లోక్‌సభకి…- రమణిక గుప్తా,అనువాదం: సి. వసంత

కేధదాలా ఝార్‌ఖండ్‌ బొగ్గు గనుల కూలీల వైపు నుండి లోక్‌సభ యాచిక సమితికి జార్జ్‌ ఫర్‌నాండిస్‌ ద్వారా మేము దాదాపు మూడు వేలమంది కూలీలతో సంతకాలు చేయించి ఇచ్చాము. శ్రీ సుబ్రహ్మణ్యం నేను సాక్ష్యాలని లోక్‌సభ యాచిక-సమితికి ఇచ్చాము. సెంట్రల్‌ లేబర్‌ మినిస్టరీకి ముఖ్యమైన లేబర్‌ ప్రతినిధి కూడా సాక్ష్యం ఇచ్చారు. సమితి సదస్సులు, గవర్నమెంటు తప్పకుండా ఇందులో హస్తక్షేపం  చేయాలని రెకమెండ్‌ చేసారు. గవర్నమెంటు వాళ్ళు ఒప్పుకున్నారు కాని పని కావడం లేదు. ఇదంతా చూసి నేను 1970లో  ఝార్‌ఖండ్‌లో ప్రవేశం కోసం, యూనియన్‌ని తయారు చేయడానికి, వేజ్‌బోర్డుని అనుసరించి వేజ్‌షీట్‌ ప్రకారం వేజెస్‌ ఇవ్వాలని పరేజ్‌ బంగళా దగ్గర ఆమరణ నిరాహారదీక్షని ప్రారంభించాను.

ఆమరణ నిరాహారదీక్ష:

నా ఆమరణ నిరాహార దీక్ష వార్త వినగానే ఢిల్లీ పాట్నాల ప్రభుత్వాల లేబర్‌ మినిస్టర్‌ అధికారుల గుండెలు దడదడ లాడసాగాయి. లేబర్‌ అధికారులు, హజారీబాగ్‌ పోలీసులు, ప్రభుత్వం, కేదలా బొగ్గు గనుల రిసీవర్లతో రహస్యంగా మీటింగులు పెట్టారు. చర్చలు జరిగాయి. మాతో కూడా చర్చలు జరిగాయి. కాని మా డిమాండ్లు ఒప్పుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టంగా చెప్పాము. కేంద్రీయ ఉపముఖ్యమంత్రి లేబర్‌ అధికారి శ్రీ డిమేలో స్వయంగా హజారీబాగ్‌ వచ్చారు. రీసీవర్‌ మా యూనియన్లతో మాట్లాడారు. ట్రక్‌లోడర్లని, కోల్‌కటర్‌లని పర్మనెంట్‌ చేయాలని తీర్మానించామని చెప్పారు. కాని ఇది అమలు కాలేదు. అందువలన కూలీలు తాడో-పేడో తేల్చుకోవాలనుకున్నారు. పోరాటం జరపాలనుకున్నారు. ప్రతిరోజు వేలమంది కార్మికులు ఊరేగింపు తీసేవారు. బంగళాని చుట్టుముట్టేవారు. నినాదాలు చేసేవారు. వందల మంది అక్కడే నా దగ్గర కూర్చునేవారు. ఒకరోజు డుగ్‌డుగీ ధ్వని ప్రతిధ్వనించింది. నగారాలు మారు మ్రోగాయి. వాతావరణం అంతా వేడెక్కింది. గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలపెట్టాయి.

కార్మికులకి వేజ్‌బోర్డ్‌ని అనుసరించి కూలీ ఇవ్వాలని, యూనియన్‌పై కాంట్రాక్టర్లు, రిసీవర్ల ద్వారా రుద్దబడిన ప్రతిబంధాలను ఎత్తివేయాలని ఆజ్ఞ జారీ అయింది. రెండు రోజుల తరువాత ఒప్పందం జరిగింది. రీసీవర్‌ రామకృపాల్‌ సింహ్‌ని హెచ్చరించారు – ”బాబూ! రామకృపాల్‌! పట్టుదలని విడిచి పెట్టండి. రమణికగుప్త ప్రజాతంత్ర విధానం ద్వారా యూనియన్‌ని నడిపిస్తున్నారు. మీరు అడ్డుపడుతున్నారు. రేపు నక్స్‌లైట్లు ఆయుధాలని చేపట్టి దండెత్తుతారు. అప్పుడు మీరేం చేయగలుగుతారు. టైమ్‌ని గుర్తించండి. రమణికగారి డిమాండ్స్‌ని ఒప్పుకోవాలి.”

రామకృపాల్‌ సింహ్‌ ఝార్‌ఖండ్‌లో యూనియన్‌ కార్యాలయాన్ని తెరవమని స్వయంగా వచ్చి చెప్పారు. ఝార్‌ఖండ్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర గేటు తెరిచారు. ఝార్‌ఖండ్‌లో మెలాబాబు ఇంట్లో జెండా ఎగరేసి యూనియన్‌ ఆఫీసు తెరిచారు. యూనియన్‌ సభ్యత్వం కోసం కొట్లాటలు కూడా జరిగాయి. ఎన్నో రోజులు క్యూలు కట్టారు. కేదలా, ఝార్‌ఖండ్‌లలో మొట్టమొదటి సారిగా కార్మికుల బి-ఫారమ్‌లు నింపబడ్డాయి. అందులో వాళ్ళ పూర్తి అడ్రస్సు, వాళ్ళు చేసేపని మొ||లైన వాటి గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళ వేజెస్‌ షీట్‌ తయారు చేయబడింది. కోల్‌కటర్‌, ఓవర్‌ బర్డెన్‌ (బొగ్గు పొరలలో రాళ్ళు, ఫైరల్‌క్లే, మట్టి ఉంటాయి. వీటన్నింటిని వేరు చేస్తేనే బొగ్గు (ూజుూవీ) లభిస్తుంది.) కార్మికులకి వేజ్‌బోర్డు ననుసరించి ఆరోజుల్లో ఐదు, ఆరు రూపాయల కూలి ఉండేది. అందరికి ఈ కూలీ ఇచ్చే ఏర్పాటు చేసారు. పది రూపాయలు బోనస్‌ కూడా ఇచ్చారు. కార్మికులకు పరిచయ పత్రాలు ఇచ్చారు. పర్మనెంట్‌ కార్మికులుగా వారికి గుర్తింపు లభించింది.

పరిచయ పత్రాల కథ : (ఐడెన్‌టిటీ కార్డులు)

పరిచయ పత్రాల వెనక పెద్ద కథే ఉంది. ఒకసారి జార్జ్‌ ఫర్‌ నాండిస్‌ కార్మికుల సభలో ఉపన్యాసం ఇవ్వడానికి కేదలా చౌక్‌కి వచ్చారు. నేను వారితో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి కష్టసుఖాల గురించి మాట్లాడాను. కార్మికుల హాజరు తీసుకోరని, వాళ్ళకి జీతం ఎంతో తెలియదని, పదవి పేరు తెలియదని అంటే అసలు వాళ్ళ గురించిన రికార్డు ఉండదని, ఒకవేళ ఏ దుర్ఘటన అయినా జరిగితే ఆ కార్మికుడు ఇక్కడే పని చేసేవాడని, దుర్ఘటన జరిగి చచ్చిపోయాడని చెప్పడానికి మా దగ్గర ఏ ప్రూఫ్‌ లేదని చెప్పాను. సభలో జార్జ్‌ సాహెబ్‌ వీటిని గురించి మాట్లాడారు. ఉద్యమానికి నాంది పలికారు. వారి స్లోగన్లు – ”మా పేరేమిటో రాసి ఇవ్వండి. కార్మికులు పర్మనెంట్‌ వర్కర్స్‌ అని ప్రమాణం చూపించడానికి ఐడెన్‌టిటీ కార్డులు ఇవ్వండి.”

నాకు బాగా జ్ఞాపకం ఈ స్లోగన్లతో బొగ్గు గనులు ప్రతిధ్వనించాయి. బొగ్గు గనులలో జరగబోయే మా ఉద్యమాలకు ఈ స్లోగన్లు నాందీ పలికాయి. పరిచయ పత్రం ఇవ్వమని అడగడం ఒక పెద్ద అడుగు ముందుకు వేయడమే. నేను దీనిని సావిత్రి సత్యవాన్‌ కథతో పోల్చేదాన్ని. సావిత్రి యమరాజుని అడిగింది. ”బంగారు గ్లాసులో నేను నా మనవడు పాలు తాగుతుంటే చూడాలి.” అంటే ఆమె మత్తైదువుతనాన్ని, సంతతిని, సమృద్ధిని కోరింది. అంటే ఆమె ఒక వరం అడిగి కావల్సినవన్నింటినీ అడిగేసింది. ఈ విధంగానే ఒక ఐడెన్‌టిటీ కార్డులో కార్మికులకు కావలసిన వివరాలన్నీ ఇమిడి ఉన్నాయి. పేరు, పని చేసే స్థానం, పదవి పేరు, జీతం, కార్మికుల అస్తిత్వం, స్థాయిత్వం అన్నీ… అన్నీ… ఈ కార్డుతోనే పరిచయం అవుతాయి.

నిజానికి ఈ పరిచయ పత్రం కార్మికుల ఎన్నో సమస్యలకు సమాధానంగా పని చేసింది. అసలు ఈ కార్డు లేకపోవడం వలన కార్మికుల అస్తిత్వానికే ముప్పు వచ్చింది. హజారీబాగ్‌ జిల్లా అంతా (ఆ రోజుల్లో గిరిడీహ్‌ దాకా వ్యాపించింది.) మా యూనియన్‌ ఉన్న ప్రతీ చోట ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మూడుసార్లు కార్మికులు ఈ స్లోగన్లను ఉచ్ఛరించేవారు. వాతావరణం అంతా మారు మ్రోగిపోయేది. ఆ సమయంలో కాంట్రాక్టర్లు వాళ్ళ గుమస్తాలు, గుండాలనేనోళ్ళు కొంత మూతపబడ్డాయి. ఐడెటిటీ కార్డు కార్మికుల చేతికి వచ్చాయా అని వాళ్ళకు అనిపించేది. నేషనలైజేషన్‌ తరువాత ఈ కార్డు కార్మికుల జీవితాలకు ఎంత వెలుగునిచ్చిందో సంవత్సరాల తరబడి ప్రభుత్వపు బొగ్గు గనులలో ఉద్యోగం కోసం పడిగాపులు కాచిన కార్మికులకు బాగా తెలుసు. ఈ కాగితం ముక్క వలన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. లేనివాళ్ళకు రెండు ముద్దలు నోట్లో వేసుకునే అవకాశం లేకుండా పోయింది. పరేజ్‌ బంగళా దగ్గరి ఆమరణ నిరాహారదీక్ష మన ఐడెన్‌టిటీ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. టోకెన్‌ రూపంలో పది రూపాయలు అయినా సరే బోనస్‌ స్లిప్‌ లభించింది. ఆ తరువాత బోనస్‌ లభించింది. ఈ బోనస్‌ ఖాతాలు బీ-ఫార్మ్‌ రిజిస్టర్‌ నిండిపోయాయి. ఇది కార్మికులకు వరదానం అయింది. ఎందుకంటే ఇంతకు ముందు ఏనాడు లేని ఐడెన్‌టిటీ వాళ్ళకు లభించింది. రికార్డు వలన ఎన్నో లాభాలు చేకూరాయి. ఈ రికార్డు ఆధారంగా ఐడెన్‌టిటీ కార్డులు ఇచ్చారు. నేషనలైజేషన్‌ తరువాత ఈ కాగితం బొగ్గు గనులలో పనిచేయడానికి వాళ్ళకి ప్రూఫ్‌గా పనిచేసింది.

నేను వెనక నుండి చస్తే పారిపోను

1970 సం|| మాట ఇది. కాంట్రాక్టర్లు కార్మికుల పోరాటం ఇక ఆగదని అంచనా వేసారు. ఈ పోరాటం కార్మికుల జీవితాన్ని చిగురింప చేస్తుందని వాళ్ళు ఊహించారు. వాళ్ళు కార్మిక సంఘాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేసారు. రణనీతిని తయారు చేసారు. యూనియన్‌లో సీనియర్‌ నేత అయిన జనిదాస్‌ అల్లుడు బాదల్‌ దాస్‌ (కాస్తో కూస్తో చదువుకున్న వ్యక్తి)ని మాకు వ్యతిరేకంగా పురికొల్పారు. నిత్యానంద్‌, బాబూ శ్రీకృష్ణ సింహ్‌లని ఇంతకు ముందే యూనియన్‌ నుండి తీసేసారు. అందువలన మాపై పగ తీర్చుకోడానికి నిత్యానంద్‌ బొగ్గుగనులలో పనిచేసే రాజపుత్ర కార్మికులతో, కాంట్రాక్టర్లతో చేతులు కలిపారు. మాకు వ్యతిరేకంగా రణనీతిని తయారు చేసారు. రాజారామ్‌ పరేజ్‌ బంగళాలో రేషన్‌ దుకాణం నడిపేవాడు. బొగ్గు గనులలో కాంట్రాక్టర్‌ పని చేసేవాడు. ఈ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్ల తరపున బలప్రదర్శన చూపించి కార్మికులను అణచాలన్న ఉద్దేశ్యంతో అతడిని ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ ఊరిలో ఉండే ఒక మహిళతో అతడికి సంబంధం ఏర్పడ్డది. ఆమెను మోసపుచ్చి ఆమె భూమిని తన పేరు మీద చేయించుకున్నాడు. ఆ మహిళను ఆమె కూతురిని తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమె కూతురికి ఈయనకి సంతానం కూడా కలిగింది. తరువాత తల్లీ-కూతురుని వెళ్ళగొట్టాడు. ఊరివాళ్ళు వాళ్ళిద్దరిని సహాయం కోసం నాదగ్గరికి పంపారు. వాళ్ళిద్దరు

ఉండటానికి కార్మికులు నివాసాన్ని ఏర్పాటు చేసారు. కేసు వేయడం కోసం ఒక ప్లీడర్‌తో కూడా మాట్లాడారు. ఈ విషయంలో కూడా రాజారామ్‌కి మాపై గొంతుదాకా కోపం వచ్చింది. అందువలన మా శత్రువులతో చేతులు కలిపి మాకు వ్యతిరేకంగా వాదించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే వర్షాకాలం నెపంతో బొగ్గుగనులని కాంట్రాక్టర్లు మూసివేసారు. ఇక్కడ యూనియన్‌ బలం చాలా ఉండేది. ఈ విధంగానే ఝార్‌ఖండ్‌లో బాబూ శివరామ్‌ సింహ్‌, కేదలా సౌత్‌ కాంట్రాక్టర్లు తమ తమ బొగ్గు గనులను మూసివేసారు. మేం అందరం యూనియన్‌ తరఫు నుండి దీనిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం నడిపాము.

బొగ్గు గనుల విభాగం అధికారులకు మేము కంప్లైంట్‌ ఇచ్చాము. మూసి వేయబడిన బొగ్గు గనులు నిజంగానే వర్షాకాలం వలననే మూసేసారా లేకపోతే మేము కంప్లైంట్‌ ఇచ్చిన ప్రకారం కాంట్రాక్టర్లు యూనియన్‌ని నిరుత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో కావాలనే మూసివేసారా! అని తనిఖీ చేయడానికి అధికారులు వచ్చారు. ఈ విషయంలో మేము వాళ్ళతో పాటు ఉండాలి. యూనియన్‌ ఆఫీసు ఇదివరకు కీర్తీరామ్‌ ఇంట్లో ఉండేది. అక్కడ నేను కూర్చున్నాను. ఇంతకు ముందు ఈ ఆఫీసు పైకప్పు గడ్డితో నిర్మించారు. ఇప్పుడు కార్మికులు శ్రమదానం చేసి గోడలను ఎత్తుగా తయారు చేసారు. పెంకులతో కప్పును తయారు చేసారు. ఇంతకు ముందు ఇది మట్టిగోడలతో కట్టిన ఇల్లు. కర్రలను గ్రామస్థులు ఇచ్చారు. మేం అందరం చందాలు వసూలు చేసి రేకు తలుపులు పెట్టించాము. కాంట్రాక్టర్లు తమ ప్లాన్‌ ప్రకారం రాజారామ్‌ని కొందరు పహల్‌ వాన్లతో మా ఆఫీసుకి పంపించారు. దుబ్‌రాజ్‌ మాంఝా మాతో పాటు దాదాపు ఒక వారం నుండి పక్కన ఉన్న ఆదివాసీల టోలీలలో బొగ్గు గనులను మూయడం అన్యాయం అని ప్రచారం చేసారు. దీనివలన కార్మికులు, కర్షకులు మేల్కొంటే వాళ్ళ సహాయంతో మళ్ళీ బొగ్గు గనులను తెరిపించవచ్చని ఆయన ఉద్దేశ్యం. గ్రామాల నుండి వచ్చే కార్మికులు వర్షాకాలంలో బొగ్గుగనులకు వచ్చేవాళ్ళు కారు.  పొలాలలో ఉండే వాళ్ళు. కాని సమయం వచ్చినప్పడు మా ఉద్యమాలలో వాళ్ళ స్త్రీలతో కలిసి వచ్చేవాళ్ళు. రాజారామ్‌ మాట్లాడటానికి నన్ను బయటకి పిలిచాడు. నేను ఆఫీసు నుండి బయటకి వస్తున్నాను. ఆయన నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. ”ఈ ఇన్‌స్పెక్షన్‌లో నీవు మైనింగ్‌ ఆఫీసర్లతో వెళ్ళావంటే చూసుకో మేం ఊరుకోం. వర్షాకాలంలో బొగ్గు గనులు మూసివేసి ఉంటాయి. విన్నావా?”

రాజారామ్‌ని చూడగానే యూనియన్‌ వాళ్ళు ఆఫీసు దగ్గర గూమిగూడారు.

”మేం ఆ అధికారులను పిలిపించాం. మేం ఎందుకు వెళ్ళం? వెళ్లి తీరుతాము. అసలు ఒద్దని చెప్పడానికి నీవు ఎవరవు?” అని నేనన్నాను.

”ఆడవాళ్ళ కోసం ఎటూ పంచాయితీలు పెట్టిస్తావు. ఇహ ఇప్పుడు బొగ్గుగనులను తెరిపించడానికి మహా తయారవుతున్నావు. నోరు మూసుకుని ఆఫీసులో కూర్చో. లేకుంటే చూడు ఎట్లాంటి గుణపాఠం నేర్పిస్తామో..” అని ఆయన అంటూ నా జుట్టు పట్టుకుని లాగాడు. నా బ్లౌజ్‌ చింపేసాడు. నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి ఆఫీసులో తోసేసాడు. బయట తాళం వేసాడు. తనతోటి వాళ్ళతో గుడిసెలకనిప్పంటిచమని చెప్పాడు. బహుశ వాళ్ళు నిప్పంటించడానికి వెనకాముందు లాడసాగారు. వాళ్ళని కూడా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. మా కార్మికులు పారిపోయారు. ఆఫీసు వెనక నుండి వచ్చి గోడలను కూల్చడం మొదలుపెట్టారు. నన్ను అక్కడి నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు.

నేను వాళ్ళను ఆపడానికి ప్రయత్నించాను… ”నేను వెనక నుండి  చస్తే పారిపోను. మీలో ధైర్యం ఉంటే నన్ను ముందు నుండే బయటకి తీసుకువెళ్ళండి. లేకపోతే నన్ను ఈ అగ్గిలోనే బూడిదైపోనీయండి.”

ఇంతలో స్త్రీ కార్మికులు తమ మొగవాళ్ళ పిరికితనాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు తమ భర్తలను, అన్నతమ్ముళ్ళను, మామగార్లను తిట్టడం మొదలుపెట్టారు. అలవాటు ప్రకారం వాళ్ళు కొంగుని నడుంకి కట్టుకున్నారు. సంచులలో రాళ్ళను వేసుకున్నారు. రాజారామ్‌ సింహ్‌, ఆయనతో పాటు వచ్చిన వాళ్లందరి మీద రాళ్ల వర్షం కురిపించారు. చాలా మంది రాళ్ళు తగలడం వలన గాయపడ్డారు. చుట్టు పక్కల దుకాణాదారులు, ట్రాక్‌వాళ్ళు గాయపడ్డారు. వీళ్ళల్లో కాంట్రాక్టర్లకు సహాయపడే వారూ ఉన్నారు. వాళ్ల బంధువులు ఉన్నారు. తాళం పగులగొట్టి కార్మికులు నన్ను బయటకి తీసుకువచ్చారు. రాజారామ్‌తో వచ్చిన వాళ్ళందరు పారిపోయారు. కాని జనీరామ్‌కి కోపం బాగా పెరిగిపోయింది. బాదల్‌దాస్‌ తన అల్లుడయినా రాజారామ్‌తో మా ఆఫీసుకు వచ్చాడని తెలిసి కూడా ఇంటికి వెళ్ళి బెదిరించాడు. ఎవరూ తలుపులు తెరవలేదు. అందుకని పై కప్పు ఎక్కి కప్పును విరగగొట్టి ఇంట్లోకి జొరబడ్డాడు. అతడిని ఎంతగా కొట్టాడంటే అతడు తరువాత కుంటివాడయ్యాడు. ఘాటో పోలీసుస్టేషన్‌ నుండి శ్రీ శివప్రసాద్‌ సింహ్‌ వచ్చారు. ఈయన సోషలిస్టు పార్టీలో పని చేసేవాడు. క్షత్రియుడు కావడం వలన మా యూనియన్‌ అధ్యక్షుడు శ్రీకృష్ణ సింహ్‌ (బిహారు మాజీ మంత్రి) తో సత్‌ సంబంధాలు ఉన్నాయి. నేను ఆఫీసు బయటకూర్చున్నాను. నా మీద దాడి జరిగినప్పటి నుండి దుబరాజ్‌ మాంఝా పారిపోయాడు. అతడి కోసం వెతికించడం మొదలుపెట్టాను. ఆయన రాగానే అడిగారు – ”బాదల్‌ని ఎందుకు కొట్టారు? ట్రక్‌ వాళ్ళు ఎందుకు గాయపడ్డారు?”

”మీరు రెండో రిపోర్టు ఎన్‌క్వయిరీకి వచ్చారు. దీనికి ముందు జరిగిన సంఘటన గురించి సూచనని మేము పోలీస్‌ స్టేషన్‌కి పంపించాము. మీరు దీన్ని ఎన్‌క్వయిరీ చేయడానికి రాలేదా? ఈ మహిళలు ఉన్నారు కాబట్టి నేను బతికి బట్ట కట్టాను. ఈ మహిళలు ధైర్యంగా ఎదిరించి ఉండకపోతే నేను బతికేదాన్ని కాను. ముందు మీరు మొదటి సంఘటన గురించిన ఎన్‌క్వయిరీ చేయండి. తరువాత జరిగిన సంఘటన గురించి దీనితో పాటు తెలిసేపోతుంది…”

”సరే… మీరు ఇప్పుడే ఎఫ్‌.ఐ.ఆర్‌ రాసి ఇవ్వండి”. అని ఆయన అన్నారు.

స్టేషన్‌ నుండి వెనక్కి వచ్చాక మా రిపోర్టుని ముందు రాసారు. తరువాత రెండో సంఘటన గురించి. దీనివలన కేసు గెలవడంలో మాకు ఎంతో లాభం కలిగింది. తరువాత బాదల్‌దాస్‌ తమ సమూహానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు. కార్మికుల ఒత్తిడి ఆయన పైన ఎటూ ఉంది. కాంట్రాక్టర్ల పన్నాగం అతడికి తెలిసిపోయింది. వాళ్ళు తనని పావుగా వాడుకుంటున్నారని అతడికి అనిపించింది. దాదాపు 6 గం||ల సమయంలో నా దగ్గర పోలీసు అధికారి కూర్చుని ఉన్నప్పుడు కేవలం లంగోటీతో ఉన్న దుబ్‌రాజ్‌ మాంఝా వచ్చాడు. అతడి శరీరం అంతా బురదతో నిండిపోయింది. రాజారామ్‌ నన్ను గుడిసెలో బంధించి నిప్పు పెట్టమన్నప్పుడు తాను వాడి చేతి నుండి అగ్గిపెట్టె లాక్కున్నాడని ఇంతలో అతడి మనుషులు తన మీద విరుచుకుపడ్డారని, తనని ఈడ్చుకుంటూ నీళ్ళతో నిండి ఉన్న పొలంలోకి తీసుకువెళ్ళి నీళ్ళలో ముంచి రాళ్ళు రప్పలు పేర్చారని చెప్పాడు. ఏదో విధంగా రాళ్ళు రప్పలని తొలగించి బయట పడ్డానని కాని వాళ్ళు ఉండటం వలన తాను రాలేదని ఇప్పుడు చీకటి పడ్డది కాబట్టి తాను వచ్చాడ’ని చెప్పాడు. ‘నన్ను తన్నారు, బెదిరించారు’ అని అతడు చెప్పాడు.

మేము అతడిని సరస్సు దగ్గర స్నానం చేయమని చెప్పాం. అతడు బతికి బట్టకట్టాడని మేం అందరం సంతోషించాం. పోలీసు అధికారికి సాక్ష్యం లభించింది. చాలా మంది కార్మికులు వచ్చి సంఘటన గురించి చెప్పారు. వివరాలు ఇచ్చారు.

కార్మికులు తమ ఉద్యమంలో ఎవరైనా తమ బంధువలైనా సరే అడ్డుపడితే ఏ మాత్రం ఊరుకోరు. ఆ రోజు ఇన్‌స్పెక్టర్‌ కోసం మేం వెళ్ళలేకపోయాం. ఇన్‌స్పెక్టర్‌ రిపోర్టు కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని రోజుల తరువాత సెంట్రల్‌ గవర్నమెంటులో మైన్స్‌ మినిస్టర్‌ అయిన మాలవీయగారు ధన్‌బాద్‌ వచ్చారు. మేం అందరం దాదాపు 800 మంది కార్మికులతో ఆయన బస చేసిన రెస్ట్‌హౌజ్‌ ఎదురుకుండా ప్రదర్శన జరిపాము. గనుల అధికారి రెండోసారి ఇన్‌స్పెక్షన్‌కి రావాలని, ఆ సమయంలో నన్ను, యూనియన్‌ ప్రతినిధులను పిలవాలని చెప్పాము. ఆయన హామీ ఇచ్చారు. తరువాత క్షత్రియులు, కాంట్రాక్టర్లు కలిసి పాట్నా వెళ్ళారు. అక్కడ కొందరు సమాజవాదీ నేతలతో మాట్లాడి, బేగం సరాయ్‌కి చెందిన సమాజవాది పార్టీ మహిళా నేతని నన్ను వ్యతిరేకించడానికి తీసుకువచ్చారు. నిజానికి ఈ ప్రదేశంలో మేం ఇద్దరం ఎప్పుడు ఎదురెదురు పడలేదు. ఆమె కాంట్రాక్టర్ల ద్వారా ఏర్పాటు చేయబడ్డ కార్మిక సంఘాల చిన్న-చిన్న సభలలో నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగింది. ఆమె కాంట్రాక్టర్ల ద్వారా పిలిపింప బడ్డదని కార్మికులు తెలుసుకున్నారు. అందువలన ఆమె మా ఉద్యమాన్ని ఆపలేకపో యింది. చాలా సంవత్సరాల తరువాత నేను పాట్నాకి ఎమ్‌ఎల్‌ఎ గా వెళ్ళినప్పుడు ఆమె చాలా కష్టాలలో ఉన్నదని తెలుసుకున్నాను. ఆమె భర్తని హత్య చేసారు. నేను ఈ హత్య గురించి ఎన్‌క్వైరీ చేయించాలని ఆదేశం ఇచ్చాను. ఆమె పాట్నా పాలిటిక్స్‌లో ముందుకు రావడానికి ఎంతో సహాయం చేసాను. ఆ రోజుల్లోనే ఆమె నాకు అసలు సంగతి చెప్పింది. నిత్యానంద్‌సింహ్‌, లలిత్‌ సింహ్‌ కొంతమంది కాంట్రాక్టర్లతో వచ్చారు. ఆమెను నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది వాళ్లే.

(సశేషం)

 

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.