మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..

డా.శిలాలోలిత

అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్‌ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.

చిత్తరు జిల్లా మదనపల్లిలో జన్మించారు. ప్రస్తుతం వీరు డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ , హైద్రాబాద్‌లో డీన్‌. స్టడెంట్స్‌ అఫైర్స్‌గా ఉన్నారు. ట్రిపుల్‌ యం.ఏ చేశారు. చిత్రకళలో ప్రావీణ్యురాలు.

ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగియైన ఈమె అంతే బాధ్యతగా, నిజాయితీగా రాసిన కవిత్వమిది.
‘ఇండ్లు’ అనే కవితలో  ఒక్కో కుటుంబం/ తమ చుట్ట తము నిర్మించుకుని/లోపల పదిలంగా తాళం వేసుకుని/ తమను తాము బంధించుకునే/ బోనులు, పంజరాలు/ మన ఇండ్లు/ ఏ జంతువులు తమను/ తాము బంధించుకోవు/ ఇతర జంతువులకు భయపడి/ కానీ, మానవుడు తననుతాను/ సిమెంటు, ఇసుక, వర్బల్‌ రాళ్ళతో/ తీర్చిన అందమైన ఇండ్లలో/ తాత్కాలికంగా రాత్రుళ్ళు/ సవధి అవుతుంటాడు/ క్రూరమృగాల్లాంటి మనుషులకు భయపడి/ అనే నిజాన్ని చెప్పేస్తుంది. మనుషులెంత క్రూరంగా, పాశవికంగా తయారయ్యరో, మానవత్వపు చిరు నావలను కోల్పోయి, మనిషిితత్వాన్ని విస్మరించి, సాటి మనిషైన స్త్రీల పట్ల కూడా
చూపే వివక్షను, దౌర్జన్యాలను ధ్వని రూపంలో చెప్పింది.
ఈమె కవితా ఖండికలు మొత్తం నలభై మూడు. పర్యావరణ స్పృహతో, ప్రకృతి కోల్పోతున్న జవజీవాలను చూసి రాసిన కవితలు- ‘భూమి తల్లి ఆవేదన’, ‘చెట్టుతల్లి’. కవి ఇస్మాయిల్‌ చెట్టు గురించి రాసి రాసే చెట్టుకవి ఐపోయడు. ప్రకృతితో మమేకమవ్వడం, అలాగే గుంటరు శేషేంద్ర శర్మ కవితల్లో కూడా చెట్లు, ఆకులు, పచ్చదనం లేకుండా వుండదు. జీవితానికి, జీవనానికి, ్మానవ ప్రకృత్తికీ అను సంధానం చేస్త ఈ కవయిత్రి కూడా మంచి భావుకతతో రాసింది.
ఆనకట్టల నిర్మాణాలు అవసరమైన చోట కాకుండా, అనవసరంగా, కట్టడాన్ని గురించి విమర్స్దిస్తూ ‘నది’ దు:ఖాన్ని ఓ చోట ఆవిష్కరించింది. ‘నేను’ నాది నుండి ‘మనం’కు, నా ఆనందం నుండి మన ఆనందం, నా కుటుంబం నుండి వసుధైక కుటుంబం వైపు నడిపించే జీవన కళే జీవితం అని దిశా నిర్దేశం చేసింది.  ‘కాశ్మీరు మధ్య ఆధీనరేఖ’ గురించి మానవత్వంతో పెద్ద మనస్సుతో స్పందించి పరిష్కరించాలనే సచన చేసినందొక చోట.
మనిషి బలహీనుడు కాడెప్పుడ వివేకానందుని సక్తుల్ని స్ఫురణకు తెచ్చుకుంటే, ‘నిత్యతప్రేరణ, చుక్కాని/ప్రకటించాలి ప్రతి మనిషి/తనలో నిక్లిప్తమై ఉన్న/ అనంతశక్తి సామర్ధ్యాన్ని/ అవిశ్రాంత  సాధకుడై సాధించాలి/ విశ్వశ్రేయస్సు నిచ్చే తన లక్ష్యాన్ని (అనంతశక్తి నీలో ఉంది) అంటుంది.
పురుషులెప్పుడూ కూతుర్ని ఒద్దనుకోవడమే కనబడుతున్న స్థితిలో, స్త్రీలు కూడా కొందరు ఒద్దనుకోవడాన్ని ్చూసిన ఈమె నీ కడుపులోనే/ నాకు రక్షణ లేని నాడు/ నీవే నన్ను వ్వనుకున్న నాడు/ నాకెందుకీ ఆడజన్మ’ – అని ప్రశ్నిస్తుంది. ఆర్ధిక స్థితిలో అట్టడుగు వర్గాల ప్రజలు చితికి పోయిన వైనాలను, ‘ఛైల్డ్‌ లేబర్‌’,  ‘బిచ్చగాళ్ళు’ కవితలు వ్యక్తీకరించాయి.
 ‘ఓషో’ సిద్ధాంతావగాహనతో- ప్రతిక్షణం జీవించు/ పరవనందంతో”, ‘ఇది నీ జీవితం అని ఆ కవితలో ఉద్భోదించింది. ‘అయితేనే నన్ను ప్రేమించు’  కవితలో ప్రేమంటే, విలువలంటే ఏమిటో ఇలా చెబుతుంది-‘ప్రియతమా! నన్ను ‘సూర్యుని కంటే, వసంతం కంటే, సముద్రం కంటే ఎక్కువగా ప్రేమించు’.
తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, పిల్లల పట్టని తనాన్ని, జంతువులకన్నా హీనంగా చూడబడుతున్న స్థితిని హృదయం గాయపడేట్లుగా చిత్రించిన కవిత ‘వృద్ధాప్యం’. కళ్యాణపీఠాలు, బలిపీఠాలుగా వరిన క్రమాన్ని విశ్లేసిస్తూ వస్తు, ధన ప్రవాహంలో కొట్టుకుపోవద్దని విజ్ఞప్తి చేసింది.
ప్రపంచీకరణ నేపధ్యంలో పారిశ్రామీ కరణ ముఖాలు తొడుక్కున్న అడవి కొత్త బొమ్మను ‘అరణ్యరోదన’లో దృశ్యవనం చేసింది.
మనిషి నిత్యయవ్వనంలో వుండాలంటే ‘ఆస్వాదించే మనసుండాలే కాని/ మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు/ అని తేల్చేస్తుంది. ఈ కవిత్వాన్ని ‘సినారె’కి అంకితమిచ్చారు. ఆయన స౦పుటిలో వస్తుత్వజ్ఞత, లలితగాఢ భావుకత, అభివ్యక్తి తీవ్రత ముప్పేటలుగా అల్లుకుని వున్నాయన్నారు.
ఒక సామాజిక బాధ్యతగా కవిత్వాన్ని చేపట్టిన ఈ కవయిత్రి కలం నుంచి మరిన్ని కవిత్వాక్షరాలు మనముందుకు రావాలని, ఆ కవిత్వ సముద్రంలో ఓలలాడాలని వుంది.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో