కొత్త పార్టీలుగూడ ఆడోల్లని మర్సిపోతెట్లా?

జూపాక సుభద్ర


యేడాది కాన్నుంచి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలన్ని ‘వచ్చె వచ్చె చిరంజీవిగాలి రబ్బరు వన్నియలో వూపుతాది దాని జోరు రబ్బరు వన్నియలో’ అని తెగ వూదరగొట్టినయి. ఏమైతేనేంది వీటి పుణ్యమాని, కలాం చెప్పిండని మొత్తానికి ,చిరంజీవి రాజకీయంల దిగిండు. వచ్చే రాకతోనే ‘ఏక్‌దమ్‌గా’ సామాజిక న్యాయం అని ఎత్తుకునేటాలకు అందరికి కండ్లు బెయి తిరిగినయి, మెరిసి నయి. కొందరికైతే ఏకంగా చెమర్చినయి. అదేందో యెన్నడిననట్లు, కొత్త కొత్త పదమైనట్లు. సామాజిక న్యాయం అనేది రాజ్యాంగంల గడ రాసుకున్న దమేనాయె. ఇయ్యల రేపు ప్రతోల్లకు ఆ పదం వాడకం పెద్ద గ్లామర్‌, ఫ్యాషనై పోయింది. కాకపోతే అది కొత్త సీసలకు బొయింది.
చిరంజీవి ‘సామాజిక న్యాయం’ అనుటానికన్నడుగాని ఎట్లా ఏందనేది వివరమిచ్చే ప్రామిటర్‌ లేడు. యీనే తెలుసుకుందామంటే యిదివరకు సమాజ సేవ జేసిన చరిత్రనే లేకపాయె. యితరుల రక్తం, కండ్లు వసూలు జేసుకుని బ్యాంకుల బెట్టిండు. యీ  హీరో తన సినిమా టిక్కెట్ల కొట్లాటలల్ల సచ్చిపోయినోల్లను పరామర్శించి పైసో ఫలవె చేతిల వెట్టని మానవ సేవ యీ హీరోది. నిన్న మొన్నటి కుర్ర హీరోలన్న వాల్ల కోసం సచ్చిపోయిన వాల్ల యింటికి బొయి మాట్లాడి మందులిచ్చి ఆర్ధిక సాయమందిచ్చిండ్రు. 30 ఏండ్ల సంది హీరోగ సినిమాలల్ల తైతక్కలాడిన చిరంజీవి గాపాటి సాయమన్నా అందించిన మానవసేవ జేసిండా అని ఆ మధ్య పత్రికలే అన్నయి.
నిజానికి చిరంజీవి సినిమాల్ని విజయవంతంగా వంద, రెండొందలు, ఆడించింది కింది కులాల గరీబొల్లు, ఆడోల్లే… రిక్షా దొక్కిన పైసలు ఆటో నడిపి, సెప్పులు కుట్టిన పైసలు, రాల్లు రోల్లు గొట్టిన పైసలు కూలినాలి జేసిన పైసలన్ని ఒక్కటికి పది సార్లజూసి వాల్ల పైసలన్ని చిరంజీవి సీన్మలకే దారబోసిండ్రు. చిరంజీవిని పెద్దోన్ని జేసిండ్రు. కాని చిరంజీవికి వాల్ల పట్ల ఎంత గురుతర బాద్దెతున్నది.? చిరంజీవి జెండా, ఎజెండాల్లో, కుడి, ఎడమల ఎక్కడ గీ గరీబులు, ఆడోల్లు అగుపించలే…
సామాజికంగా చూస్తే యిక్కడ అనేక సమస్యలున్నాయి. అనేక ఉద్యమాలు జరిగినయి. జరుగుతున్నయి. పత్తి రైతుల ఆత్మహత్యలు, పబ్లిక్‌ రంగ సంస్థలు ప్రైవేట/ పరం చేసినపుడు, చేనేత, బీడికార్మికులు, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లాంటి అసంఘటితరంగ పోరాటాల సందర్భాల్లో, బస్తీలకు బస్తీలే కూల్చేసినపుడు, ప్రాజుక్టులు, సెజ్‌లు వచ్చి గ్రామాలకు గ్రామాల్నే నిర్వాసితుల్ని చేస్తున్న సమస్యల పట్ల, కుల అస్తిత్వ, ప్రాంతాల, జెండర్‌ అస్తిత్వ పోరాటాలకు ఏనాడ మద్దతియ్యలేదు, నోరిప్పలే.. యీ సినిమా హీరో.
సామాజిక బాధ్యతంటే అమీర్‌ఖాన్‌ (హిందీ సినిమా హీరో) షబానాఆజ్మి లాంటి వాల్లను మెచ్చుకోవాలె. నర్మదాబాచావోకి మద్దతిచ్చి ఎన్ని బెదిరింపు లెదుర్కున్నా, తన మద్దతు నిర్ణయం మార్చుకోలే అమీర్‌ఖాన్‌. ఎంపికాకముందే షబానాఆజ్మి బాంబే స్లమ్స్‌ని అక్రమంగా కూల్చినందుకు వ్యతిరేకంగా స్లమ్స్‌ బాధితులకు అండగా నిలబడి పోరాడింది. యిక హాలివుడ్‌ హీరో (చైనా) జాకీచాన్‌ సంపాదించిన దాంట్లో సగం కుటుంబం, సగం సమాజ పరం జేసిండు. అట్లాంటి చరిత్రలు మన సినిమా హీరో చిరంజీవి జీవిత చరిత్రలో లేవు.
సామాజిక న్యాయం అని గంప గుత్తోలె మాట్లాడడం కాదు. ఎవరికి ఏ న్యాయం అనే స్పష్టత కావాలి. దాంట్ల తాలో, బోలో తేల్తది. నాణ్యమైన నవ్వులాంధ్రను పూయిస్తడట. కాని మహిళల ముచ్చటే మర్సిండు. యికపాటలో సబ్బండ వృత్తులు బాగన మొగినయి ఒక్క చెప్పులుకుట్టే వృత్తి తప్ప. తన పార్టీ ప్రాతినిధ్యం గా ఒక్క మహిళ లేదు, దళిత్‌ లేడు. యిది చిరంజీవి సామాజానికి న్యాయం. అతని వ్యవస్థాపక స్జేజి మీద కూడా ఒక్క ఆడమనిషి కనిపించలే. బ్యానర్‌ మీద మహిళా ప్రతినిధిగా మదర్‌ ధెరిస్సాను బెట్టుకున్నడు.మహిళలందరికి ప్రతినిధి మదర్‌ ధెరిస్సా కాదు. సామాజిక, కుటుంబ, కుల, మగ, శ్రామిక, ఆర్ధిక రాజకీయ సమస్యలు అంటుకోని సన్యాసిని సేవా జీవితం ఆమెది. అట్లాంటామె ప్రాపంచిక సమస్యల్లో సతమతమయ్యే మహిళలకి ప్రాతినిధ్యమా! ఆమె బొమ్మ బెట్టితేనే మహిళా సాధికారతల్ని మాట్లాడినట్లా! చిరంజీవి ప్రసంగంలో పాటలో, అజెండాలో, జెండాలో మహిళా సమస్యలే చర్చకు, ప్రస్థావనకు రాలేదు.
 – తెలంగాణ మీద తన రాజకీయభిప్రాయం బాగనే వుంది. మరి యిక్కడ పద్నాలుగేండ్ల సంది నడుస్తున్న వర్గీకరణ ఉద్యమమ్మీద మాట్లాడక డాటవేయడం చిరంజీవి సామాజిక న్యాయమా!
–  ఈ 2008 ఆగష్టు నెలకు కొత్త పార్టీల పుట్టుకతో పుల్లు రాజకీయ గిరాకీ వచ్చింది. ఏనాడు సమాజ సమస్యల్ని ముట్టుకోని సినీ హీరో చిరంజీవి, టిడిపి నాయకుడు దేవేందర్‌ గౌడ్‌ తెలంగణ బీసీగా బైటికొచ్చి కొత్తపార్టీలు పెట్టిండ్రు మంచిదే. కానీ వీళ్ళ పార్టీలల్ల ఏ మహిళల కోసం మాట్లాడక పోవుడు ఏ మహిళలని భాగం చేయక పోవుడే కష్టం కలిగించే సంగతి. 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

7 Responses to కొత్త పార్టీలుగూడ ఆడోల్లని మర్సిపోతెట్లా?

 1. babu says:

  చాలా చక్క గా చెప్పారు. http://chaakirevu.wordpress.com/

 2. బహు బాగా చెప్పారు. ఇల్లాంటి వ్యాసపరంపరలు ఇంకాచాలా రావాలని కోరుకుంటున్నాను.

 3. Prasanthi says:

  నాకైతే అస్సలు నచ్చలేదు. నేను చిరంజీవిని నటునిగా అభిమానిస్తాను. రాజకీయపరంగా నాకు ఏ అభిప్రాయం లేదు. కాకపోతే విమర్శించేందుకు చెప్పిన అంశాలు నచ్చనందున వ్యాఖ్య వ్రాయాల్సి వచ్చింది.
  1. ఇతరుల కళ్ళు, రక్తం తీసుకుని బ్యాంకు పెట్టారు అనడం.

  నేను చెప్తే, లేదా ఇంకెవరైనా చెప్తే ఆ స్థాయిలో జనం ఇస్తారా!! తన పట్ల అభిమానులు చూపే ఆదరణ ని మంచి ఉద్దేశ్యానికి ఉపయోగిస్తే తప్పేముంది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననీయదు అన్నట్లుంటుంది.

  2. పేదోళ్ళు, ఆడోళ్ళు, చిరంజీవి సినిమా విజయాలకు కారకులు.
  ఇది మరీ బాగుంది. సినిమాని ఎవరైనా వినోదం కోసం చూస్తారు. అంతే కానీ హీరోని ఉద్ధరీంచడానికి కాదు కదా. కొన్ని సినిమాలు మీరన్నట్టు అభిమానులే ఆడించారు అనుకుందాము. అది చిరంజీవి అడిగితే చేశారా.?

 4. Prasanthi says:

  3. థెరీసా స్త్త్రీ లకు ప్రతినిథి కాదు ఎందుకంటే ఆవిడ సన్యాసిని అన్నారు. మహిళల బాధలు తెలియవు అన్నారు. ఆవిడ సన్యాసా, కాదా అన్నది కాదు విషయం. ఆవిడ నిస్వార్థంగా చేసిన సేవ స్ఫూర్తి నిచ్చే విషయం. అలాగే ఎప్పుడూ ఆపన్నులకు సేవ చేసే ఆమెకు మహిళల కష్టాలు తెలియవు అనుకోవడం అసంబధ్ధమే.

 5. Prasanthi says:

  నేను కూడా ఒక స్త్త్రీనే. కాకపోతే అన్ని రకాల మహిళల బాధలు తెలియవు అంటారేమో. బాధలు తెలియాలంటే అనుభవించనక్కరలేదు. సాటి స్త్రీగా ఆర్ద్రత పొందగలిగితే చాలు. స్త్రీ విద్య, చైతనయము, సాంఘిక దురాచారాల రూపకల్పనలో సంస్కర్తలైన పురుషుల పాత్ర కూడా ఉంది. అందువల్ల స్త్రీలను ఇంకా ఎన్నుకోలేదు అన్న కారణం చేత వారు స్త్రీలను సమర్థించట్లేదు అనుకుంటే పొరపాటు.

 6. Prasanthi says:

  నేను అమీర ఖాన అభిమానిని. షబానా ఆజ్మీ పట్ల కూడా ఈ మధ్య వరకు గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే తాను ముస్లిమ నైన కారణంగా తనకు ముంబైలో ఇల్లు దొరకడంలేదు అని వ్యాఖ్యానించారో అప్పుడే ఆవిడ పట్ల గౌరవం పోయింది.

  ఇప్పటి వరకు ఆయన ఏ ఉద్యమానికి మద్దతు ప్రకటించకపోయి ఉండచ్చు. కానీ ఇప్పుడైనా చేయడం తప్పు కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చినందువల్లే మాట్లాడుతుండి ఉండవచ్చు గాక, అంతమాత్రం చేత ఆయన ఎత్తి చూపించే సమస్యలు సమస్యలు కాకుండా పోతాయా?

 7. Prasanthi says:

  రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆస్తి ఇచ్చేయాలా? ఎందుకు? రాజకీయాల్లో ఉండేవాళ్ళందరూ అలా చేస్తున్నారా? రాజకీయాల్లోకి రావాలంటే ఆస్తులు పంచే రావాలి అని చట్టం చేయచ్చు కదా. అప్పుడు రాజకీయాల్లోనే సంపాదించుకోవచ్చు అనే అర్థం తీస్తే ఏమి చేస్తారు? సినిమాల్లో పని చేసి కష్టపడి సంపాదించుకుందే కానీ ప్రజల డబ్బు దోచుకుంది కాదు కదా.

  ప్రస్తుతం ఉన్న మహిళా నాయకురాళ్ళలో ఎంత మంది మహిళల సమస్యా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో