బడుల్ని గూడా యిడువని …..- జూపాక సుభద్ర

 

మా అక్క బిడ్డ వూల్లె కరువు గొట్లాడ్తుందని, పనులు దొరక్కే యీ మధ్యన్నే సిటీ కొచ్చిండ్రు. అపార్ట్‌మెంటుల వాచ్‌మెన్‌గ ఆమె పెనిమిటి కుదిరితే ఆమె ఆ అపార్ట్‌మెంటు యిండ్లల్ల పంజేస్కుంటుండ్రు. ఆ అపార్ట్‌మెంటు మా యింటికి జెర దగ్గర్లో వుంటుంది. గవర్నమెంటు స్కూలు దూరమున్నదని తన నాలుగేండ్ల బిడ్డెను యింటి దగ్గెరి ప్రైవేటు స్కూల్ల వేసింది. తన ఐషతిగాకున్నా, అప్పుజేసి ఆ బల్లె వేసింది.

‘అక్కా నల్లరిబ్బెండ్లు, తెల్లరిబ్బెండ్లు, తెల్లబూట్లు, నల్లబూట్లు పుస్తకాల బ్యాగు, టిఫిని బెట్టే బ్యాగు, టై, బెల్టు, రొండు బడిడ్రెసులు, పుస్తకాలు, నోట్సులు, పీజు గిట్ల గలిపి ఏందక్కువ, ఏడువేలైనయక్క. యే బుడ్డబడే గదా అనుకుంటె గింత కర్సాయె గదక్క అని బొచ్చె గొట్టుకున్నది మా అక్క బిడ్డె ముత్యాలు. గీ పిల్ల సల్లగుండ తిప్పి తిప్పి కొడితె నాలుగేండ్లు లేదు, పదిరూపాల పొడుగు లేదు గన్నిపై సలాయె, యాడదెద్దుమక్కా యాడాది, యాడాది. గిప్పుడంటె నువ్విత్తివి ఎప్పటికెట్ల యెల్లాలె అని, కాని అమ్ముడు బోయయినా సరె అక్క నా బిడ్డెను సదివిచ్చుకోవాలని అనిపిత్తంది గాల్లగీల్లను సూత్తాంటె అని మాట్లాడేది. యింకా నా బిడ్డెను డ్రెసు, బూట్లు, బ్యాగేసి స్కూలుకు తోలుడు నాకు చాన సంతోష మైతంది. ఏనుగెక్కిన బలమొస్తందక్కా… అని మురిసి పొయేది.

అయితే యిట్లా సంబురపడే ముత్యాలుకు బిడ్డె తిండి మీద సుతులాయించని బాదెక్కువయింది. బిడ్డెను యింటికి తీసుకొచ్చింది మొన్న. ‘అక్కా నీ బిడ్డెం జూడు బొక్క బొక్కయితంది. యిదివరకు కరువుల గూడ మంచిగనే వుండెక్కా… మేము తిన్నా తినకున్నా పిల్లలకు వున్న దాంట్లె మంచిగనే పెట్టుకున్నం. గీ బల్లేసిన కాన్నుంచి పిల్ల కురాకు సరింగతింటలేదక్కా… బడిల మంచిగ తినాలె, అన్ని తినాలెనని నేర్పియ్యాలె గదా! పిల్లను ఏమన్నరో ఏమో అక్క బడిల పిల్ల బెగడు వడ్డది. వూల్లె రోజు సియ్య కూర గావాలనేడ్సేది. సియ్య లేంది తినకపోయేది. బుక్కకొక సియ్య దినేది. గట్ల తినే పిల్ల నీసంటె ముడ్తలేదక్కా నీసు మొత్తం బందువెట్టింది. ఏమైందో బిడ్డకు ప్రాణం బాగలేకనా లోజరమా అని డాక్టరుకు గూడ సూపిచ్చినం. ‘ఏం లేదమ్మా’ అని సెప్పిండు.

మరేమైందక్కా! పిల్లను బల్లేసిన నాలుగు రోజులకే పిల్లెందుకు సడల్న సియ్యల్దినుడు బందు వెట్టిందని ఏంది ముచ్చటని సమజుగాలే దక్కా. నీసండితే తింటలేదు బలవంతంగా నోట్లె బుదుగరిచ్చి పెడితె ఓకరిచ్చుకుంటుంది. పప్పు, కూరగాయలే తింటంది. ఏదన్న గుడ్డు, మావుసం కూరండిన్నాడు కారమో తొక్కో యేసి పెట్టుడైతంది. గింతబలమైన తిండి కడుపుల వడకుంటెట్ల పిల్లజూడు, కండ్లుబొయి కనగంతల జేరినయి, గిట్లయితెట్లక్కా… పిల్ల ఎట్ల మంచిగ్గావాలె ఏందో తెలువక పిల్ల టిపిని బాక్సుల ఓనాడు కోడికూరబెట్టి తోలిన. తోటి పిల్లలు యెవ్వలు కనీసం గుడ్డుగూడ తెచ్చుకోరాట స్కూలు టిపిండ్ల, అట్లాంటిది మా చిన్నదాని టిపిండ్ల కూరజూసి పిల్లలంత నవ్వుకున్నరట, టీచరుకు ఫిరాదు జేసిండ్రట. పిల్లను వొక్కదాన్నే దూరంగూసోబెట్టి (ఏం బయపెట్టిందో ఏమో) తినమన్నదట పసిబిడ్డాయె దానికెట్లనిపిచ్చిందో ఏమనిపిచ్చిందో యింటికొచ్చి బాగా ఏడ్చింది. కుందాపన వెట్టుకొని గిట్ల నీసు దింటలేదు, బల్లె గిట్ల టీచరమ్మలు గిట్ల పిలగాండ్లు గుడ్డు, మటన్‌, చికెన్‌ దెచ్చుకుంటె దూరంగూసోబెట్టి, తినొద్దని బెదరగొట్టి భయపెట్టి పిలగాండ్లని నీసుదింటె కొట్టుడు అస్సలు మంచిగ లేదక్కా. పిల్లలు నీసు దినకుంటె ఎట్ల బలముంటది. ఏందో మటన్‌ దింటె నాలిక మందమైతదాట, సదువురాదట. సదువుకు తిండికి సమందమేంది. టీచర్‌నడిగితే ‘బాపని పిల్లలున్నరు. వాల్లకిష్టములేదు వాల్లనిబ్బంది పెట్టుడెందుకమ్మా…. యిది స్కూలు పద్ధతి’ అని మాట్లాడిందట. వోర్నీ గీ తిండి అసహనాలు స్కూల్లగ్గూడ పాకినయనుకున్న.

497311251_5a456979ac copy

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>