వరకట్న మరణాలు (ఐ.పి.సి 304బి)

వరకట్న మరణం అంటే ఏమిటి?

పెళ్ళైన ఏడు సంవత్సరాలలో ఎవరైనా స్త్రీ కాలిన గాయాల వల్ల గానీ, శరీరానికి అయిన ఇతర గాయల వల్ల గానీ అనుమానాస్పద స్థితిలో మరణించి, ఆమె మరణానికి ముందు ఆమె భర్తగానీ, అతని తల్లిదండ్రులుగానీ, బంధువులుగానీ కట్నం గురించి ఆమె పట్ల క్రూరంగా, క్షోభపెట్టే విధంగా ప్రవర్తించినప్పుడు అది వరకట్నం చావు అవుతుంది. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఆమె భర్తగానీ అతని బంధువులుగానీ ఈ నేరం చేశారని కోర్టు నమ్ముతుంది. (సె. 304 బి భారతీయ శిక్షాస్మృతి)

ఈ నేరానికి శిక్ష ఏమిటి?

ఈ నేరం ఋజువైనప్పుడు ఆ వ్యక్తులకి ఏడు సంవత్సరాలకి తక్కువ కాకుండా యావజ్జీవ కారాగార శిక్షను కోర్టులు విధించవచ్చు.

ఈ కేసు ఋజువు కావాలంటే ఏ అంశాలు ఉండాలి?

ఈ నిబంధన సరిపోవాలంటే ఈ క్రింది అంశాలు ఉండాలి.

–  స్త్రీ మరణం కాలిన గాయాల వల్లగానీ లేక ఇతర శారీరక గాయాల వల్లగానీ లేక అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగి ఉండాలి.

– ఆ మరణం పెళ్ళైన ఏడు సంవత్సరాల్లో సంభవించి ఉండాలి.

–  భర్తగానీ, అతని బంధువులు గానీ ఆమెను మరణానికి ముందు క్రూరంగా హింసించి ఉండాలి. క్షోభపెట్టి ఉండాలి.

– ఆ క్రూరత్వం, క్షోభ కట్నానికి సంబంధించినదై ఉండాలి.

ఈ నేరం చాలా తీవ్రమైన నేరము. కాగ్నిజబుల్‌ నేరమే. పోలీసులు ఎలాంటి వారంట్‌ లేకుండా నిందితుల్ని అరెస్టు చేయవచ్చు. అలాగే ఇది నాన్‌ బెయిల్‌బుల్‌ నేరం. బెయిల్‌ ఇవ్వడమనేది కోర్టు విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.

ఈ కేసుల విచారణ సెషన్స్‌ కోర్టులు చేస్తాయి. మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదు. కానీ విచారణని మాత్రం సెషన్స్‌ కోర్టులే చేస్తాయి. (మన రాష్ట్రంలో అసిస్టెంట్స్‌ సెషన్స్‌ జడ్జీలు ఈ కేసులని విచారిస్తారు)

వివాహం జరిగిన ఏడు సంవత్సరాలలోపు మహిళ ఎవరైనా ఆత్మహత్య చేసుకొని, ఆమె భర్తగానీ, బంధువులు గానీ ఆమెను హింసించి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినారన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు ప్రేరేపించుట నిజమనే భావనకి కోర్టులు రావాల్సి ఉంటుంది. అయితే అలాంటి భావనకి వచ్చే ముందు కేసులోని అన్ని విషయాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. (సె. 113 ఎ భారతీయ సాక్ష్యాధారాల చట్టం)

స్త్రీ మరణానికి ముందు ఆమెను ఆమె భర్తగానీ, బంధువులు గానీ క్రూరంగా హింసించారని, కట్నం గురించి క్షోభపెట్టారని ఋజువైనప్పుడు ఆమె మరణానికి ఆ వ్యక్తుల దుష్ప్రేరణే కారణమని కోర్టు నమ్ముతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయాలను నమ్మాలని భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని కొత్త సె. 113 బి చెప్తుంది.

ఉదాహరణకు – వివాహం జరిగిన ఏడు సంవత్సరాలలోపు ఎవరైనా మహిళ కాలి గాయాలతోగానీ, అనుమాన పరిస్థితులలోగానీ చనిపోయి, ఆ మరణానికి ముందు వరకట్నం గురించి ఆమెను ఆమె భర్తగానీ, అతని బంధువులు గానీ హింసించినట్లు సాక్ష్యం ఉంటే వాళ్ళు ఆమెను మరణానికి గురిచేశారని, ఈ భావనకి వ్యతిరేకంగా సాక్ష్యం చూపించే వరకు కోర్టు నమ్ముతుంది. జి.ఓ.యం.యస్‌.నెం. 28 మాతా, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ 4.7.03 ప్రకారం చనిపోయిన మహిళ తల్లిదండ్రులకు కోర్టు ఖర్చు నిమిత్తం రూ. 25000 మంజూరు చేయుదురు.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో