నీ భూమిక – శారద శివపురపు

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో రెండో బహుమతి పొందిన కవిత)

అవాంఛిత గర్భంతో అమ్మ కడుపున పడ్డాను

అందుకే ఏడ్చి కూడా నవ్వించలేక పోయాను..

అలరించని నా బోసినవ్వు, బుడిబుడి నడకలూ,

మురిపించని నా అందాలు, తెలివితేటలూ,

పోటీపడి పెరిగిన నా ఒంటి బరువు నాన్న గుండె బరువు

మాతురున్నా కాలం, మార్చలేదు నాన్న డబ్బు కరువు.

ఇష్టమైన పై చదువులు, కష్టపెట్టే కట్నాలు

నాన్న మనసున మాట, అన్న నోటివెంట ఈటెల్లా.

ఊహ తెలిసిన్నాటినుంచి విన్న ”ఈడదాన్ని” కాదన్న మాట

పుట్టింట ఈడదాన్ని కాలేని నేను మెట్టింట ”ఆడదాన్ని” ఎట్లైత.

అందం, చదువు, కట్నాలూ, పేకేజీ కుదిరింది; పైన లాంఛనాలు

దండుకున్న గాడిదొకటి గుర్రమెక్కి పెళ్ళి కొడుకై వచ్చింది

పెళ్ళివారి బారాత్‌తో అడవి తరలి వచ్చింది

నానాజంతు సమితి ఒకటి గానా బజానా చేసింది.

చిరపరలాడే పట్టుచీరలు, తళతళలాడే నగల్లో

జలజల రాలే అక్షింతలు, రంగురంగుల పువ్వులు

తాళాల, మేళాల మోతలు; ఇన్నేసి చప్పుళ్ళలో,

నా మనసు సంధిస్తున్న ప్రశ్నలు నాకే వినపడలేదు.

పీడ విరగడనుకుని కాళ్ళు కడుగునీళ్ళు తలపై చల్లుకున్న నాన్న

పెళ్ళి పట్టు చీరనుకుని, చింతల చెట్టుని నేనూ చుట్టుకున్నా.

పేరుపేరునా అప్పగింతలు, తేలికపడింది మనసు తెలియక

ఇకనుంచి నా బాధ్యత వారిదికాదు, వారందరిదీ నాదని.

సుఖమయ సహజీవనానికి నాంది వివాహమా?

అంతంలేని ‘సతీ-సహ-గమనం’కి ఆరంభ మహోత్సవమా?

అర్థంలేని గందరగోళంలో జవాబురాని ప్రశ్న.

అందుకే బేలను అనుకొని పడవద్దు పెళ్ళికి తొందర

పెద్ద పెద్ద చదువులు చదివి నల్గురికి కా నువు ఆసరా

బాలను, బేలను అనుకొన్న ”ఆడదైనా, ఈడదైనా, ఏడదైనా”

ఇదే కథ వింటున్నాం తరతరాలుగా మార్పే లేక

ఇక ఈ కథలను కంచికి పంపే సమయం వచ్చింది.

అందుకు

నువు నేర్పిన అక్షరాలు తిరుగులేని పోరు బాటలయ్యేవరకూ

మొక్కగా ఎదిగి మానై నలుగురికి కాయలు పంచే వరకూ

దివ్వెగా వెలిగి దారులన్నీ వెలుగులు పరిచేవరకూ

నీకు నువ్వు కీర్తివై, స్ఫూర్తివై, మూర్తిమంతమయ్యే వరకూ

వీగిపోని ఆత్మస్థైర్యంతో చెదరని చిరునవ్వై నిలిచేవరకూ

అబలవై బంధనాల్లో చిక్కుకుని నీ ఎదుగుదలకు ఉరివేయకు

స్వాతంత్య్రం అంటే వేరొకరు ఇచ్చేది కాదని తెలుసుకో,

బాధ్యతంటే ఇంకొకరిదే కాదు, నీది కూడా అన్నట్టు మసలుకో,

నీ బాధ్యత నువు తీసుకుంటే నువ్వెవరికి బరువు కావు చూసుకో.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో