ఎల్‌ఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ – రెయిన్‌బో హోమ్‌ పిల్లలు రాసిన కథ, కవిత, బొమ్మలు

రామాపురం అనే గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారి పేర్లు శ్యామల, శంకర్‌. వారికి ఒక అమ్మాయి. పేరు నందిని, 8వ తరగతి చదువుతున్నది. వారు రోజు పొలం పని చేసుకునేవారు. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. క్లాస్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ కొట్టేది అన్నింటిలోనూ కష్టపడేది. ఒక రోజు రోడ్డుపైన వెళ్తుండగా పదిమంది అడుక్కు తింటున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఒక రోజు ధర్మం చేయండి అని అడిగితే, ఏమైంది బాబు ఇలా ఉన్నారు మీరు? మాకు ఎవరూ లేరమ్మా అన్నారు. సరే అని కొంత డబ్బు ఇస్తే అందరూ కలిసి పంచుకున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళింది. అన్నం తిని పడుకుంది. కానీ ఆమెకు నిద్ర రావడం లేదు. ఎందుకంటే మనము ఇలా మంచిగా ఉన్నాం కానీ ఎంతోమంది బీదవారుగా ఉన్నారు అని అనుకుంది నందిని. మరుసటి రోజు బీదలు ఎవరూ లేని జిల్లా దగ్గరికి వెళ్ళి పిల్లలు మీకు ఒకటి చెపుతా వింటారా అని అడిగింది. ఏంటిది అక్కా అన్నారు వాళ్ళు. మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకుంటాను. మీకు రోజు స్కూల్‌కి పంపిస్తా. డ్రెస్సులు కొనిస్తా. మీకు అన్నీ కొనిస్తాను. సరేనా సరే అక్క అని అందరు కలిసి సంతోషపడ్డారు. వెంటనే పిల్లలందరినీ ఆటోలో తీసుకొని ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు ఏంటమ్మా బడికి పోలేదా అని. పోలేదు అమ్మ నాకు ఈ పిల్లలందరిని చూస్తే జాలేసిందమ్మా. అందుకే నేను వీరందరినీ మన ఇంటికి తీసుకొచ్చానమ్మా అని చెబితే వాళ్ల తల్లిదండ్రులు ఈమెని ఎంతో మెచ్చుకున్నారు. పిల్లలందరినీ బడిలో చేర్పించి అందరికీ పుస్తకాలు, డ్రెస్సులు, అవసరమైన అన్నింటినీ కొనిచ్చారు. పిల్లలందరూ ఎంతో సంతోషపడ్డారు. అన్నం తిని అందరు పడుకున్నారు. ఉదయం లేచి స్నానాలు చేసి అన్నం తిని బడికి పోయారు. అమ్మ నాన్న పొలం పనికి వెళ్ళిపోయారు. పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళిపోయారు. మేడమ్‌ అడిగింది ఏంటి నందినీ నిన్న స్కూల్‌కి రాలేదు. మేడమ్‌ నిన్న బస్టాప్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కనిపించారు. నాకు వాళ్లను చూస్తే బాధనిపించింది. అందుకే నేను వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్లాను అని చెప్పింది. మరీ మీ తల్లిదండ్రులు ఏమన్నారని అడిగారు టీచర్‌. నన్ను ఎంతో మెచ్చుకున్నారు అని చెప్పింది నందిని. టీచర్‌ సంతోషపడి మెచ్చుకున్నారు. ఈ విషయం అందరికీ చెప్పింది. ప్రార్థన చేసేముందు నందినిని పిలిచి హెచ్‌ఎమ్‌ గారు ఎంతో మెచ్చుకున్నారు. ఒక గిఫ్టు ఇచ్చారు. సాయంత్రం అది తీసుకెళ్ళి అమ్మానాన్నలకి చూయిస్తే ఎంతో సంతోషించారు. పిల్లలు, నందిని వాళ్ళ తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు.

 

పిల్లల భూమిక

రూపం అందమైనది

మాట మధురమైనది

నీ స్నేహం మరువలేను

రూపం ఒక భావం

భావం ఒక జీవం

జీవం ఒక ప్రాణం

మా ప్రాణమే ఎల్‌.ఎస్‌.ఎన్‌.

ఆమె ఉంటారు తెల్లగా

ఆమె మాట్లాడుతారు ఎంతో మధురంగా

అందరిని చూస్తారు సమానంగా

ఆమె మాట్లాడితే చిలుక పలుకు పలుకుతారు

ఆమె జుట్టు ఉంటుంది పొడవుగా

ఆమె ఎవరో కారు మా యాస్మీన్‌ అక్క

(ఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ పిల్లల కవిత రావాలి)

( రెయిన్‌బో హోమ్‌ పిల్లలు గీసిన బొమ్మలు – ఎల్‌ఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ )

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.