జీవించే హక్కుని కాలరాస్తున్న సెజ్‌లను వ్యతిరేకిద్దాం!

ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య 

‘నందిగ్రామ్‌’పై సి.పి.ఎమ్‌. ప్రభుత్వం జరిపిన దాడిని మనమింకా మరిచిపోక ముందే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరిన్ని సెజ్‌ల నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఎవరి ప్రయెజనాలు వున్నాయె ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

 అందుకే ‘నందిగ్రామ్‌’లో ప్రజలు సంఘటితమై వామపక్ష ప్రభుత్వానికి, కార్పోరేట్‌ సంస్థలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తూనే వున్నారు. తమ జీవితానికి, భూమికి వున్న సంబంధాన్ని విడదీసుకోలేని రైతులు, రైతుకూలీలు సెజ్‌ పేరిట జరిగే భూదురాక్రమణను అడ్డుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా ఉద్యొమాల జాతీయ సమాఖ్య వారికి అండగా నిలుస్తున్నారు. ఇంకా నందిగ్రామ్‌ చల్లారనేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకో సెజ్‌ అంటూ, కోస్టల్‌ కారిడార్‌ అ౦టూ వేలవేల ఎకరాలను, తీరప్రాంతాలను కార్పోరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రపంచీకరణలో పడిపోయిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం పూర్తిగా విస్మరించాయి. ఈ సెజ్‌ల రూపంలో అభివృద్ధి పేరిట ఒక కొత్త జమీందారి వ్యవస్థను స్థాపించి, దేశ సార్వభౌమత్వాన్ని విదేశాలకు తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకించడం ఈ దేశపౌరులుగా మనందరి బాధ్యత.
 భారతదేశంలో 600కు పైగా సెజ్‌లు ఉంటే మన రాష్ట్రంలో 91 సెజ్‌లు సత్రప్రాయంగా అనుమతి పొందాయి. ప్రభుత్వం సెజ్‌లు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే శక్తి అని అంటున్నది. కాని అది వాస్తవం కాదు. సెజ్‌లలో భూములు, మత్స్యసంపద, గ్రామాలు, సహజవనరులన్నింటిని కార్పోరేట్‌ సంస్థలు దోచుకుంటాయి. ముఖ్యంగా ఈ సెజ్‌ల కోసం ఎస్‌.సి./ఎస్‌.టి., బి.సి., మైనార్టీల అసైన్డు, డిఫారం, సాగు భూములను బలవంతంగా లాక్కొంటుంది.  ఒకప్పుడు భూసంస్కరణల వల్ల పేదలకు పంచియిచ్చిన భూమిని కూడా వదలటం లేదు. ఈ గుంజుకున్న భూములలో నుండి సగంపైగా భూమిని అధిక ధరలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఊర్లకు ఊర్లు ఖాళీచేయమని ప్రజల్ని నిర్వాసితుల్ని చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజల జీవనాధారమైన భూమి వారి కాళ్ళ క్రింద నుండి కదిలిపోతుంది. ఎగుమతులను ప్రోత్సహించాలన్న నెపంతో సెజ్‌లకు సకల సదుపాయలు, అనేక రాయితీలు ప్రభుత్వం కల్పిస్తుంది. రాయితీలు కేవలం కంపెనీలకే కాదు, దాని డైరెక్టర్లకు ఆదాయపు పన్ను చట్టం నుండి కూడా మినహాయింపు యిస్తుంది. సెజ్‌ అనుమతి పొందిన తర్వాత కస్టమ్స్‌, ఎక్సైజు, సేల్స్‌టాక్స్‌, సర్వీసు టాక్స్‌, స్టాంప్‌ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ అండ్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ టాక్సులపై రాయితీల మినహాయింపులు ఎన్నో! ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక అరాచకత్వానికి దారితీయగా దేశవిదేశాల ప్రజానీకానికి వ్యతిరేకంగా కొద్దిమంది దళారులకు ఇది మంచి అవకాశం. రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం వచ్చే నాలుగేళ్ళలో 9,39,000 మిలియన్లు ప్రభుత్వ ఆదాయం నష్టపోతామని ప్రకటించింది. సెజ్‌ల పేరిట జరుగుతున్న దుర్మార్గాలకు యిది తొలిమెట్టు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు సబ్సిడీలను ఎత్తివేసి ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణమైన పాలకవర్గాలు మరోవైపు దేశాన్ని కొల్లగొట్ట్లి గుత్తపెట్టుబడిదారులకు యిస్తున్నారు. దేశం ఏ అభివృద్ధి దిశవైపు నడుస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి!!
 సెజ్‌ల వలన భూమి, అడవి, చేతివృత్తులను పోగొట్టుకున్న జనానికి ఉపాధి కల్పిస్తామంటున్న ప్రభుత్వం యిప్పటివరకు చాలాచోట్ల ఎలాంటి ఉపాధి కల్పిస్తారో ప్రజలకు చెప్పడం లేదు, కనీసం పాలకవర్గాలకు తెలియదు. సెజ్‌ చట్టంలో ఉద్యోగభద్రత ప్రకటించలేదు, ఆరోగ్యభద్రత అసలే లేదు. సెక్షన్‌ 51 సెజ్‌ చట్టం ప్రకారం ఏ చట్టం నుండైనా జీవో నుండైనా సెజ్‌లకు మినహాయింపు యివ్వవచ్చు. ఇది కార్మిక, పర్యావరణ చట్టాలకు వర్తిస్తుంది. సెజ్‌ ప్రాంతంలో కార్మికులకు కార్మిక చట్టాలు వర్తించవు. కార్మిక నష్టపరిహారచట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, ప్రసతి సెలవుల చట్టం, కార్మిక భీమా చట్టం, పనిగంటల నియంత్రణ, కార్మికుల సంఘటితమయ్యే హక్కు ఏమీ వర్తించవు. కొన్ని వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులకు సెజ్‌ చట్టం చరమగీతం పాడుతుంది. ప్రత్యేక ఆర్థిక మండలాలు కేవలం భూమి మీద ఆధారపడ్డ రైతాంగం యొక్క సమస్య ొమాత్రమే కాదు. ఈ సెజ్‌ల వల్ల దేశ ఆహారభద్రతకు, పర్యావరణానికి, జీవావరణానికి ఆఖరుకు దేశ సార్వభౌమత్వానికి ముప్పు. భూమితో సహా ప్రకృతిలోని సహజవనరులన్నీ ప్రైవేటు వ్యక్తుల పరమైనప్పుడు ప్రభుత్వ నియంత్రణ లేక ఆర్థికవ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. ధనికులు మరింత ధనికులుగా తయరు అవుతారు. ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. పప్పు, ఆహారదినుసులు ధరలు పెరిగి, పేద, మధ్యతరగతి, ముఖ్యంగా కార్మికలోకాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తాయి. పెద్దఎత్తున వ్యవసాయభూమిని వ్యవసాయేతర ొభూములుగా ొమారుస్తున్న ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చకుండా కొన్ని మిలియన్ల నీటిని సెజ్‌లకు అందిస్తున్నది. దీని వలన గుక్కెడు మంచినీరు కరువై ప్రజలు అల్లాడిపోతారు. సముద్రతీరం వెంబడి చేపలవేట వృత్తిగా బ్రతికేవారి జీవితాలను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కాబట్టి భూమితో సహా సహజవనరుల్ని కొల్లగొట్టి రైతులనే కాక వ్యవసాయం మీద ఆధారపడ్డ కార్మికుల పొట్టకొడుతూ నయ జమీందారి వ్యవస్థను నెలకొల్పి కాంట్రాక్టు కార్మికులుగా మలిచే సెజ్‌లను వ్యతిరేకించడం కార్మికకర్షకలోక తక్షణ కర్తవ్యం. అన్నదాతగా పేరొందిన రైతాంగం చాలా శాతం తమ భూములలోనే కూలీలుగా, ఫ్యాక్టరీలలో దగాపడే కార్మికులుగా మారే దుస్థితిని శ్రామికమార్గం ఖండించాలి.
మార్కెట్‌ ఆర్థికవ్యవస్థలో పెట్టుబడిదారుల ప్రయెజనం నిర్ణయత్మక అంశమైనప్పుడు ప్రజల ప్రయెజనాలు గాలికి వదిలేయబడుతాయి. మనదేశంలో కార్మికుల శ్రమను చవగ్గా కొల్లగొట్టి, పెట్టుబడిదారీ దేశాలకు కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే పారిశ్రామికవాడలుగా మాత్రమే కాక సామ్రాజ్యవాద స్వతంత్ర అగ్రహారాలుగా, విదేశీ భూభాగాలుగా ఏర్పడుతున్న సెజ్‌లను వ్యతిరేకించవలసిన అవసరం నేడు ఎంతైనా వుంది. ఈ సెజ్‌ కార్పోరేటు శక్తులు దోపిడీదారులు మాత్రమే కాదు జాతి వ్యతిరేకశక్తులు కూడా. కాబట్టి ఈ పోరాటం దోపిడికి వ్యతిరేకం మాత్రమే కాక వలస వ్యతిరేక దేశభక్తియుత పోరాటం కూడా. కాబట్టి ఈ దేశపౌరులుగా ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో భాగస్వాములై మద్దతు తెలపండి, ఈ ఉద్యమాలకు చేయూత నివ్వండి.
కాకినాడలో ఒ.ఎన్‌.జి.సి. కాక ఇతర ప్రైవేటురంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్‌ను నెలకొల్పుతా మన్నారు. తొలుత కాకినాడ రూరల్‌ సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్‌ను ప్రతిపాదించగా ఆ ొభూమిలో వరి పండించే నేలలు వున్నాయని రైతులు, సంవత్సరంలో సగం రోజులు పైగా పని దొరుకుతుందని వ్యవసాయకూలీసంఘాలు ప్రతిఘటించారు. వాళ్ళ ఆందోళన కన్నా అది రియల్‌ఎస్టేట్‌ కళ్ళకు బంగారుభూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. ఏమైతేనేం సెజ్‌ యు. కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు మారింది. మరొక విశేషమేమంటే ఒ.ఎన్‌.జి.సి. ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే వుద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములున్నాయి కాబట్టి దాని స్థానంలో తీరప్రాంతములో చవిటినేలను ఎంపిక చేశామని వివరణ యిచ్చుకున్నా, భూసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు. వందల ఎకరాల జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరి పండే భూమి కూడా వుంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. సెజ్‌ల కోసం సారవంతమైన భూములు తీసుకోకూడదని నిబంధనలకు అనుగుణంగా భూ రికార్డులనే తారుమారు చేసారు. పచ్చని వరిపొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములుగా మార్చేసారు. ప్రజలను భయపెట్టి వెసగించి భూములను లాక్కొన్నారు. భూములను ప్రభుత్వం దళితులకు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒకరి సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. రైతులకు కౌలుదారులకు మధ్య తగాదాలు సృష్టిస్తున్నారు. పేదలకు ముఖ్యంగా దళితులకు సొంత ఇళ్ళు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని భ్రమింపచేసి ప్రజలను, ఉద్యొమాన్ని నీరుగారుస్తున్నారు. సెజ్‌ ప్రాంతంలో గ్రామసభలు జరుపలేదు. వాటి తీర్మానాలు లేవు. ఇక్కడ ఎన్నో ఇళ్ళు సగంలో ఆపేసారు. అటు పునరావాస కాలనీలో వుండాలో లేక స్వంత ఇంటిలో వుండగలరో తెలియని అభద్రత నిరంతరం వాళ్ళను వెంటాడుతూనే వుంటుంది. ఇక వీరు కోల్పోయే పశుసంపదకు వెలకట్టలేము. ఇందుకు పునరావాస కాలనీలో ఎలా వాటిని పెంచుకోవాలో అర్థంకాదు. ”మమ్మల్ని కబేళాలకు తరలించండి” అన్న స్త్రీల ఆర్తనాదాలు ప్రతి గ్రామములో వినిపించేవే. యజమాన్యం హక్కు వున్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే 1000 కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 1500 కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూములలో పశువులను మేపే యాదవులను ఈ గ్రామాలలో చూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టే మత్స్యకారులు, సముద్రంలో అలివి వేసి గుంపుగా చేపలు పట్టేవారున్నారు. వీరందరికి ప్రభుత్వం దృష్టిలో నష్టం కలుగదు. నష్టపరిహారం ప్రశ్నే తలెత్తదు.
సంఘటితమైన రైతులు ”కాకినాడ సెజ్‌ వ్యతిరేక సమితి”గా ఏర్పడ్డారు. ఈ సమితి ఆధ్వర్యంలో రైతులు తమ నిరసనని అనేక పోరాట రూపాలలో తెలియజేస్తుంటే వీరిని జైలు పాలుజేస్తున్నారు. అయినా పోరాట స్ప్తూర్తితో తమ తోటలను నరకడానికి వచ్చిన అధికార, పోలీసు యంత్రాంగాన్ని చుట్టుముట్టి, ఆ విధ్వంసానికి జరిమానా విధించడం జరిగింది. సెజ్‌ వ్యతిరేక పోరాట నాయకులను అరెస్టు చేస్తే దానిని ప్రతిఘటించిన యువత, మహిళలు గ్రామాల్లోకొచ్చిన అధికారులను నిర్బంధించి గ్రామ రహదారులను మూసివేసి, తమ నాయకులను విడిపించుకున్న సంఘటనలెన్నో!! పోరాటంలో మహిళల భాగస్వామ్యం కోసం ఏర్పడిన ”కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాట మహిళా సంఘం” ద్వారా స్త్రీలు ఈ పోరులో క్రియాశీలకపాత్ర వహిస్తూ,స్ప్తూర్తిదాయకంగా నిలుస్తున్నారు. తమ జీవితాల్ని మట్టుబెడుతున్న సెజ్‌లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ొమార్చి 7వ తారీఖున ”మహిళా ఆక్రందన దినం”గా ప్రకటించారు. అదే రోజున సెజ్‌ పనులను ఆపడానికి ప్రజాస్వామ్యబద్ధంగా వేల మంది జనంతో ప్రయత్నిస్తే, దౌర్జన్యపూరితంగా స్త్రీల మీద దాడి జరిగింది. దానికి ఆగ్రహించిన స్త్రీలు, పురుషులు, మూకుమ్మడిగా సెజ్‌ భూములలోని కంచెలను, బోర్డులను, కట్టడాలను కూల్చివేసారు. వారిపై అనేక కేసులు అక్రమంగా బనాయించారు. అప్పట్నుంచి గ్రాొమాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోరాట కమిటి నాయకులపైన, మహిళా సంఘం నాయకురాలి పైన అనేక అక్రమ కేసులు బనాయించారు. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. వేటాడి వేటాడి నాయకులను జైలు పాలు చేస్తున్నారు. వీరు కోర్టులలో, మానవహక్కుల కమీషన్‌లలో న్యాయం కోసం పోరాడుతున్నారు. అందుకు స్పందించిన మానవహక్కుల కమీషన్‌ ఉద్యమకారులను క్రిమినల్స్‌గా చూడవద్దని ఆదేశించింది. ప్రజల తరఫున న్యాయంకోసం పోరాడుతున్న న్యాయవాదినిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడాన్ని చాలా తీవ్రంగా ఆక్షేపించింది. ఈ రోజు వరకు  మొసపూరితంగా, బలవంతంగా భూములను, ఇళ్ళను సెజ్‌ వారు కొంత మేరకు కొనుక్కొన్నప్పటికీ ్భూములు, ఇళ్ళు కూడా ఉద్యమిస్తున్న ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ొమా ప్రాణాలైనా ఇస్తాం గానీ మా భూములను, సహజవనరులను ఇవ్వమని ప్రజలు సంఘటితమై నినదిస్తున్నారు.
 మహబబ్‌నగర్‌ జిల్లాలోనే పోలేపల్లి, ముదిరెడ్డిపల్లె, గండ్లగడ్డ తాండాలలో మొత్తం 1240 ఎకరాల ఎస్‌.సి./ఎస్‌.టి., బి.సి., మైనార్టీల అసైన్డ్‌ పట్టాభూములను బలవంతంగా గుంజుకొని, అరబిందో, హెట్రో ఫార్మా కంపెనీలకు కొన్ని కోట్లకు ప్రభుత్వం అమ్ముకుంది. 1240 ఎకరాల్లో 150 ఎకరాలు ఫార్మా సెజ్‌లకిస్తే మిగతా భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికే అనేది స్పష్టం. అక్కడి పర్యావరణ కాలుష్యాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం సుమారు అరవై ఫార్మాసెజ్‌లకు అనుమతి ఇచ్చింది. ఒక్క పోలేపల్లి గ్రామంలో 2003 నుంచి జరిగిన సర్కార్‌ భూదోపిడివల్ల నలభైఒక్క మంది రైతులు గుండె ఆగి మరణించారు. అక్కడి ఫార్మా కంపెనీల్లో భూములు కోల్పోయిన రైతాంగం కార్మికులుగా – దినసరి కూలీలుగా మారి రోజుకు వంద రూపాయల కూలీతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్త దుర్భరజీవితం గడుపుతున్నారు. పోలేపల్లి ప్రజలు కూడా గత మూడు సంవత్సరాలుగా ొభూమికోసం పోరుచేస్త జైలు పాలవుతూనే – ఈ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓట్లను చీల్చి అభ్యర్ధుల గెలుపోటములను తారుొమారు చేయడం ద్వారా తమ నిరసనను ప్రకటించారు.
ఇటు చిత్తూరు జిల్లా సత్యవేడు సెజ్‌ కోసం శ్రీసిటి యాజమాన్యం పన్నెండు వేల ఎకరాలను బలవంతంగా సేకరించింది. అలాగే అనంతపురం, నెల్లూరు జిల్లాలో కూడా సెజ్‌లు శరవేగంగా అమలు అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓడరేవు, గు౦టూరు జిల్లాలో నవాబుపట్నంలో కూడా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం వాన్‌పిక్‌ కంపెనీ పన్నెండువేల ఎకరాల భూమిని సేకరించింది. ప్రకాశం జిల్లా వెటుపల్లి పంచాయితీ, కొత్తరెడ్డిపాలెం పంచాయితీలు రెండ కలిపి పద్దెనిమిది గ్రామాలు ఖాళీ చేయిస్తోంది.
ఏది ఏమైనా మాకు కులం మతం స్త్రీలు పురుషులు వృద్ధులు పిల్లలు అని భేదాలు లేక మేమంతా సెజ్‌ బాధిత వర్గమని ప్రకటిస్తూ భావితరాన్ని బానిసత్వానికి నెట్టే సెజ్‌లు ొమాకొద్దని ఉద్యమిస్తున్న ప్రజలకు ”ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య” తన మద్దతునిస్తుంది. సామ్రాజ్యవాద కార్పోరేట్‌ శక్తులను వ్యతిరేకిస్తూ ప్రత్యావ్నయ అభివృద్ధి నమూనాను ప్రజాభాగస్వామ్యంతో వెతుక్కుందాం!!
మొసపూరితంగాను, బలవంతంగాను తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయలి.
రైతుకూలీల, దళితుల, మత్స్యకారుల, మహిళల ప్రకృతిపై హక్కును అభివృద్ధి పేరుతో కాలరాయొద్దు.
సెజ్‌ వ్యతిరేక నాయకులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయలి.
తీరప్రాంతాల్లో సి.ఆర్‌.జెడ్‌ (తీరప్రాంత క్రమబద్దీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు) విధానాన్ని పాటించి పరిశ్రమలను నిషేధించాలి.
సెజ్‌ చట్టాన్ని వెంటనే రద్దు చేయలి.
శ్రీమతి మేథా పాట్కర్‌, శ్రీ బాలగోపాల్‌, ప్రొ. కె.ఆర్‌. చౌదరి, పి. చెన్నయ్‌, బి. కృష్ణంరాజు, జీవన్‌కువర్‌, సూర్యనారాయణమూర్తి, ఎన్‌. హేొమా వెంకట్రావ్‌, జె.వి. రత్నం, మధు కాగుల, సరేపల్లి సుజాత, సిస్టర్‌ సెల్విన్‌, సరస్వతి, ఉషా, టి. శంకర్‌, శ్రీనివాస్‌రెడ్డి మరియు లింగరాజుపల్లి సెజ్‌ వ్యతిరేకనాయకులు, ప్రజాసంఘ నాయకులు  25.8.08న ధర్నాచౌక్‌లో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

One Response to జీవించే హక్కుని కాలరాస్తున్న సెజ్‌లను వ్యతిరేకిద్దాం!

  1. mallikharjunarao devabhaktuni says:

    రఇతులఅకు గిత్తుబాతు ధర ఇస్తె భారత దెసము అభివ్రుద్ద్దిచెందుతుంది. సెజ్లు అవసరము లెదు.రైతన్న బాగుంతె మనముఅందరి కంతె ముందుంతము.ఇన్కొఆలొచన అవసరములెదని నాఅభిప్రాయము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో