స్తీ శక్తి

సమస్తాన్ని తనలో ధరించే ధరణి

జీవితాలకు వెలుగునిచ్చే వనితామణి

ఆదర్శంగా నిలిచే విదుషీమణి

కుటుంబాన్ని తీర్చిదిద్దే సౌభాగ్యవతి

పతిని దైవంగా కొలిచే సతి

సహనానికి మారుపేరు ఈ పడతి

రౌద్రంలో దుర్గాదేవి, విద్యలో సరస్వతి దేవి

సిరులిచ్చే లక్ష్మీదేవి

దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మూలం

అందరికీ స్త్రీ ఒక్కటే ఆధారం

ప్రేమను పంచే కరుణామూర్తి

తనకు ఇవే నా పాదాభివందనాలు ……

– బి. సింధు ప్రియ, 9వ తరగతి, అరవింద మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, మంగళగిరి

స్త్రీలు అంటే ఏమి ఎరుగని అబలలు కాదు,

మనసులో అంతశ్శక్తి కలిగిన ధైర్యులు.

చదువు రాని నిరక్ష్యరాస్యులు కారు,

ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానులు.

స్త్రీలు వంటింటికి పరిమితం కాదు,

కుటుంబాన్ని తీర్చిదిద్దుతారు.

విద్య, వైద్య, రాజకీయ, సాంకేతిక రంగాలలో ముందున్నారు.

ఒకప్పటి సరోజిని నాయుడు, ఇప్పటి మలాలా – మన నాయకురాళ్ళు.

కమలా సోహోనీ, మేరి క్యూరీ – స్త్రీ శాస్త్రవేత్తలు.

కల్పనా చావ్లా, సునితా విలియమ్స్‌ – స్త్రీ అంతరిక్ష శాస్త్రవేత్తలు.

సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌ – స్త్రీ క్రీడాకారిణులు.

ఈ ఆధునిక ప్రపంచంలో మగవారితో పోటీ పడుతున్నారు స్త్రీలు.

– పి. సౌమ్య,  9వ తరగతి, అరవింద మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, మంగళగిరి

 

స్త్రీ నేటి సమాజాన్ని నడిపిస్తుంది.

ఆమె ఒక దీపమై ఆ ఇంటికి వెలుగునిస్తుంది.

ఆమె ఇచ్చిన వెలుగుతో ఆ కుటుంబం ప్రకాశిస్తుంది.

ఆమె వల్లే నేడు ఈ సమాజం నడుస్తుంది.

అన్ని కష్టాలు తానే భరిస్తుంది.

అన్ని బాధ్యతలు తానే భరిస్తుంది.

అమ్మై బిడ్డలను ప్రేమిస్తుంది.

పౌరురాలై చెడ్డవారిని, దుర్మార్గులని శిక్షిస్తుంది.

ఉపాధ్యాయురాలై పిల్లలకు మంచి నేర్పిస్తుంది.

ఆ పిల్లలను వెలుగు బాటతో నడిపిస్తుంది.

అప్పుడే నేను నిజమైన స్త్రీ అని భావిస్తుంది.

ఆమె తరువాత తరాన్ని సృష్టిస్తుంది.

అందరికి ఉపయోగపడేలా జీవిస్తుంది.

– కె.రోజా, 9వ తరగతి,  అరవింద మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, మంగళగిరి

Drawings by Children at LSN Foundation Rainbow Home

Pillalu bhumika 3 Pillalu bhumika 2 Pillalu bhumika 1

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.