దేవాలయ భూములు – ప్రస్తుత స్థితి, పేదలకు అవకాశాలు

పి.ఎస్‌. అజయ్‌కుమార్‌


 ఎజ్జి అప్పారావు, లోవ జగన్నాయకులు అనే ఇద్దరు సవర ఆదివాసీ యువకులు తమ మండలాలలో గల దేవాలయ భూముల వివరాలు ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమీషనరుకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. మండలాల వారీగా భూముల సమాచారం సేకరిస్తున్నామని అది పూర్తయ్యక ఇస్తామని వారికి జవాబు వచ్చింది. ఇది జరిగి సంవత్సరం కావస్తుంది. ఆ సర్వే పూర్తి అయ్యిందీ, లేనిదీ తెలియదు. అయితే కోనేరు రంగారావు కమిటీ తమ నివేదికలో మాత్రం ఆ జిల్లా దేవాలయ భూములను 10,560.24 ఎకరాలుగా పేర్కొంది. అలాగే అసలు దేవాలయ భూములు ఎంత అన్నది ఆ శాఖకే స్పష్టంగా తెలియదని కూడా వ్యాఖ్యానించింది.
మన రాష్ట్రంలో 3.76 లక్షల ఎకరాల దేవాలయ భూములు వున్నాయి. వాటిని 40,000 మంది కౌలుదార్లు సాగుచేస్తున్నట్లు ఒక అంచనా. దేవాలయ భూములు ఏనాటికైనా లభిస్తాయనే ఆశతో భూమిలేని వ్యవసాయ కూలీలు ముఖ్యంగా దళిత, వెనుకబడిన కులాల పేదలు వున్నారు. దేవాలయ భూములను దళిత పేదలకు ఇవ్వాలని చాలాకాలంగా దళితసంఘాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. వామపక్ష పార్టీల ప్రజాసంఘాలు కౌలుదార్ల హక్కుల గర్చి మాట్లాడుతూ వచ్చాయి. అయితే దేవుడి ొభూములపై దేవాలయ శాఖకు పూర్తిగా ఆధిపత్యం సిద్ధించి ఆ భూములపై చర్యలు తీసుకోగలిగే సందర్భంలో ఎవర వాటిపై దృష్టి పెట్టడంలేదు.
మిలేని పేదలకు దేవాలయ భూములు లభించేందుకు వున్న మార్గాలను చర్చించే ముందు వాటికి సంబంధించి కౌలుదార్ల సమస్యను అర్థం చేసుకోవాలి.
దేవాలయ భూములు – కౌలుదార్లు
దేవాలయ భూముల కౌలుదార్లను ఒకే మార్గంగా మనం చూడలేం. ఇందులో ఇతరత్రా ొభూమి, జీవనోపాధి లేకుండా కౌలు మిపై ఆధారపడి జీవించే పేద కౌలుదార్లు వున్నారు. మధ్యతరగతి, ధనిక మార్గాలకు చెందిన కౌలుదార్లు వున్నారు. వీరిలో చాలామంది తమ భూములను పేదలకు ఉపకౌలుకిచ్చి లబ్ధి పొందుతున్నారు. పైన తెలిపిన రెండు రకాల కౌలుదార్లలోన ఎవరి సంఖ్య ఎంత అనే వివరాలు ఎక్కడా లేవు. అయినా మొత్తం కౌలుదార్ల జాబితానైనా వుందా అంటే అనుమానమే. పేద కౌలుదార్లు తక్కువగాను ఇతరులే అధికసంఖ్యలో వుంటారని సాధారణ అనుభవం నుంచి చెప్పవచ్చు. ఇక ఉప కౌలుదార్ల వివరాలు అసలే బైటికి రావు.
మనకు రెండు కౌలుదారీ రక్షణ చట్టాలు వున్నాయి. అవి తెలంగాణ (1955), ఆంధ్ర (1956) రక్షిత కౌలుదారీ చట్టాలు. ఇవి నిజమైన కౌలుదార్లకు ఎంతవరకు ఉపయెగపడ్డాయె తెలీదు గాని దేవాలయ భూములను సాగుచేసే ధనిక మార్గాలకు మాత్రం బాగా ఉపయెగపడ్డాయి. దేవాలయ అధికారులతో లాలచీపడి లోపాయికారిగా కౌలు ఒప్పందంలోకి వెళ్ళడం, ఆనక కౌలుదారీ చట్టం కింద ”లిటిగేషన్‌” ప్రారంభించి సాగుచేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ప్రైవేటు వ్యక్తులు సాలుకు 30 నుండి 40 వేల ఆదాయం పొందుతుంటే, దేవాలయనికి 4 నుండి 5 వందలే ఆదాయం వస్తుందని రంగారావు నివేదిక వాపోయింది. దేవాలయ భూములు పంచమని ఎవరైనా ప్రభుత్వాన్ని అడిగితే కౌలుదారీ చట్టాలు భూస్వాధీనానికి అడ్డంకిగా మారాయని ప్రభుత్వం తప్పుకునేది.
తొలగిన అడ్డంకి
ఆంధ్రప్రదేశ్‌ చారిటబుల్‌ అండ్‌ హిందూ రెలీజియస్‌ ఇన్‌స్టిట్యషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్టం దేవాలయ ొభూములను కౌలుదారీ చట్టాల నుండి మినహాయించింది. దీనిపై కొందరు కౌలుదార్లు హైకోర్టుకు వెళ్లగా 1989లో హైకోర్టు చట్టంలోని సెక్షన్‌ 82 చెల్లదని రద్దుచేస్తూ తీర్పునిచ్చింది.
అదృష్టవశాత్తు రాష్ట్రప్రభుత్వం హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు 29 ఆగస్టు 2003న హైకోర్టు తీర్పును రద్దుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పేద కౌలుదార్లు మినహా మిగిలిన అన్ని కౌళ్ళు రద్దయి భూములను స్వాధీనం చేసుకోవడానికి చట్టపరమైన మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత రాష్ట్రప్రభుత్వం జి.ఓ. 379ని ప్రకటించింది.
సెక్షన్‌ 82 ఏం చెబుతుంది?
మిలేని పేద కౌలుదార్లను మినహాయించి మిగిలిన కౌలు హక్కులను సెక్షన్‌ 82(1) రద్దు చేస్తుంది. సబ్‌ సెక్షన్‌ (2) భూమిలేని పేద కౌలుదారు అంటే ఎవరో నిర్వచించింది. ఒక కౌలుదారు తాను కలిగివున్న (స్వంతం, కౌలు, ఇతర విధాలుగా) మి 2.50 ఎకరాల పల్లం (తరి) (1.011715 హెక్టార్లు) లేదా 5.00 ఎకరాలు మెట్ట (కుష్కి) (2.023430 హెక్టార్లు), వ్యవసాయేతర ఆదాయం నెలకు 250 రపాయలు లేదా సాలుకు 3000 రపాయలు మించకుండా వున్నవాడని నిర్వచించింది.
పేదలకున్న రెండు అవకాశాలు
పైన తెలిపిన చట్టంలోని సెక్షన్‌ 82 (1,2) పేద కౌలుదార్లకు రక్షణ కల్పించిన విషయం చూశాం. రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. 379 సెక్షన్‌ 5(2), 6(1), (2) ప్రకారం పేద కౌలుదార్లకు రెండు వెసులుబాట్లు కల్పించింది.
1. భూమి లేని పేద కౌలుదారు మార్కెటు విలువలో 75 శాతం చెల్లించి, ఆ కౌలు భూమిని కొనుక్కోవచ్చు. ఈ విలువ మొత్తాన్ని 4 సమభాగాలు చేసి మొదటిభాగాన్ని ఎగ్రిమెంటు సమయంలో చెల్లించాలి. మిగిలిన 3 భాగాలను, 3 సంవత్సరాల కాలవ్యవధిలో 6 శాతం వడ్డీతో ఫాయిదాల కింద తీర్చాలి. ఈ పద్ధతి ద్వారా భూమిని పొందిన ఆసామి 5 సంవత్సరాల వరకు దానిని అమ్మకూడదు.
2. ఇక రెండవ వెసులుబాటు, మార్కెటు కౌలు రేటులో 2/3 వంతును చెల్లిస్త కౌలును కొనసాగించవచ్చు. ఈ రెండు అవకాశాలలో దేనినైనా ఒకదాన్ని వినియెగించుకోమని కోరుత దేవాదాయ శాఖ ఫారం-2లో పేద కౌలుదారుకి నోటీసులు పంపించాలి.
వాస్తవంగా ఏం జరుగుతోంది
దేవాలయ భూములను పేదలకు ఇవ్వడానికి కౌలుదారీ చట్టాలు అడ్డుగా వున్నాయని చెపుత వచ్చిన ప్రభుత్వాలు, నేడు ఆ అడ్డులేకపోయినా స్పందించటం లేదు. సెక్షన్‌ 82(2) ద్వారా పేద కౌలుదార్లకు 75 శాతం మార్కెట్‌ రేటుపై కొనుక్కునే అవకాశం వున్నా వారికి అవకాశం ఇవ్వటం లేదు. పేద కౌలుదార్ల చేతిలో భూమి వుంటే, కౌలు రద్దయిందనీ స్వాధీనం చేసుకొని వేలం వేస్తున్నారు.
వేలంలో పాల్గొనేవారు ముందుగా ధరావతు కట్టాలి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీతనగరం గ్రామానికి చెందిన సర్వే నెంబరు 22లోని 25 ఎకరాలకు వేలంలో పాల్గొనేవారు ఎకరాకి 10,000 రపాయలు ధరావతు కట్టాలనడంతో ఆ పంచాయితీ ప్రజలు చేతులెత్తేశారు. చివరికి ఒక మంత్రివర్యుని అనుచరులు వాటిని చేజిక్కించుకున్నారు (ఆ వేలం ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగిందో ఆ దేవుడికి కూడా తెలీదు).
అసలు దేవాదాయ భూమి ఎంతవున్నదనే స్పష్టత ఆ శాఖకే లేదని రంగారావు కమిటీ చేసిన వ్యాఖ్యను పైన ప్రస్తావించుకున్నాం. కమిటీ నివేదికలో ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో దేవుడి భూమి 1984-85లో 11,830.90 ఎకరాలు, 2005 మే నాటికి అది 10,560.24 ఎకరాలు. మిగిలిన జిల్లాల పరిస్థితి అదే. భూముల వివరాలే సరిగ్గా లేనప్పుడు ఇక కౌలుదార్ల వివరాలు, అందులో పేదల భోగట్టా ఎక్కడ వుంటుంది?
భూముల వివరాలు సరిగా లేకపోవడం, కౌలుదారి చట్టం నుండి వచ్చిన చట్టబద్ధమైన మినహాయింపును ఆ శాఖలో అవినీతి, ‘అదనపు’ ఆదాయం పెరగడానికి దోహదపడ్డాయి. పేద కౌలుదార్లు వున్నచోట మీ కౌలు రద్దయిందని నోటీసులు జారీచేసి ములు స్వాధీనం చేసుకుంటుంది. ధనికులు కౌలుదార్లుగా వున్నచోట లోపాయికారిగా లాలచి వేలం పాటలు నిర్వహిస్తుంది. బహిరంగంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా 95 నుండి 98 శాతం రహస్యంగానే సాగుతున్నాయని రంగారావు కమిటీయే వ్యాఖ్యానించింది.
వాస్తవ పరిస్థితికి అద్దం పట్టని రికార్డులు – రంగారెడ్డి జిల్లా అనుభవం
రంగారెడ్డి జిల్లా యచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన ఓంకారేశ్వరస్వామి దేవాలయనికి నందివనపర్తిలో 42-00 ఎకరాలు, నజ్‌దిక్‌ సింగారంలో 1289.00 ఎకారలు, మొత్తం 1,331-00 ఎకరాల భూమి వుంది. దేవాదాయ శాఖ రికార్డు ప్రకారం ఈ మొత్తం భూమిని నజ్‌దిక్‌ సింగారం శివారు (మదిర) తాటిపర్తి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు 360 ఎకరాలు సాగుచేస్తున్నాయి. అంటే సగటున కుటుంబానికి 14 ఎకరాలు. చట్టంలోని సెక్షన్‌ 82(2) నిర్వచనం కింద వీరు పేదలు కాదు. అందుచేత 82(1) అనుసరించి కౌలు హక్కులు రద్దయినట్లుగా ఆ శాఖ వారికి నోటీసులు పంపించింది. అది కూడా అంగ్రేజీలో.
వాస్తవం ఏమిటంటే దేవాదాయ శాఖ వద్ద వున్న కౌలుదార్ల జాబితా 5 దశాబ్దాల పాతది. నేడు 75 కుటుంబాలు ఆ భూమిని సాగుచేస్తున్నాయి. అంటే సగటున 4 ఎకరాలు. వీరందర దళితులు, వెనుకబడిన కులాల పేదలు.
నజ్‌దిక్‌ సింగారానికి చెందిన దళిత మహిళ బత్తుల సత్తమ్మ హైకోర్టులో కేసువేసి సెక్షన్‌ 82(2) కింద తనకు గల అవకాశాన్ని ఇవ్వాలని, అందుకు దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరింది. అలాంటి క్లయిములు వున్నవారందరూ, అసిస్టెంట్‌ కమీషనర్లకు దరఖాస్తులు (మీరే) చేసుకోండని కోర్టు ఒక సలహా ఇచ్చింది. అది బాగానే వుంది. కాని వారికి సహాయం చేసే నాధుడు ఎవరు?
దేవాలయ భములపై కోనేరు కమిటీ ముఖ్యమైన సచనలు – ప్రభుత్వ చర్యలు
6 సంవత్సరాల కౌలు కాలాన్ని 3 సంవత్సరాలకి తగ్గించాలని, కౌలుకిచ్చే ప్రక్రియ పారదర్శకంగా వుండాలని, ప్రభుత్వ సంస్థ ద్వారా (ఇందిరాక్రాంతి పథం, మహిళా పొదుపు సంఫలు వగైరా) పేదలు కౌలుకు తీసుకునే వీలు కల్పించాలనే సూచన 7.2ను ప్రభుత్వం జి.ఓ.నెం. 1191, తేది 7-9-2007 ఉత్తర్వుల ద్వారా ”న్యాయపరమైన చిక్కులు” వస్తాయని తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ భూముల వివరాలు
క్ర.స. జిల్లాపేరు 1984-85లో పరిస్థితి మే 2005 నాటికి పరిస్థితి
1. శ్రీకాకుళం 11,830.90 10,560.24
2. విజయనగరం 8,278.72 15,234.79
3. విశాఖపట్నం – 19,683.83
4. తూర్పుగోదావరి 17,278.68 16,950.19
5. పశ్చిమగోదావరి 9,512.66 11,950.19
6. కృష్ణా 14,678.32 25,622.52
7. గుంటూరు 40.199.441/2 24,030.33
8. ప్రకాశం 31,366.68 32,239.66
9. నెల్లూరు 21,260.09 1,987.11
10. కర్న్లూలు 26,554.90 57,088.66
11. కడప 10,386.59 10,670.23
12. అనంతపురం 28,820.88 33,427.40
13. చిత్తూరు 16,115.22 12,155.61
14. హైదరాబాదు డివిజన్‌ 4 – –
15. ఖమ్మం 11,270.14 13,535.31
16. వరంగల్‌ 3,380.38 4,291.33
17. నల్లగొండ 5,580.55 13,245.19
18. నిజామాబాదు 18,530.39 29,130.22
19 కరీంనగర్‌ 589 2,065.23 
20. ఆదిలాబాదు – 3,074.00
21. మహబూబ్‌నగర్‌ 30,384.37 24,130.22
22. మెదక్‌ – 3,791.11
23. రంగారెడ్డి 5,073.79 7,863.15
24. హైదరాబాదు (జంటనగరాలు) 48.52+1000 చ.గ. 3,000.19+1 చ.గ.
 ఆధారం : దేవాదాయశాఖ కమీషనర్‌ వారి కార్యాలయం – పైన తెలిపిన పట్టికలోని అంకెల తేడాలు సంబంధితశాఖ తెలిపినవే.

అదే విధంగా పేదలు కాని వారి ఆధీనంలో దేవాలయ భూములు వుంటే వారిని భౌతికంగా తొలగించాలని, పేదల ఆక్రమణలో వుంటే అందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలకు (పైన తెలిపిన) విక్రయించాలనీ, ఎవరు పేదలో తేల్చే అధికారం దేవ (ఆదాయ), ధర్మ (ఆదాయ) అసిస్టెంట్‌ కమీషనరుకు గాక రెవెన్యూ డివిజన్‌లో అధికారికి ఇవ్వాలనే సచన 7.3ని కూడా ప్రభుత్వం అదే జి.ఓ. ద్వారా తిరస్కరించింది.  ఆ విధంగా ప్రభుత్వం రంగారావు ొసూచనలనే కాదు, తాను చేసిన చట్టం (1987), ఉత్తర్వుల (2003) స్పూర్తిని నీరుగార్చింది. ఎస్సీ కార్పోరేషన్‌, ఇందిరా క్రాంతి పథంలోని భూమి కొనుగోళ్ళ పథకంలో నిధులు ఖర్చు కాకుండా మురిగిపోతున్నాయి. మరోవైపున చట్టం ఇచ్చిన వెసులుబాటును పేద కౌలుదార్లు పొందలేకపోతున్నారు.
ప్రభుత్వం పేదరిక నిర్మలనకు ఏర్పాటు చేసిన వివిధ ఏజెన్సీల ద్వారా దేవాలయ భూములను కొని లేదా కౌలుకు తీసుకొని పేదలకు ఇవ్వడానికి చట్టపరంగా ఎలాంటి ఆటంకమూ లేదు. గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో ఈ విధంగా దేవాలయ భూమిని కొన్ని అక్కడ దళితులకు పంచారు. నక్సలైట్‌ ఉద్యమం వైపు ఆకర్షితులవుతున్నారని, కాబట్టి భూమి ఇవ్వాలని ఎస్పీ తెచ్చిన వత్తిడే అందుకు కారణం. ప్రజలకు దీనిద్వారా ప్రభుత్వం ఏ విధమైన సంకేతాలు ఇవ్వదల్చుకుందనేది పెద్ద ప్రశ్న.
మనం ఏం చెయ్యలి?
అ. జిల్లాలవారీ దేవాలయ భూముల వివరాలను (కోనేరు రంగారావు నివేదిక నుండి) ఇస్తున్నాం. మీ జిల్లాలలో దేవాలయల వారీగా భూముల వివరాలను సేకరించాలి. ఇందుకు సమాచారహక్కు చట్టం వుంది.
ఆ. భూముల వివరాల ఆధారంగా గ్రామాలలో సర్వే నిర్వహించాలి. సాగులో వున్నవారు పేదలైతే (పేదవాడి నిర్వచనం వ్యాసంలో వుంది) చట్టంలోని సెక్షన్‌ 82 అనుసరించి అసిస్టెంట్‌ కమీషనరు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి దరఖాస్తు చేయించాలి.
 1. మార్కెట్‌రేటులో 75 శాతం చెల్లించి కొనుక్కోవటం.
 2. లేదా మార్కెట్‌ కౌలురేటులో 2/3 వంతు చెల్లించి కౌలుదారుగా కొనసాగటం. దేనినైనా కౌలుదారు కోరవచ్చు.
ఇ. గ్రామ సర్వేలో ధనికులే భూమిని సాగుచేస్తుంటే కౌలు వేలం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరిగింది? ఎంతకు కౌలు వేలం పాడారనే విషయలను సేకరించాలి. ఇందుకు ఆర్‌టిఐని ఉపయెగించవచ్చు.
ఈ. ఎటువంటి కౌలు ఒప్పందం లేకుండా ధనికులు సాగుచేస్తున్నా లేదా ఉప కౌలుకు ఇచ్చినా ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని కోరాలి.
      ఉ. పేదలకు దేవాలయ భూములను ఇవ్వాలని డిమా౦డ్‌ చేయాలి. (‘భూమికోసం’  ఫిబ్రవరి సంచిక సౌజన్యంతో)

 

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో