లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం – 2012

భారత రాజ్యాంగంలోని 39వ అధికరణంలో ఇతర విషయాలతోబాటుగా సంతోషంగా గడపాల్సిన బాల్యాన్ని బాధామయం కాకుండా చూసి, పెరుగుతున్న వయసులో వారికి అన్నిరకాల దోపిడీలనుంచి రక్షణ కల్పించి, వారి స్వేచ్ఛకూ, వ్యక్తిగత గౌరవానికి భంగం కాకుండా ఉండే విధాన నిర్ణయాన్ని అవలంబించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఐక్యరాజ్యసమితి 1992 డిశెంబరు 11న పిల్లల హక్కులపై జరిపిన తీర్మానంలో (అ) పిల్లలను లైంగికపరంగా చట్టవిరుద్ధ చర్యలకు పురికొల్పటం, బలవంతం చేయటం (ఆ) పిల్లలను వ్యభిచార వృత్తిలోకి దించి దోపిడి చేయటం, ఇతర చట్ట వ్యతిరేక లైంగిక చర్యలకు ఉపయోగించుకోవడం (ఇ) పిల్లలను కామపరంగా నగ్నంగా ఉపయోగించటం, చిత్రాలు తీయటం వంటి వాటిని పటిష్టంగా నిరోధించాలని తీర్మానించింది. అందులో భారత ప్రభుత్వం పాల్గొని అంగీకరించింది. అందుకు అనుగుణంగా పిల్లలకోసం ప్రత్యేక చట్టం తెచ్చారు.

ముఖ్యాంశాలు :

అ) ఈ చట్టం బిడ్డలందరకూ వర్తిస్తుంది. బిడ్డ అంటే 18 సం||లలోపు వయస్సు ఉన్న బాలుడు లేదా బాలిక అని అర్థం.

ఆ) ఈ చట్టంలో బిడ్డ ఏదేని శరీరభాగంలోకి ఏదేని అవయవం లేదా వస్తువు ఏమేరకు చొప్పించి దాడిచేసినా తీవ్ర శిక్ష విధించవచ్చు. ఒకవేళ ఈ చర్యను పోలీసు, మిలటరీ, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది జరిపితే శిక్ష తీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది.

ఇ) బిడ్డ శరీరాన్ని ఏరకంగా అశ్లీల దృష్టితో తాకినా అది లైంగికదాడి అవుతుంది. ఒకవేళ బిడ్డపై ఏరకంగా జరిగిన లైంగిక దాడి అయినా ఒకరికంటే ఎక్కువమంది జరిపినట్లయితే ఆ గుంపులోని ప్రతి ఒక్కరూ విడివిడిగా, ఒకరే లైంగిక దాడి జరిపినట్లుగా భావించి శిక్షించాల్సి వస్తుంది.

ఈ) బిడ్డ చూసేలా సైగలు చేయడం, శబ్దాలు చేయడం, ఏదైనా వస్తువును లేదా శరీర అంగాన్ని లైంగిక ఉద్దేశ్యంతో బిడ్డకు కనబడేటట్లు ప్రదర్శించడం, ఆ సైగలు, అంగాల్ని బిడ్డ చూసినా వేధింపు క్రింద నేరస్తులౌతారు. కామప్రేరితమైన వస్తువులు, బొమ్మలు, చిత్రాలు చూపినా, వెంటబడి తిరగడం ద్వారా లేదా ఫోన్‌, మెయిల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వేధించినా లైంగికనేరం క్రింద మూడేళ్ళవరకూ జైలు శిక్ష పడుతుంది.

ఉ) బిడ్డపై ఏ రకమైన లైంగికనేరం జరిగేందుకు అయినా, ఏవిధంగా ప్రోత్సహించినా, నేరానికి ప్రయత్నించినా ఈ చట్ట ప్రకారం నేరం. ప్రోత్సాహం చేయటం ఏరకంగా ఉన్నా శిక్షార్హమైన నేరమే.

నేరం జరిగినట్లు తెలిసినా, జరుగవచ్చుననే భయంవున్నా, ప్రత్యేక బాలపోలీసు (జువైనల్‌) విభాగానికి గానీ, స్థానిక పోలీసులకు కానీ తెలియజేయాలి. రిపోర్టు నమోదు చేసుకొని, 24 గంటలలోపు ఈ విషయం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి, పిల్లల న్యాయస్థానంలో (పిల్లల న్యాయస్థానం లేనిచోట సెషన్స్‌ కోర్టులో) తెలియజేయాలి. బిడ్డకు ఆలన, రక్షణ అవసరమని భావించిన పక్షంలో తక్షణం అందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ చట్టం ప్రకారం తను సరైనదిగా నమ్మి సమాచారం ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకునే వీలులేదు. ఐతే ఇతరులకు యాతన కలిగించి, పీడించేందుకు ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించవచ్చు. బిడ్డ ఫిర్యాదు చేస్తే అది ఋజువు కాకున్నా బిడ్డపై ఎలాంటి చర్యలూ తీసుకునే వీలులేదు.

ఇక టి.వి. పత్రికల వాళ్ళు బాధిత బిడ్డ ముఖం చూపించటం చేయరాదు. బిడ్డ పేరు, చదివే స్కూలు, ఇరుగు పొరుగు వంటి బిడ్డ గుర్తింపును తెలియజేస్తే కారకులకు ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష విధించవచ్చు.

కేసు పరిశీలన, పరిశోధన సమయంలోకూడా బిడ్డను ఏయే ప్రశ్నలు అడగదల్చుకున్నదీ తెలియజేయాలి. బిడ్డ బహిరంగ గుర్తింపునకు అనుమతించకూడదు. న్యాయస్థానంలో పరీక్షించే సమయంలో నిందితుడు బిడ్డకు కనబడకుండా చర్యలు తీసుకోవాలి. విచారణ సందర్భంగా కానీ, కేసు నమోదు సందర్భంగా కాని ఆ బిడ్డ మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నా, బిడ్డకు భాష రాకున్నా తగిన ఫీజు చెల్లించి, బిడ్డతో భావప్రసరణ (సైగలు, వేరే భాష) జరపగల వారి సహాయం పొందాలి.

బిడ్డకు న్యాయవాదిని ప్రత్యేకంగా నియమించుకునే హక్కు ఉంది. ఒకవేళ వారు ఆర్థిక స్థోమత లేనివారు అయితే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఒక న్యాయవాదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ చట్టం అమలు పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలోనూ, కేంద్రస్థాయిలోనూ ‘కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌’ సంస్థల ఏర్పాటు చేయాలి.

ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు అందుకుని నమోదు చేసే వ్యక్తి ఫిర్యాదు చేసినవారికి తన పేరు, హోదా, చిరునామా, టెలిఫోను నెంబరు, తన పై అధికారి పేరు, చిరునామాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బిడ్డకు తక్షణం అవసరమయ్యే వైద్యసహాయాన్ని బిడ్డకు సంబంధించిన వ్యక్తి సమక్షంలో జరపాలి. ఫోరెన్సిక్‌ పరీక్షలకు అవసరమైన నమూనా సేకరణకు ఏర్పాటు చేయాలి.

బిడ్డకు జరిగిన నష్టం, గాయాలు, పనిచేసేట్లయితే కోల్పోయిన పనిదినాలు, శారీరక, మానసిక ఆరోగ్యం, వైకల్యత జరిగితే దాని తీవ్రత, మొ|| అంశాలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన పరిహారాన్ని ‘బాధితుల పరిహార నిధి’ నుంచీ చెల్లించాలి. ఆ రకమైన నిధులు పరిహారాలు లేనిచోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచీ ఉత్తర్వులు అందిన 30 రోజులలోగా రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో