‘అత్యాచారానికి స్త్రీయే కారకురాలా? ముమ్మాటికి కాదు’

డాక్టర్‌ కొత్తింటి సునంద

‘అత్యాచారం’ అనేది మనం అనునిత్యం వినే వార్తలలో ఒక భాగమై పోయింది.

  అత్యాచారం జరిగింది అని తెలిసిన వెంటనే మనవాళ్ళు కొందరు, వెంటనే ‘ఆ పిల్ల ఎట్లాంటిదో ఏమొ?

ఎట్లాంటి బట్టలేసుకొంటుందో ఏమొ? యడాడ తిరుగుతుందో ఏమొ?’ అని వ్యాఖ్యానాలు చేయడం, ఆ వెనువెంటనే ”వాడిని మా పిల్లల జోలికి రమ్మను, మా పిల్ల నిప్పు… తాకిన వాడిని కాల్చిపారేస్తుంది.  మేము మా పిల్లలని కట్టుబాటులో పెంచుతున్నామండి.  ఆ తిరుగుళ్ళు అవీ మా పిల్లలకు లేనేలేవు” అని గర్వంగా చెప్తూ వుంటారు.  దురదృష్టవశాత్తూ ఆమ్మాయే అత్యాచారానికి గురి అవుతుందనుకోండి.  అత్యాచారం చేసినవాడిపై తిట్లు, శాపనార్థాలు కురిపిస్తారు.  అప్పుడుగాని అమ్మాయిల జీవితాలు ఎంత భేద్యమైనవో (vulnerable) వాళ్ళకర్థం కాదు.
 సాంఘికంగా మనకంటే ఎంతో ముందున్న ‘సోకాల్డ్‌ డెవలప్‌డ్‌ కంట్రీ’  లలో కూడ ఇటువంటి అభిప్రాయలు కలిగినవాళ్ళు ఈనాటికీ వున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.  july 26 (2008) The Hindu లొజూలీ బిండెల్‌ రాసిన వ్యాసం ‘Rape – there is never an execuse, ever  వ్యాసం చదివితే, యూరప్‌లోని కొన్నిదేశాలలో అత్యాచారాల గురించి చేసిన సర్వేలలో ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయలు, వాటిని జ్యూలీ బిండెల్‌ తీవ్రంగా నిరసించడం, ఖండించడం మనకు తెలుస్తుంది.
1999లో జరిగిన ఒక అత్యాచారం కేసులో యూరప్‌లో డిఫెన్సు లాయరు అత్యాచారం జరిగిందని చెప్తున్న సమయంలో ఆ స్త్రీ ఒంటికి అతుక్కొని వుండే బిగుతైన జీన్సు ప్యాంటు వేసికొని వుంది.  ఆ స్త్రీ సహాయం లేకుండ పురుషుడికి అత్యాచారం చేయడం అసంభవం అని వాదించారట.  అంతకు మునుపు దోషిగా నిలబెట్టిన నిందితుడిని, న్యాయధీశులు డిఫెన్సు వాదననంగీకరించి, నిర్దోషిగా విడుదల చేసారంట.  ఇక అప్పటినుండి దాదాపు పది సంవత్సరాలు నిరాటంకంగా అత్యాచారానికి పాల్పడ్డ ప్రతీ మగవాడు  అతని లాయరు, జడ్జీలు – అందరు ఆ ఆర్గ్యుమెంటునే వాడుకొ౦టూ, బలపరుస్తూ తప్పించుకొంట, తప్పింపచేస్తూ వస్తున్నారంట.  ఈ వాదం ఎలా వుందంటే పూర్వం అమ్మమ్మల కాలంలో కాళ్ళు రెండూ గట్టిగా పెనవేసుకు కూచో, అత్యాచారం చేయలేరు అన్నట్లుంది అంటారు జ్యూలీ బిండెల్‌.  ఈ వాదాన్ని తిప్పికొట్టేందుకు స్త్రీవాద ఉద్యమానికి పదేళ్ళు పట్టింది.
కాని దానికి బ్రేకు పడింది మొన్నీ మధ్య జరిగిన ఒక కేసు విచారణలో.  45 వయస్సులో వున్న ఒక మగవాడు 16 ఏళ్ళ వయస్సులో వున్న తన పార్టనర్‌ కూతురికి డ్రైవింగు నేర్పిస్తున్న సమయంలో, ఆ అమాయి ప్యాంటు ముందుభాగంలో చేతులు జొనిపి అత్యాచారం చేయబోయడని ఆరోపణ.  ‘ఆ అమ్మాయి బిగుతైన ప్యాంటు వేసుకొని వుంది.  ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నేనెలా ఆ పని చేయగలను.  ఆమె యిష్ట ప్రకారమే జరిగింది, అని పాతపాటే పాడారంట ఆ నిందితుడు ప్లస్‌ అతడి లాయరు.  కాని ఈసారి జడ్జీలు దానికి ఒప్పుకోలేదు.  ‘జీన్స్‌ ప్యాంటేమీ చేస్టిటీ బెల్టు’ (chestity belt) కాదు అని అతడికి శిక్ష విధించారంట.  ఇది ఇటలీలో జరిగింది.  యూరప్‌లోని చాలా దేశాలలోని ప్రజలు – అత్యాచారానికి కారకురాలు స్త్రీ అనీ ఆమె వస్త్రధారణ, ఆమె ప్రవర్తన, ఆమె తాగుడు అని స్త్రీని బాధితురాలిగ కాకుండ నిందితురాలిగా చూసే బ్లేమ్‌ కల్చర్‌ (blame culture) అంటే స్త్రీపై నిందారోపణ చేసే ఆచారం ప్రబలంగా వుందని జ్యూలీ బిండెల్‌ చెప్తారు.  ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌ పోయినేడాది జరిపిన సర్వేలో ప్రశ్నలకు జవాబులిచ్చిన వారిలో పావువంతుమంది అత్యాచారానికి కొంతవరకో, పూర్తిగానో స్త్రీదే బాధ్యత అని చెప్పారట.  ఆమె శరీరాన్ని బట్టబయలు చేసే బట్టలు వేసుకొంటుంది కనుక ఆమే కారణం అన్నారంట.  ఐర్లెండులో జరిపిన సర్వేలో కూడ వెయ్యిలో 40% అత్యాచారానికి స్త్రీల ప్రవర్తన, వారి అంగాంగ ప్రదర్శనే కారణమని చెప్పారట.
ఇంగ్లండు, వేల్స్‌ దేశాలకు సంబంధించిన పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ డైరెక్టరు కెన్‌ వక్‌ డొనాల్డ్‌ (cane mac donald) ‘గార్డియన్‌’ అనే పత్రికకు ఇంచుమించు ఇటువంటి అభిప్రాయన్నే వెలిబుచ్చారట – స్త్రీల విచ్చలవిడితనం, తాగుడు వంటివే అత్యాచారాలకు దారితీస్తున్నాయని స్కాట్లండుకు (scotland) చెందిన ఒక సీనియరువెస్టు లాయరు డొనాల్డ్‌ ఫిండ్లే (donald findlay) ధోరణి కూడ ఇదే.  అత్యాచారాల కేసులు విచారణ చేస్తున్న సమయంలో కోర్టు జాగ్రత్తగా వుండాలని, పదహారేళ్ళ లోపు అమ్మాయిలను ‘అమాయకుల’నుకోనవసరం లేదని, తనకు 23 ఏళ్ళ వయసులో సెక్సు గురించి తెలిసినదానికంటే ఇప్పటి పదమూడేళ్ళ అమ్మాయికెక్కువ తెలుసని  అసలు అత్యాచార సమయంలో అమ్మాయి ఎటువంటి బట్టలు వేసుకొని వుందో గమనించడం ముఖ్యమని హెచ్చరించారట కూడాను.
పురుషులు తమపై ఆరోపింపబడిన అత్యాచార నేరాన్ని తప్పించుకోడానికి ఇంకొక అస్త్రాన్ని కూడ తరచు వాడుతుంటారు.  స్త్రీ తన సైగల ద్వారా, సంకేతాల ద్వారా రమ్మని పిలిచినందునే లేదా అంగీకారం తెలిపినందునే మేము ఆవిడ జోలికి వెళ్ళాము అని.  జ్యూలీ బిండెల్‌ ఈ వాదాన్ని కూడా తీవ్రంగా గర్హిస్త, స్త్రీ అంగీకారం తెలిపిందో, అనంగీకారం తెలిపిందో కూడ తెలుసుకోలేనంత అమాయకులేమీ కారు మగవారు అని ఖండించారు.  కాని ఎక్కువ శాతం మగవారు ఈ వాదనను వాడుకోడం, అంతకంటె ఎక్కువ శాతం దానిని సమర్థించడమూ జరుగుతునే వుందింకా.
సౌత్‌ ఆఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో, ఫిబ్రవరి నెలలో మినీస్కర్టులు (పొట్టి పావడలు) ధరించిన నలుగురమ్మాయిలను కొందరు మగవారు ట్యాక్సీస్టాండులో లైంగిక వేధింపులకు గురిచేశారు.  ఆ స్త్రీలను వివస్త్రలను చేసి వారిని నగ్నంగా వూరేగించారట.  పైపెచ్చు ఆ మగధీరులు, దారినే పోతున్నవారిని పిలిచి మరీ ‘చూడండి, చూడండి వీరు కోరుకొన్నదే మేము చేశాము’ అని కేక వేశారట.  ఎంత దారుణం.  ఒక్కొక్కసారి స్త్రీల శీలాన్ని గురించి, పవిత్రతను గురించి వీరావేశంతో మాట్లాడేవారే అత్యాచారాల కొడిగడుత వుంటారని జ్యూలీ బిండెల్‌ రాశారు.
నైజీరియలోని ఒక సెనేటర్‌ అత్యాచారాల సంఖ్యను తగ్గించే ఉద్యమంలో భాగంగ ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలను కొన్నాడట.  అదేమంటే స్త్రీలు తమ వక్షోజాలను, ఛాతీ, పొట్ట భాగాలను కనిపించే విధంగా బట్టలేసుకొని బహిరంగ ప్రదేశాలలో తిరిగితే వారికి మూడునెలల జైలుశిక్ష విధించాలి అని.  పోలెండులోని ఇంకొక లెజిస్లేటరు స్త్రీలు పొట్టిపావడలను బహిష్కరించాలని పిలుపునిచ్చారట.  నార్త్‌ మలేషియలోని ఒక నగర కౌన్సిలు వారు తమ హుందాతనాన్ని కాపాడుకొనేందుకు, అత్యాచారాలను, అశ్లీల శృంగారాన్ని అరికట్టేందుకు స్త్రీలు ఎత్తుమడమల జోళ్ళను, లిప్‌స్టిక్కు వాడకాన్ని నిషేధించాలని ఆదేశించారట.
బురఖా ధరించని స్త్రీలు తమంతట తాము అత్యాచారాలను ఆహ్వానించినట్లు అర్థమని కొందరు మతపెద్దల అభిప్రాయమంట.  ఆస్ట్రేలియకు చెందిన ఒక సీనియర్‌ మతపెద్ద షేక్‌ తాజుద్దీన్‌ అల్‌ హిలాలి ఒక ప్రసంగంలో ఇలా అన్నారట.  ”పచ్చిమా౦సం ఏ విధంగ వేటాడే జంతువుల నాకర్షిస్తుందో అదే విధంగా బురఖా వేసుకోని స్త్రీ మగవాడిని ఆకర్షిస్తుంది” – జ్యూలీ బిండెల్‌ సూటిగ ఒక ప్రశ్ననిక్కడ అడుగుతారు.  స్త్రీ తన కాళ్ళు, చేతులు కనపడే విధంగ బట్టలు వేసుకొన్నంత ొమాత్రాన, మగవారెవరైనా తనను సెక్సులోకి లాగొచ్చని సంకేతమిచ్చినట్లు అర్థమా?  బలవంతంగానైనా సరే తమను అనుభవించవచ్చునని చెప్పినట్లు లెక్కకాదు అంటారు జ్యూలీ. 2006లో బ్రిటన్‌లో economic and social research council వారొక ప్రాజెక్టును చేపట్టారు.  అందులో భాగంగా mock jury trials – నకిలీ న్యాయసమితి విచారణలు చేపట్టారు.  ఒక నివేదిక తయరు చేశారు.  దానిలో ఒక (juror) న్యాయవేత్త స్త్రీ సహకరించనిదే ఈ పురుషుడు స్త్రీని చెరచడంగాని, కామక్రీడ నిర్వహించడం గాని వీలుకాదు.  అతడు ఆమెను గట్టిగా కొడితే తప్ప సాధ్యం కాదు.  స్త్రీ శరీరం మీద గాట్లు, దెబ్బల గుర్తులు లేకపోయినట్లయితే ఆ స్త్రీ సహకరించినట్లే లెక్క అని ఆయన ఉవాచ.
 జ్యూలీ బిండెల్‌ మనలను ఇలా అడుగుతున్నారు.  ఇదంతా విన్న తరువాత మీకు సమస్య పూర్తిగ అర్థమయ్యే వుంటుంది.  అయితే మనమేమి చేద్దాం?  శరీరన్నంతటిని కవచం కప్పుకొని తిరుగుదామా? ఆయుధాలు ధరించుదామా? లేదా బయటికి వెళ్ళకుండ వనేద్దామా? – అసలటువంటి ఆలోచనలకే తావీయనవసరం లేదంటారు జ్యూలీ.  ఏ.చ. ప్రభుత్వం ఒక పక్క అత్యాచారాల కేసులలో సరిగా శిక్షలు పడడం లేదని వాపోతనే ఇంకొక పక్క తనను రక్షించుకొనే బాధ్యత స్త్రీలదే అని చెపుతోంది.  ఈ విధంగా కాకుండ మనం స్కాట్లాండులో ‘rape crisis scotland’ వారు చేపట్టిన కార్యక్రమాన్ని అనుసరిద్దాం.  అత్యాచారాలకు స్త్రీలే కారకులు అనే వాదనను ఖండించి, సవాలు చేద్దాం.  పోస్టర్లు అతికిద్దాం.  కరపత్రాలు పంచిపెడదాం. స్కాట్లాండు న్యాయకార్యదర్శి ఈ కాలంలో కూడ పాతవాదన – స్త్రీలే అత్యాచారాలకు కారకులు అనే వాదన చేసేవాళ్ళున్నారంటే నమ్మశక్యం కాదు అంటారు.
 స్త్రీవాదులు దశాబ్దాలుగా ఈ వాదనని తప్పని మొత్తుకొంటున్నా, ఎంతమంది వారి మాటలకు ప్రభావితులైనారు?  ఎందుచేత ఎక్కువమందిలో మార్పు రాలేదు?  ఏదేమైనా ‘rape is sex without consent’ – అత్యాచారం యిష్టంలేని, అనంగీకారమైన కామక్రీడ అని జ్యూలీ గట్టిగ చెప్తున్నారు.  ఇందులో అర్థం కాని అంశమే ముందసలు అని నిలదీస్తారు.
యూరప్‌ దేశాలలో కాముకులు ‘బిగుతైన జీన్స్‌ ప్యాంటు’ వాదనడ్డం పెట్టుకొని తప్పించుకో చశారు.  మరి మనదేశం మాటో
1. అభం శుభం ఎరుగని, ముక్కుపచ్చలారని మూడేళ్ళపాప ఏ విధంగ మగవాడిని సెక్సుకు ప్రోత్సహిస్తుంది?  తన వస్త్రధారణతోనా?  ప్రవర్తనతోనా? 2. మొరటు చీర కట్టుకొని, చింకి జుట్టును కొప్పులో బిగించి పొలాలలో బండపనులు చేసే గ్రామీణ రైతు కూలీ ఏ విధంగా పురుషులలో కావెద్దీపన కలిగిస్తుంది?  తన అర్థాకలి చూపులతోనా?  బురద కొట్టుకొన్న కాళ్ళు చేతులతోనా? 3. మన ఇళ్ళల్లో పనిచేసే పనిమనిషి – ఏ విధంగా ఆ యింటి మగవారిని సెక్సుకు పురికొల్పుతుంది?  ఊడ్చే భంగిమతోనా!  చేతికంటిన జిడ్డు మరకలతోనా? 4. పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థిని ఏమిచేసి తన ఉపాధ్యాయునిలో తనపై కామవాంఛ రేపుతుంది?  అర్థం కాని పాఠాలను వివరించమని అడిగి విసిగించడం వల్లనా!  సరియైన జవాబులు చెప్పి ఆనందింపచేయడం వల్లనా! 5. ‘నాన్నా అది కొనివ్వు, ఇది కొనివ్వు’ అని నాన్న ఒళ్ళో కూర్చొని గారాలు పోయిన చిన్నారి చిట్టితల్లి యుక్తవయస్సుకు రాగానే ఆ తండ్రిలో కావెద్దీపన ఏ విధంగా కలగచేస్తుంది?  తన పెద్దన్నను సెక్స్‌కు ఎలా పురికొలుపుతుంది? 6.తాను తాగడం అట్లుంచి… ‘బాబ నీవు తాగి వున్నావు నీకు మద్యంతో పాటు మా౦సము  మగువ కూడ అవసరము.  రా! నన్నందుకో అనుభవించు’ అని ఏ స్త్రీ చెప్తుంది.  రాస్తూ పోతే లిస్టు పెరిగిపోవడమే తప్ప… దీనికి అంతపొంత కనపడడం లేదు.  కనుక నేను చెప్పేది ఒకటే.  ఆలోచించండి, అర్థం చేసుకోండి, అమలులో పెట్టండి.  అవసరమైన చోట ధిక్కరించండి, ఎదురు నిలబడి పోరాడండి.  గత్యంతరం లేదు.

 

 

 

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

8 Responses to ‘అత్యాచారానికి స్త్రీయే కారకురాలా? ముమ్మాటికి కాదు’

 1. శ్రీహర్ష says:

  అత్యాచార నేరానికి excuse లేనే లేదు. నూటికి నూరుపాళ్ళూ అది నిందితుడి తప్పే. అసలు దీనిపై చర్చే అనవసరం. అత్యాచారానికి స్త్రీలే కారకులు అనటం మరీ దారుణం. అసహ్యకరమైన ఆటవిక న్యాయం. (మాట వరసకు అనటమే కానీ ఏ ఆటవిక న్యాయమైనా ఇటువంటి వాదనను అంగీకరిస్తుందని నేననుకోను). పొందిగ్గా వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన స్త్రీలు అత్యాచారాలనుంచి తప్పించుకోగలరు అనే గ్యారంటీ ఏమీ లేదు. కానీ రెచ్చగొట్టే వస్త్రధారణ ఇటువంటి సందర్భాల్లో సమస్యలు కొని తీసుకువస్తుంది అనేది నా అభిప్రాయం. కానీ మనలాంటి దేశాలలో అటువంటివి నగరాలకే పరిమితం కాబట్టి “కేవలం వస్త్రధారణే అన్ని అత్యాచారాలకు కారణం, కాబట్టి స్త్రీదే పూర్తి బాధ్యత” అనటం వితండం. అత్యంత కఠినమైన చట్టాలూ, వాటిని చిత్తశుధ్ధితో అమలు చేయటం తప్ప అత్యాచారాల్ని అరికట్టేందుకు వేరే మార్గం లేదని నేననుకుంటాను. దీనిపై కూడా ఒకింత విచిత్రమైన వాదన విన్నాను గతంలో. చట్టం కఠినమయ్యే కొద్దీ శిక్షాభయంతో అత్యాచారం చేసిన తరువాత హత్య చేయటం పెరిగిఫోతుంది అని. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతోంది అంట? కలకత్తాలో వాడెవడో 4 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి ముక్కలుగా కోసి పూడ్చేశాడంట ఆధారాలు లేకుండా చెయ్యటానికి. హైకోర్టు ఆ రాక్షసుడికి మరణ శిక్ష విధించింది. జడ్జిమెంటులో న్యాయమూర్తి “ఇది కేవలం అత్యాచారమే కాక, పరమ హింసాత్మకమైన హత్యగా పరిగణించి” మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పిచ్చారు. కానీ ప్రతీకారధోరణితో చేసే అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకూ కూడా మరణశిక్ష వర్తింపచేయ్యటం ఎందుకు సబబు కాదు అనేది నా ప్రశ్న. ఇటువంటివి జరిగి నిందితులు తప్పించుకు తిరగగలిగిన ప్రతి సారీ అది మరో వెయ్యి మందికి ప్రోత్సాహకంగా పని చేస్తుందనేది వాస్తవం. అత్యాచారం చేస్తే మరణ శిక్ష తప్పదు అని తెలిస్తే 90% అత్యాచారాలు మటుమాయమైపోతాయని ఖచ్చితంగా చెప్పగలను. చిన్నవయసులోనే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కొంత మేర ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మిగిలిన కొద్ది శాతం కేసులు దేనికైనా తెగించే కరుడుగట్టిన నేరస్థుల వల్లనే జరుగుతాయి. కానీ మొదటి 90% కి ఊతాన్నిచ్చేది మాత్రం “ఆ ఏమవుతుందిలే” అనే భయంలేనితనమే కారణం.

 2. rudranarasimha says:

  rape not excusable crime …culprit should be punished ciciriouly without delay

 3. rudranarasimha says:

  rape is not at all excusable crime..culprit shoul be punished civiriouly immeduately

 4. srikanth says:

  సునంద గారు… అత్యాచారమనేది నీచమైన నేరమని అందరూ అంగీకరిస్తారు. కానీ ఒక స్త్రీ అత్యాచారం జరిగింది అని చెప్పగానే, మగాన్ని పూర్తిగా దొషిని చూసినట్లు చూడడం సబబు కాదు. దానికి చాలా జారణాలు వుండవచ్చు. ఆ కారణాలను కూలంకశంగా పరిశీలించాలి. జడ్జిలు ఇలా పరిశీలించి ఆ పరిస్తుతులను బట్టి, తీర్పులు చెబుతుంటారు. జీను ఫాంటు వేసుకున్న కారణంగా అత్యాచారం జరగదని జద్జిలు నమ్మడానికి బహుశా అలాంటి కారణం కావచ్చు. విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాతే జడ్జిలు అలా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలకు అనుకూలంగా తీర్పులు చెప్పినప్పుడు మెచ్చుకుని, వారికి ప్రతికూలంగా తీర్పులు చెప్పినప్పుడు మాత్రం తీవ్రంగా విమర్శించడం భావ్యమేనా..? మనది పురుషస్వామ్య ప్రపంచమే అనుకుందాం, ఇంకా మగవాడి ఇస్టారాజ్యంగానే ఈ ప్రపంచం నడుస్తున్నదని అనుకుందాం. ఐనా సరే, అత్యాచారం విషయంలోకి వస్తే మగాల్లు అందరూ స్త్రీమాటలనే నమ్ముతారు. జడ్జిలు కూడా అంతే. అత్యాచార విషయంలో సానుభూతి ఎప్పుడు స్త్రీలవైపే వుంటుంది. బలమైన కారణాలు, నిజమేననిపించే విషయాలు, డిఫెన్సు వారు చూపిస్తే జడ్జిలు మాత్రం ఏమి చేయగలరు..?

  ఉదాహరనకి, మనదేసంలో సుప్రీం కోర్టు, ఒక అత్యాచార కేసులో దోషికి, ఎటువంటి సాక్షాలు లేకున్నా, కేవలం భాదితురాలి వాఙ్మూలాన్ని ఆదారంగా పరిగనలోకి తీసుకుని శిక్షించడం జరిగింది. అత్యాచారం కేసులలో చేసాడని నిరూపించడం ఎంత కష్టమో, చేయలేదని నిరూపిచు కోవడం కూడా అంతే కష్టం. అలాంటప్పుడు కేవలం బాదితురాలి మాటల ఆదారంగా శిక్షింగ్చడం అంటే కొన్ని సార్లు మగవారు అన్యాయంగా బలవ్వరా..? అందుకేనేమో, ఒకనొక సంధర్భంలో ప్రముఖ లాయరు గారు, ఇకమీదట స్త్రీతో గడిపే ప్రతిమగవాడు ఇది ఆమె ఇష్ట పూర్వకంగానే జరిగిందని ఒక agreement మీద సంతకం తీసుకోవడం వుత్తమం అని చెప్పారు. ఆయన కొంత అతిషయోక్తికి పోయినా.. ఇది పూర్తిగా కొట్టిపారేయలేనిది కదా. మన సినిమా జనాలు, “ఏ ఆడదీ తనకు అత్యాచారం జరిగింది అని అబద్దం చెప్పదు” అని సంభాషనలు మహిలా ప్రేక్షకుల కోసం హీరోల చేత చెప్పించడం మనం చూస్తూనే వున్నాం. కానీ నిజం మాత్రం ఇందుకు భిన్నంగా వుంది. మన దేశంలోనే కొంతమంది స్త్రీలు డబ్బుకోసం ఇలా దొంగకేసులు బనాయించిన సందర్బాలు లేకపోలేదు. మరి స్త్రీ చెప్పిన ప్రతీమాటను గుడ్డిగా నమ్మేస్తే మగవారికి అన్యాయం జరగదా..? ఇలా ఒక స్త్రీ అబద్దపు కేసు పెడితే మన న్యాయస్థానం ఆమెను శిక్షించింది కూడా. అంతేకాదు ఒక సంవత్సరం కిందటి మాట, బెంగలూరులోని స్త్రీ సంక్షేమ శాఖ వారు పనిచేసే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న లైంగిక హింసను అరికట్టాలన్న సదుద్దేసంతో కంపెనీలలో అటువంటి కేసులను విచారించడం జరిగింది. కొంతమంది ఈ విషయం తెలుసుకుని తమంతట తాముగా వచ్చి బాధితురాలికి క్షామాపన చెప్పారు కూడా. కాకపోతే అందులో కొసమెరుపు ఏమిటంటే స్త్రీ సంక్షేమ శాఖ వారు అందులోని తప్పుడు కేసులను వెతికి వేరు చేయడానికి చాలా శ్రమించవలసి వచ్చిందంట. అలా తప్పుడు కేసులు పెట్టిన వారిని తీవ్రంగా మందలించినట్లు చెప్పారు. మరి దీనికేమంటారో మన హీరోలు.

  ఇంత కష్టపడి నేను చేయదలుచు కున్నదేమంటాఎ అత్యాచారం జరిగింది అని స్త్రీ చెప్పీ చెప్పగానే అది నిజమని నమ్మి శిక్షలు జడ్జిలు ఎందుకువేయడంలేదో చెప్పడం మాత్రమే. దానికి వారికి కావలసిన సాక్షాలు వారికి చూపించాలి. వారు అన్నింటినీ పరిశీలించి తీర్పు చెబుతారు.

  ఇంతవరకూ నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే అమెరికాలో జరిగిన ఒక అధ్యనం గురించి నేను చెప్పదలచుకున్నాను. దానికి సంభందిచిన లింకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

  http://www.anandaanswers.com/pages/naaFalse.html

  ఆ అధ్యనం 70,000 జనాభా వున్న ఒక పట్టనంలో జరిగింది. అందులో 49% కేసులు తప్పుడు కేసులని తేల్చారు. అంతేకాదు కాలేగీలలో విద్యార్థినులు పెట్టే కేసులలో కూడా దదాపుగా 50% తప్పుడు కేసులని స్పస్టంగా చెప్పడం జరిగింది. కాలేగీలలో వీటిని మహిలా ఆఫీసర్లే విచారిస్తారు.

  తప్పుడు కేసులు ఈవిదంగా పెట్టడానికి కొన్ని కారనాలను కూడా చెప్పడాం జరిగింది..

  1) alibi స్రుస్టించుకోవడం.
  2) ప్రతీకారం
  3) సానుభూతి పొందడం.

  నిజానికి ఇలాంటి తప్పుడు కేసులలో, అలా కేసులు పెట్టిన వారికి అత్యాచారానికి సమానమైన శిక్ష వేయాలి. ఎందుకంటే ఇలాంటివి ఒక అమాయకుడైన మగా వాడి తీవ్ర మానసిక, ఆర్థిక వేదనకు గురిచేయడమే కాదు, మరో నిజమైన బాధితురాలికి అన్యాయం కూడా చేస్తాయి.

 5. srikanth says:

  చిన్న తప్పిదము: పైనా చెప్పిన నా చివరి పేరాలో , “అత్యాచార నేరానికి వేసే శిక్క్షకు సమానమైన శిక్ష అని నా ఉద్దేశమ.” జరిగిన పొరపాటును గమనించగలరు.

 6. srikanth says:

  హర్ష గారికి,
  హత్యా నేరానికే మరన శిక్ష వేయడమ మీద కొన్ని అభ్యంతరాలు వున్నాయి. అన్ని హత్యకేసులలో మరన శిక్ష విధించరు. అలాంటిది అత్యాచార నేరానికి మరన శిక్ష ఎలా సమంజసమో మీరు చెప్పడమ బాగుంటుంది. కటిన శిక్ష లే నేరాలను అరికట్టడానికి మార్గమైతే మరి దొంగతనమ చేసిన వారికి చేయి నరకడమ లాంటి శిక్షలు సమంజమేనా…?

 7. శివకుమార శాస్త్రి
  సునంద గారు
  నేను మీకు తెలియ చేయునధి స్త్రీ కి అన్యాయము జరిగినది కాబట్టి మగవాల్లు అంతాదోషులు అనుట అన్యాయము.అని తెలియచేయుట కన్న ప్రతి ఒక్కరూ (మగవారు)ఆలోచించు నట్లూగా వ్యాసముములు వ్రాయుట మంచిది.

 8. ఒళ్లంతా వస్త్రాలు ధరించిన స్త్రీలకు అత్యాచారాల నుంచి ప్రత్యేక రక్షణ ఏమీ లేదు. సరే! కానీ నాగరికత పేరుతోనో, నియో రిచ్ ఫామిలీల పేరుతోనో అశ్లీలంగా వస్త్రాలు ధరించి సభ్య సమాజంలో తిరిగే ఆడపిల్లలను ప్రోత్సహించగలమా? మీరు ఏదైనా వీకెండ్ ప్రసాద్స్ ఐ-మాక్స్ థియేటర్ కి వెళ్ళి చూడండి, సాటి స్త్రీ గా సిగ్గుతో తల దించుకుని చెపుతున్నాను….చాతీ భాగం సగానికి పైగా బహిర్గతమయ్యేలా deep low neck బ్లౌజులు, టాప్ లు వేసుని వాటి కింద పన్నెండేళ్ల పిల్లాడు కూడా ‘అదేమిటో ‘ తెలుసుకోవలని ఉత్సుకత చూపించే విధంగా push up braలు వేసుకుని చాలా కాజువల్ గా తిరిగే పడుచులు కోకొల్లలు గా కనిపిస్తారు.

  వీళ్ళు సెకండ్ షోలు చూసి అరుపులు కేకలతో కార్లలో తిరిగి ఇంటికి వస్తుంటే పురుష ప్రవృత్తి విజృభించిన పశువెవడో రెచ్చిపోతే దానికెవరు కారణం?

  మీ వొంటిని మీరు బహిర్గతం చేసి నలుగురికీ చూపించాల్సిన వస్తువుగా భావిస్తున్నారంటే, దానికి మీరు ఇవ్వ వలసిన విలువ మరెవ్వరో ఇవ్వలేదని వాదించడం భావ్యమా?

  అత్యాచారం ఎంత ఘోరమో, ఇటువంటి వింత పోకడలు కూడా అంతే ఘోరం!

  గోవాలో స్కార్లెట్ ని ఎందుకు రేప్ చేసారు. చాలీ చాలని వస్త్రాలతో రాత్రి 3 గంటల వేళ బీచ్ లో తిరుగుతుంటే..జరిగింది ఆ సంఘటన!

  రేప్ అనివార్య పరిస్థితుల్లో జరిగితే సరే! ఆరేళ్ల పసిపిల్ల కనపడ్డా శృంగార భావనలతో చూసే వెధవలున్న సమాజంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. తర్వాత “శీలం” అంటూ బాధపడకూడదు.

  ఇక రేప్ కి యావజ్జీవ శిక్ష ఒక్కటే సరైనది. నలుగురైదుగురికి శిక్ష పడితే…తప్పకుండా ఇలాంటి నేరాలు తగ్గుముఖం పట్టి తీరతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో