ఫ్యామిలీ కోర్టులు

కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984

కుటుంబ సంబంధమైన తగాదాలను పరిష్కరించి వారి మధ్య రాజీ కుదుర్చుటకు, వివాహపరమైన తగాదాలను పరిష్కరించుటకు ఫ్యామిలీ కోర్టుల చట్టము ప్రవేశపెట్టబడినది. లా కమీషన్‌ యొక్క రిపోర్టు ఆధారంగా రూపొందించబడిన ఈ చట్టం త్వరితంగా తగాదాలను పరిష్కరించుటకు దోహదపడుతుంది. లాయరును నియమించుకోనవసరం లేకుండా ఎవరి కేసును వారే వాదించుకొనుటకుగాను ఈ చట్టం వీలు కల్పిస్తోంది.

చట్టపు ముఖ్యోద్దేశాలు : రాజీ మార్గంగా కుటుంబ తగాదాలు పరిష్కరించుట, త్వరితంగా న్యాయాన్ని అందించుట.

కుటుంబ న్యాయస్థాన పరిధిలోనికి వచ్చే తగాదాలు :

–  వివాహ సంబంధిత తగాదాలు అంటే వివాహ నిబద్ధత, విడాకులు, దాంపత్య హక్కులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ బాధ్యత, భార్యాభర్తల ఆస్తి వివాదాలు, సంతాన న్యాయ సమ్మతి (వారసత్వం) నిర్ధారణ చిన్న (అయుక్త) పిల్లల సంరక్షణ వగైరాలు. అవి కాక ప్రత్యేక చట్టం ద్వారా దాఖలు చేయబడిన తగాదాలు (అంశాలు)

– కుటుంబ న్యాయస్థానం ఒక పరిధిలో స్థాపిస్తే పైన చెప్పిన తగాదాలన్నీ ఆ న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలి, వేరే ఇతరమైన న్యాయస్థానాలు (సివిలు, క్రిమినలు న్యాయస్థానాలు) పైన చెప్పిన తగాదాలను పరిష్కరించకూడదు (జాలవు).

–  పార్టీలకు (వాది, ప్రతివాదులు) న్యాయవాదిని నియమించుకొనే హక్కులేదు. కాని న్యాయస్థానం అలాంటి అవసరం ఉందని భావిస్తే నిస్వార్థంగా కోర్టుకు సలహానిచ్చే వ్యక్తిని (ూఎఱషబర జబతీఱaవ) నియమించవచ్చు.

– కుటుంబ న్యాయస్థానం, నివేదికను (=వజూశీత్‌ీ), వాంగ్మూలాన్ని (ూ్‌a్‌వఎవఅ్‌), దస్తావేజు (ణశీషబఎవఅ్‌), సమాచారం (Iఅటశీతీఎa్‌ఱశీఅ)లను (అది తగాదాలు పరిష్కారానికి సహాయకారి అనుకుంటే) సాక్ష్యాలుగా తీసుకోవచ్చు. సాక్ష్యం చట్టబద్ధత యీ న్యాయస్థానానికి అక్షరాలా అన్వయించనక్కరలేదు.

– కుటుంబ న్యాయస్థానపు తీర్పు పైన హైకోర్టుకు

(ఉన్నత న్యాయస్థానానికి) అప్పీలు (పునర్విచారణ, పునర్నిర్ణయం కొరకు) దాఖలు చేయవచ్చు.

–  కాని కుటుంబ న్యాయస్థానపు తీర్పుకు పునరీక్షణ (=వఙఱరఱశీఅ) లేదు ళిూవష-19(3)రి. భార్యాభర్తల మధ్య వివాహపరమైన మరియు ఆస్తి తగాదాలు, భరణానికి సంబంధించిన విషయాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాలు మొదలగునవి ఈ ఫ్యామిలీ కోర్టులలో చేపట్టబడతాయి.

ఈ ఫ్యామిలీ కోర్టులలో పై విషయాల్లో దావాలు వేసుకోదలచిన మహిళలు, పిల్లలు, మరియు అర్హులైన పురుషులు జిల్లా న్యాయసేవా అధికార సంస్థల నుండి న్యాయ సహాయం పొందవచ్చు.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో