మత అసహనంపై నిరసన ప్రదర్శన- కొండవీటి సత్యవతి

ఇంతకాలం చాప కింద నీరులాగా, నివురు కప్పిన నిప్పులా ఉన్న మత అసహనం, మత ఛాందసం, హిందూ ఫండమెంటలిజమ్‌  ఇటీవల కాలంలో చాలా బాహాటంగా తన గొంతును పెంచడంతోపాటు అసహన పద్ధతుల్ని ప్రశ్నిస్తున్న వారి మీద అక్షరదాడులతో పాటు భౌతిక దాడులకూ పాల్పడుతోంది. 2013లో ఆగస్టు 20వ తేదీన మహారాష్ట్రలో ప్రముఖ హేతువాదీ, రచయిత నరేంద్ర దబోల్కర్‌ను కాల్చి చంపారు. దేశంలో పెచ్చరిల్లుతున్న మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దబోల్కర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16న సిపిఐ నేత, రచయిత అయిన గోవింద్‌ పండరీనాధ్‌ పన్సారీని కొందరు దుండగులు కాల్చి చంపారు. పన్సారీ ఉదయపు నడకకు వెళ్ళి భార్యతో కలిసి తిరిగి వస్తుండగా ఆయన మీద కాల్పులు జరిపి చంపారు. 75 సంవత్సరాల వృద్ధుడు కల్బుర్గినీ నాస్తికుడనే నిందమోపి హతమార్చారు. అంతకు ముందు తమిళనాడులో పెరుమాళ్‌ మురుగన్‌ అనే నవలా రచయితపట్ల మతోన్మాద అరాచక శక్తులు తీవ్ర దౌర్జన్యానికి పాల్పడ్డాయి. వందేళ్ళ క్రితం నాటి ఒక సాంప్రదాయాన్ని ఒక నవలలో సూచనప్రాయంగా పేర్కొనటం ఆ శక్తుల కన్నెర్రకు కారణమైంది. మురుగన్‌ పెరుమాళ్‌కు రక్షణ ఇవ్వకుండా వాళ్ళకి క్షమాపణ చెప్పించడంతో తీవ్ర మనస్తాపం చెందిన పెరుమాళ్‌ ‘రచయితగా నేను చనిపోయాను’ అని బాధాకరమైన ప్రకటన చేసి రాయడం ఆపేసారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు సృజనకారుల్లో తీవ్ర భయాందోళనలను కలగచేస్తున్నాయి. కవులూ, రచయతలూ, కళాకారులూ భయపడుతూ బతకాల్సిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ తెలంగాణాలో ఐక్యమై ఉద్యమబాట పట్టారు. అందరూ కలిసి దేశంలో నెలకొన్న అసహన, భయానక పరిస్థితులకు వ్యతిరేకంగా గళం విప్పాలని, ఐక్యకార్యాచరణకి దిగాలని నిర్ణయించారు.   ఈ నిర్ణయంలో భాగంగా నవంబరు 23వ తేదీన రచయితలూ, కళాకారులూ, కార్యకర్తలూ కలిసి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయం నుండి ఇందిరాపార్క్‌ (ధర్నాచౌక్‌) వరకు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. విమల నేతృత్వంలో జననాట్యమండలి కళాకారుల పాటలు, డప్పులతో ప్రజల దృష్టి నాకర్షిస్తూ, ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తూ, నినాదాలతో హోరెత్తుతూ ఈ నిరసన ప్రదర్శన జరిగింది.

02 03

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.