వేదన – నండూరి జ్యోతి

మనోభావాలలో ఉదయించిన అక్షరాలు

ఒకదానితో మరొకటి పరిచయం చేసుకుంటూ

మరికొన్ని అక్షరాల బంధాలను పెంచుకుంటూ

ఇంకొన్ని నాగలితో తవ్వబడి, హృదయయంత్రంలో స్పందనాక్షరాలుగా మారి

మనోఫలకంపై తేజోమయమైన బంగారు అక్షరాలయ్యాయి

ఒకరి మనసునుండి రెక్కలగుర్రంపై పయనమై

మరొకరి మనసుని హత్తుకొని ఆనందవీచికలు వీస్తుంటే,

ఎందుకో ఇంకొన్ని అక్షరాలు పగిలిన గాజుముక్కలతో గాయాల రక్తకన్నీటితో,

ఉప్పెనల్లే ఎగసి సుడిగుండంలో తోయబడిన అరాచకానికి సాక్షిగా,

జీవితం విచ్చుకోలేని కాలగమనానికి ప్రతిబింబంగా,

హృదయవిదారకంగా మరణమృదంగాన్ని ఆలపిస్తున్నాయి

ఎందుకో ఈ వేదన మనసును మీటలేదా, ఆవిరైన కన్నీటిని తుడవలేదా

ఒక వేదన గూడుకట్టుకొని నిర్లిప్తంగా ఆక్రోశిస్తుంటే,

రాలిన ఎండుటాకులలో కలసి

ఎగసిన మంటలలో నిలువునా కాలి జీవచ్ఛవంలా నిలబడిందా

బీటలు వారి అస్థిపంజరంలా శిథిలమైన మనోగతం వినపడలేక విలవిలలాడుతుందా

ఒక వేదన గాలికెగసి నింగిని చేరి గుండెపగిలే చితిమంటలనే మిగిల్చిందా

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో