స్త్రీల ఉద్యమాలకి అండగా వుందాం

బి. భూపతిరావు
భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, అత్యున్నతమైన గౌరవ స్థానాన్ని కల్పించింది ”స్త్రీ”కి మాత్రమే. ”మాతృదేవోభవ” అని ముందుగా గౌరవించింది ”అమ్మ”కి మాత్రమే. భారతీయ సంస్కృతికి మూలం ”స్త్రీ”. భారతీయ ఆచార వ్యవహారాలలో సంస్కృతి సంప్రదాయలలో అగ్రనీరాజ నాలు అందుకుంది ”స్త్రీ” మాత్రమే. ఎంతోమంది ఋషులకు, ఆచార్యులకు, మహాత్ములకు, మేధావులకు వారి ఉన్నతమైన జీవితాలకు వెలుగుచూపి బంగారుబాటలు వేసింది ”స్త్రీ” మాత్రమే.
ప్రపంచములోనే ప్రథమంగా ”స్త్రీ” విద్యావంతులున్న దేశం మనది. అహల్య, గార్గి, మైత్రేయ వంటి స్త్రీలు పురుషులతో సమానంగా చర్చలలో పాలుపంచుకున్న దేశం మనది. ”స్త్రీ”ని దేవతగా కొలిచి ”స్త్రీ”కి సముచితమైన స్థానం కల్పించిన దేశం మనది. భారతీయ సంస్కృతిలోను, సమాజంలోను ”స్త్రీ”కి వున్న గౌరవంతోనే మనదేశాన్ని భారతమాత అని గౌరవిస్తున్నాము. ”అన్నపూర్ణ” అని ఆరాధిస్తున్నాము.
మన ఇతిహాసాలు, పురాణాలు అన్నీ ”స్త్రీ”ని ఆదిపతగా పేర్కొంటున్నాయి. సకలసంపదల కల్పవల్లిగా శ్లాఘిస్తున్నాయి. మన సంస్కృతిలో ”స్త్రీ”కి ఇంతటి ప్రాధాన్యం వుంది. ఇప్పటివరకు ”స్త్రీ” అలాగే గౌరవం పొందుతూ వచ్చింది. ఇది ఒక పార్శ్వము మాత్రమే.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో నేడు భారతీయ సమాజంలో వింతపోకడలు విజృంభిస్తున్నాయి. అరాచకాలు, అకృత్యాలు నిత్యం చలామణి అవుతున్నాయి. ఆధునికత శాస్త్ర సాంకేతిక రంగాలలో పెనుమార్పులు తేవచ్చు. మనదేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చవచ్చు. కానీ అత్యున్నతమైన మానవతా విలువలు మాత్రమే సమాజంలో మనిషికి సంతోషాన్ని ఇవ్వగలవు. ఆనందాన్ని పంచిపెట్టగలవు. సమాజాన్ని అంతటినీ ఒకే త్రాటిపై నడిపి సమాజ పురోగమనానికి ఇతోధికంగా తోడ్పడగలవు. ప్రస్తుతం ఆ మానవతా విలువలు అడుగంటుతున్నాయి. ఈ ”విలువల” పతనమే నేటి సమాజంలో విజృంభిస్తున్న అరాచకాలు.  ”స్త్రీ”పై జరుగుతున్న దౌర్జన్యాలు.
నేటి ”మహిళ” పరిస్థితి దయ నీయంగా వరుతుంది. గడపదాటి బయటకి తోడులేనిదే వెళ్లలేని పరిస్థితి. ఎందుకు ఆమెలో ఇంత భయం? నేటి మహిళ విద్యావంతురాలు, అన్ని రంగాలలో తన ప్రతిభను చాటు అభివృద్ధి పథంలో రాకెట్‌లా దూసుకెళ్తుంది. అణురంగం నుంచి అంతరిక్షం దాకా… కంప్యూటర్‌ నుంచి రక్షణ దాకా అన్ని రంగాలలో తన సేవలను అవెఘంగా అందిస్తుంది. మరి ఆమె నేటి సమాజంలో ఎందుకు స్వేచ్ఛగా విహరించలేక పోతుంది? వీటన్నింటికి సమాధానం విలువల పతనం.
”ప్రేమ” పేరుతో ఆడే మానవ మృగాల వేటలో ఆమె సమిధగా వరటం. అందమైన ఆ ”కుసువలు” ఉన్మాదుల కబంధహస్తాలలో ఆహుతవడం. సుకుమార మైన ఆ ”పుష్పాలు” నరరప హంతకుల కత్తికోరలకు బలికావడం. ”సువాసనలు” వెదజల్లే ఆ పూవులు యసిడ్‌ దాడిలో బలికావడం. నేటి మహిళ హృదయ పొరల్లో దాగిన ఆవేదన వర్ణనాతీతం. క్షణం… క్షణం… భయం… భయంతో నేటి మహిళలు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లి ఇంటికి చేరే వరకు వారిలో భయం ఆవహించి వుంటోంది. ఏ ఉన్మాది చేతిలో చచ్చిపోతావె అని, వాళ్ల తల్లిదండ్రులలో ఆవేదన… కూతురు ఎప్పుడొస్తుందా… అని. ఇటువంటి పరిస్థితులు నేటి సమాజంలో ఉత్పన్నమైనందుకు మనం తలదించుకోవాలి.
అర్ధరాత్రి ”స్త్రీ” సగర్వంగా నడి బజారులో స్వేచ్ఛగా తిరిగే రోజు రావాలి, అన్న మహాత్ముడు ఇప్పుడుంటే ఇది నా భారతదేశమేనా! అని తలదించుకుంటారు. ఎక్కడైతే ”స్త్రీలు” ఆనందంగా వుంటారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారంటారు. ఆనందం లేదు సరే… స్వేచ్ఛగా వాళ్లు తిరగటానికి అభయమిచ్చే సమాజంకోసం ఎదురుచస్తున్నారు. ఈ పరిస్థితులు చూసి ప్రతీ మానవతావాది మధనపడాలి. ఈ పరిస్థితుల్ని ఎదిరించటానికి ప్రతీ ఒక్కరు నడుంకట్టాలి.
ఎక్కడైతే… విలువల రాహిత్యం గోచరిస్తుందో అక్కడ ”స్త్రీ”కి గౌరవస్థానం అడుగంటుతుంది. ఎక్కడైతే ”నైతికత” మంట కలుస్తుందో అచ్చట ”స్త్రీ” జీవితం నగ్నంగా నడిబజారులో దర్శనమిస్తుంది. ఎచ్చటైతే… అరాచకాలు అగ్రప్రాధాన్యాన్ని సంతరించు కుంటాయె అచ్చట ”స్త్రీ” ఆత్మామాభివనం అధఃపాతాళానికి నెట్టబడుతుంది. ఎచ్చటైతే… ఈ అనైతిక చర్యలన్నీ ఒక్కటై ”స్త్రీ”పై దాడికి ప్రేరేపిస్తాయె అచ్చట సమాజ వినాశబీజం మొలకెత్తుతుంది. అది మహావృక్షమై… సమాజ పురోగతిని నిరోధించి సమాజ తిరోగతిని పతాకస్థాయికి చేరుస్తుంది. సమాజ తిరోగమనంలో హీరోలు కామఉన్మాదులు, అరాచకాలు – అకృత్యాలకు పాల్పడేవాళ్లు, ”స్త్రీ”ని ఒక విలాసవస్తువుగా చూసేవాళ్లు, ఇంకా ఇలా ఎంతోమంది అదృశ్య తిరోగమన శక్తులు ఇందులో వుంటారు. వీరిని సమూలంగా నిరోధించి, మన సంస్కృతిని – ”స్త్రీ” గౌరవాన్ని, ఆత్మామాభివనాన్ని పరిరక్షించి నేటి మహిళకు అండగా నిలిచి భారతమాత గౌరవాన్ని నిలపవలసిన పరిస్థితి ఆసన్న మైంది.
చదువు – సంస్కారం – విలువలు, ఒకదానితో ఒకటి పెనవేసుకుంటాయి. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినపుడు మాత్రమే సంస్కార వంతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. మనిషిని సంపాదనాపరుడిగా చేసే విద్యా చిట్కాలు కన్నా, మానవతావాదిగా వర్చే భారతీయ విద్య నేడు చాలా అవసరం. మార్కెట్‌వాదుల చేతుల్లో వున్న విద్యాలయలు ”పైశాచిక” నిలయలుగా రానున్న రోజుల్లో మారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆ పరిస్థితి ఏర్పడకముందే ప్రైవేటు, ప్రభుత్వ విద్యాలయలను మానవతా వికాస కేంద్రాలుగా మార్చి ఆదర్శవంతమైన విద్యార్థులను తయరుచేసి సమాజంలో క్షీణిస్తున్న విలువలకు పునఃస్థాపన చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
తల్లిదండ్రులు తమ కుటుంబములోని పిల్లలకు సామాజిక స్పృహ కలిగించి ఆడపిల్లలపై గౌరవభావం కలిగేటట్లు ప్రవర్తించాలి. ”స్త్రీ” చైతన్యం కోసం కృషిచేసేవారికి ప్రచారసాధనాలు అండగా నిలవాలి. నేటి యువతకు ”ప్రేమ”పై సరైన అవగాహన పెంచుటకు ప్రభుత్వాలు – స్వచ్ఛంద సంస్థలు – మీడియ అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రాణం తీసేది ప్రేమకాదు, ప్రేమలో త్యాగం, ఇతరుల క్షేమం ఇమిడివుంది అనే భావన కలిగించాలి. ప్రేమ మానవత్వాన్ని మేల్కొల్పుతుంది కానీ పైశాచికం కాదు అని స్వచ్ఛందంగా తనకు తానుగా తెలుసుకునేటట్లు చేయలి. ఈ భావాల్ని యువతలో కలిగించడానికి విద్యాలయల్లో వారానికి ఒకసారి సెమినార్‌ తరగతులను సామాజిక చైతన్యానికి కృషిచేసే వ్యక్తులతో నిర్వహించాలి. ఇందులో విద్యార్థులందరు పాల్గొనేటట్లు చడాలి. కామొన్మాదులను, అరాచకాలు – అకృత్యాలకు పాల్పడేవారిని చట్టాలు శిక్షించగలవు. కానీ పూర్తివర్పు సాధ్యం కాదు. వారు ఆ విధంగా మారటానికి గల పరిస్థితుల్ని అన్వేషించి వాటి మూలాలు వెదికి సమూల సంస్కరణలు చేపట్టాలి సమాజానికి ”దిక్సూచి” గురువు. వీరు కూడా కలియుగ కీచకులుగా మారి విలువలకు తిలోదకాలు ఇవ్వటం అత్యంత హేయమైన చర్య. భావితరాలవారికి మార్గదర్శకులుగా ఉండవలసిన ఆచార్యులు కూడా సాంఘిక అనైతిక చర్యలకు పాల్పడుత తిరోగమన శక్తులుగా వరుతుంటే పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో పెడధోరణులు ఆవిర్భవించాయన్నది నగ్నసత్యం. సమాజస్థితిని, గతిని, మార్చవలసిన ఉపాధ్యాయులే ”ప్రేమ” పేరుతో విద్యార్థి నులను వేధించటం విద్యలో విలువలు పతనం చెందుతున్నాయన టానికి నిదర్శనం.
మన ఇతిహాసాలు, తల్లి-తండ్రి తర్వాత స్థానాన్ని గురువుకిచ్చి, ”గురుదేవోభవ” అంట సత్కరిస్తున్నాయి. గురువు వెలుగుచపే దేవునిగా… కంటికి కనిపించే ప్రత్యక్ష దైవంగా… గౌరవం పొందుతున్నాడు. డా|| ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు, డా|| అబ్దుల్‌ కలాం గార్ల జీవితవిశేషాలు తెలుసుకునైనా నేటి ఉపాధ్యాయులు ఈ వృత్తి విశిష్ఠతను కాపాడాలి. చదువుల తల్లి కళ్ళలో కన్నీటి సుడులు అరికట్టాలి.
కీచక ప్రవృత్తి ఉన్న ఉపాధ్యాయులు గురువు స్థానంలో వుంటే వాళ్లు తయరుచేసిన విద్యార్థులు దుర్యోధనులు, దుశ్శాసనులు, కీచకులుగానే సమాజంలో ప్రత్యక్షమవుతారు. వీరికి శ్రీరాముడు చేతకానివాడిలా కనిపిస్తాడు. మానవతా విలువలు చెలామణి లేని రుపాయిల్లా కనిపిస్తాయి. ఈ కీచకుల చేతిలో ప్రత్యషలు, అనషలు, కల్పనలు ఇలా ఎంతోమంది అబలలు అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోవాల్సి వుంటుంది. వీరికి ఆడవాళ్ళ ఆక్రందనలు వినిపించవు. వాళ్ల తల్లిదండ్రుల కన్నీటిఘోష వినిపించదు. వాళ్లకి తెలిసిందంతా ఒకటే… ఆడదానిని భయపెట్టైనా తన మృగలక్షణాన్ని ప్రదర్శించడం.
ఇప్పటికైనా ఇటువంటి మానవ మృగాలకు బుద్ధి చెప్పాలంటే కఠినమైన చట్టాలు అమలుపరచడం ఒక ఎత్తైతే, విలువలతో కూడిన విద్యను అందించడం ఒక ఎత్తు. విద్యాలయల్లో సంస్కారబీజాలు నాటి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యార్థులను భావిసమాజానికి అందించ డానికి ఉపాధ్యాయలోకం కృషిచేయలి. కీచకపర్వానికి అంతం పలికి ”స్త్రీ”పై జరుగుతున్న అరాచకాలు అన్నింటికి స్వస్తి చెప్పాలి. యవత్‌ భారతసమాజం అంతా మహిళకు అండగా వుంట, పైశాచిక చర్యలకు చరమగీతం పాడాలి. మానవతా విలువలను మేల్కొలిపే నూతన భారత నిర్మాణంలో, కలియుగ కీచకులను అంతం చేయుటలో ప్రతి వ్యక్తి నడుం కట్టాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో