సఖి సెంటర్ల కౌన్సిలర్లకు శిక్షణ

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రక్షణాధికారిగా డి.వి.సెల్స్‌ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్‌ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి.

అయితే 2016లో భారత ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ూఅవ ూ్‌శీజూ జతీఱరఱర జవఅ్‌వతీ లు ఏర్పాటు చేయడం కోసం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలలోను నిర్భయ కేంద్రాల పేరుతో ూఅవ ూ్‌శీజూ జతీఱరఱర జవఅ్‌వతీ లను ఏర్పాటు చేసింది. జిల్లా ఏరియా హాస్పిటల్స్‌లో వీటిని ఏర్పాటు చేసి అందరికీ సులభంగా అర్థమవ్వడం కోసం సఖి సెంటర్‌లనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఈ సెంటర్‌ల పనితీరు, డి.వి. చట్టం అమలు మీద దీని ప్రభావం ఎలా వుంటోందనే అంశం మీద భూమిక ఒక అధ్యయనం నిర్వహించింది. దాని రిపోర్ట్‌ను త్వరలో భూమిక పాఠకులకు అందుబాటులోకి తెస్తాం.

కౌన్సిలింగ్‌ మీద భూమికకు వున్న సాధికారత, హెల్ప్‌లైన్‌ నిర్వహణలో వున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళా శిశు అభివృద్ధి శాఖ సఖి సెంటర్ల నిర్వహణలో తోడ్పాటు నివ్వాల్సిందిగా కోరడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకుని సఖి సెంటర్లలో పనిచేస్తున్న కౌన్సిలర్‌లకు రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించడం జరిగింది.

కౌన్సిలింగ్‌ నైపుణ్యాలు, డివి చట్టం అమలుతీరు, కొత్తగా అమలులోకి వచ్చిన మహిళా, పిల్లల రక్షణ చట్టాల మీద ఈ వర్క్‌ షాప్‌ నడిచింది. అంతే కాకుండా సెక్సువాలిటి, జండర్‌, సెక్సువల్‌ ఛాయసెస్‌ మీద ఒక రోజంతా వర్క్‌ షాప్‌ జరిగింది. చర్చలు జరిగాయి. ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ మొత్తం రిపోర్ట్‌ను వచ్చే సంచికల్లో ప్రచురించగలము.

ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ ద్వారా సఖి సెంటర్‌లలో పనిచేస్తున్న కౌన్సిలర్‌లలో మంచి అనుసంధానం అభివృద్ధి చెందింది. బాధిత మహిళకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా

ఉండగా, ఆసరాగా నిలపాల్సిన అవసరం గురించి చాలా మాట్లాడు కోవడం జరిగింది. ఇరువురం కలిసి పనిచెయ్యాలనే తీర్మానంతో సమావేశం ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో