షిప్‌ రావడం వలన వినోద్‌ బాబు ఇప్పటికే చేస్తున్న ఎన్నో వ్యాపారాలకు తోడు మరొక వ్యాపారాన్ని చేపడతాడు. అందువల్ల లాభాలు వస్తాయి. ఆ లాభాలతో హోటల్‌ వ్యాపారం ప్రారంభించవచ్చన్నది అవ్మజి ఆలోచన. అందువల్ల మళ్ళీ జరిగేది లాభార్జనే. డబ్బు సంపాదన, సంపాదించింది పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడం, ఈ వరుసలోనే వాళ్ళ జీవిత విధానం నడుస్తుంది. ఒక వ్యాపారంలో వచ్చే లాభాలు మరొక వ్యాపారానికి మదుపు కావడం మీదనే ఆమె దృష్టి వున్నదని హోటల్‌ వ్యాపారం గురించిన ఆమె ఊహలు సూచిస్తాయి.
భర్త వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందడానికి ఇచ్చే పార్టీల ఏర్పాట్లకు ఎటువంటి లోపం కలుగకుండ టేబుల్‌ మీద పెట్టే ఏ వస్తువైనా అతిథులను ఆకర్షించే విధంగా, గృహిణి పరిశుభ్రతను, తెలివి తేటలను చెప్పుకునే విధంగా వుండేటట్లు పని వాళ్ళతో చేయిస్తుంది అవ్మజి.
వినోద్‌ బాబు అవ్మజి ఇచ్చే విందులు ఆకలి తీరిన తరువాత అవసరాలకు మించిన డబ్బు సంపాదనకు వర్గాలు. డబ్బు ఖర్చుచేసి విందులు ఏర్పాటు చేయడం, డబ్బు సంపాదనకు, లాభాల సముపార్జనకు అనువైన వ్యాపార లావాదేవీలతో ఒప్పందాలు కుదుర్చు కొనడానికి, సంపాదన, లాభార్జన, కూడబెట్టడం, దాచుకోవడం ఈ క్రమంలోనే వాళ్ళ మేడలైనా బ్యాంక్‌ అకౌంట్లయినా బహువచనంలో ఉంటాయి.
ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట లేక బాధ పడే ఎందరో సమాజంలో ఉంటుండగా మరొకవైపు మేడలు, అకౌంట్లు పెంచుకునే అమాజి వంటి వారు కొందరు వున్నారు. ఈ వైరుధ్యాన్ని అమాజి ఇంట్లోనే పని కుర్రవాడి పరిస్థితి ద్వారా చూపారు సత్యవతి.
వినోదం కోసం, విలాసం కోసం, ఆర్ధిక లావాదేవీల కోసం విందులు జరిగే ఇంట్లో ఆకలి తీరని పని కుర్రాడున్నాడు. వాడు తల్లిదండ్రులను, తన వాళ్ళందరిని వదలివచ్చింది, ఆకలి తీర్చుకొనడానికే. ప్రాథమిక అవసరమైన ఆకలిని తీర్చడానికి శక్తి లేకనే తల్లి కన్న ప్రేమను చంపుకుని పిల్లవాడిని అమాజి ఇంట్లో పనికి కుదిర్చింది. కాని ఆ ఇంట్లో వాడు చూసే భోగాలు వాడి దరిదాపులకు రావు. అనుక్షణం చూసే, చవులరించే వంటకాలేవీ సరియైన సమయంలో, సరియైన రూపంలో వాడి అనుభవానికి రావు. చద్దన్నవె లేక, పాచిపోయిన అన్నవె వాడు తినవలసి రావడం ఈ విషయన్ని సూచిస్తుంది. అన్నపు రాసులు చూస్తె ఆకలి మంటలతో పని కుర్రాడు బాధపడుతు కాళ్ళు కడుపులోకి ముడుచుకుని పడుకొనవలసి రావడం విషాదకర వాస్తవం.
ఈ కథలో కీలకమైంది గాజు గ్లాసు. అది పగలడం అమాజి గారి విందును భగ్నం చేసే ఘటన. అది పగలడం పని కుర్రవాడి జీవనాన్నే భగ్నం చేసే ఘటన కావడం గమనించాల్సిన అంశం. నిజానికి ఆ గ్లాసు ఖరీదు 70 రుపాయలైనా అది అవ్మజి కొక లెక్కకాదు. కాని అనుక్షణం తమ ఇళ్ళల్లో తమ సంపదల మధ్య తామనుభవిస్తున్న భోగభాగ్యాలను చస్త బ్రతికే పని కుర్రాళ్ళను అదుపు చేయడానికి వాడి అజాగ్రత్తకు శిక్ష  సరియైన విధానంగా ఆమె భావిస్తుంది. ఆమే కాదు ఆమె ప్రాతినిధ్యం వహించే మా ర్గమంతా అట్లాగే అనుకుంటుంది. తమ చుట్ట ఉన్న సౌఖ్యాలకు, సౌకర్యాలకు తాము ఎప్పుడ పరాయి వాళ్ళమేనని వాళ్ళకు తెలియచేస్త ఉండటంతోనే అవ్మజిలాంటి వారి అధి కారం నిలబడుతుంది. అందుకే ఆ గ్లాసు ఖరీదు పూడే వరకు వాడికి జీతం ఇవ్వ కుండా పనిచేయించుకుంటానంటుంది. ఈ పరిష్కారం నచ్చలేదు. కనుక జీతం లేక సరియైన తిండి లేక ఆ ఇంట్లో వుండాల్సిన అవసరం, అగత్యం కనపడక పని కుర్రవాడు ఆ ఇల్లు వదిలి వెళ్ళి పోవడం పరిష్కారంగా ఎంచుకున్నాడు.
ధనిక వర్గ స్త్రీల ఉనికి, వ్యక్తిత్వం :
పని కుర్రాడు తోమి తుడిచి స్మార్ట్‌గా ట్రేలో అమర్చే గాజు గ్లాసులో ఒక గ్లాసు పగిలితే ఆరో గ్లాసు లేకుండా పార్టీ ఏర్పాట్లు ఎలా పూర్తవుతాయి అని చాలా ఆందోళన చెందిన అవ్మజి విజయ ఇంటి నుండి అలాంటి గ్లాసు తెప్పించి ఆ పార్టీని నిర్వహిస్తుంది.
 ఈ హడావుడి ఆందోళన ఇవన్నీ అమాజికి ఎందుకు? భర్తకు తగిన భార్యగా ఉండటమే స్త్రీ ధర్మం అయినప్పుడు వ్యాపార ప్రయెజనాల కోసం భర్త ఇచ్చే పార్టీలను గొప్పగా నిర్వహించడమే ఇల్లాలిగా తన బాధ్యత. ఆ సంస్కృతి, సంప్రదాయలు వంట బట్టిన స్త్రీ అమాజి. గృహస్తు ఎన్ని మర్యాదలు చేసినా గృహిణి దానికి తగ్గట్లు మెసిలితేనే సంసారం మూడు మేడలు ఆరు బ్యాంక్‌ ఎకౌంట్లుగా వర్ధిల్లుతుందని పెద్దలు చెపారు అని రచయిత్రి చెప్పడంలో వుద్దేశం అదే.
భర్తల సంపాదన సామర్ధ్యం స్త్రీలు తెరవెనుక తాము నిర్వహించాల్సిన తమ పాత్రను సమర్ధవంతంగా పోషించినప్పుడే ఇబ్బడి ముబ్బడి అవుతుంది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుందన్న పితృస్వామిక నీతికి అర్ధం అదే. ఆ చట్రంలో ఇమిడి పోయే భార్య కనుక అమాజి ప్రవర్తన అట్లాగే ఉండటం సహజం.
అవ్మజి వినోద్‌ బాబు భార్య. అంతకుమించి ఆమెకు మరొక వునికి లేదు. భర్త ప్రయెజనాలకు, ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంట భర్త సంపాదన మరింత వృద్ధి చెందడానికి ఇచ్చే పార్టీలు చేయడం, భర్త సంపాదనకు అభివ్యక్త రుపంగా అలంకరించుకుని అతని ప్రక్కనే నీడలా తిరగడం, పార్టీలకు వచ్చే అతిథులకు ఎటువంటి లోపం రాకుండా ఆదర్శ గృహిణిగా నడుచుకొనడం ఇదే ఆమె జీవితం.
పార్టీల ఏర్పాటుకు హడావుడి ఆమెదైతే వినోద్‌ బాబు చక్కటి పార్టీ ఇచ్చాడంట పేరు అతనిది. భర్త సంపాదించే డబ్బు తమ కోసమేనని, భర్త ఎంత డబ్బు సంపాదిస్తే తాను అంత దర్జాగా బ్రతుకవచ్చుననుకుంటుంది. కాని ఆ క్రమంలో తన ఉనికిని కోల్పోతున్నానని గ్రహించలేక పోతుంది స్త్రీ. చాలా వరకు అమాజి లాంటి స్త్రీలంతా నౌకర్లు, చాకర్లు, కార్లు, బంగ్లాలు, నగలు మొదలగు బోగభాగ్యాలను చసుకుని ఇదే వ జీవితమనుకుంట తృప్తి పడే చైతన్య రాహిత్యంలో ఉండటం వల్లనే ఇళ్ళు స్వర్గాలుగా భ్రమ కల్పిస్తాయి.
వినోద్‌ బాబు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్ని పార్టీలు ఏర్పాటు చేసినా ఆ పార్టీల ఏర్పాటుకు కావలసినవన్నీ సమకూర్చి, అతిథులను సంతృప్తి పరచడానికి అవ్మజి ఎంత సహకరించినా అందువల్ల అతనికి ఎన్ని ప్రయెజనాలు నెరవేరినా ఆమె వత్రం భర్త కనుసన్నలలో మెలగాల్సిందే.
భర్త ప్రయెజనాల కొరకు పెద్ద వారితో పరిచయలు చేసుకోవడం, ఆధునికంగా కనిపించడం, ప్రవర్తించడం చేస్తున్నదంతా భర్త ఇష్టానికి అనుకూలంగా భర్త కనుసన్నల మధ్య జరిగేదే.
వినోద్‌బాబు అతిథిగారి చేత రాయల్‌ సొల్యట్‌ మూత తీయించి ఛీర్స్‌ చెప్పారు. అతిథిగారి భార్య ఆ డ్రింక్‌ తీసుకొనటానికి కొంత మొహమాటపడింది. వినోద్‌ మనవాడే అంట భర్త హామీ ఇచ్చాక ఆమె గ్లాసు తీసుకుంది. ఆమె మగవాళ్ళతో సమంగా తాగుతుంటే ఆమె కట్టుబొట్టును చసిన పని కుర్రాడికి సినివలో జ్యోతిలక్ష్మి గుర్తుకు వస్తుంది. అంత అత్యాధునికంగా అలంకరించుకొని అన్ని పార్టీలకు హాజరయ్యే మేనేజర్‌ గారి సతీమణి కూడా భర్త అనుజ్ఞతోనే పార్టీలో ఆనందంగా పాల్గొంటుంది.
అతిథి గారి భార్య గ్లాసు తీసుకొనడం చసి మరి నేనేం చేయలన్నట్టు వినోద్‌ బాబు మొహంలోకి చసింది అమాజి. భార్య ఏ పరిస్థితులలో ఏ విధంగా నడుచుకోవాలో తేల్చే కోడ్‌ భర్త కన్నులలో వున్నట్లు అతను సీరియస్‌గా చూడడంతోనే ఫ్రిజ్‌లోంచి బత్తాయి రసం తెచ్చుకుంటుంది. అతను ఒక్కో పార్టీలో ఒక్కో ్మాదిరిగా ఆమెకు అనుజ్ఞలిస్తాడని, అతని కనుసంజ్ఞలను బట్టి, ముఖ కవళికలను బట్టి ఆ భార్య వాటిని అర్ధం చేసుకుని అమలు చేయవలసి ఉంటుంది. భార్య చేతులకు సమయం, సందర్భం నిర్ణయించేవాడు భర్త. తన మీద లోపలి నుండి అమలయ్యే ఈ నియంత్రణ అతిథుల ముందు బయటపడకుండా బత్తాయి రసం తెచ్చుకున్న అమాజి ”ఎంత వెడ్రన్‌ అయినా ఆంధ్రలో గృహిణులు ఇంకా అంత ఎత్తుకి ఎదగలేదని” సంజాయిషీ ఇచ్చుకొన్నది.
స్త్రీల జీవిత సమస్యలు-వైరుధ్యాలు :
సమాజంలో మనకు మూడు వర్గాలు స్త్రీలు కన్పిస్తారు. ప్రతి స్త్రీ చేయడానికి నిర్దేశించబడిన పని ఇంటి పని. మగవారు ఎక్కడ ఏ పనులు చేసినా ఇంట్లో వత్రం పని చేయల్సింది స్త్రీలే. ఇంటిపని, వంటపని, పిల్లల పోషణ ఇవన్నీ అని వర్గాల స్త్రీలు చేయవలసినవే.
ఆర్ధికంగా అన్ని విధాల వున్నవారు ఉన్నత వర్గపు స్త్రీలు. వీరికి కావలసినంత డబ్బుంది కనుక తాము చేయల్సిన పనులను చేయటానికి డబ్బిచ్చి మనుషులను పెట్టుకుంటారు. తమ ఇష్టానుసారము తమకు కావలసిన పనులన్నీ పని వాళ్ళపై ఆజమాయిషి చేస్తె చేయించుకుంటారు. వీరు స్వయంగా శ్రమ చేయరు. ఇతరులను నియంత్రిస్తూ చేయించుకుంటారు.
అదే మధ్య తరగతి స్త్రీలు పూర్తిగా కాకపోయినా కొంత ఆర్ధికమైన వెసులుబాటు ఉన్నవాళ్ళే. మొత్తంగా ఇంటిపని, పిల్లల పెంపకం తాము స్వయంగా చేసుకుంట, చేతి సహాయనికి కొద్దిపాటి డబ్బుతో ఇంటికి వచ్చి పనిచేసి వెళ్ళే వాళ్ళను చూసు కుంటారు.
పేద వర్గపు స్త్రీలు అన్ని పనులు తామే స్వయంగా చేసుకుంటారు. కాని వీరికి కావలసిన వనరులుండవు. ఆ వనరుల సంపాదనకే ఎక్కువ సమయన్ని వెచ్చించాల్సి వస్తుంది. వీళ్ళ సంపాదన పిల్లల పోషణకు సరిపోదు. ఒకళ్ళ సంపాదన మీద కుటుంబ పోషణ అసాధ్యం. ఐదు సంవత్సరాలు దాటిన వారందరు ఎవరికి చేతనైన పని వారు చేస్తేనే, సంపాదిస్తేనే ఆ పూట తిండి గడుస్తుంది. ఇటువంటి స్థితిలో పేద వర్గపు స్త్రీలు కుటుంబాన్ని, పిల్లలను తన సంపాదనతో పోషించలేక, పిల్లలు సరియైన తిండి పెట్టలేక వాడి శ్రమను వాడు ఖర్చు చేసుకుని వాడి బ్రతుకు వాడు బ్రతకటానికి ఉన్న వర్గాల వారి ఇండ్లలో పనికి కుదురుస్తారు.
ఎందుకంటే తమ పిల్లలకు ఎలాగు కడుపు నిండా తిండి పెట్టలేమని అలాంటి ఇంట్లో వుండే వాళ్ళైనా సుఖంగా తిని ఉంటారని, వారి వద్ద వుంచినందుకు వారిచ్చే డబ్బును తాము ఇంటి ఖర్చులకు వినియెగించుకోవచ్చునని వాళ్ళ ఆశ. ఇలాంటి పేదరికానికి చెందిన కుటుంబంలో నుండి వచ్చిన వాడే అవ్మాజి గారింట్లోని పనికుర్రాడు.
అమాజి ఉన్నత వర్గపు స్త్రీ. ఆమె శ్రమ చేయదుకాని, చేయించుకుంటుంది. ఆమె చేయవలసిన పనులు చేయడానికి ఇద్దరు పనివాళ్ళున్నారు. వాళ్ళ చేత ఆమె వంటలు వండిస్తుంది. ఇళ్ళు సర్దిస్తుంది. ఇక ఆమె స్వయంగా చేసే పనులు బజారుకు వెళ్ళడం, వచ్చే ఫోనులకు జవాబివ్వడం, అందమైన వస్తువులు కొనడం, ఆ వస్తువులను జాగ్రత్త చేయడం, సమయం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శించడం, తద్వారా అతిథుల మెప్పు పొందడం ఇదీ చేసేపని. పని కుర్రాణ్ణి శుభ్రంగా వుంచి స్మార్ట్‌గా పని చేయించడమే ఆమె చేసే పని.
అమాజి భర్త వ్యాపార లావాదేవీలకు కావలసిన పార్టీలకు సహాయం అందిస్తూ పని వాళ్ళతో పనులు చేయించుకుంటు ఇంట్లోని ఏ విషయం గురించైన వినోద్‌ బాబు గారికి ఎక్కువ చెప్పకుండ ఇల్లు అతని వ్యాపార లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కాకుండ అతనికి అన్ని విధాల సహకరిస్తు ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ వుంటుందన్న నానుడిని నిజం చేస్తుంది.
ఆర్ధికంగా వెనుకబడి వుండి తన కుటుంబాన్ని తను పోషించుకోలేని పేదరాలు కనుక పని కుర్రాడి తల్లి వాన్ని అమాజి ఇంట్లో పనికి చేర్చింది.
గాజు గ్లాసు పగలగొట్టాడని జీతం కోత విధించిన అమ్మగారిని చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష వేయవద్దని బ్రతిమిలాడుకుంటుంది. అమ్మగారి కోపాన్ని చల్లార్చడానికి గాయమై నిద్ర, తిండి లేక రాత్రంతా శ్రమించి మానసికంగా, శారీరకంగా అలసిపోయిన కొడుకును దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి బదులు కసి తీర కొట్టింది. ఒక వేళ తల్లి మనసుతో ఓదారిస్తే తనతోపాటు వచ్చేస్తాడని, తను వాడిని పోషించలేనని, కన్నీళ్ళతోనైనా వాడు ఏదో ఒకటి తిని ఉంటాడనుకుంటుంది. కాని అమ్మగారు తనను తినమని ఇచ్చిన తిండి చూసిన తరువాత ఇంత ఉన్నవాళ్ళ ఇంట్లో ఉంచిన వాడు తినేది తను తినే పదార్థాలకన్న మంచివి కావని అర్ధం చేసుకుంటుంది.
అయినా అమ్మగారితో తన కొడుకును జాగ్రత్తగా ్చూసుకోమని గానీ వేళకింత సరియైన తిండి పెట్టమని గానీ చెప్పలేక పోయింది. ఆకలితో వుంచి వాడి చేత పనులు చేయిస్తే ఎలా చేస్తాడని నిలదీయలేక పోయింది. పిల్లవాడి బాధ ఏమిటో స్పష్టంగా తెలుస్తనే ఉంది. కనుక నోరు తెరిచి అడగలేదు. అడిగితే తన వెంట వచ్చేస్తాడేవె నన్న బ్రతుకు భయం. అడగలేక, వాడిని ఓదార్చలేక వాడి చేతిలో అర్ధ రూపాయి పెట్టి వెళ్ళిపోవడంతో ఆమె స్థితి అర్ధమవుతుంది.
అమాజిని ఈ స్త్రీని పక్క పక్కన చచినప్పుడు వర్గ సమాజంలో స్త్రీల జీవిత విధానాలలో వుండే తీవ్ర వైరుధ్యం కూడా అర్ధమవుతుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో