బాలికల కోసం అమలులో ఉన్న పథకాలలో కొన్ని

బాలికా సంరక్షణ బీమా: 2005వ సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి తర్వాత పుట్టిన బాలికలందరికీ ప్రభుత్వం బీమా చేస్తుంది. వీరికి 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఈ బీమా మొత్తం  లక్ష రూపాయలుగా వీరికి అందుతుంది. అయితే ఈ మొత్తాన్ని అందుకోవాలంటే బాలిక ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి.

విద్యా ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌: బాలికల విద్యార్జనను పెంచేందుకు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఏడాదికి రూ.1200ల వరకు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. అంగన్‌వాడీలు ఈ బాలికలను గుర్తించి ఐసిడిఎస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారికి ప్రతిపాదనలు పంపుతారు.

బాలికా మండలి : మాతా, శిశు మరణాలు ఎక్కువ ఉండి, బడిమానివేసే బాలికల శాతం అధికంగా ఉన్నచోట్ల బాలికలను గుర్తించి, వారికి శిక్షణనిచ్చి వారివారి గ్రామాలలో బడి ఈడు బాలికలు బడి బయట ఉండకుండా చూసే బాధ్యతను అప్పగిస్తారు.

బాలికల గృహం:  తల్లిదండ్రులులేని / వదిలివేయబడిన బాలికలను రెసిడెన్షియల్‌ పద్ధతిలో వసతి సదుపాయంతోపాటు పదవ తరగతి వరకు ఉచితంగా విద్యనందిస్తారు.

శిశు గృహం: పసిపిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఆ శిశువులను ఈ గృహంలో సంరక్షించి, వారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చే వారికి దత్తత ఇస్తారు. దత్తత వెళ్ళని పిల్లలు మేజర్లు అయ్యేవరకు ప్రభుత్వమే వారి సంరక్షణ, విద్యావసరాలను చూస్తుంది.

బాలల రక్షణ కోసం నడపబడుతున్న టోల్‌  ఫ్రీ నెంబర్‌ (చైల్డ్‌ లైన్‌) : 1098

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.