పక్రృతి ధర్మం పాటిద్దాం- కవినీత

కడుపులో మనం అమ్మని పెట్టిన అవస్థలకి
పురిటి నొప్పుల బాధలకి అమ్మ అంతం కావాలి అనుకుంటే
సృష్టి ధర్మం కొనసాగుతుందా…
భారం మోస్తున్న భూమాత భయపడిపోతే…
జీవరాసులకు జీవం ఎక్కడిది
ఉరుముల ధాటికి తట్టుకోలేక వర్షపు మేఘం చినుకును వద్దనుకుంటే…
ప్రకృతి ధర్మం గతి తప్పదా
మండే అగ్ని ఆహుతి అవ్వాలి అంటే…
అర నిమిషం అయిన మనం వుంటామా
సెలయేటి అలలు అలా అలా అంతం కావాలి అనుకోని వుంటే…
దాహార్తి మనకి తీర్చేది ఎవరు
గొంగళి పురుగును చూసినా ఛీదరింపులకు చా చా ఏమి బ్రతుకు అని
గొంగళి అనుకుంటే…
రంగు రంగుల సీతాకోక చిలుకలు మనం చూసేవాళ్ళమా
ప్రకృతి కాలాలు క్రమంగా వాటి పని చేసుకుంటున్న అవి
ఎన్ని ఒడుదుడుకులు తట్టుకొని పయనం సాగించకుంటే…
మనిషి అనే మనం జీవించి వుంటామా
కుటుంబానికి కష్టము వచ్చింది అన కంటతడి పెట్టుకో
కాసేపటికి కలతలేని నిద్ర నిన్ను అవారిస్తుంది
ఉల్లాసంగా ముందుకు నడూ ఉప్పెనలు అయిన నీముందు తల వంచుతాయి
నీకు కష్టము వచ్చింది అని కంఠానికి ఉరి వేసుకుంటే…
కష్టాల తాటికి నీ వాళ్లను బలి తీసుకుంటుంది అనేది మరువకు
ఎవరికి వారే ఓ ప్రత్యేకత గలవారు అనేదే మరిచావా
మరుక్షణం నిన్ను మరణం స్వాగతిస్తుంది
మనిషి జీవితం పరుగుల పందెం
ఈ పరుగు పందెంలో జీవించి వున్న ప్రతి మనిషి గెలిపొందినట్టే
ఆట ఆత్మహత్యతో మధ్యలో ఆపి ఓడిన వాళ్ళము అవుతామా
అందరం పరగుపెడదాము గెలుపు ఎవరికి వచ్చిన ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిద్దాం
అందుకు ఆగుదాం, అలుపు ఎరుగని ప్రకృతి ధర్మాన్ని పాటిద్దాం.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>