కోస్టల్‌ కారిడార్‌ గురించి తెలుసుకుందాం, ఆలోచిద్దాం

 ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య

 మనరాష్ట్రం ”అన్నపూర్ణ”గా పిలువబడే కోస్తాతీరం వెంబడి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో భయందోళనలు మొదలైనాయి. గత 6 నెలల కాలంగా ప్రభుత్వం తలపెట్టిన కోస్టల్‌ కారిడర్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కోస్తాతీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 972 కి.మీల పొడవున ఈ కారిడార్‌కు సముద్రం వెంబడి, సముద్రానికి జాతీయరహదారికి మధ్యనున్న భూముల్ని సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సముద్ర తీరానికి జాతీయ రహదారికి మధ్యొదూరం సగటున 20 కి.మీ. లెక్కకడితే, సేకరించదలుచుకున్న 972 కి.మీ.దూరానికి చదరపు కి.మీ.కు 254 ఎకరాల చొప్పున లెక్కవేస్తే 49.50 లక్షల ఎకరాలు అవుతుంది. కోస్టల్‌ కారిడార్‌ కోసం ఫేజ్‌-1 కింద తర్పుగోదావరి, విశాఖ జిల్లాలలో 603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షయాభై వేల ఎకరాల్లో ”పెట్రోలియం, కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ రీజియన్‌” (పిసిపిఐఆర్‌) ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. తర్వాత దశల్లో మిగిలిన 7 జిల్లాల్లో 972 కి.మీ. కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం జరుగుతుంది. కాకినాడ ఎస్‌ఇజడ్‌, తీరం వెంబడి వచ్చే కొత్త ఓడరేవులు ఇందులో భాగంగా ఉంటాయి. ఇదంతా కూడా భారతదేశం ఉపఖండం చుట్టూ తీరప్రాంతంలో 8,112 కి.మీ. పొడవున రాబోయే కోస్టల్‌ కారిడార్‌లో భాగం అవుతుంది. అంటే ఈ భూ  భాగంలో ఉన్న ప్రజలైన చిన్న సన్నకారురైతుల, పెద్ద సంఖ్యలో జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు నిర్వాసితులౌతాయి. అంతేకాకుండా రసాయన కాలుష్యం ఏర్పరచే పరిశ్రమలు స్థాపించడం వల్ల రాష్ట్రంలో ఆహారధాన్యాల దిగుబడి తగ్గిపోవడంతో పాటు, సముద్ర తీరప్రాంతంలో ఉండే చేపలతో బాటు ఇతర జీవరాశి కూడా అంతమయిపోయే ప్రమాదం ఉంది. రాబోయే ఇంతపెద్ద విపత్కర పరిస్థితి గురించి మనం తెలుసుకోవలసి ఉంది.
అల్లకల్లోలం అయ్యే జీవితాలు :
 రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు సంవత్సరానికి 6.7 వేల కోట్ల మత్స్యసంపద ఉత్పత్తి చేస్తారని ఒక అధ్యయనం తెలుపుతుంది. ఈ మత్స్యకారుల గ్రామాలన్నీ కోస్తా తీరం వెంబడే ఉన్నాయి. వేటమాత్రమే వీళ్ళ వృత్తి. వీళ్ళకు బయటి సమాజంతో సంబంధాలు చాలా తక్కువ. వాళ్ళ జీవనం అంతా సముద్రంతో, తీరంతో మిళితమై ఉంటుంది. విస్తాపనకు గురయ్యే వీళ్ళందరికీ పునరావాసం అసాధ్యం. రైతుకూలీలు, చేతివృత్తుల పనివారు, దళితులు, గిరిజనులు, చాలా పెద్దసంఖ్యలో గౌడ కుటుంబాలు నిర్వాసితమౌతాయి. సముద్రతీరం వెంటవుండే రకరకాల వృక్షాల నుండి ఎండిన కర్రను సేకరించి అమ్ముకుని బతికే నిరుపేదలు కూడా తీవ్రంగా నష్టపోతారు. నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నంలో నిర్మించే ‘అల్ట్రా మెగా థర్మల్‌ ప్లాంట్‌’ నిర్మాణం ప్రారంభం కాకముందే, కేవలం పోర్టు విస్తరణే 16 గ్రామాల మత్స్యకారుల బతుకులను ప్రశ్నార్థకం చేసింది. తర్పుగోదావరి జిల్లా, తాళ్ళరేవు మండలం గాడిమొగ్గ దగ్గర నెలకొన్న రిలయన్స్‌ కంపెనీ సహజవాయువు ప్రాజెక్టు దాదాపు 12 వేల మత్స్యకారుల జనాభాను నష్టపరిచింది. దేశ తీరప్రాంతంలో 8,112 కిలోమీటర్ల పొడవునా గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కోల్‌కత్తా వరకు ఏర్పాటుచేసే ఇండియన్‌ ఇండస్ట్రియల్‌ కోస్టల్‌ కారిడార్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల అయింది. దీనివల్ల దాదాపు సముద్రతీరంలో జీవనం సాగిస్తున్న 6 కోట్ల మంది నిర్వాసితులయ్యే ప్రమాదముందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో బడుగుజీవులను, జీవరాశిని తుడిచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేస్తుందో మనం ఆలోచించవలసిన అవసరం అంది.
ఆహారభద్రతకు ముప్పు :
 ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 96 లక్షల టన్నుల బియ్యంలో 67 లక్షల టన్నులు కోస్తా జిల్లాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 26 లక్షల టన్నులకు పైగా ఉభయగోదావరి జిల్లాల్లో పండుతాయి. పప్పుదినుసులైన పెసర్లు, మినుములు, కందులతోబాటు రాగులు, నువ్వులు, వేరుశెనగ, జీడిపప్పు, మిర్చి, పొగాకు ఉత్పత్తిలో ఈ జిల్లాలదే అగ్రస్థానం. మామిడి, పనస, జామ, సపోటా పండ్లు, కొబ్బరి ఈ ప్రాంతంలో పుష్కలంగా పండుతాయి. పంటల ద్వారానే దాదాపు 15,544 కోట్ల రపాయల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 3 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. కోస్తాతీరంలో వేటలో పట్టే 43 రకాల చేపలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇవన్నీ విదేశాలకు ఎగుమతి కావడం వల్ల 6.7 వేల కోట్ల ఆదాయం గడిస్తున్నారు. సముద్రంలో లభించే సంపదే కాకుండా అదనంగా సుమారు 5 లక్షల 82 వేల టన్నుల చేపలు, రొయ్యలను చేపల చెరువుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ అన్ని రంగాలపై దాదాపు 2 కోట్ల 40 లక్షల మంది జీవిస్తున్నారు.
ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు
 కోస్తా తీరంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన రసాయనిక పరిశ్రమలు, ఏర్పాటుకానున్న రసాయనిక కాంప్లెక్సులు ఫార్మాసిటీలు, సెజ్‌ల వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టమే కాకుండా పర్యావరణంపై భూగర్భజలాలపై విపరీతమైన ప్రభావం చూపెట్టబోతుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం, అరిణాం, అక్కివలస గ్రామాల్లో నిర్మించిన నాగార్జున అగ్రికెమ్‌ క్రిమిసంహారక మందుల పరిశ్రమలు, పొన్నాడ పంచాయితీలోని స్మార్ట్‌కమ్‌ రసాయనిక ఔషధ పరిశ్రమలు, రణస్థలం పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పరచిన అరబిందో ఫార్మ, రెడ్డిస్‌ ల్యాబ్స్‌, ఆంధ్రా ఆర్గానిక్స్‌, విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం గోవిందాపురం జంక్షన్‌లో నిర్మించిన వ్యట్రిక్‌ (వీరాల్యాబ్‌), విశాఖపట్టణం జిల్లాలోని భీమునిపట్నం మండలంలోని చిన్న నాగమయ్యపాలెం, పెద్దనాగమయ్యపాలెం, అన్నవరం గ్రామాల మధ్య ఏర్పరచిన ఔషధాల కంపెనీలు, పెట్రోడ్రగు, రాంకా ఫార్మసిటీ, అనకాపల్లిలో ఏర్పరచిన బీడీ రసాయనాలు తదితర పరిశ్రమల వల్ల చుట్టుప్రక్కల ఉన్న 20 కి.మీ. ప్రాంతం ఇప్పటికే నరకప్రాయంగా తయరయింది. ప్రధానంగా ఈ పరిశ్రమలన్నీ వర్షాకాలంలో కాలుష్యాన్ని వ్యర్ధపదార్థాలను విడిచిపెడుతున్నాయి. భూగర్భజలాలను కలుషితం చేయడంతో పాటు ఈ వ్యర్ధపదార్థాలన్నీ సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఈ చుట్టుప్రక్కల  భూములు సహజసిద్ధమైన భూసారాన్ని కోల్పోయి పంట దిగుబడి తగ్గిపోవడం గమనిస్తున్నాం. పరిశ్రమల్లో నుంచి వదిలిన వ్యర్ధపదార్థాలు సముద్రంలో కలవడం వల్ల అక్కడ పుట్టిపెరిగే చేపలు, తాబేళ్ళు, పీతలు తదితర సముద్ర జీవాలు చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పరవాడ మండలంలోని సింహాద్రి ఎన్‌టిపిసి కర్మాగారం నుంచి వెలువడిన వ్యర్ధపదార్థాలు సముద్రంలో కలవడం వలన చాలా అరుదైన ఆలివ్‌ రిడ్లే జాతి తాబేళ్ళు మృతిచెంది తీరానికి కొట్టుకొచ్చాయి. రెండుసార్లు పెద్ద సొరచేపలు చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చాయి. చాలా సున్నిత జీవాలైన పుష్పాల్లాంటి అందమైన కోరల్‌ రీఫ్‌ ప్రాణులు చచ్చిపోయి, నీళ్ళపై తేలుత కనబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసిన చేపలలో, రొయ్యలలో రసాయన అవశేషాలున్నాయని జపాన్‌, యూరప్‌ దేశాలు వాటిని వెనక్కి పంపాయి. దిక్కుతోచని స్థితిలో చేపల వ్యాపారులు ఆ రొయ్యలను, చేపలను సముద్రంలో పారబోసారు. పారిశ్రామిక కేంద్రమైన విశాఖ జిల్లాలో జింక్‌ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్యం వల్ల ములగడమింది, చుక్కవానిపాలెం గ్రామాలలో పుట్టిన పిల్లలలో ఎదుగుదల క్షీణిస్తుంది. చాలామంది మానసిక రోగులుగా తయరౌతున్నట్లు అందరి శరీరాల్లో సీసం ఎక్కువ శాతం కనపడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా 1980వ సంవత్సరం నుంచి ఏర్పాటుచేసిన పరిశ్రమల నిర్వహణ విషయంలో సరిగా నిఫ లేకపోవడంతో కూడా ఆ ప్రాంతాలన్నీ భయంకరమైన కాలుష్య ప్రాంతాలుగా తయరయినాయి. భూమిపై ఉన్న అన్ని చెరువులు, భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైనాయని సుప్రీంకోర్టు ఏర్పరచిన కమిటీ తెలిపింది. ఈ ప్రాంతాలలో వ్యవసాయం పూర్తిగా తుడిచిపెట్టబడింది. ప్రజలు తాగునీరు కొనుక్కోవలసి వస్తుంది. చర్మవ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇప్పటికీి ఎక్కువస్థాయిలో దర్శనమిస్తాయి. వెకాళ్ళ నొప్పులు, స్త్రీలలో గర్భవిచ్ఛిన్నం, పుట్టిన శిశువుల్లో లోపాలున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థపదార్థాలు మూసీినదిలో కలవడం వలన, ఆ నీటితో పండే ఆకుకూరల్లో రసాయనిక పదార్థాలు, ఆ ప్రాంతంలో పెంచిన గడ్డిని మేసిన పాలలో రసాయనిక అవశేషాలు ఉన్నట్టు కమ్యూనిటీ సెల్‌, సెయింట్‌ జాన్స్‌ మెడికల్‌ కాలేజీ (బెంగుళూరు) సంస్థ పరిశోధనలో తెలిసింది. హైదరాబాద్‌ నగర శివార్లలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని, గుండెజబ్బులు కూడా ఎక్కువ వచ్చే సచనలు కన్పిస్తున్నాయని కూడా ఈ సంస్థ పేర్కొంది. ఇటువంటి అనుభవాలు చసిన మనం కోస్టల్‌ కారిడార్‌ వల్ల ఎటువంటి పరిణావలు ఉంటాయె ఊహించుకోవచ్చు. అక్కడ ప్రభుత్వం తలపెట్టిన ”అభివృద్ధి” కార్యక్రవలను ఒకసారి గమనిద్దాం.
 శ్రీకాకుళంజిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు సముద్రతీరం జాతీయరహదారి మధ్యలో బల్క్‌డ్రగు ఇండస్ట్రీలు, మెగా కెమికల్‌ కాంప్లెక్స్‌లు, హెలీస్టేషన్లు, ఫెర్టిలైజర్‌ కంపెనీలు నిర్మించడం.
 శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం.
 విశాఖపట్నం ఎస్‌.రాయవరంలో ఒక వి్మానాశ్రయం, నెల్లూరు, ఒంగోలు తాడిగడెంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, తర్పుగోదావరి .జిల్లా అన్నవరం సమీపంలో ఒక వివనాశ్రయం నిర్మాణం.
 నిజాంపట్నం, కాకినాడ ఓడరేవుల ఆధునీకరణ, భీమునిపట్నంలో కొత్త ఓడరేవు నిర్మాణం, తూర్పుగోదావరి జిల్లాలో 5 చిన్న ఓడరేవులు, విశాఖపట్నం జిల్లాలో 4 చిన్న ఓడరేవులు, విజయనగరం జిల్లాలో ఒక ఓడరేవు నిర్మాణం, శ్రీకాకుళంలో నాలుగు మైనర్‌ పోర్టుల నిర్మాణం. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండు చొప్పున హెలీస్టేషన్ల ఏర్పాటు.
 విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, డీప్‌వాటర్‌ ఓడరేవులను తొండంగి దగ్గర కాకినాడ ఎస్‌ఇజడ్‌ కోసం నిర్మించే కొత్త ఓడరేవులను ఆరులైన్ల రోడ్డు నిర్మించి కలపడం. ఈ రోడ్డు తుని దగ్గర నేషనల్‌ హైవే-5కు కలపడం.
 ఇదంతా చూస్తే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి నమూనా మన కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. దాని వెనుక వుండే విచ్ఛిన్నం, వినాశనం, విస్తాపన, ఆరోగ్య అభద్రత గురించి సామాజిక కార్యకర్తలుగా, రాజకీయ పార్టీలుగా మనం ఆలోచించవలసి వుంది. ఇంత భయంకరంగా మొత్తం జీవరాశితో బాటు మన ఆరోగ్యాల్ని నాశనం చేస్త ‘ఆరోగ్యశ్రీ’ పథకం పెట్టడం ఎవరి ప్రయెజనాల కోసవె మనం ప్రభుత్వాన్ని అడగవలసి వుంది. ప్రజలందరిని భాగస్తుల్ని చేసే ప్రత్యావ్నయ అభివృద్ధి నమూనాను మనం వెదుకుదాం. పేద ప్రజల జీవితాల్ని ఫణంగాపెట్టి కార్పోరేట్‌ శక్తులకు, సావ్రజ్యవాద శక్తులకు లాభాలు గడించి పెట్టే అభివృద్ధిని వ్యతిరేకిద్దాం రండి.

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.