సెభాష్‌ సెరీనా

పి.సత్యవతి

ఎంత వివక్ష రహిత సమాజంగా, పారదర్శక సమాజంగా, ప్రజాస్వామిక విలువలకి పట్టం కట్టే సమాజంగా మద్దెల కొట్టుకున్నా, ఆధిపత్య వర్ణానికీ, జాతికీ చెందని వాళ్ళు, ఆదిపత్య వర్గాలతో సమానమైన మనుగడ సాగించాలంటే డబ్బే కాదు, ఏదైనా ఒక రంగంలో గుర్తింపు కావాలని గ్రహించిన రిచర్డ్‌ విలియమ్స్‌ తన కూతుళ్ళని టెన్నిస్‌ క్రీడాకారిణుల్ని చెయ్యలని, సరైన నిర్ణయం తీసుకోక పోయి వుంటే మొన్నటి యు.ఎస్‌. ఛాంపియన్‌ సెరీనా టెన్నిస్‌  కోర్టులో చూపించిన అభినివేశాన్ని మనం చూసి వుండకపోదుం. టెన్నిస్‌ తారలకి గ్లామర్‌ కాదు ముఖ్యం, కండబలం, స్టామినా, పట్టుదల, శ్రమ. ఇదంతా ఒక్క సంవత్సరంలోనో రెండు సంవత్సరాలలోనో సాధించేది కాదు. ఇరవై ఆరేళ్ళ సెరీనా, తన నాలుగో ఏటినించే టెన్నిస్‌ బ్యాట్‌ని వదలకుండా పట్టుకుంది. అక్క వీనస్‌ మొన్నటి నెంబర్‌ నెంబర్‌ ఒన్‌ అయితే చెల్లి సెరీనా ఇప్పటి నెంబర్‌ ఒన్‌. ఒకేసారి నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ తీసుకున్న క్రీడాకారిణి. ఒకప్పుడు నవ్రాతిలోవా అంటేన, తరువాత స్టెఫీగ్రాఫ్‌ అంటేన, చాలా అభిమానం నాకు. టెన్నిస్‌ విమెన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లంటే ఇష్టమైన క్రీడాకారిణి గెలిచేదాకా కుర్చీకి అతుక్కుపోవడమే. వీనస్‌ సెరీనాలొచ్చాక నేను వాళ్ళకి పూర్తిగా సరెండర్‌ అయిపోయాను. వాళ్ళు టెన్నిస్‌ ఆడుతుంటే అందులో నాకు సర్వశక్తిసమన్వితమైన యువతులు కనిపిస్తారు. వాళ్ళ శరీర దారుఢ్యం చూసే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసా న్నిస్తుంది. అమ్మాయిలంతా అట్లా వుంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది.
 వీనస్‌, సెరీనాల తండి రిచర్డ్‌, తల్లి ఒరసిన్‌లకి అయిదుగురు ఆడపిల్లలు. క్రీడారంగంలో ప్రతిభ కనపరిస్తే తన బిడ్డలకి మెరుగైన జీవితం లభిస్తుందని, లాస్‌ ఏంజిలిస్‌ పరిసరాల్లోని కామ్టన్‌ అనే ప్రదేశానికి నివాసం మార్చాడు. సెరీనా నాలుగున్నరేళ్ళకే టెన్నిస్‌ బ్యాట్‌ పట్టింది. పదేళ్ళొచ్చేసరికి 49 పోటీల్లో పాల్గొంది. అక్క చెల్లెళ్ళంతా ఇంట్లోనే చదువుకునేవాళ్ళు. 1991 తరువాత రిచర్డ్‌ తన కూతుళ్ళు వీనస్‌, సెరీనాలని జూనియర్‌ టోర్న మెంట్స్‌కి పంపడం మానేశాడు. వర్ణవివక్ష ఎదుర్కోకూడదని. సెరీనా రిక్‌మకి నడిపే టెన్నిస్‌ స్కూల్లో చేరింది. పిల్లలకి దగ్గరగా వుండాలని రిచర్డ్‌ తన నివాసాన్ని వెస్ట్‌ పామ్‌ బీచ్‌కి వర్చాడు. 14 ఏళ్ళకల్లా ప్రొఫెషనల్‌ అయినప్పటికీ సెరీనా, వయస్సు చాలానందున నాన్‌ డబ్ల్యు.టి.ఏ పోటీల్లో మాత్రమే పాల్గొనాల్సొచ్చేది. 1997లో షికాగోలో వెనికా సెలెస్‌, మేరీ పియెర్స్‌లపై విజయం సాధించటం ఒక రికార్డు. 1997 నాటికి ఆమె ప్రపంచంలో 99 వ స్థానానికి, 1998 కి డబ్ల్యు.టి.ఏ టాప్‌ ట్వంటీకి ఎదిగింది. 1998లో అక్క వీనస్‌ చేతిలో ఓడిపోయింది. అయితే వీనస్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ గెలిచింది. 2002 -03 సంవత్సరంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, యు.ఎస్‌ ఓపెన్‌తో సహా నాలుగు గ్రాండ్‌ స్లామ్స్‌ గెలిచింది. అట్లా గెలిచిన క్రీడాకారిణి ఆమె ఒక్కతే. 2008 యు.ఎస్‌ ఓపెన్తో ఇప్పటికీ తొమ్మిది గ్రాండ్‌ స్లామ్స్‌ ఆమె స్వంతం. ఇప్పుడామె ప్రపంచం టెన్నిస్‌ క్రీడాకారిణుల్లో ప్రధమ స్ధానంలో వుంది. అనారోగ్యంవల్ల కొంతకాలం, (2002-02) ఆమె టెన్నిస్‌ నుంచీ ఇతర రంగాల వైపు దృష్టి మళ్ళించినా, మళ్ళీ పుంజుకుని ఎదురు లేకుండా నిలబడింది. తనకన్న ముందు ప్రధమ స్థానంలో వుండిన అక్కను మించిపోయింది. ఈ అక్కా చెల్లెళ్ళిద్దర ప్రత్యర్ధులుగా ఆడిన మ్యాచ్‌లు చూసి తీరవలసిందే. ఈ అక్కా చెల్లెళ్ళిద్దర ప్రత్యర్ధులుగా ఆడిన మ్యాచ్‌లు చూసి తీరవలసిందే. ఈ సంవత్సరం వింబుల్డన్‌ వీనస్‌ది. అక్క చెల్లెళ్ళిద్దర కలిసి పదహారు గ్రాండ్‌ స్లామ్స్‌ సాధించడమేకాక బీజింగు ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని కూడా తీసుకున్నారు.
సెరీనా 1981 సెప్టెంబరు 26న పుట్టింది.  సెరీనా ఫ్యాషన్‌ డిజైనింగు కూడా చేసింది. ఆమెకు స్వయంగా ఒక డిజైనింగు సంస్థ కూడా ఉంది. రంగు రంగుల, రకరకాల దుస్తులతో సంచలనం కలిగిస్తూ వుంటుంది.
మొన్నటి యు ఎస్‌ ఓపెన్‌లో టిఫనీ వెండి కప్పు 1.5 మిలియన్‌ డాలర్ల బహుమతి మొత్తం, ప్రపంచ నెంబరు వన్‌ రాంకింగు, ఇంకేం కావాలి అంటే ఇంకా సాధించాల్సింది చాలా వుందంటుంది సెరీన. క్రిస్‌ ఎవర్ట్ల్‌లాగా బిల్లీ జీన్‌ కింగు లాగా…
 ఒకప్పుడు గాయం మూలంగాన అనారోగ్యం మూలంగాన ఇతర వ్యాపకాలతో టెన్నిస్‌కి దూరమైన సెరీనాను క్రిస్‌ ఎవర్ట్‌ విమర్శించింది. కానీ ఇప్పుడామె మళ్ళీ సెరీనాని అభినందించింది. గత నలభై సంవత్సరాలల్లో టెన్నిస్‌లో అత్యుత్తమ క్రీడాకారుల్లో సెరీనాకు 17 వ స్థానం ఇచ్చింది ‘టెన్నిస్‌’ పత్రిక.
 సందేహం లేకుండా వీనస్‌ సెరీనాలు ప్రపంచంలో అత్యుత్తమ టెన్నిస్‌ క్రీడాకారిణు లుగా నిలిచిపోతారు. సెభాష్‌ సెరీనా!

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

2 Responses to సెభాష్‌ సెరీనా

  1. Prasanthi says:

    ఎంతో మంచి వ్యాసం. నాకు కూడా వారంటే అభిమానం.

  2. చాలా బాగుంది. మీరు ఈవ్యాసం చదివితే ఎలా సపందిస్తారో! చదివి ఇక్కడే చెప్పండి.

    http://annisangathulu.blogspot.com/2008/06/blog-post_27.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో