మరో సీతాయణం (భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – సరిత భూపతి

పుట్టగానే శిశువు అని
బలిపశువును చేసారు …
మెట్టినింట అడుగు పెట్టగానే ఇల్లాలు అని
వంటింటి కుందేలును చేసారు…
కన్నవారి ఆంక్షలకు అనుగుణంగా నడుచుకుంటే
బుద్ధిమంతురాలు అని అబలను చేసారు…
అత్తింటి వారి ఆక్షేపణలను భరిస్తే
త్యాగశీలి అని చేతగానిదాన్ని చేసారు…
భర్త హింసలను తట్టుకుంటే
గుణవతి అని దిక్కులేనిదాన్ని చేసారు…
ఆడదానిపై అణచివేతలనే అలంకారాలుగా
భావించే సమాజం ఇది…
అందుకే ”రేప్‌ చేస్తే చేయించుకోవాలి” అని కూడా
అనేసాడు ఓ ప్రబుద్ధుడు…
ఆడది అర్థరాత్రి ఒంటరిగా నడవగలిగినపుడు
దేశానికి స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ…
పట్టపగలే అరాచకాలు జరుగుతున్న (పట్టించుకోని)
పాడులోకమిది…
మరి ఇక దేశానికి స్వాతంత్య్రం ఏది?
అందుకే ఓ మహిళా మేలుకో…
నీ మీద అధికారాన్ని చెలాయించే వారి అహంభావాన్ని
పాతాళానికి తొక్కివెయ్యి…
నీ పై జరిగే అన్యాయాలను ఎదిరించు…
చేష్టలుడిగి కూర్చున్న సమాజాన్ని నిగ్గదీసి అడుగు…
అపరకాళీ వై కదిలి
దుష్టశిక్షణ గావించు …
అయిదుగురు భర్తలుండి విదవయైన ద్రౌపదిలా
మరొకడి సాయం కోరక ఈ దుర్యోధన, దుశ్శాసనులను
గుడ్డలూడదీసి తరిమి తరిమి కొట్టి …
మరో మహాభారతం లిఖించు…
అగ్నిలో దూకి పునీత అనిపించుకొమ్మన్న
పతిదేవుని మాట జవదాటక …
కష్టాల ఎదురీతలో ఓడి (గెలిపించి)
భయపడి తల్లి ఒడిలో దాగిన సీతలా కాక
అణచివేత చుట్టూ అగ్ని గుండం వేసి
మాడిమసైపోయిన అరాచకత్వపు బూడిదలో దూకి
అభిషేకం చేసుకొని పునీతవై
మరో సీతాయణం సృష్టించు…
ఓ స్త్రీ మేలుకో…

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో