బాల్య వివాహాల నిరోధక చట్టం, 2006

చట్టంలోని ముఖ్య అంశాలు

సెక్షన్‌ 2 (ఏ) –  బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని ఆడపిల్ల.

సెక్షన్‌ 2 (బి) – ”బాల్య వివాహం” అంటే మైనర్‌ బాలిక, మరియు బాలుడు మధ్య జరిగేది. (మైనర్‌ అంటే 18 సం. నిండని బాల బాలికలు ఎవరైనా).

సెక్షన్‌ 3(1) –  ఈ చట్ట పరిధి ప్రకారం, ఎవరైనా (బాలిక గాని బాలుడు గాని) వివాహ సమయానికి మైనరు అయితే ఆ వివాహం చెల్లదు.

సెక్షన్‌ 4(1) – ఈ సెక్షన్‌ క్రింద మైనర్‌ వివాహం జరిగినపుడు, దానిని జరిపిన బాలుని తల్లిదండ్రులు లేదా అతని సంరక్షకులు గాని మైనర్‌ బాలికకు భరణం చెల్లించవలసి ఉంటుంది. ఈ భరణం ఆమె మరలా వివాహం చేసుకునేదాక ఇచ్చేటట్లు ”జిల్లా న్యాయస్థానం” ఆజ్ఞాపిస్తుంది.

సెక్షన్‌ 5 –  బాల్య వివాహం ద్వారా మైనరు బాలిక శిశువుకు జన్మనిస్తే ఆ శిశువు రక్షణ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.

సెక్షన్‌ 9 – 18 సంవత్సరాలు దాటిన పురుషుడు ఎవరైనా బాల్యవివాహం చేసుకుంటే (మైనర్‌ బాలికను) 2 సంవత్సరాలు జైలుశిక్ష మరియు జరిమానా కోర్టు విధిస్తుంది.

సెక్షన్‌ 10 –  ఈ సెక్షను క్రింద ఎవరైతే బాల్యవివాహాన్ని జరిపిస్తారో, జరగడానికి తోడ్పడతారో వారు కూడా శిక్షార్హులే. వారికి రెండు సంవత్సరాల దాకా జైలుశిక్ష రూ.లక్ష దాకా జరిమానా కోర్టు విధిస్తుంది.

సెక్షన్‌ 12  – బాల్య వివాహం జరిపి తరువాత ఆ మైనరు బాలికను, అతని సంరక్షకుడుగాని, మరి ఎవరైనా ఇతరులుగాని ఆమెను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తే ఆ వివాహం చట్టరీత్యా నేరం.

సెక్షన్‌ 13(1) –  ఈ సెక్షన్‌ ద్వారా ఫస్ట్‌ క్లాస్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు, బాల్య వివాహాలను నిరోధించే అధికారం ప్రభుత్వం ఇచ్చింది.

సెక్షన్‌ 13(4)  – ఈ సెక్షన్‌ ద్వారా జిల్లా మేజిస్ట్రేట్‌, బాల్య వివాహ నిరోధక అధికారిగా బాల్య వివాహాలను నిరోధించే అధికారం ఉంటుంది.

సెక్షన్‌ 14 –  ఈ చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని అన్ని హిందూ సాంప్రదాయాలలో జరిపినా అది చెల్లదు.

సెక్షన్‌ 15   – ఈ చట్టం క్రింద నమోదయ్యే కేసులో వారెంట్‌ లేదా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే పోలీసులు బాల్యవివాహాన్ని ఆపవచ్చు.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో