ఇంటర్‌నెట్‌ మోసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎలా?

సమాచార విప్లవానికి దారివేసిన ఇంటర్‌నెట్‌ అపారమైన సమాచారాన్ని చిటికేసినంత తేలికగా అందుబాటులోకి తెచ్చింది. క్షణాల్లో వార్తల చేరవేత, అవతలి మనుష్యుల్ని చూస్తూ మాట్లాడగలిగిన డిజిటల్‌ వీడియోల సౌలభ్యం, లక్షలాది ఫోటోల నిక్షిప్తం, ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డుల వినియోగం ఇవెన్నో లాభాలతో పాటు నష్టాల్ని కల్గిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల నెట్‌ హింస కూడా పెరుగుతోంది. ఫోటోలను మార్ఫింగ్‌ చేయడం, అబ్యూసివ్‌ ఇమెయిల్స్‌ పంపడంలాంటివి. వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింద పొందుపరిచాం.

ఇక్కడ ఫిర్యాదుదారులు రెండు రకాల పరిస్థితులను ఎదుర్కొంటారు

– నేరం జరుగుతూ ఉన్నప్పుడు లేదా తప్పక జరుగుతుందనుకున్నప్పుడు.

– నేరం ముందే జరిగిపోయినపుడు

చేయవలసిన, తీసుకొనవలసిన చర్యలు :

మొదటి కేసులో ఆ సమాచారాన్ని సంబంధిత లోకల్‌ పోలీసుకు తెలియజేయండి లేదా దాని గురించి సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు సమాచారం వెబ్‌సైట్‌ ద్వారా www.apstatepolice.org/www.hyderabad police.gov.in తెలియ జేయాలి. అలా చేసినట్లయితే ఆ సంఘటన జరుగకుండా నివారించే అవకాశం ఉంటుంది.

రెండవ కేసునందు చాలావరకు ఆర్థిక సంబంధమైన నేరాలన్నీ ఐపిసి పరిధిలోకి వస్తాయి. కావున ఫిర్యాదుదారుడు సంబంధిత లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌లోగానీ లేదా సిసిఎస్‌ లో గానీ ఫిర్యాదు చేయాలి.

ఇటువంటి కేసు సైబర్‌ ఎన్విరాన్‌మెంట్‌లో జరిగినదయితే కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదు. ఈ క్రింద చెప్పబడిన సమాచారాన్ని కూడా అందించవలసి ఉంటుంది.

– పరిశోధనకు సంబంధించిన ఇ-మెయిల్‌ మెసేజ్‌లు.

– ఇతర ఇ-మెయిల్‌ అడ్రస్‌లు.

– పంపినవారి సమాచారం.

– ఆ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సమాచారం (కాంటెంట్‌)

– ఐపి అడ్రస్‌లు

– డేట్‌ (తారీఖు) మరియు టైం (సమయం) కు సంబంధించిన సమాచారం.

– ఉపయోగించిన వ్యక్తి (యూజర్‌) యొక్క సమాచారం.

– అటాచ్‌మెంట్స్‌.

– పాస్‌వర్డ్స్‌.

– అప్లికేషన్‌ లాగ్‌లు. అవి ‘స్నూపింగ్‌’కు సాక్ష్యాలుగా ఉంటాయి.

– ఆ కమ్యూనికేషన్‌ రిసీవ్‌ చేసుకోవడానికి ఉపయోగించిన కంప్యూటర్‌.

– స్క్రీన్‌ లేక యూజర్‌ నేమ్‌ (బాధితుడు మరియు అనుమానితుడు ఇద్దరివీ)

– ఆ ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (ఐఎస్‌పి), అకౌంట్‌ ఉపయోగిస్తున్న దాని యజమాని (ఓనర్‌)

– ముఖ్య సమాచారం/మొత్తం సమాచారం

– ఆ మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్న లేదా చూసిన డేట్‌ మరియు టైమ్‌ వివరాలు.

– అంతకు పూర్వం/ముందు చేసిన కాంటాక్ట్‌ల యొక్క డేట్స్‌ మరియు టైమ్‌ల వివరాలు.

– ఏదైనా ఆ కమ్యూనికేషన్‌ బాధితుని ద్వారా లాగిన్‌ లేదా ప్రింటవుట్‌ చేయబడి ఉంటే అది.

– ఉపయోగించిన/ ఉపయోగపడే/సంబంధించిన పాస్‌వర్డ్స్‌.

– నేరంతో సంబంధముందని భావించిన అనుమానితుల వివరాలు.

– ఏదైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఉపయోగించి నట్లయితే అది మరికొంత అదనపు సమాచారాన్ని గ్రహించి ఉంచుతుంది. అటువంటి సమాచారం యొక్క వివరాలు.

– క్రెడిట్‌కార్డ్‌/ఏటియం కార్డ్‌/డెబిట్‌ కార్డ్‌ల యొక్క సమాచారం మరియు వాటి అకౌంట్‌ వివరాలు.

– ఆ కార్డులు ఇటీవలి కాలంలో ఉపయోగించిన ప్రదేశాల వివరాలు.

డిజిటల్‌ సాక్ష్యాన్ని చాలా సులభంగా నాశనం చేయవచ్చు/చెడగొట్టవచ్చు. ఉదాహరణకు:

– ఉపయోగించడం ద్వారా అది మారిపోతుంది

– దాని దురుద్దేశ్య పూర్వకంగా మరియు తరచుగా తుడిచివేయడం గానీ లేదా మార్పు చేయడం గానీ జరుగుతుంది.

– దానిని సరిగా హాండ్లింగ్‌ చేయకపోయినా, సేవ్‌ చేయకపో వడం వలన కూడా అది మారిపోవచ్చును.

– ఈ కారణాల వలన సాక్ష్యాన్ని జాగ్రత్తగా సేకరించాలి మరియు దాచి ఉంచాలి. ఇటువంటి నేరాల పరిశోధనలో ఇంటర్‌నెట్‌ ఉపయోగించడం, టైమ్‌, డేట్‌ మరియు టైంజోన్‌ సమాచారం మొదలైనవి రుజువు చేయడం చాలా ముఖ్యం.

ఫిర్యాదు చేసేటపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు:

– ఎల్లప్పుడూ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి పోలీసులను సంప్రదించి వారికి ఫిర్యాదు చేయడమే సరియైన పని.

– అన్నింటికంటే ముందుగా సంబంధిత బ్యాంకుకు ఆ మోసాన్ని గురించి తెలియజేయాలి. దీని వలన తరువాత జరిగే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.

– మోసగాడు ఇప్పటికీ మీతో టచ్‌లో ఉంటే, అతనితో సంబంధాన్ని కొనసాగిస్తూ అతని గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయండి.

– మీకు ఏదైనా ఒక మెయిల్‌ ఐడి లేదా మొబైల్‌ నంబరు మీద అనుమానం ఉన్నట్లయితే, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్‌ చేయకండి మరియు దాని గురించి వెంటనే పోలీసులకు తెలియజేయండి.

– ఎంత ఇబ్బందికరమైన సమాచారమైనా సరే పోలీసులు దాన్ని చూసేవరకు నేరానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని తొలగించకండి.

Cyber Crimes Cell Contacts :

Office : 040-27852040

Inspector : 9490616827
Email : cybercell_hyd.appolice.gov.in

 

 

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో