కిం కర్తవ్యం

 ఎం. పార్వతీ మోహన్‌

స్వార్థం చెలియలి కట్టదాటి
సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ.

కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో
క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.

స్త్రీలు వృద్ధులు పిల్లలని కూడా చూడక
చిత్రహింసల పాల్చేస్తున్న వేళ
మంచితనం మానవత్వం మరుగునపడి,
మాయమాటలు, వెసపు చేతులతో
గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరుకుత
జీవనపరవవధి మరచిపోతున్న వేళ
అవనుష శక్తులు అకస్మాత్తుగా
రక్తదాహం నరమేధం కోరుతున్న వేళ
ఎక్కిన మెట్లకు పాకుడుపట్టి
కంచే చేను మేస్తున్నట్లు
తనవాళ్ళనుకున్న వాళ్ళే ఇక్కట్ల పాల్చేస్తుంటే
మనసు కృంగి అధఃపాతాళానికి జారిపోతున్న వేళ
యంత్రాలకూ, మంత్రాలకూ ప్రాధాన్యమిస్త
సాటిమనిషి మనసుని నిర్లక్ష్యం చేస్తున్నవేళ
ఎవడో వచ్చి రక్షిస్తాడనే పేరాశతో
కాపాడేవారే కాటేస్తారేవెననే భీతితో,
మనమనుకున్నదేదీ కాదనీ
మనం విధి చేతుల్లో పావులమనీ
అన్నింటికీ సరిపుచ్చుకుంట బ్రతకాలనీ,
నిరాశా నిస్పృహలకు లోనయే సమయం కాదిది!
స్వార్థపు పునాది పడకుండా చూసే ముందుచూపు
వ్యామొహపు కలుపుమొక్కలని ఏరిపారేసే నేర్పు
అంధవిశ్వాసాలని అడ్డుకునే నేర్పు
మూఢనమ్మకాలని వదిలించుకునే ఓర్పు కావాలి నేడు!
ప్రతి యువతా ఒక అభేద్య దుర్గమై
ప్రతి హస్తం దుర్మార్గాన్ని దునువడే ఖడ్గమై
కర్తవ్యదీక్షా పరతంత్రులమై నిలవాలి నేడు!
బద్ధకులు, ప్రలోభాలు వీడి,
ఆత్మసంరక్షణార్ధం, ఆత్మబలంతో
లోకకల్యాణ రక్షా కంకణబద్ధులమై నిలవాలి నేడు!
రంగులవెంట పరుగులిడకుండా
మనిషి మృగం కాకుండా
మానవత్వం తద్వారా దైవత్వం
పెంచుకుని, ప్రేమపంచే దీక్ష పూనాలి నేడు!

నాకో బిడ్డ కావాలి

ముంగర జాషువ

మా నాన్న గుండెలమీద బరువు దించుకొని
ఇంకా పెద్దబరువుని నా గుండెలమీదకెత్తాడు!
పుట్టింట్లో పెండ్లి చేసుకోకపోతే చస్తామన్నారు
అత్తింట్లో ఉద్యోగం చేస్తే చంపుతామన్నారు!
మా నాన్న-
కాన్పుకి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు
నా భర్త ముఖంలో వేయికాంతులు
స్వేచ్ఛగా బార్‌లకు
చీరెల వేటకూ దిగులుండదని-
అయితే నాకొక్కటే దిగులు
ఇతనేమయిపోతాడోనని కాదు
తొలికాన్పు ఎలా వుంటుందోనని
పెద్దాపరేషన్‌ చేస్తారేవెనని భయం-
ఒక్కోసారి
నార్‌ప్లాంట్‌ చేయించుకున్నా పోయేదనిపిస్తుంది!
ఇంకోసారి-
పెళ్లయి నాలుగేళ్లు అయినా
సంతులేదని సతాయించే
అత్తమామల నోళ్లు మూయించడానికి
ఒక్క బిడ్డనైనా కనాలనిపిస్తుంది-
నాకయితే
ఎవరైతే ఏమనిపిస్తుంది గాని
మగపిల్లవాడు కావాలనే రొద భరించలేకున్నా!
కాన్పు అంటే-
మెదడునరాలు చిట్లే ఘోషని
నడుమునుంచి పొత్తికడుపుకి జారే
నిప్పులు తొక్కే పురిటినొప్పుల బాధని
నీవు భరించలేవనే ఆడబిడ్డ బెదిరింపులకు
గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.
డెలివరీ తర్వాత పునర్జన్మ ఉంటుందో లేదోనని-
అయితే చిన్న ఆశ నాలో ధైర్యాన్ని తెస్తుంది
కండ్లు తెరచి నన్నే చచే పసిపాప కోసం
ఆబగా నా రొమ్ముని అందుకొనే
నునులేత పెదవుల స్పర్శకోసం
చిన్నచిన్న అరచేతులను
బుల్లిబుల్లి పాదాలను
ముద్దాడాలనే తపన కోసం, సాఫల్యం కోసం
అమ్మ అని పిలిపించుకోవాలనే కోర్కె బలీయమైంది-
గర్వంగా బిడ్డనెత్తుకొని
నలుగురికీ చ౦పాలనే కాంక్ష వెన్నంటే వుంది
నేనే సృష్టి కర్తననిపిస్తుంది –
నవమొసాలు మొసి పెంచితే
రేపు కొడుకైనా
నన్ను ప్రేమగా చూస్తాడో లేదో?

‘నవ్య శాసనం’

వంగర పరమేశ్వరరావు

భూమిపై నేను తొలి అడుగిడినపుడే
ఆంక్షల అడ్డుగోడను కట్టేసి
నా కేరింతల మురిపాలు
మీ జీవిత శాపాలుగా భావిస్త
నిప్పుల గుండంలో దకినంత బాధను
మీ ముఖాలో ప్రతిఫలిస్తారు!
మీ గుండెలపై కుంపటిని
నా ర౦పం చితితో వెలిగించుకుంటారు?
నన్నో ప్రాణిగాకాక, ప్రతిబంధక బరువుగా చస్త
అనుక్షణం ఈసడింపుల ఈటెల వటలతో గాయపరుస్త…
అడుగడుగునా అవవనాల మేకులను దిగగొడుత…
నేను వేసే ప్రతీ అడుగును
రక్తసిక్త రాదారిగా చేస్తూనే వుంటారు!
అయినా…అన్ని సవాళ్లను ఛేదించుకొని
ర్యాంకుల జయకేతనాల్ని ఎగరేస్తుంటే…
‘ఎంతేనా… ‘ఆడ’పిల్లే కదా!’ అని
నిటూర్పుల నిస్పృహలో
మీ పెట్టు’బడులకు’ దురదృష్టి లెక్కల దుర్భిణీ వేస్తారు.
చాకిరేవు నా ఆనంద తీరమనీ…
వంటింటి గడపనే లక్ష్మణరేఖగా గీస్త…
నా ఉచ్ఛ్వాస-నిశ్ఛ్వాసలకి
బంధాల సంకెళ్ళు తగిలిస్తారు!
మురికిపట్టిన మీ మనసుల్ని
మసిబారిన మీ తలపుల బోళ్ళను
తళతళా మెరిపించటం కోసం
నిత్యం శ్రమతో సాధన చేస్తుంటాను!
మీ ఆధిపత్య అణచివేతలో
నన్నో యంత్రాన్ని చేసి
నన్ను వదిలించుకోవటం కోసం
బేరసారాల ‘కట్నపు’ బరువుతో
మీ బాధ్యత తీరిందనుకుంటారు.
మూడు ముళ్ళ కాపురాల
నరకయతనల కాలిన గురుతులు
ముష్టిఫతాల దాష్టిక గాయలతో నలిగి
సజల నేత్రాల వెతలకు ప్రతీకనై
మర బొమ్మలా
గిరగిరా కాలంతో ప్రయణిస్తె…
అణగారిన నా ఆశలు… ఆశయలకు
సాకార ప్రాణప్రతిష్ఠ పర్వంలో
మాతృమూర్తి మమతనై తీవెలు సాగుత…
మరో ప్రాణికి ఊపిరిలదుతాను.
ఇపుడు సర్వం నాకవగతమే…!
సమస్త మనోభావాల సమ్మిళిత కాన్వాస్‌పై
సమగ్ర హృదయశక్తుల వర్ణచిత్రాన్ని ఆవిష్కరించడంలో
నా మనోనేత్రం సత్తా చపుతుంది.
అందుకే…
నా చిట్టి తల్లికి
నా అనుభవపాఠాల్ని రంగరించి ఉగ్గుపాలు పోస్తూ…
అఖండ విశ్వాసంతో
పురివిప్పిన ఆత్మస్థైర్యంతో
రేపటి నవ్యయుగసావ్రజ్యదుర్గానికి
వారసురాల్ని చేస్త…
కొంగ్రొత్త శాసనం
నిప్పులు చెరిగే నెత్తుటితో సత్రీకరిస్తున్నాను!

అమ్మ

 పృథ్వి

అనుభవాల సాగరం అమ్మ
ఆవేదన వెల్లువ అమ్మ
అరుణోదయ గీతిక అమ్మ
అనురాగ మల్లిక అమ్మ
అరవిచ్చిన జాజుల రెమ్మ
విరజాజి నవ్వుల కొమ్మ
ఆకలేస్తే గోరుముద్ద అమ్మ
నీ ఏడుపు నవ్వుల కమ్మ
నీ నిద్దుర జోలకు అమ్మ
ప్రతి పాపకి ఊపిరి అమ్మ
అమృతమౌ ఆనందం అమ్మ
మనసులోని ప్రేమే అమ్మ
పిచ్చిప్రేమకు రపం అమ్మ
ప్రకృతిలో ప్రేమకు శ్రీకారం అమ్మ
ప్రతిసృష్టికి మూలం అమ్మ
అన్నిటికాధారం అమ్మ
మాటల ఒదగని భావం అమ్మ
ఆనందానికి నిజరూపం అమ్మ

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to కిం కర్తవ్యం

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    కవితల గురించి రాసేముందు
    అక్షరదోషాలు చాలానే కనిపిస్తున్నాయి.

    అందుకే మళ్ళీ ఎప్పుడైనా చదివినప్పుడు రాస్తాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో