ప్రతిస్పందన

భూమిక డిసెంబరు 2015 సంచికలో నార్నె వెంకట సుబ్బయ్య, మంగళగిరి పేరుతో వచ్చిన ఉత్తరం చూశాము. ఆ ఉత్తరం పలు అపార్ధాలతోను, అవాస్తవాలతోను ఉందని తెలుపుతున్నాము. మేము వెంకట సబ్బుయ్యగారి ఉత్తరం పంపించకుండా కేవలం మేము రాసిన సమాధానాన్ని మాత్రమే భూమికకు పంపించామని ఒక అవాస్తవికమైన ఆరోపణ చేశారు. ఆ అవాస్తవంపై ఆధారపడి మేము భూమిక పాఠకులను తికమక పెట్టాలని లేక సానుభూతి పొందాలని చూస్తున్నామని నిర్ధారించేశారు. మేము కొన్ని పత్రికలతో పాటు భూమికకు కూడా ఉభయులకు చెందిన ఉత్తరాల్ని పంపించాము. ఇంకా వెంకట సుబ్బయ్య గారు పది లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మాకు పంపిన లాయర్‌ నోటీసును, దానికి మా తరపున న్యాయవాది పంపించిన సమాధానాన్ని కూడా పంపించాము. వెంకట సుబ్బయ్య గారి ఉత్తరంలో మరో అసత్యం ఏమిటంటే, మేము మా పత్రికలో కొంత మంది వ్యక్తుల్ని సంఘాల్ని విమర్శించామని చెప్పటం. వెంకట సుబ్బయ్య గారికి ఈ సందర్భంగా మేము చెప్పే హితవాక్యం ఏమిటంటే, ఇకనైనా అపోహలపైన, అవాస్తవాలపైన ఆధారపడి ప్రయాణం సాగించటం మానుకోవటం మంచిది. ఒక విషయాన్ని మీకు మరోసారి గుర్తుచేస్తున్నాము. వాయిస్‌ ఆఫ్‌ చార్వాక పత్రిక ప్రత్యేక సంచికలో వెలుబుచ్చిన 498-ఎ వ్యతిరేక మరియు మహిళా వ్యతిరేక అవగాహనను ఆ ప్రత్యేక సంచికలోనున్న భావదారిద్య్రాన్ని తీవ్రంగా ఎండగడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని ప్రగతిశీల మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ఆ ప్రకటన అనేక పత్రికల్లో వచ్చింది. భూమిక పత్రికలో కూడా ఆ ప్రకటన ఈ సంవత్సరం జూన్‌ నెలలో వచ్చింది. వెంకట సుబ్బయ్య గారు ఆ ప్రకటనను  చూస్తే తనకు కలుగుతున్న అపోహలు, అపార్ధాలు అన్నీ తుడిచి పెట్టుకుపోగలవని భావిస్తున్నాము. అలాగే మీరు మీ మిత్రులు 40 లాయర్‌ నోటీసులు మాకు పంపించారు. ఈ లాయర్‌ నోటీసుల వ్యవహారాన్ని తప్పుపడుతూ, మందలిస్తూ పైన చెప్పిన సంఘాలు ఇటీవల మరో ఉమ్మడి ప్రకటన చేశాయి. వెంకట సుబ్బయ్య గారు కనీసం దాన్ని చదివినా తన అపార్ధాలకు స్వస్తి చెప్పగలరని అనుకుంటున్నాము. దేశంలో నేడు పలు ప్రాంతాల్లో మతోన్మాద శక్తులు పెట్రేగుతూ హేతువాదుల్ని, ప్రగతిశీల శక్తుల్ని టార్గెట్‌ చేసుకుంటూ పొట్టన పెట్టుకుంటున్న పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతున్నాయి. సామాజిక మార్పును కాంక్షించే వాళ్ళంతా ఆ ఉద్యమాల్ని బలోపేతం చేయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది వదిలిపెట్టి మీరు సాటి మిత్రులపై నోటీసుల యుద్ధం చెయ్యటం ప్రజాఉద్యమాల్ని ప్రక్కదారి పట్టించటమే కాక పరోక్షంగా మతోన్మాద శక్తులకు తోడ్పడటమే అవుతుందని తెలుసుకోండి.

– రేకా కృష్ణార్జునరావు, బొర్రా గోవర్ధన్‌, గోలి సీతారామయ్య, మంగళగిరి.

*****

”సుమ బాలలు స్వయం సిద్ధలుగా … – వారణాసి నాగలక్ష్మి” – నిజమే నాగలక్ష్మిగారూ, చిన్న చిన్న కారణాలకే ఇళ్ళల్లోంచి పారిపోయే పిల్లలకి బయటి ప్రపంచం ఎంతకౄరంగా ఉంటుందో తెలియదు. తెలుసుకునే పాటికి ఆలస్యం అవుతుంది. మంచి కవిత. ”నిప్పుల నడకలోంచి… కళ్యాణి – వి.శాంతి ప్రబోధ” – శాంతి ప్రబోధ గారు కధ చాలా బాగుంది. నిజానికి ఇవి కథలు కావు జీవితాలే. చాలా చక్కగా చెప్పారు. నేను కౌన్సిలింగు కెళ్ళిన రోజులు గుర్తుకొచ్చాయి. ఎన్నో ఇలాంటి కథలు, బలవుతున్న జీవితాలు. – శారద శివపురపు, బెంగుళూరు.

*****

సుమ బాలలు స్వయం సిద్దలుగా… – వారణాసి నాగలక్ష్మీ” – సుమబాలలపై చక్కని సున్నితమైన కవిత! అభినందనలు నాగలక్ష్మి గారూ!! – రాజేష్‌ యాళ్ళ, ఇ-మెయిల్‌.

*****

”నాన్నమ్మ ఆలోచన – లక్ష్మీ రాఘవ” – బావుంది లక్ష్మి గారు. పిల్లల మనసులు వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోవాలి. డబ్బు వైపు పరుగులు పెడుతున్న తరాన్ని చూస్తున్న మనకి ఇలాంటి కథల అవసరం చాలా ఉంది. ”తొలి ఉపాధ్యాయుడు – చింగీజ్‌ ఐతమాతోవ్‌ – ఉమా నూతక్కి” – పుస్తక పరిచయం చాలా ఆసక్తిగా ఉంది. చదవాలి. థాంక్యూ  ఉమ గారు. – వనజ తాతినేని, విజయవాడ.

*****

డిసెంబరు సంచికలో సంపాదకీయం చాలా బాగుంది ఇటువంటి ఆర్టికల్‌ ఈ మధ్య కాలంలో చదవలేదు.  – పోతుకూచి సాంబశివరావు, హైదరాబాద్‌.

*****

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో