మహిళలపై జరిగే అత్యాచారాలకు మహిళలే కారణమా? – జి. ప్రియాంక

ఇటీవల కాలంలో హిందూమత ప్రబోధకుడు, మత ఛాందస వాది అయినటువంటి గరికపాటి నరసింహారావు విద్యార్థులకు విరాట పురాణం వివరిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆడవాళ్ళపై అత్యాచారాలు నేరాలు, ఘోరాలు జరగటానికి ఆడవాళ్ళ వేషధారణే కారణమన్న డిజిపి గారి వ్యాఖ్యలను బలపరుస్తూ అమ్మాయిల వస్త్ర వేషధారణను దుమ్మెత్తి పోసాడు. ఆయన వ్యాఖ్యలు క్లుప్తంగా : జీన్స్‌ వేసి, టి షర్ట్‌ వేసి పైనేమీ లేకుండా పైన ఎగరగొట్టేశారు శుభ్రంగా పట్టి తెగ ప్రదర్శించుకొంటు తిరగటం రైళ్లో చూస్తున్నం. కర్మకాలిపోయి మేం తప్పుకోవాలి, వాళ్ళు తప్పుకోరు. ఉన్నదే ఇంత సందు అక్కడ నా బోటిగాడు పెద్ద వయసు వాడు 50 ఏళ్ళు పైబడిన వాడుంటే మమ్మల్ని గుద్దుకెళ్ళి పోవటం వాళ్ళకిష్టం. తప్పుకోమ్మా అంటే ఎందుకండి రాసుకోవటం నాకిష్టం నేనే వదిలేసుకున్నా నీకెందుకు భ్రమ మగవాడివైయుండి! ఇదివరకు అసలు మగవాళ్ళు కనబడ్డారంటే ప్రక్కకు వెళ్ళిపోయే వాళ్ళు. ఇంక మగాడు కొంచెం భ్రమపడేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు ముందు కొస్తున్నారు. అందంగా ఉన్న స్త్రీలు తమ సంకెళ్ళు తాము వేసుకోవాలి. తమ నియమాలు తను పెట్టుకోవాలి. వీలయినంత కప్పుకోని ఉండాలి. కాపలా పెట్టుకోవాలి పెళ్ళయిన తరువాత నిన్ను ఎవరూ పట్టుకోలేరు. అనుభవించు ఎవరు వద్దన్నారు ద్రౌపదిని చూసి నేర్చుకోవాలి. చక్కగా కొంగు కప్పుకొని వచ్చింది. ఇవీ ప్రసంగంలో ముఖ్యాంశాలు. ఇది జరిగిన సభలో ఉన్న అమ్మాయిలు నవ్వుతూ వినటం దురదృష్టకరం. ఈ ప్రసంగంపై 20 మంది మహిళల వద్దకు అభిప్రాయాల సేకరణకు వెళ్ళాను. అందులో 10 మంది ఆయన వ్యాఖ్యలు వాస్తవమని మద్ధతు ఇచ్చారు. మిగిలిన 10 మంది దుయ్య బట్టారు. వ్యతిరేకించిన ఈ 10 మంది వివిధ ప్రజా సంఘాల్లో పనిచేసేవాళ్లు ఇక్కడ మనం గమనించాల్సిందే మిటంటే ఈ సమాజంలో సంఘంలో పనిచేసి సంఘ చైతన్యం కలిగి ఉండే వాళ్ల కంటే సాధారణ జీవితం గడిపే సామాన్య మహిళలే అధికంగా ఉంటారు. మరి ఆ అధికంగా ఉండే స్త్రీలు ఇలాంటి మత ఛాందస వాదుల వ్యాఖ్యలను బలపరుస్తున్నారంటే అసలులోపం ఎక్కడుందో పరిశీలిద్దాం.

ప్రొద్దున్న లేచింది మొదలు హిందు మత అభివృద్ధి లక్ష్యంగా మనుస్మృతే పరమావధిగా భావించే గరికపాటి లాంటి ఆధునిక మనువులు హిందు మతం స్త్రీని ఎక్కడ ఉంచిందో ఆ చోటో

ఉండాలనుకుంటారు. ఆ గీత దాటి అడుగు ముందుకు వేస్తే అది బరి తెగించిందిగా ముద్ర వేస్తారు. స్త్రీ ఎప్పుడు పురుషునికి సేవకురాలిగా వారి అడుగులకు మడుగులు వొత్తే బానిసగా

ఉండాలి. పెళ్లిలో కూడా ఏడు అడుగులు భార్య భర్త వెనుక వేయాలి. ఎలా తిరిగి వచ్చినా పన్నెత్తి మాట కూడా అనకూడదు. అది పతివ్రత లక్షణం కాదు. భర్తకు అణకువగా నడచుకోవటం పతివ్రత లక్షణం. సతీసావిత్రి అనసూయలు రోల్‌ మోడల్స్‌గా చూపిస్తున్నారు అంటే స్త్రీకి ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండకూడదు. గంగిరెద్దులా తల ఊపి నడుచుకుంటె స్వర్గానికి వెళ్తాం లేదంటె నరకపాలవుతం. ఎంతో అదృష్టం చేసుకుంటేనే సుమంగళిగా భర్త చేతుల మీదుగా పోతం. అంతేకాదు తిండి విషయంలో కూడా భర్త తిన్న తర్వాతే ఆ కంచంలో తినాలి. భర్త కంటే ముందు నిద్ర లేచి ఇంటి చాకిరి అంతా చేసేయాలి. అప్పుడు మనం పుణ్యస్త్రీలమవుతం అనే గుడ్డి నమ్మకాలు నమ్మే మహిళలు నేటికీ ఉన్నారు. ఈ కట్టుబాట్లన్నీ ఇలాగే సాగితే ఎంత బాగుండేదో అనుకుంటున్న గరికపాటి లాంటి వాళ్ళకు నేడు స్త్రీలు నచ్చిన దుస్తులు ధరిస్తే ఎంతో పాపంలా, నాలుగడుగులు ముందుకు వేసి పరుగెత్తి రైళ్లు ఎక్కితే అది పెద్ద అపచారంగానూ, రైల్లో సీటు కోసం ముందుకు వెళితే అది బరి తెగింపుగానూ కనిపిస్తున్నాయి. ద్రౌపదిని చూపిస్తూ అలా కొంగు కప్పుకొని

ఉండాలని ప్రబోధిస్తున్నారు. నేడు పరుగెత్తుతున్న కాలంతోపాటు పరుగులు తియ్యడం ఆ ముసుగులతో సాధ్యమా? 1990 నవంబర్‌ 7 న సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ మిశ్రా స్త్రీలకు చదువులు ఉద్యోగాలు అవసరం లేదని వ్యాఖ్యానించాడు.

ఇటీవల కాలంలో ఒక బి.జె.పి మంత్రి నిరుద్యోగితకు కారణం స్త్రీలు కూడా ఉద్యోగాలకు పోటీ పడటమే అన్నారు. ఈ దేశంలో చాలా పార్టీల పెద్దలు, మాజీ మంత్రులు కూడా స్త్రీల పైన అత్యాచారాలకు వారి యొక్క వస్త్ర వేషధారణే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎవరి నోటికి వచ్చినట్టు వారు స్త్రీలపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఒకవైపు గరికపాటి లాంటివారు మరికాస్త ముందుకు వెళ్ళి స్త్రీల పద్ధతులు మారిపోయి వాటిలో మార్పు తెచ్చుకొని అలనాటి పురాణాల్లో స్త్రీలలా తలవంచుకు బ్రతకాలి. కొంగు ముసుగు వేసుకొని తలదించుకు అడుగులో అడుగు వేసుకు పునాదులపై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఎవరి ప్రయోజనాల కోసం అలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసి తిరగబడక పోవటమే కారణం. మరో ప్రక్క అవసరం లేని వ్యాపార ప్రకటనల్లో కూడా స్త్రీలకు చెడ్డీలు, మిడ్డీలు వేసి సొమ్ము చేసుకుంటూ స్త్రీని ఒక ఆట బొమ్మలా మార్చి వేస్తున్నా వ్యాపారవేత్తల కుట్రలు మనం అర్థం చేసుకోవటం లేదు. జీన్స్‌, టి షర్ట్సు మార్కెట్‌లోకి దించిన పెట్టుబడి దారుడిది తప్పుకాదు! అది సేల్‌ చేయడానికి ప్రకటనలు ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్న వ్యాపా రస్తుడిది తప్పు కాదు! వాటిని చూసి మనుషులమని మర్చిపోయి మృగాళ్ళా ప్రవర్తించిన మగవాడిది తప్పుకాదు! అది వేసుకున్న ఆడదానిదే తప్పా! ఆడదే బజారుది, బరి తెగించినది, ఇది ఎంత వరకు న్యాయం? అసలు మరో విషయం ఆలోచిద్దాం. 5 ఏళ్ళ పాప, 60 ఏళ్ళ ముసలమ్మ, కన్నతల్లి, ఆసుపత్రిలో ఉన్న బాలింతరా లు, మూడు నెలల పాప, వాళ్ళలో ఏ వస్త్రధారణ చూసి మగవాడు అత్యాచారాలకు పాల్పడుతున్నాడు? కాదేది కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కాదేవయసూ అత్యాచారాలకు అనర్హం అంటున్నారు నేటి మగవాళ్ళు.

దీన్ని అర్థం చేసుకున్న గరికపాటి లాంటి వాళ్ళు తప్పువారి పక్షాన లేదు అన్నట్టుగా స్త్రీలపై నెడుతుంటే అది నిజమేమోనని గుడ్డిగా విశ్వశిస్తున్నారు మన ఆడవాళ్ళు. ఇది మాత్రమే కాదు రాజకీయాల్లో, సినిమాల్లో, సీరియల్స్‌లో ఇలా అనేకచోట్ల మహిళలను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకొంటూ దాన్ని కప్పి పుచ్చుకోవటానికి తిరిగి నిందలు వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మహిళలకు రానివ్వకుండా ప్రవచనాలు, సినిమాలు, సీరియల్స్‌ ద్వారా తప్పుదారి పట్టిస్తున్నాయి. దాని ప్రభావమే గరికపాటి వ్యాఖ్యలకు మద్ధతు పలికిన 10 మంది మహిళలపై ఉంది. దీన్ని దూరం చేయాలంటే మహిళా సంఘాలు, మేధావులు స్త్రీ చైతన్యానికి నడుం బిగించాలి. వివిధ రకాల మార్గాల ద్వారా వాస్తవాలని మహిళల్లోకి తీసుకువెళ్ళాలి.

ఇలాంటి అంశాలపై మహిళా అవగాహన సైద్ధాంతిక కారణాలను, మూలాలను ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు గుర్తించి అవి మహిళల్లోకి వివిధ మార్గాల ద్వారా తీసుకు వెళ్ళాలి.

1. బాగా మారుమూల గ్రామాలకి నాటకాల రూపంలో మహిళల్లోకి తీసుకు వెళ్ళాలి.

2. విద్యావంతులకు వివిధ రకాల సెమినార్స్‌ పెట్టడం, ఆర్టికల్స్‌ వ్రాసి ప్రచురించడం, బుక్‌లెట్స్‌ వేసి పంపిణీ చేయడం ద్వారా చైతన్యం చేయగలుగుతాం.

3. గృహిణులందరికి సంక్రాంతి, నూతన సంవత్సరం, ఉగాది సందర్భంగా వివిధ రకాల పోటీలు పెట్టి ఆ సందర్భంలో కొంత సమాచారం ఇవ్వటం చేయాలి.

4. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ రకాల పోటీలు పెట్టి కథలు రూపంలో అర్థం అయ్యేటట్టు విషయ పరిజ్ఞానం కల్పించాలి.

5. ఉద్యోగినులకు ఒక వేదికను ఆటవిడుపుకోసం ఏర్పాటు చేసి దానిలో కొంత సమాచారాన్ని ఇవ్వటం.

6. గిరిజన ప్రాంతాల్లో మహిళలకు షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో చూపించి చైతన్య వంతుల్ని చెయ్యాలి.

7. స్లమ్‌ ఏరియాల్లో సేవా కార్యక్రమాల పేరుతో పోయి విద్య నేర్పించేందుకు రాత్రి బడులు, చైతన్య ఉపన్యాసాలు ఇవ్వటం ద్వారా చైతన్య పరిచే అవకాశం ఉంటుంది.

8. విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు పెట్టడం, దానిలో భాగంగా డిబేట్స్‌, ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు పెట్టి అసలు ఏమి జరుగుతున్నదో మూలాలు ఎక్కడున్నాయో ముగింపులో తెలియ జేయాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to మహిళలపై జరిగే అత్యాచారాలకు మహిళలే కారణమా? – జి. ప్రియాంక

  1. Janaki Gogada says:

    Yes… we must motivate women in India.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో