సదాలక్ష్మి సదా ఆదర్శరత్నం

జూపాక సుభద్ర

మాజీ డిఫ్యూటి స్వీకర్‌, మొదటి అసెంబ్లీకి  ‘దేవాదాయ మంత్రి’ సదాలక్ష్మి కీర్తిశేషులై మొన్న జూలై 24తో నాలుగు సంవత్సరాలు దాటింది.

 ఆమె జీవితాంతం రాజకీయల్లో బతికిన మనిషి.

 రాజకీయమే జీవితం, జీవితమే రాజకీయంగా మనుగడ సాగించిన వ్యక్తి సదాలక్ష్మి. ఆమె దాదాపు ముప్ఫై నలభై ఏండ్లు కాంగ్రెసులో పని చేసినా, టిడిపిలో పనిచేసినా, ప్రత్యేక తెలంగాణ పార్టీ పెట్టినా, డా. బాబ జగ్జీవన్‌రాం సంక్షేమ సంఘం బెట్టినా..యీ రంగాల వాల్లు ఆమెకిచ్చిన గుర్తింపు గౌరవాలకు సంబంధించిన విషయలమీదే, వివక్షల మీదే బాధ.
 స్వాతంత్య్రం వచ్చినంక మొదటితరం దళిత మహిళా రాజకీయవేత్త సదాలక్ష్మి. ఆమెతో కలిసి పనిచేసిన ఆధిపత్య కులాల, దళిత కులాల మగవాల్లైన నాయకులు పివి, కాసు బ్రహ్మనందరెడ్డి, దామొదరం సంజీవయ్య వెంగళరావు, అంజయ్యల రాజకీయ చరిత్రలో, ప్రభుత్వంలో, ప్రజల్లో, పార్టీల్లో ప్రముఖ స్థానాలే కల్పించారు. ప్రభుత్వ భవనాలుగా, పార్కులుగా, విగ్రహాలుగా, ప్రాజెక్టు కాలువలుగా రోడ్లుగా వాల్ల పేర్లు అడుగడుగునా ప్రజల నోట్లే నానుతనే వున్నారు. వాల్ల వర్దంతుల్ని, జయంతుల్ని ప్రభుత్వాలు, పార్టీలు ఘనంగానే చేస్తరు. మీడియలు మీటింగులు బెట్టి చర్చ జేస్తరు వాళ్ళ పేరు మీద. మొదటి అసెంబ్లీకి దేవాదాయ శాఖమంత్రిగా, డిఫ్యూటీీ స్పీకరుగా పని చేసిన మొట్ట మొదటి దళిత మహిళను, జీవితాంతం రాజకీయం నెరపిన సదాలక్ష్మిని ఎవరు గుర్తించకపోవడం, గౌరవించక పోవడం పెద్ద విషాదం.
ఆ విషాదాల వెనక అనేక రాజకీయలు రాజ్యమేల్తున్నయి. స్వాతంత్ర మొచ్చి 61 ఏండ్లయినా యింకా రాజకీయాలు ఆధిపత్య కులాల మగవాల్ల గుప్పిట్లోనే వున్నాయి. యిప్పటిదాకా రాజకీయ స్థిర జీవితాన్ని ఏర్పర్చుకునే మరో సదాలక్ష్మి ఎదిగే అవకాశమివ్వని, దొరక నివ్వని అప్రజాస్వామిక రాజకీయభివృద్ధిలో నేటి దళిత మహిళలున్నారు.
సదాలక్ష్మి ఒక సాధారణ దళిత మహిళ కాదు. రాజకీయల్ని రంగరించి తాగింది. పుబ్బలో పుట్టి, వఘలో మాయం కాని రాజకీయ జీవితం, అరవై ఏండ్ల రాజకీయ దిట్ట సదాలక్ష్మి. అట్లాంటి సదాలక్ష్మి రాజకీయ పోరాటాలను, చైతన్యాలను, పార్టీలు, కుల సంఘాలు గౌరవించక పోవడమే బాధాకరం. ఈ సందర్భంగా ‘సదాలక్ష్మిజీవిత చరిత్ర’ కోసం రిసెర్చి చేయిస్తున్న అన్వేషిని అభినందించాలి.
సదాలక్ష్మి సమాజంలో అన్ని పెట్టి పుట్టిన బిడ్డ కాదు. ఎనుక ఏడు దోపిల్లు ముందట మున్నరు వివక్షలతో పుట్టినామె. అవకాశాల్ని అంది పుచ్చుకున్న రాజీలేని రాజకీయ జీవితం. కుటుంబం, కులంతోనే కాదు, రాజకీయంలో కూడ రాజీలేనితనం. రాజకీయలకోసం కుటుంబాన్ని, దాని ఆధిపత్యాల్ని చాలా అవలీలగా పక్కకు నెట్టిన గొప్ప మహిళావాది. ఆమె జీవితంలో తియ్యటి, చల్లటి సమయాలు, సందర్భాలకన్నా ఆమెకు నిత్య సామాజిక పోరాటాలతో, రాజకీయంగా జెండర్‌గా, ప్రాంతంగా, కులంగా చేసిన అనేక యుద్దాలతోనే ఆమె జీవితం గడిచి పోయింది.
యిట్లాంటి చరిత్రవున్న ఒక దళిత మహిళా రాజకీయ వేత్త ఎందుకు విస్మరణకు గురైంది. ఆధిపత్య కుల రాజకీయ పార్టీలే కాదు.కుల, ప్రాంత, జెండర్‌ సంఘాలు కూడా పట్టించుకోలేదు. ఒక ఆడామె, అందులో పాకీ కులానికి చెందిన దళిత మహిళ. ఆమె వూల్లేలితేంది, వూకుంటేది? అని దళితేతరులు నిర్లక్ష్యం చేసినా దళితులెక్కడ నెత్తికెత్తుకున్నరు? తెలంగాణ సంఘాలు ఆమెను సరిసి సంకనెత్తుకున్నదెక్కడ? ముప్పయేండ్ల కిందట్నే ప్రత్యేక తెలంగాణ పార్టీ పెట్టి చేసిన పోరాటాలు, ఆ పోరాట చరిత్ర విలువను గుర్తించిందెక్కడ? తెలంగాణ పోరాటాన్ని హైజాక్‌ చేసి, తెలంగాణ నినాదాన్ని బురదల తొక్కి అమ్ముడు బోయిన చెన్నారెడ్డిలాంటివాల్లు గొప్ప తెలంగాణ నాయకులైండ్రు. వారికి ఘనంగా గౌరవాలందు తాయి. కాని తెలంగాణ కోసం చిత్తశుద్దిగా రాజీలేని పోరాటం నడిపిన సదాలక్ష్మి పేరు వినబడది కనబడది తెలంగాణ సంగాలల్ల. యిది వారి చ౦పుతున్న చైతన్యం.
 చరిత్ర కింది వర్గాల వైపు నుంచి వుండాలని వాదించే తెలంగాణ బీసి రచయితలక్కూడా సదాలక్ష్మి సామాజిక సేవ కనబడదు. కాని అమెరికాలో చచ్చిపోయిన సరోజిని నాయుడి శిష్యురాలి వర్ధంతికూడా అందంగా అక్షరాలు చెక్కుతారు, నివాళి యిస్తారు. యిది వారి ప్రాంతీయమైన కింది కులాల అవగహన.
 మొదటి అసెంబ్లీకి దేవాదాయ శాఖ మంత్రిగా అది ఒక దళిత మహిళ నిర్వహణ సామాన్యంగాదు. బ్రాహ్మణ హిందు మనువాదుల కనుసన్నల్లో కంట్రోల్‌ నడిచే దేవాదాయ శాఖలో పనిచేయడం సదాలక్ష్మికి కత్తి మీద సామే. ఆమె మంత్రిగా వుండి కూడా గుడిలోకి రానీయని అవమానాల్ని ఎదుర్కొంది. తర్వాత ఢీకొంది. దేవాదాయశాఖ దళితులకు స్థానం భాగస్వామ్యం లేని అగ్రహారం లాంటి శాఖ. అట్లాంటి దాంట్లో కూడా దళితులకు అనేక రకాల భాగస్వామ్యం కోసం పోరాడింది. దేవాదాయ శాఖ దళితులకు రిజర్వేషన్లు అమలు జరిపించడానికి, పాలకమండలలో, దేవస్థాన కమిటీల్లో ఛైర్మండ్లుగా, డైరక్టురులుగా దళితులుండాలని సదాలక్ష్మి రాకాసి యుద్ధం చేసింది.
అట్లనే దేవాదాయ భూముల్ని భూమి లేని దళితులకు పంచింది. ఆర్దిక వ్యవస్థ ఒక్క భాపనోల్లకేనా అది కూడా రిజర్వేషండ్ల ప్రకారం నడవాలని శత పోరాడింది. కాని ఆ మార్పును కుల మనువాదులు పడనీయలేదు. యిట్లాంటి పోరాటాలు తన రాజకీయ జీవితంలో కొన్ని మచ్చు తునుకలు. యివి ఏ రాజకీయ నాయకుడు చేయలేదు.
సదాలక్ష్మి డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ చైతన్యమున్నామె. డా. బాబూ జగ్జీజ్జివన్‌ రాం అనుయయిగా జగ్జీజ్జివన్‌రాం సంక్షేమ సంఘ౦ బెట్టి దళితుల అభివృద్ధికి నిరంతరం కృసి చేసింది. ఆమె చేసిన, నడిపిన రాజకీయ పోరాటాల స్పూర్తి దళిత సంఘాలకు పట్టలేదు. ఏ దళిత సంఘం సదాలక్ష్మి వర్ధంతిని జరిపిన పాపాన పోలేదు. ఇది అంబేద్కర్‌ పేరు చెప్పుకొని బతుకుతున్న దళిత సంఘాల చైతన్యం.
ఆమె బతికున్నపుడు ఆమె అంటే పడనివాల్లు ఒకరా ఇద్దరా! పెద్దకులం మొగోల్లు, కులపోల్లు, జాతోల్లు, కుటుంబం అంతా ఆమెను వ్యతిరేకించినోల్లే. అయినా ఆమె రాజీలేని, రాజీపడని దళిత మహిళా రత్నం. పెద్దరికం, అవినీతి, అణచివేతలు, కుట్ర కుతంత్రాల మాయల మంత్రాలయం లాంటి రాజకీయల్లోకి బొయి అక్కడే స్థిర నివాసం బెట్టి ఆదర్శ నాయకురాలిగా తనదైన రీతిలో దళిత ముద్ర లేసింది.
సదాలక్ష్మి, జీసస్‌ జన్మదినం ఒకటే కావడం, జాషువా, పెరియర్‌, సదాలక్ష్మి వర్ధంతి దినం ఒకటే కావడం యదృచ్ఛికమైనా ప్రత్యేకం.
ఆమె నెరిగిన వాల్లనెవరినైనా సదాలక్ష్మిని గర్చి అడిగితే ఆమె ధిక్కారతత్వ , ప్రశ్నించేగుణం, ఆత్మగౌరవం, దయగుణం, నిర్భీతి, టోటల్‌గా గొప్ప రాజకీయ తత్త్వవేత్తని పొగుడుతారు. అట్లాంటి సదాలక్ష్మికి మనం యిస్తున్న గుర్తింపు గౌరవాలెక్కడ? ఆమె జీవితానుభవాలు అవసరం లేదా దళితులకు? యిప్పటిదాకా ప్రభుత్వాలు, అధికార ప్రతి పక్షాలు కనీసం ఆమె  విగ్రహం కూడా ఏర్పాటు చేయక పోవడం వివక్ష కాదా! అణగారిన జాతుల అభివృద్ధికోసం నిరంతరం పోరాడిన రాజకీయ వేత్త సదాలక్ష్మిని అణగారిన కుల సంఘాలు, నాయకులు, ఆమె రాజకీయ జీవితానుభవాల్ని, పోరాట చైతన్యాల్ని ప్రజలకందించాల్సిన అవసరం యిక మీదనైనా జరగాలి.

 

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to సదాలక్ష్మి సదా ఆదర్శరత్నం

  1. Dhanumjaya says:

    నాకు సదాలక్ష్మి గారి గురించి మరిన్ని వివరాలు పమ్పగలరని విన్నపము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>