సమాజంలో రజక స్త్రీ స్థితిగతులు – బి. లక్ష్మీప్రియ

సమాజంలో రజక వృత్తి ఆధునికత్వాన్ని సంతరించు కున్నా మహిళలకు మాత్రం ఆధునికానికి తగ్గ అధిక చాకిరి వుండనే వుంటుంది. మహిళకి సమాజం కొన్ని బిరుదులు, కిరీటాలు, ప్రత్యేక లక్షణాలను ఆపాదించింది. అవే సహనం, శాంతి, ఓపిక… మొదలగు క్షమాగుణ లక్షణాలు.

అంటే పురుషులు ఎన్ని తప్పులు చేసినా సహనంతో భరించాలి. ఎన్ని దెబ్బలు కొట్టినా శాంతంగా వుండాలి. ఎన్ని మాటలతో దూషించినా ఓపికగా వుండాలి. ఇన్ని లక్షణాలతో సంసారం గుట్టు బయటకి తెలియకూడదు. వాళ్ళ పరువు సమాజంలో గొప్పగానే వుండాలి. అలాగే ఉదయం నిద్రలేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు శ్రమ.. గొడ్డు చాకిరీ చేస్తుంది. వాకిలి కడిగి ముగ్గు పెట్టడంతో మొదలవుతుంది. వంటా వార్పు తప్పనిసరి. మహిళకు బిడ్డల ఆలనా, పాలనలో పురుషుడు పాలుపంచుకోడు. ఉద్యోగి అయితే ద్విపాత్రాభినయం. ఇంటిపని, ఉద్యోగంలోని సాధకబాధకాలు రెండూ భరించాల్సిందే. ఇవన్నీ మహిళ ఓపికగా చేయాలి. శ్రమ అని విసుక్కోకూడదు. చీదరించుకోకూడదు, అలసట అననే కూడదు. ఆరోగ్యం బాగాలేదు అని అసలే అనకూడదు. ఎప్పుడూ ఇదే గోలా అని విసుక్కుంటాడు భర్త. తిరిగి పొరపాటున కూడా సమాధానం చెప్పరాదు, చెబితే దెబ్బలే. ఆఖరుకు ఆమె శరీరంపై కూడా హక్కులేదు.

వృత్తి పనిలో రజక స్త్రీ : ఇంటిపని పిల్లల ఆలనాపాలనా, భర్త, అత్తమామల సేవలే కాక వృత్తిపనిలో కూడా పాలుపంచు కుంటుంది. స్త్రీ తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. రజక వృత్తి పని అంత తేలిక అయ్యింది కాదు. వృత్తి పనిచేసే మహిళకు

ఉద్యోగ స్త్రీ పడే పాట్ల కన్నా అధికమైన శ్రమ వుంటుంది. శారీరక శ్రమ అధికం, యజమాని ఇంటికి వెళ్లి ఉతకడానికి బట్టలు తెచ్చుకోవాలి. వాటిని శుభ్రపరిచి సమయానికి అందచేయాలి.

ఉతికే పనిగానీ బట్టలు యజమానుల ఇండ్లకు వెళ్లి తెచ్చే పనిగానీ స్త్రీ, పురుషులు ఇద్దరూ చేస్తారు. కానీ ఈ పని మహిళలే ఎక్కువగా చేస్తుంటారు. ఉదయాన్నే రేవులో బట్టలు ఉతకాలంటే రాత్రే బట్టలు నానబెట్టాలి. ఉదయాన్నే ఇంట్లో పని పూర్తి చేసుకుని రేవులోకి దిగాలి. ఎక్కడో తప్ప మహిళ చాకిరేవుకి వచ్చి బట్టలు ఉతక్కపోవడం కన్పించదు. చాకల్దాని జుట్టుగా అయిపోయిందే అనే మాట తరచుగా వింటాం. అంటే బట్టలు ఉతికేటప్పుడు మందు నీళ్ళు తలపై పడి పడి వెంట్రుకలు రంగు మారి పోతాయి. ”పుల్లగా మారిపోయింది” అంటారు. ఈ ఆధునిక కాలంలో జుట్టు రంగు అలా మార్చుకోవడానికి డబ్బులిచ్చి మార్చుకుంటున్నారు.

సమాజంలో రజక స్త్రీ : కులం- వృత్తి అవినాభావ సంబంధం నేడు సడలింది. అయినా కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నవారు వున్నారు. ఎంతోమంది రజకులు కులవృత్తి కొనసాగిస్తూనే వున్నారు. రజక మహిళలు కులవృత్తిలో భాగస్వామ్యం పంచుకుంటారు. పితృస్వామ్య విలువలతో కూడిన సమాజంలో రజక మహిళ కుటుంబంలో ఇంటిచాకిరీ, పిల్లల పెంపకంలో సతమతమవుతూనే కుల వృత్తి పనిలో శ్రమను పంచుకుంటుంది.

గృహహింసతో పాటు కులవృత్తిలో భాగంగా ఆధిపత్య కులాలిళ్లకు వెళ్లినపుడు అగౌరవానికి, లైంగిక వేధింపులకు, శ్రమ దోపిడీకి గురవుతుంది. సమాజంలో రజక వృత్తి పని భారం క్రమేపీ పురుషుల నుండి స్త్రీలపైకి వెళ్తోంది. మధ్యతరగతి ప్రజానీకంలో ఒకరుగా వున్న రజకులు అట్టడుగు వర్గానికి చెందినవారుగా చూడబడుతున్నారు. అందులోనూ మహిళల పరిస్థితి మహాదారుణం అయ్యింది. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం అంటున్నా ఈ రోజుల్లో కూడా రజక స్త్రీ పరిస్థితి దయనీయంగా వుంది.

ఏమేయ్‌, ఓసేయ్‌, చాకల్దానా, ఏమదవలి… అంటూ పలురకాల సంబోధనలతో, పిలుపులతో పిలుస్తారు. పలకలేదా తిట్లు మొదలవుతాయి. రజక స్త్రీ తన ఇంట్లో పని పూర్తి చేసుకుని యజమానులు, పెత్తందారులు, రైతుల ఇండ్లకి పనికి పోతుంది. ఈ అసభ్యకరమైన పిలుపులతో స్వాగతం చెప్పి యజమానురాలు ఇంటిపని అంతా పూర్తి చేయించుకుంటుంది. పని భారం అధికం, ఇచ్చే ప్రతిఫలం కొంచెం. ఉచితంగా కూడా పనులు చేయించుకొంటారు.

ఇప్పటికి అనేక ప్రాంతాల్లో ‘చాకలి దానిని వచ్చా బట్టలు వేయండి’ అని అడిగితేనే వేస్తారు. అన్నం పెట్టండి అని అడిగితేనే పెడ్తారు. భూస్వాములు, పెత్తందారుల మాటలు వినకపోతే బ్రతికే పరిస్థితి లేదు.

ఎదురు తిరిగితే దౌర్జన్యాలు కొన్ని సందర్భాల్లో రజక మహిళ లైంగిక వేధింపులకు గురవుతుంది. అత్యాచారాల పాలబడుతోంది. వశం కాకపోతే దొంగతనాలు మోపుతారు. ఊరు బహిష్కరిస్తారు. పని ప్రతిఫలం ఎగ్గొడతారు. రజక మహిళలు బట్టలుతకడంవల్ల తల వెంట్రుకలు రంగు మారి, చుండ్రు సమస్యలు ఎదుర్కొంటుంది. నీళ్ళలో తడుస్తూ వుండటం వల్ల ఆస్తమా, క్షయ, తలనొప్పి జబ్బులు వస్తున్నాయి.

సబ్బులు, సర్ఫులలో రసాయనాలు వుండటం వల్ల చర్మవ్యాధులు సోకుతున్నాయి. రోగుల బట్టలుతకడం వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. ఇలా అనారోగ్యం బారిన పడుతూకూడా కుటుంబంలో, వృత్తిలో అన్ని రకాలుగా సమాన న్యాయం చేస్తుంది రజక మహిళ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో